
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే.. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ వంటివి అందిస్తోంది. కాగా మరో ఆరు నెలల్లో ఈవీల ధరలు, పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఉంటాయని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. 32వ కన్వర్జెన్స్ ఇండియా అండ్ 10వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్‌పో కార్యక్రమంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
212 కి.మీ. ఢిల్లీ - డెహ్రాడూన్ యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు రాబోయే మూడు నెలల్లో పూర్తవుతాయని నితిన్ గడ్కరీ అన్నారు. దిగుమతులను తగ్గించుకోవడానికి.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అదే సమయంలో స్వదేశీ ఉత్పత్తులను కూడా ప్రోత్సహిస్తోందని స్పష్టం చేశారు.
భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటే, మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు. మంచి రోడ్లను నిర్మించుకోవడం ద్వారా.. లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించుకోవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు చాలా బాగుందని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ భారీ లేఆఫ్స్!.. వేలాదిమందిపై ప్రభావం?
ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ వంటికి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఉపయోగించాలి. దీనికి తగిన విధంగా ఉండే వాహనాలను.. ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేయాలని గడ్కరీ సూచించారు. రోడ్డు నిర్మాణ వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ.. ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment