ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం టాటామోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్‌కు చెందిన పలు కార్లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మళ్లీ నష్టాల్ని చవిచూసింది.కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ.1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే ఈ నష్టాల్ని మరింత తగ్గించి లాభాల బాట పట్టేలా కొనుగోలు దారులకు ఆఫర్లను అందిస్తుంది. తాజాగా గణనీయమైన తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు పలు మోడళ్ల ఆధారంగా రూ.60,000 వరకు డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు టాటా మోటార్స్ నివేదించింది.
టాటా హారియర్
2021 డీజిల్ వెహికల్ టాటా హారియర్ మోడల్ కారుపై రూ.20వేల వరకు నగదు ప్రయోజనాలు కలుపుకొని రూ.60వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక 2022 మోడల్ కారుపై ఎక్ఛేంజ్ ఆఫర్ లో రూ.40వేల వరకు,డార్క్ ఎడిషన్ రూ. 20,000 వరకు ఎక్ఛేంజ్, ఎస్‌యూవీలో కార్పొరేట్ కొనుగోలుదారులకు రూ. 25,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
టాటా సఫారీ
2021 మోడల్ సఫారీలలోరూ.60,000 వరకు ఎక్ఛేంజ్ ప్రయోజనాల్ని, దీంతోపాటు 2022 మోడల్ టాటా సఫారీ కారుపై రూ.40,000వరకు ఎక్ఛేంజ్ ప్రయోజనాల్ని పొందవచ్చు.
టాటా టియాగో
సెడాన్ కార్ల విభాగంగా కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్న నాలుగు డోర్ల టాటా టియాగో కారుపై టాటా మోటార్స్ ఆఫర్లు ప్రకటించింది. కాంపాక్ట్ సెడాన్ సీఎన్జీ వేరియంట్‌లు మినిహాయించి మిగిలిన కార్లపై రూ.25వేల వరకు ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.
టాటా నెక్సాన్
ఇక టాటా కార్లలో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న మరో కార్ నెక్సాన్. లుక్స్‌తో పాటు దాని పనితీరు కారణంగా కొనుగోలు దారులు నెక్సాన్ ను సొంతం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే టాటా మోటార్స్ సైతం కొనుగోలుదారుల కోసం నెక్సాన్ డీజిల్ వెహికల్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.15,000, కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్పొరేట్ కొనుగోలుదారులు రూ.10,000 వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment