
రాబర్ట్ పాల్ మృతదేహం
రాబర్ట్ ఆదివారం ఉదయం ఇంటినుంచి సైక్లింగ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాజేంద్రనగర్: సైక్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అమెరికా వాసి మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన జాన్ రాబర్ట్ పాల్ (38), ఆయన భార్య అంజలీనాతో కలసి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. అంజలీనా హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. రాబర్ట్ ఆదివారం ఉదయం ఇంటినుంచి సైక్లింగ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలించగా ఖానాపూర్ గండిపేట రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న గుట్టల మధ్య రాబర్ట్ పాల్ మృతదేహం కనిపించింది.