బంకుల్లో అక్రమాలకు ప్రభుత్వం చెక్
బంకుల్లో అక్రమాలకు ప్రభుత్వం చెక్
Published Sat, Sep 9 2017 6:54 PM | Last Updated on Wed, Sep 20 2017 11:07 AM
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, గ్యాస్ బంకుల్లో అక్రమాలు చోటుచేసుకుంటూ ప్రతిరోజు లక్షలాదిమంది వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంధనం, గ్యాస్ నింపడాన్ని తనిఖీ చేసేందుకు హై-సెక్యురిటీ డివైజ్‌లను ఇన్‌స్టాల్ చేస్తోంది. ఈ మేరకు డివైజ్‌లను ఏర్పాటుచేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఆమోదించాయని ప్రభుత్వం తెలిపింది. కొత్త సెక్యురిటీ డివైజ్‌లను ఏర్పాటుచేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వచ్చే వరకు ప్రభుత్వం గడువు విధించింది.
ప్రస్తుతం పెట్రోల్, గ్యాస్ స్టేషనలలో సెక్యురిటీ డివైజ్‌లను ఉన్నాయి. కానీ వాటిల్లో తారుమారుకు ఎక్కువగా అవకాశం ఉండటం, అక్రమాలు ఎక్కువగా చోటుచేసుకుంటుండటంతో కొత్త వాటితో ఈ డివైజ్‌లను మార్చుతున్నారు. '' హైసెక్యురిటీ డివైజ్‌లను ఏర్పాటుచేయడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆమోదించాయి. వచ్చే వారం వరకు వారికి గడువు ఇచ్చాం'' అని వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చెప్పారు. మూడు డివైజ్‌లు ఎలక్ట్రానిక్ ఫ్లో మెటర్స్, టాంపర్-ప్రూఫ్ ఎలక్ట్రానిక్ సీల్స్, పల్సర్‌లను లీగల్ టెట్రోలజీ డిపార్ట్‌మెంట్ పరీక్షించిందని సీనియర్ అధికారులు చెప్పారు.
Advertisement