హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సియెరా ఎస్‌యూవీ వచ్చే ఏడాది భారత రోడ్లపై పరుగుతీయనుంది. 2025 ద్వితీయార్థంలో ఈ మోడల్ రీ–ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ ప్రకటించింది. వచ్చే ఏడాది పండుగల సీజన్ నాటికి కస్టమర్ల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది.
తొలుత ఎలక్ట్రిక్ వర్షన్‌లో ఇది రంగ ప్రవేశం చేయనుంది. తర్వాత ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారిత సియెరా మార్కెట్లోకి రానుంది. అడాప్టివ్ టెక్ ఫార్వార్డ్ లైఫ్‌స్టైల్ (అట్లాస్) ప్లాట్‌ఫామ్‌పై సియెరా ఐసీఈ, అలాగే హారియర్ ఈవీలో ఉపయోగించిన జెన్2 ఈవీ ప్లాట్‌ఫామ్‌పై సియెరా ఈవీ రూపుదిద్దుకోనుందని సమాచారం.
అడాస్ ఫీచర్లను జోడిస్తున్నట్టు తెలుస్తోంది. సియెరా కాన్సెప్ట్ వర్షన్‌ను 2020, 2023 ఆటో ఎక్స్‌పో వేదికల్లో టాటా మోటార్స్ ప్రదర్శించింది. అయితే తయారీకి సిద్దంగా ఉన్న వెర్షన్ ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు హ్యారియర్ ఈవీ 2025 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment