రూ.9.97 లక్షల డుకాటీ బైక్ లాంచ్: వివరాలు | 2025 Ducati Scrambler Icon Dark launched in India | Sakshi

రూ.9.97 లక్షల డుకాటీ బైక్ లాంచ్: వివరాలు

Apr 4 2025 4:56 PM | Updated on Apr 4 2025 5:39 PM

2025 Ducati Scrambler Icon Dark launched in India

డుకాటి  స్క్రాంబ్లర్  ఐకాన్ డార్క్ మోడల్.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని ధర రూ. 9.97 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది. కానీ ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి మార్పు లేదు.

డుకాటి  స్క్రాంబ్లర్  ఐకాన్ డార్క్ ఎడిషన్ అనేది.. ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న అత్యంత సరసమైన డుకాటి బైక్. ఇందులో 803 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 73 హార్స్ పవర్, 65.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సుమారు 176 కేజీల బరువున్న ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.

స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ దాని మెయిన్ ఫ్రేమ్, సైకిల్ పార్ట్స్, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్‌లో మాదిరిగానే ఉంటాయి. TFT డిస్ప్లే, రైడ్-బై-వైర్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement