Cyclists
-
గోయింగ్ సోలో! ఇద్దరు విజేతల అరుదైన కథ
‘ఆడపిల్లలు సైకిల్ తొక్కడమేమిటి!’ అని ఆశ్చర్యపోయే కుటుంబాల్లో పుట్టారు గరీమ శంకర్, రేణు సింఘీలు చిన్నప్పుడు సైకిల్‌ను చూడడం తప్ప నడిపింది లేదు. సైకిల్‌పై జెట్ స్పీడ్‌తో దూసుకుపోయేవాళ్లను చూసి ఆశ్చర్యపడేవారు. అలాంటి వారు సైకిలింగ్‌లో అద్భుతాల సృష్టిస్తారని ఎవరూ ఊహించలేదు. ‘గోయింగ్ సోలో’ డాక్యుమెంటరీలో వారి అంతర్. బహిర్ ప్రయాణం ఉంటుంది. నాలుగు గోడల మధ్య ఇంటికి పరిమితమైన రోజుల నుంచి లండన్–ఎడిన్బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్)లాంటి ప్రతిష్ఠాత్మకమైన సైకిలింగ్ ఈవెంట్స్ వరకు చేసిన ప్రయాణం కళ్లకు కడుతుంది. ‘వారి జీవితాల్లో సైకిలింగ్‌కు మించి చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనిపించింది. వారి జీవితాల్లోని అద్భుతాలను ఆవిష్కరించడానికి సైకిల్ అనేది ఒక సాధనం మాత్రమే’ అంటాడు ‘గోయింగ్ సోలో’ డైరెక్టర్ అమీ గోర్. ఢిల్లీలోని ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన గరీమకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు తప్ప ఏ లోటూ లేదు. టీనేజ్‌లో ఉన్నప్పుడు అందరిలాగా తాను కూడా రోడ్డు మీద సైకిల్ తొక్కాలనుకునేది. సైకిల్ తొక్కడం మాట ఎలా ఉన్నా ఇల్లు దాటి బయటికి రావడమే గగనంగా ఉండేది. తల్లిదండ్రులు ఆమెను పొరపాటున కూడా బయటికి పంపేవారు కాదు. గరీమకు పెళ్లి అయింది. ఆ తరువాత ఒక బిడ్డకు తల్లి అయింది. బాగా బరువు పెరిగింది. అది తనకు చాలా ఇబ్బందిగా మారింది. బరువు తగ్గడానికి మార్గాల గురించి ఆలోచిస్తున్న సమయంలో తనకు ఇష్టమైన సైకిలింగ్ గుర్తుకు వచ్చింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు తమ్ముడి ద్వారా సైకిల్ తొక్కడం నేర్చుకుంది. అయితే ఆమె సైకిల్ యాత్ర ఇంటిపరిసరాలకే పరిమితం. బరువు తగ్గడం మాట ఎలా ఉన్నా సైకిలింగ్ ద్వారా తాను ఒంటరిగా రోడ్డు మీదికి వచ్చింది. నగరంలో ప్రతి వీధిని చూసే అవకాశం వచ్చింది. అంతా కొత్తగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉంది! ఇక అప్పటి నుంచి రెగ్యులర్ రైడర్‌గా మారింది. సైకిల్ లేకుండా ఆమెను చూడడం అరుదైపోయింది. సైకిలింగ్‌పై గరీమ ఆసక్తిని గమనించిన సన్నిహితులు ‘లక్ష్యం ఏర్పాటు చేసుకో. విజయం సాధించు’ అని చెప్పేవారు. దీంతో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త అడుగులు వేసింది. సైకిల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ప్రారంభించింది. ఆ రేసులను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చేది. తెలిసినవాళ్లు లండన్–ఎడిన్బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్) సైకిల్ ఈవెంట్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో షెడ్యూల్‌కు మూడు నెలల ముందు తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ‘నిజానికి అదొక అసాధ్యమైన లక్ష్యం. కాని ఏదో ధైర్యం నన్ను ముందుకు నడిపించింది’ అంటున్న గరీమ ఎల్ఈఎల్లో 125 గంటలలో 1,540 కిలోమీటర్లు దూరం సైకిలింగ్ చేసింది. గరీమ ఉత్సాహం, సాహసానికి ముచ్చటపడిన ఎల్‌ఈఎల్ కమ్యూనిటీ ఆమెను మెడల్‌తో సత్కరించింది. ఇక రాజస్థాన్‌కు చెందిన రేణు సింఘీ విషయానికి వస్తే పెళ్లికి ముందు అంతంత మాత్రంగా ఉన్న స్వేచ్ఛ ఆ తరువాత పూర్తిగా పోయింది. వంట నుంచి పిల్లల పెంపకం వరకు పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. తన కుమారుడికి సైకిల్ కొనడానికి ఒకరోజు బైక్షాప్కు వెళ్లింది. తన కోసం కూడా ఒక సైకిల్ కొన్నది. అప్పటికి ఆమె వయసు 52 ఏళ్లు. ‘ఈ వయసులో సైకిల్ తొక్కడమేమిటి’ అనేవారు కుటుంబసభ్యులు. అయితే అవేమీ పట్టించుకోకుండా లాంగ్–డిస్టెన్స్ సైకిలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచేది. ఆ తరువాత ఇంటర్నేషనఃల్ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టింది. ‘మనకు నచ్చింది చేయాలి. వయసు అనేది అడ్డు కాదు’ అంటున్న సింఘీ ఎల్‌ఈఎల్–ఈవెంట్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అమ్మీ మీడియా (న్యూయార్క్), ఖాన్ అండ్ కుమార్ మీడియా (ఇండియా) నిర్మించిన ‘గోయింగ్ సోలో’ను దిల్లీ, ఊటీ, జైపుర్, జోద్పూర్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్లో చిత్రీకరించారు. 70 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీకి అమీ గోర్ దర్శకుడు. టీవి, షార్ట్‌ఫిల్మ్, డాక్యుమెంటరీలలో పదిసంవత్సరాల అనుభవం ఉంది. ‘వారి అనుభవాలు, ప్రయాణం నన్ను ఎంతో ఉద్వేగానికి గురిచేశాయి. రకరకాల పరిస్థితులు లేదా వయసును కారణంగా చూపి తమకు తాము రకరకాల పరిమితులు విధించుకునే ఎంతోమందికి ఈ డాక్యుమెంటరీ స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు డైరెక్టర్ అమీ గోర్. (చదవండి: చూసే కన్ను బట్టి అర్థం మారుతుంది..ట్రై చేయండి అదేంటో!) -
వైర్లు లేని స్మార్ట్ సిగ్నల్ వ్యవస్థ
సౌతాంప్టన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎప్పటికప్పుడు వస్తోన్న మార్పులను అందిపుచ్చుకొని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినప్పుడే నిజమైన పురోభివృద్ధి మానవ జాతి సాధించగలదన్నది తెల్సిందే. కాలుష్యం నియంత్రణలో భాగంగా ఇంగ్లండ్ ప్రభుత్వం గత కొంత కాలంగా మోటారు వాహనాల స్థానంలో సైకిళ్లను ప్రోత్సహిస్తూ వస్తోన్నది. అయినప్పటికీ వాహనాల సంఖ్య తగ్గక పోగా, ప్రతి కూడలి వద్ద రద్దీగా పెరుగుతుండడంతో సైకిళ్లపై ప్రయాణించడమన్నది సైక్లిస్టులకు భారంగా తయారయింది. ఈ నేపథ్యంలో ప్రతి కూడలి వద్ద వారికి అనుకూలమైన సిగ్నలింగ్ వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒకప్పుడు పాదాచారులకు ప్రాధాన్యమిచ్చిన తీరులో ఇప్పుడు సైక్లిస్టులు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఇంగ్లండ్ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత. గతంలో పాదాచారుల కోసం నిర్దిష్ట సమయంలో గ్రీన్ సిగ్నల్ వెలగ్గా, ఇప్పుడు నిర్దిష్ట సంఖ్యలో సైకిళ్లను చూసి వెంటనే వాటికి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రభుత్వం ప్రవేశ పెడుతోన్న స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థ లక్ష్యం. ఇందుకు విద్యుత్ వైర్లు అవసరం లేని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ను ఉపయోగిస్తోంది. ఈ స్మార్ట్ వ్యవస్థను ముందుగా ప్రయోగాత్మకంగా లండన్‌తోపాటు వోల్వర్హామ్టన్, కోవెంట్లీ, సౌతాంప్టన్‌లో ముందుగా ప్రవేశపెడుతున్నారు. తర్వాత దీన్ని అన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ స్మార్ట్ వ్యవస్థను ఇంతకుముందే అమల్లోకి తీసుకరావాలనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. (చదవండి: ఒక్కసారిగా ఏడ్చేసిన కిమ్) -
గండిపేట గుట్టల్లో అమెరికా సైక్లిస్ట్ మృతి
రాజేంద్రనగర్: సైక్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అమెరికా వాసి మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన జాన్ రాబర్ట్ పాల్ (38), ఆయన భార్య అంజలీనాతో కలసి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. అంజలీనా హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. రాబర్ట్ ఆదివారం ఉదయం ఇంటినుంచి సైక్లింగ్కి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలించగా ఖానాపూర్ గండిపేట రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న గుట్టల మధ్య రాబర్ట్ పాల్ మృతదేహం కనిపించింది. -
ఆకట్టుకుంటున్న ఆస్ట్రిచ్ రేస్...
ఒకప్పుడు కార్టూన్లలో చూసి థ్రిల్ గా ఫీల్ అయిన రోడ్ రన్ షో... ఇప్పుడు కళ్ళెదుటే కనిపించింది. తోడేలు నుంచి తప్పించుకునేందుకు కార్టూన్లో పరిగెట్టిన పక్షి... దక్షిణాఫ్రికాలోని సైక్లిస్టుల ముందు నిజంగానే ప్రత్యక్షమైంది. అనుకోని సన్నివేశం ఎదురవ్వడం వారికి ఓ ప్రత్యేక అనుభూతిని కూce కలిగించింది. అందుకే ఆ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఒలేక్సియ్ మిశ్చెంకో అనే ఓ వినియోగదారుడు మార్చి 5న యూట్యూబ్ లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. దక్షిణాఫ్రికాలోని కోప్ ఆఫ్ గుడ్ హోప్ ప్రాంతంలో సైక్లిస్టుల ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో ఓ ఆస్ట్రిచ్ వారిని వెంబడించింది. అనుకోని సన్నివేశం ఎదురైనా కాస్త తేరుకున్న సైకిలిస్టు... అతివేగంగా పరిగెట్టే ఆ పక్షితోనే పోటీ పెట్టుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వీక్షకులను కట్టి పడేస్తోంది. మనుషులైతే నాకేంటి అంటూ ఆ పక్షి.. సైకిలిస్టును ఛేజ్ చేయడం యూట్యూబ్ లో కనువిందు చేస్తోంది. అయితే కాళ్ళు కూడదీసుకొని సైకిల్ పై వెళ్ళే ఇద్దరిని ఎంతోదూరం వెంబడించిన ఆ పక్షిరాజం... ఇక లాభం లేదనుకుందో ఏమో చివరికి కాస్త వెనక్కి తగ్గినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ రేస్ జరుగుతున్న కోప్ ఆర్గస్ టూర్ ప్రాంతంలో ఆస్ట్రిచ్.. మిశ్చెంక్ కళ్ళపడింది. ఇలా పక్షిని గమనించానో లేదో అలా సెకన్లలో రోడ్డుపైకి దూకి వెంటనే సైకిల్ తో స్నేహితుల వెంటపడ్డానని, ఆ తర్వాత ఎంతో నవ్వొచ్చిందని మిశ్చెంక్.. తన యూట్యూబ్ పోస్ట్ లో రాశాడు. అయితే గంటకు సుమారు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే రైడర్స్ కు ఆస్ట్రిచ్ వల్ల పెద్దగా భయం లేదన్నాడు. అదృష్టం కొద్దీ అది పరుగు విరమించుకొని పక్కదారి పట్టిందని, 'కోప్ ఆఫ్ గుడ్ హోప్' దగ్గర మార్గం ముగిసిపోతుందని, నిజంగా ఆ పక్షి తనను వెంబడించి ఉంటే ఏమయ్యుండేదో అంటూ ఒకింత భయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు చాలామంది నిజంగానే భయపడతారు. కానీ మిశ్చెంక్ మాత్రం దానికి కాస్త హ్యూమరసాన్ని జోడించాడు. కచ్చితంగా ఆ పక్షి.. తన గాల్ ఫ్రెండ్ కు సత్తా చూపించేందుకే తనతో పోటీ పడిందని, ఆమె నిజంగానే ఫ్లాట్ అయిపోయి ఉంటుందంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు... అది తన సత్తా చూపించుకుందో లేదోగాని, ప్రపంచంలోనే అతి వేగంగా పరిగెత్తే ఆస్ట్రిచ్ తో పోటీపడి తాను మాత్రం మంచి ట్రైనింగే తీసుకున్నానన్నాడు. -
సైకిళ్లకూ ఓ ఎస్కలేటర్..!
వీలైనంత వరకూ సైకిళ్లను బయటికి తీయండి.. కాలుష్యాన్ని తగ్గించండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ తరచూ ప్రచారం జరుగుతుంటుంది. కానీ సైకిల్ ట్రాకులే ఉండవు. పైగా రోడ్లు అంతెత్తున ఎగుడు దిగుళ్లుగా ఉంటే ఇక సైకిల్ తొక్కడం కష్టమే. అందుకే.. సైక్లిస్టులను ప్రోత్సహించేందుకని నార్వేలోని ట్రాండ్హీమ్ నగరంలో ఇలా సైకిళ్ల కోసం ప్రత్యేక ఎస్కలేటర్ నిర్మించారు. దీనిపై వెళ్లడం చాలా సింపుల్. సైకిల్‌పై వచ్చి.. కుడి కాలును ట్రాకుపై ఉండే ఫుట్ప్లేట్పై ఉంచాలి. ఓ బటన్ నొక్కాలి. అంతే. ఫుట్‌ప్లేట్ ముందుకు కదులుతుంది. రోడ్డు ఎత్తుగా ఉన్నా.. శ్రమ పడకుండానే పైకి వెళ్లొచ్చు. మనం దిగాల్సిన చోటు రాగానే ఫుట్‌ప్లేట్ మీది నుంచి కాలును తీస్తే చాలు. ఆ ప్లేట్ లోపలికి వెళ్లిపోతుంది. ఒకేసారి వరుసగా ఆరుగురు వెళ్లొచ్చు కూడా. పైలట్ ప్రాజెక్టుగా దీనిని 2003లోనే ప్రారంభించగా గతేడాదే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. సైకిళ్ల ఎస్కలేటర్ ప్రపంచంలో ఇప్పటికీ ఇదొక్కటే ఉందట. ఈ ఎస్కలేటర్ ఏర్పాటుకు ఖర్చెంతో చెప్పలేదు కదూ.. మీటరుకు రూ. లక్ష వరకూ అవుతుందట. -
పాశ్వాన్ సహాయం కోరిన గడ్కరీ
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ సహాయం కోరారు. సైక్లిస్టుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సైకిళ్ల తయారీకి సంబంధించిన మార్గదర్శకాలను ఆప్డేట్ చేయాలని పాశ్వాన్ రాసిన లేఖలో గడ్కరీ కోరారు. రోడ్డు ప్రమాదాల్లో సైక్లిస్టుల మరణాలు పెరుగుతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ, భారత ప్రమాణాల విభాగం సంయుక్తంగా పనిచేసి సైక్లిస్టుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరముందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పాశ్వాన్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని నాణ్యతా ప్రమణాలకు అనుగుణంగా సైకిళ్లు తయారయ్యేలా చూడాలని కోరారు. -
సైకిల్‌కు మోగిన రెబెల్స్
టీడీపీకితిరుగుబాటు బెడద యలమంచిలి, పాడేరు,అరకులోయల్లో రగిలిపోతున్న శ్రేణులు బుజ్జగించినా మాట వినని సుందరపు రవిబాబుకు హ్యాండిచ్చిన చంద్రబాబు సాక్షి,విశాఖపట్నం : జిల్లాలో సైకిల్‌కు చిక్కుముళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీని ధిక్కరించి రెబల్స్ మోగిస్తున్న గంటలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఊహించి నట్టుగానే యలమంచిలి,పాడేరు, అరకులోయల్లో రెబల్ అభ్యర్థులు పార్టీని ధిక్కరించి బరిలో నిలబడి సవాల్ విసిరారు. యలమంచిలిలో పంచకర్లకు టికెట్ ఇవ్వడంతో అలిగిన సుందరపు విజయ్ కుమార్ రెబల్‌గా నామినేషన్ వేశారు. రెండురోజుల ముందు తనకు అన్యాయం జరిగిందని ఆమరణ దీక్ష ప్రకటించిన సుందరపును గురువారం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టులో బుజ్జగించారు. దీంతో సుందరపు దారికివచ్చినట్టేనని చంకలుగుద్దుకున్నారు. ఆయన మాత్రం బాబు బుజ్జగింపులను బేఖాతరుచేస్తూ శనివారం నామినేషన్ వేసి అసలు అభ్యర్థి పంచకర్లకు గొంతులో పచ్చివెలక్కాయపడేలా చేశారు. పాడేరు సీటును బీజేపీకి ఇచ్చి తమ గొంతుకోశారనే ఆగ్రహంతో ఉన్న ఆశావహ నేతలు రెబల్స్‌గా బరిలో నిలిచారు. మొన్నటికి మొన్న ప్రసాద్, నేడు కొట్టగుల్లి సుబ్బారావు రెబల్స్‌గా నామినేషన్ వేశారు. చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అరకు టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుకు టీడీపీ చివరి నిమిషంలో హ్యేండ్ ఇచ్చింది. నామినేషన్లకు ఆఖరి రోజయిన శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రవిబాబు మూడు రోజుల క్రితం ఇచ్చిన పార్టీ బి-ఫారంతో నామినేషన్ వేశారు. అదే సమయంలో అరకు ఎమ్మెల్యే సివేరి సోమ మరో బి-ఫారంతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిణామంతో అక్కడే ఉన్న రవిబాబుతోపాటు అతని వర్గీయులతో అవాక్కయ్యారు. ఆఖర్లో ఇలా అధినేత వెన్నుపోటు పొడవడాన్ని అక్కడి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈమేరకు రవిబాబు రెబల్‌గా మరో నామినేషన్ వేశారు. మరోపక్క టిక్కెట్లు దక్కని మాజీమంత్రి మణికుమారి అరకు పార్లమెంట్‌కు, గాజువాక నుంచి కోనతాతారావు రెబల్స్‌గా నామినేషన్ వేయడానికి పత్రాలు సిద్ధం చేశారు. కాని ఇంతలో పార్టీ ముఖ్యనేత నారాయణ వీరిని ఫోన్లో బుజ్జగించారు. పార్టీ పరువు బజారుకీడ్చొద్దని తాయిలాల ఎరవేశారు. దీంతోవీరు నామినేషన్ వేయకుండా ఉండిపోయారు.