petrol cars
-
మీరు కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త!
ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టాటామోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్‌కు చెందిన పలు కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మళ్లీ నష్టాల్ని చవిచూసింది.కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ.1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే ఈ నష్టాల్ని మరింత తగ్గించి లాభాల బాట పట్టేలా కొనుగోలు దారులకు ఆఫర్లను అందిస్తుంది. తాజాగా గణనీయమైన తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు పలు మోడళ్ల ఆధారంగా రూ.60,000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు టాటా మోటార్స్ నివేదించింది. టాటా హారియర్ 2021 డీజిల్ వెహికల్ టాటా హారియర్ మోడల్ కారుపై రూ.20వేల వరకు నగదు ప్రయోజనాలు కలుపుకొని రూ.60వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక 2022 మోడల్ కారుపై ఎక్ఛేంజ్ ఆఫర్ లో రూ.40వేల వరకు,డార్క్ ఎడిషన్ రూ. 20,000 వరకు ఎక్ఛేంజ్, ఎస్‌యూవీలో కార్పొరేట్ కొనుగోలుదారులకు రూ. 25,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. టాటా సఫారీ 2021 మోడల్ సఫారీలలోరూ.60,000 వరకు ఎక్ఛేంజ్ ప్రయోజనాల్ని, దీంతోపాటు 2022 మోడల్ టాటా సఫారీ కారుపై రూ.40,000వరకు ఎక్ఛేంజ్ ప్రయోజనాల్ని పొందవచ్చు. టాటా టియాగో సెడాన్ కార్ల విభాగంగా కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్న నాలుగు డోర్ల టాటా టియాగో కారుపై టాటా మోటార్స్ ఆఫర్లు ప్రకటించింది. కాంపాక్ట్ సెడాన్ సీఎన్జీ వేరియంట్లు మినిహాయించి మిగిలిన కార్లపై రూ.25వేల వరకు ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. టాటా నెక్సాన్ ఇక టాటా కార్లలో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న మరో కార్ నెక్సాన్. లుక్స్‌తో పాటు దాని పనితీరు కారణంగా కొనుగోలు దారులు నెక్సాన్ ను సొంతం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే టాటా మోటార్స్ సైతం కొనుగోలుదారుల కోసం నెక్సాన్ డీజిల్ వెహికల్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.15,000, కాంపాక్ట్ ఎస్యూవీ కార్పొరేట్ కొనుగోలుదారులు రూ.10,000 వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది. -
సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో ఇవే టాప్
న్యూఢిల్లీ: 2020లో భారతదేశంలో మారుతి సుజుకి డిజైర్, బజాజ్ పల్సర్ సరోకొత్త రికార్డు సృష్టించాయి. గత ఏడాది సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి డిజైర్, అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా బజాజ్ పల్సర్ నిలిచినట్లు "ఆటోమొబైల్ ఇండస్ట్రీ ట్రెండ్ రిపోర్ట్ 2020" ప్రకారం ఆన్ లైన్ ప్రీ ఓన్డ్ ఆటోమొబైల్ సంస్థ డ్రూమ్ వెల్లడించింది. 2020లో సెకండ్ హ్యాండ్ కార్ల సగటు అమ్మకపు ధర రూ.8,38,827గా ఉంది. అలాగే మోటార్ సైకిళ్ల సగటు ధర రూ.47,869గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2020లో విక్రయించిన వాడిన కార్లు, మోటార్ సైకిళ్ల సగటు యాజమాన్యం వ్యవధి 5ఏళ్ల నుంచి 7ఏళ్లగా ఉంది. 2020లో విక్రయించిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 34 శాతం పెట్రోల్ మోడల్స్, 65 శాతం డీజిల్ మోడల్స్, 1 శాతం పెట్రోల్ + సిఎన్జి మోడల్స్ ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్లు మొత్తం కార్ల అమ్మకాల్లో 63 శాతం ఉండగా, మిగిలిన కార్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగి ఉన్నాయి. నివేదిక ప్రకారం.. తెలుపు, సిల్వర్, బూడిద రంగు గల వాటిని ఎక్కువగా కొనుగోలుదారులు ఇష్ట్టపడ్డారు. 2020లో విక్రయించిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 36 శాతం భారతీయ కంపెనీలకు, 22 శాతం జపాన్ కంపెనీలకు, 18 శాతం జర్మన్ కంపెనీలకు, 12 శాతం దక్షిణ కొరియా కంపెనీలకు చెందినవని నివేదిక పేర్కొంది. చదవండి: బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
ముందుగానే పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం..
గాలి కాల్యుష్యంపై ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాలి నాణ్యతను పెంచేందుకు పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం కూడా చేపట్టాలని నిర్ణయించాయి. అయితే ఈ నిషేధాన్ని ఇంకా కాస్త ముందుగానే చేపట్టబోతున్నాయి. కొత్త డీజిల్, పెట్రోల్ కార్ల విక్రయాలను ముందుగా నిర్ణయించిన దానికంటే 10 ఏళ్లు ముందుగా అంటే 2030 నుంచే నిషేధించబోతున్నట్టు లండన్ మేయర్ సదిక్ ఖాన్, బ్రిటన్‌లోని ఇతర నగరాల నేతలు సోమవారం ప్రకటించారు. ప్రధానమంత్రి థెరెస్సా మే కన్జర్వేటివ్ ప్రభుత్వం 2040 నుంచి కొత్త పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు గతేడాది పేర్కొంది. ప్రస్తుతం ఆ గడువును పదేళ్లు ముందుకు జరిపారు ఈ నేతలు. అయితే హైబ్రిడ్ వాహనాలను కూడా నిషేధిస్తారా? లేదా? అన్నది ఇంకా అస్పష్టంగానే ఉంది. ఖాన్‌తో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో మాంచెస్టర్, లివర్‌పూల్, ఆక్స్ఫర్డ్, షెఫీల్డ్, బ్రిస్టల్ నుంచి వచ్చిన నేతలున్నారు. కొత్త పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై త్వరగా నిషేధం విధించే విషయంపై సమగ్రంగా చర్చించారు. నగరాల్లో క్లీన్ ఎయిర్ జోన్స్‌ను అందించడానికి 2030 నుంచే ఈ నిషేధాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు ఖాన్ చెప్పారు. అదేవిధంగా నేషనల్ వెహికిల్ రెన్యూవల్ స్కీమ్ కూడా గాలి నాణ్యతను, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. -
పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం
ఆటో పరిశ్రమకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనా సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లపై నిషేధం విధించాలని చైనా వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు దానికి సంబంధించిన పరిశోధనను కూడా ఆ దేశం ప్రారంభించిందని, కానీ ఎప్పడి నుంచి ఈ రద్దు నిర్ణయం అమల్లోకి తీసుకురావాలో ఇంకా నిర్ణయించాల్సి ఉందంటూ ఆ దేశ ఇండస్ట్రి ఉపమంత్రి చెప్పారు. తమ కారు పరిశ్రమ అభివృద్ధి కోసం తీవ్ర మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి జిన్ గుబిన్ జిన్హువాకు చెప్పారు. చైనా తీసుకోబోయే ఈ నిర్ణయం ఆటోమొబైల్ తయారీ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని తెలిసింది. ప్రపంచంలో కార్లకు అతిపెద్ద మార్కెట్‌గా చైనానే ఉంది. ప్రపంచంలో మూడోవంతు కార్లు ఈ దేశంలోనే తయారవుతాయి. ఎక్కువగా చైనా సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడుతుందని, దీంతో కాలుష్యం, కర్బన్ ఉద్గారాల విడుదల ఎక్కువగా జరుగుతుందని తెలిసింది. ఈ కారణంతో చైనా సంప్రదాయ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా ఇప్పటికే ఈ ప్లాన్‌ను ఆటోమొబైల్ తయారీదారులకు చెప్పింది. 2020 కల్లా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ పెట్రోల్-ఎలక్ట్రిక్ వాహనాల షేరును 12 శాతం పెంచాలని తయారీదారులను ఆదేశించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటుచేయాలని ఆ దేశ ప్రభుత్వ రంగ విద్యుత్ కంపెనీలనూ ఆదేశించింది. గీలి, వోల్వో చైనీస్ యజమాన్యం 2025 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రెనాల్ట్-నిస్సాన్, ఫోర్డ్, జనరల్ మోటార్స్ కూడా చైనాలో ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధిపై పనిచేస్తున్నాయి. -
కొత్త పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం
కొత్త డీజిల్, పెట్రోల్ కార్లు, వ్యాన్లపై బ్రిటన్ నిషేధం విధించింది. ఈ వాహనాల అమ్మకాలను 2040 నుంచి నిషేధిస్తున్నట్టు యూకే పర్యావరణ సెక్రటరీ మైఖేల్ గోవ్ ప్రకటించారు. ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న ''ఎయిర్ క్వాలిటీ ప్లాన్'' ను బుధవారం బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2040 నుంచి అన్ని వాహనాలు, కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడిచేవి ఉండేలా ప్లాన్ చేస్తున్నామని గోవ్ చెప్పారు. హైబ్రిడ్ వెహికిల్స్‌తో సహా అన్ని ఇతర ఇంజిన్లతో నడిచే వాహనాలపై నిషేధం విధించనున్నట్టు పేర్కొన్నారు. 2040 నుంచి జీరో ఎమిషన్స్ కార్లే రోడ్లపై నడిచేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఎలక్ట్రిక్ కార్ల వైపుకి మరలుతున్న ఈ ప్రక్రియను ఓ మైలురాయిలాగా గోవ్ అభివర్ణించారు. ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. గోవ్ ఈ ప్లాన్‌ను ప్రకటించిన వెంటనే లగ్జరీ ఆటో కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ కొత్త ఎలక్ట్రిక్ మినీని బ్రిటన్‌లో అసెంబ్లింగ్ చేసినట్టు తెలిపింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఉద్గారాలపై పోరాటం చేయడానికి మంత్రులు కూడా 225 మిలియన్ పౌండ్ల(రూ.2140 కోట్లకు పైగా) ఫండ్‌ను ఆవిష్కరించారు. ఒకవేళ పర్యావరణానికి ప్రమాదకరమైన నైట్రోజన్ డయాక్సైడ్ను తగ్గించలేకపోయినప్పుడు, స్థానిక అథారిటీలు ఛార్జర్లను ప్రవేశపెట్టేలా లేదా రోజులో కొంత సమయం ఆ వాహనాలపై నిషేధం విధించేలా ప్లాన్ చేస్తున్నారు. 2040 తర్వాత ఉద్గార రహిత వాహనాలనే అమ్మాలని 2011లోనే ఆ దేశ సంకీర్ణ ప్రభుత్వం కార్బన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీనిలోనే 2050 నుంచి ఎలాంటి పెట్రోల్, డీజిల్ కార్లు రోడ్లపై నడవకుండా చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. -
ఎలక్ట్రిక్ వాహనాలు తెస్తాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో కొత్త అధ్యాయానికి రెడీ అవుతోంది. డీజిల్, పెట్రోల్ కార్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఈ సంస్థ.. ఫుల్ ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనాలను సైతం ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో కంపెనీ ఈ మోడళ్లను విజయవంతంగా విక్రయిస్తోంది. భారత్‌లో వాహనాల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బీఎస్-5కు బదులుగా, బీఎస్-6 ప్రమాణాలను 2020 నుంచే అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము సైతం మార్కెట్‌కు అనుగుణంగా వ్యవహరిస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఎస్ ఫాల్గర్ తెలిపారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంస్థ భవిష్యత్ కార్యాచరణ ఆయన మాటల్లోనే.. వాహనాలు రెడీ.. పలు దేశాల్లో ఎలక్ట్రికల్, హైబ్రిడ్ మోడళ్లను విజయవంతంగా అమ్ముతున్నాం. ఈ వాహనాల విభాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాం. ప్రధానంగా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ టెక్నాలజీపై భారీగా వ్యయం చేశాం. భారత్‌లో ఏటా 30 లక్షలకుపైగా పెట్రోలు, డీజిల్ కార్లు అమ్ముడవుతున్నాయి. పర్యావరణం పట్ల ఇక్కడి కస్టమర్లకు బాగా అవగాహన ఉంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహన రంగంలో దేశంలో అపార అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. మార్కెట్లో ఉన్న అవకాశాలను వాహన కంపెనీలు ఇంకా రుచి చూడాల్సి ఉంది. మెర్సిడెస్ విషయానికి వస్తే భవిష్యత్ తరం మోడళ్లను ఏ క్షణంలోనైనా భారత విపణిలో ఆవిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అయితే అందుకు మార్కెట్ రెడీగా లేదు. కీలక పాత్ర ప్రభుత్వానిదే.. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల కొనుగోళ్లకు కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చార్జింగ్ స్టేషన్లు ఎక్కడా ఏర్పాటు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా ఈ మోడళ్ల ఖరీదు ఎక్కువ. తక్కువ యూనిట్ల అమ్మకాల కారణంగానే ధర కాస్త అధికంగా ఉంటోంది. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు బాధ్యత వాహన కంపెనీలదే అన్న భావన ప్రభుత్వానిది. వాస్తవానికి ఇంధన సంస్థలే చొరవ చూపాలి. ఈ విషయంలో ప్రభుత్వమూ కీలకంగా వ్యవహరించాలి. చార్జింగ్ స్టేషన్లు విరివిగా ఏర్పాటైతేనే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇదంతా ఒక్క రోజులో అయ్యే పని కాదు. అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలి. కస్టమర్లు ఎలక్ట్రికల్, హైబ్రిడ్ వాహనాల పట్ల ఆకర్శితులయ్యేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. తయారీ వ్యయం కంటే తక్కువకు నష్టానికి మేం వాహనాలను విక్రయించలేం కదా. రెండేళ్లలో బీఎస్-6.. భారత్ స్టేజ్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను ప్రవేశపెట్టేందుకు మేం రెడీగా ఉన్నాం. అది కూడా 2018 కల్లా కంపెనీ సిద్ధం. ప్లాంటును అందుకు తగ్గట్టుగా మార్పులు చేస్తాం. నూతన ప్రమాణాలు రానున్న రోజుల్లో కంపెనీకి ప్రయోజనం చేకూరుస్తాయి. బీఎస్-6 అమలుకు ప్రభుత్వ తోడ్పాటు అవసరం. ధ్రువీకరణ విధానం వేగిరం చేయడంతోపాటు నాణ్యమైన ఇంధనం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి.