lift incident
-
ఎనిమిదేళ్ల గర్విత్.. మిస్టర్ కూల్
ఫరీదాబాద్: మనం వెళ్తున్న లిఫ్ట్ హఠాత్తుగా ఆగిపోతే ఏం చేస్తాం? ఒక్కసారిగా కంగారుపడతాం. కేకలు వేస్తాం. ఎప్పుడు బయటపడతామా అని క్షణక్షణం ఎదురుచూస్తాం. లిఫ్ట్ తలుపులు తెరుచుకుని క్షేమంగా బయటకువచ్చేదాకా ఆందోళన తగ్గదు. కానీ, హరియాణాలో లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఎనిమిదేళ్ల బాలుడు గర్విత్ ఏమాత్రం టెన్షన్ పడకుండా రెండు గంటలపాటు చక్కగా హోంవర్క్ పూర్తిచేసుకున్నాడు. మిస్టర్ కూల్ అనిపించుకున్నాడు. హరియాణా రాష్ట్రం గ్రేటర్ ఫరీదాబాద్‌లోని సెక్టార్–86లో ఉన్న ఒమాక్సీ హైట్ సొసైటీ అపార్టుమెంట్ నాలుగో అంతస్తులో గర్విత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం 5 గంటలకు ట్యూషన్ కోసం అదే అపార్టుమెంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌కు లిఫ్ట్‌లో బయలుదేరాడు. రెండో అంతస్తుకు చేరుకోగానే లిఫ్ట్ ఆగిపోయింది. కాసేపు ఎదురుచూసినా లిఫ్ట్ కదల్లేదు. ఇక చేసేదిలేక హోంవర్క్ చేసుకోవడం ప్రారంభించాడు. గర్విత్ ఇంకా రాలేదంటూ ట్యూషన్ టీచర్ అతడి తండ్రి పవన్‌కు ఫోన్ చేసింది. దాంతో ఆందోళనకు గురైన పవన్ అపార్టుమెంట్ అంతటా గాలించడం మొదలుపెట్టాడు. రెండో అంతస్తుకు చేరుకొని బిగ్గరగా పిలవడంతో గర్విత్ స్పందించాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయానని బదులిచ్చాడు. రాత్రి 7 గంటలకు ఇతరుల సాయంతో లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరవగా, గర్విత్ నవ్వుతూ బయటకువచ్చాడు. హోంవర్క్ లిఫ్ట్‌లో పూర్తి చేసుకున్నానని చెప్పాడు. పిల్లాడి ధైర్యం చూసి అపార్టుమెంట్‌వాసులు ఆశ్చర్యపోయారు. -
అమిత్ షా 'లిప్టు' ఘటనపై విచారణకు కమిటీ
పాట్నా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ సన్నిహితుడు అమిత్ షా లిప్టులో ఇరుక్కు పోవడంపై విచారణ జరిపేందుకు బీహర్ ప్రభుత్వం మంగళవారం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. మంత్రివర్గ ప్రిన్సిపల్ సెక్రటరీ శిశిర్ సిన్హా, కమిటీ అధ్యక్షతన ఈ ఘటనపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వెనుక కుట్ర దాగి ఉందని, ఎవరో కావాలనే ఆయనకు అపాయం తలపెట్టారని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై విచారణ జరపడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైతే, కేంద్ర ప్రభుత్వంతో విచారణ జరిపించాల్సిందిగా పాశ్వాన్ మంత్రివర్గాన్ని డిమాండ్ చేశారు. కాగా, అమిత్‌షా గత గురువారం అర్ధరాత్రి లిఫ్టులో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. గ్రౌండ్ ఫ్లోర్లో బయలుదేరిన లిఫ్టు మొదటి ఫ్లోర్‌కు చేరకుండానే మధ్యలో ఆగిపోయింది. దీంతో అమిత్‌షాతో పాటు ఆ పార్టీ బిహార్ నేతలు భూపేంద్ర యాదవ్, నాగేంద్ర, సౌదన్‌సింగ్, ఇద్దరు భద్రతా సిబ్బంది దాదాపు 40 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. వారి ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. చివరికి సీఆర్పీఎఫ్ జవాన్లు లిఫ్టు తలుపులను పగలగొట్టి అమిత్‌షాతో పాటు మిగతా వారిని బయటకు తీశారు. -
అమిత్ షా 'లిప్టు' ఆగిపోవడం కుట్రే!
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ సన్నిహితుడు అమిత్ షా లిప్టులో ఇరుక్కు పోవడం వెనుక ఓ కుట్ర దాగి ఉందని, ఎవరో కావాలనే ఆయనకు అపాయం తలపెట్టారని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. ఒక రాష్ట్ర అతిథి గృహంలో ఇలాంటి ఘటన జరగడం అంత తేలికగా తీసుకోలేమని అన్నారు. దీనివెనుక పూర్తి స్థాయి నిర్లక్ష్యమో లేఖ కుట్రనో దాగి ఉందని ఈ విషయాన్ని హోమంత్రి సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. దర్యాప్తు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అమిత్‌షా గత గురువారం అర్ధరాత్రి లిఫ్టులో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. గ్రౌండ్ ఫ్లోర్లో బయలుదేరిన లిఫ్టు మొదటి ఫ్లోర్‌కు చేరకుండానే మధ్యలో ఆగిపోయింది. దీంతో అమిత్‌షాతో పాటు ఆ పార్టీ బిహార్ నేతలు భూపేంద్ర యాదవ్, నాగేంద్ర, సౌదన్‌సింగ్, ఇద్దరు భద్రతా సిబ్బంది దాదాపు 40 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. వారి ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. చివరికి సీఆర్పీఎఫ్ జవాన్లు లిఫ్టు తలుపులను పగలగొట్టి అమిత్‌షాతో పాటు మిగతా వారిని బయటకు తీశారు. ఓవర్లోడింగ్(బరువు ఎక్కువ) కారణంగానే లిఫ్టు నిలిచిపోయినట్లు బిహార్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.