కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) నాగ్‌పూర్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదర్భలో పెట్టుబడులు పెట్టవలసిన అవసరాన్ని గురించి వివరించారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు లేకపోవడం వల్ల రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులు లేకపోవడాన్ని పేర్కొన్నారు.
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియాలో 35 శాతం వాటాను కలిగి ఉన్న 'సజ్జన్ జిందాల్' ఇటీవల తన నివాసాన్ని సందర్శించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని తాను చెప్పినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ వైరల్
వ్యాపారాలకు ప్రభుత్వ రాయితీల సమస్యను ప్రస్తావిస్తూ, పారిశ్రామికవేత్తలు కూడా కొంత ఓపికతో ఉండాలని గడ్కరీ చెప్పారు. లడ్కీ బహిన్ యోజన కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉన్నందున.. పెట్టుబడిదారులు తమ సబ్సిడీ చెల్లింపును అందుకోవడానికి కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంటుందని అన్నారు. కాబట్టి విదర్భలోని వ్యాపారులు, తమ వ్యాపారాలను స్వతంత్రంగా చేసుకోవాలని, ప్రభుత్వాల మీదే పూర్తిగా ఆధారపడకూడదని సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment