
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఎవరికైనా జరిమానా తప్పదు, అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేను కూడా ముంబైలో రెండు సార్లు ఫైన్ కట్టానని రైజింగ్ భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో వెల్లడించారు.
ఇప్పుడు హైవేలమీద అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లు ఉన్నాయి. ఎవరూ తప్పించుకోలేదు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. కెమెరా ఫోటో తీస్తుంది. జరిమానా తప్పకుండా కట్టాల్సిందే. కఠినమైన ట్రాఫిక్ చలాన్లపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. జరిమానాలు ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రవేశపెట్టలేదు. చట్టానికి కట్టుబడి ఉండటానికి తీసుకొచ్చాము. జరిమానాలు పెరిగాయని ప్రజలు అంటున్నారు.. అలాంటప్పుడు నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండే సరిపోతుందని గడ్కరీ అన్నారు.
ప్రభుత్వం 2019లో మోటారు వాహన చట్టాన్ని సవరించింది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం, రవాణా నియమాల ఉల్లంఘనలు పెరగడం వల్ల.. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గించడానికి ప్రధాన మార్గం అధిక జరిమానాలు విధించడమే. 2019లో రోడ్డు ప్రమాదం వల్ల మరణించినవారి సంఖ్య సుమారు 1.59 లక్షలు, ఈ సంఖ్య 2022 నాటికి 1.68 లక్షలకు చేరింది. కాబట్టి నియమాలంయు మరింత కఠినతరం చేయకపోతే.. మరణాల సంఖ్య నానాటికి గణనీయంగా పెరిగిపోతుందని గడ్కరీ అన్నారు.
గత సంవత్సరం.. ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి, జరిమానాలు విధించడానికి కృత్రిమ మేధస్సుతో పాటు.. ఇతర సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించాలని గడ్కరీ పేర్కొన్నారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు రూల్స్ అతిక్రమించినవారిని గుర్తించడంలో సహాయపడతాయి. తద్వారా దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
#RisingBharatSummit2025 | Topics which are good for the society should be propagated, irrelevant topics must be completely neglected: Union Minister @nitin_gadkari@KishoreAjwani | #Nagpur #AurangzebControversy #Maharashtra pic.twitter.com/bAVslfIOJl
— News18 (@CNNnews18) April 8, 2025