పాశ్వాన్ సహాయం కోరిన గడ్కరీ
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ సహాయం కోరారు. సైక్లిస్టుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సైకిళ్ల తయారీకి సంబంధించిన మార్గదర్శకాలను ఆప్డేట్ చేయాలని పాశ్వాన్ రాసిన లేఖలో గడ్కరీ కోరారు. రోడ్డు ప్రమాదాల్లో సైక్లిస్టుల మరణాలు పెరుగుతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వినియోగదారుల వ్యవహారాల శాఖ, భారత ప్రమాణాల విభాగం సంయుక్తంగా పనిచేసి సైక్లిస్టుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరముందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పాశ్వాన్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని నాణ్యతా ప్రమణాలకు అనుగుణంగా సైకిళ్లు తయారయ్యేలా చూడాలని కోరారు.