Gandipeta
-
111 జీవో రద్దు ఓకే.. వాట్ నెక్ట్స్..?
హైదరాబాద్ మహానగర శివారులోని గ్రామాలకు ట్రిపుల్ వన్ ట్రబుల్స్ ఇక తప్పినట్టేనా? కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి?. 84 గ్రామాలకు 111 జీవో నుంచి విముక్తి దొరికినట్టేనా ? జంట జలాశయలా పరిరక్షణకు కొత్త రూల్స్ ఎలా ఫామ్ చేయబోతున్నారు ? లోకల్ పబ్లిక్‌లో ఉన్న అనుమానాలేంటీ ? HMDA రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి ? రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 84 గ్రామాల ప్రజలు జీవో 111తో రెండు దశాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్ ట్రిపుల్ వన్ జీవో రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోద ముద్ర వేశారు. దీంతో జీవో పరిధిలోని గ్రామాల్లో సంబరాలు, సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేశారు. అంత వరకు ఓకే.. కానీ.. స్థానిక ప్రజలను అనేక అనుమానాలు వేధిస్తున్నాయి. జీవో ఎత్తివేసిన తర్వాత అనుమతులు ఎలా ఇస్తారు? గ్రీన్ జోన్ పరిధిలో ఏయే గ్రామాలను ఎంపిక చేస్తారు? గ్రీన్ జోన్ పరిధిని ఏ ప్రాతిపాదికన నిర్ణయిస్తారు? జంట జలాశయాలపైన ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు జలాశయాల్లో కలవకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అక్రమంగా లే అవుట్లు వెలిశాయి. వాటికి అనుమతులు ఎలా ఇస్తారు? ట్రిపుల్ వన్ జీవో రద్దు తర్వాత.. కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని గ్రీన్ జోన్‌గా నిర్ధారించే అవకాశాలున్నాయి. గ్రీన్ జోన్లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతించే అవకాశం లేదు. ఇక మురుగునీరు జంటజలాశయాల్లో కలవకుండా 11 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. గండిపేట జలాశయం చుట్టూ 5, హిమాయత్ సాగర్ జలాశయం చుట్టూ 6 ఎస్టీపీలు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జంట జలాశయాల పరిరక్షణపై పర్యావరణ వేత్తలు ఆందోళణ చెందాల్సిన పనిలేదని మాత్రం చెబుతున్నారు లోకల్ ఎంపీ రంజిత్ రెడ్డి చెబుతున్నారు. చదవండి: Telangana University: రిజిస్ట్రార్ నియామకంలో మళ్లీ వివాదం ఇక మొయినాబాద్, శంకర్ పల్లి, శంషాబాద్ మండలాల్లో ఇప్పటికే చాలా వరకు HMDA అనుమతులు లేకుండా అక్రమ లే అవుట్లు భారీగా వెలిశాయి. వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. HMDA పరిధిలో దాదాపుగా పది వేల ఎకరాల్లో అక్రమ వెంచర్లు వెలిసినట్లు ప్రాథమిక అంచనా. 111 జీవో నేపథ్యంలో ఆ ప్లాట్లను ఇన్నాళ్లు నిషేధిత జాబితాలో ఉంచారు. వాటికి సంబంధించి నోటరీతో ఇన్నాళ్లు సరిపెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేయలేదు. జీవో రద్దు ప్రకటన తర్వాత. విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. చదవండి: ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట అయితే గ్రామాల్లో తమ భూములు అమ్ముకోకుండా ఉన్న కొద్ది పాటి రైతులు మాత్రం జీవో రద్దుతో తమ భూములకు విలువ పెరుగుతుందని సంబరపడుతున్నారు. మొత్తంగా జీవో 111 రద్దు పరిధిలో HMDA కనీసం ఒక్క లేఅవుట్‌కు అధికారికంగా అనుమతి ఇచ్చే వరకు ఇక్కడ ప్రాంతవాసుల్లో అనుమానాలు మాత్రం క్లియర్ అయ్యేలా కనిపించని పరిస్థితి నెలకొంది. -
వారి చైతన్యం ‘తాటిచెట్టం’త.. మనకు, వాళ్లకు తేడా ఏంటి?
అదో మారుమూల గ్రామం.. కానీ, ప్రకృతిపరిరక్షణపై చైతన్యం ఎక్కువే. అందుకే.. రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు చెట్లను కొట్టేయబోతే, అడ్డుకుని వాటిని కాపాడేందుకు ముందుకొచ్చారు.. అక్కడి అధికారులు కూడా సహకరిస్తున్నారు. అవేమీ మర్రి చెట్టులాంటి వృక్షాలు కాదు, తాటిచెట్లు. ఇదీ పశ్చిమ బంగాలోని బంకురా జిల్లా బిష్ణుపూర్ గ్రామీణుల చైతన్యం. సాక్షి, హైదరాబాద్: నీడనిచ్చే విశాలమైన పచ్చనిచెట్లు.. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 286 వృక్షాలు.. వీటి వయసు 20 ఏళ్లకుపైబడే ఉంటాయి.. నగర శివారులోని గండిపేట రోడ్డుకు ఆ చెట్లే అందం. రోడ్డు విస్తరణలో భాగంగా వాటిని కొట్టేయబోతే (42 చెట్లకు మాత్రం ట్రాన్స్‌లొకేట్ అనుమతి ఉంది) కొందరు స్థానికులు ముందుకొచ్చి వాటిల్లో యోగ్యమైన వాటిని తరలించి మరోచోట నాటించాలనుకున్నారు. కానీ, అందుకు ఇక్కడి అధికారులు విధించిన షరతులే అడ్డుగా మారాయి. వాటిల్లో 9 చెట్లను మంగళవారం నరికేశారు. బెంగాల్లో తాటి చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసి కాపాడుకునేందుకు స్థానికులు హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. ఆ చెట్ల తరలింపునకు అక్కడి జిల్లా కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారు. వచ్చే వారమే పనులు మొదలు కానున్నాయి. అదే స్వచ్ఛంద సంస్థను హైదరాబాద్ గండిపేట ప్రాంతవాసులు సంప్రదించి కాపాడుకునేందుకు ముందుకు వచ్చినా ఇక్కడి అధికారులు గొడ్డలి వేటుకే జై అంటున్నారు. అక్కడి అధికారులకు, ఇక్కడి అధికారులకు మధ్య ఎంత తేడా? నగరం నుంచి గండిపేటకు దారితేసే రోడ్డును విస్తరించేందుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించే పని రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ చెట్లను కాపాడే దిశలో దాదాపు మూడు నెలలుగా జరుగుతున్న వ్యవహారం వృక్ష ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది. హైకోర్టు జోక్యం చేసుకున్నా వాటిని కాపాడుకోలేని నిస్సహాయత ఇక్కడ నెలకొంది. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నా.. సమస్య పరిష్కారంకాలేదు. సరిగ్గా ఇదే సమయంలో.. బెంగాల్ ప్రజల స్పూర్తిదాయకమైన గాధ తెరపైకి వచ్చింది. తాటి చెట్లను కాపాడుకునే దిశలో.. బెంగాల్‌లోని సారెంగా ప్రాంతానికి వెళ్లే రాష్ట్ర రహదారిని విస్తరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బిష్ణుపూర్ అనే ఊళ్లో 200కుపైగా తాటిచెట్ల తొలగింపునకు మార్కింగ్ చేశారు. ప్రకృతి ప్రేమికులైన స్థానికులు వెంటనే అక్కడి నిషాన్ సబూజే సమాజే అనే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. తాటిచెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసే హైదరాబాద్‌కు చెందిన వటా ఫౌండేషన్ వివరాలను ఇంటర్నెట్లో గుర్తించారు. ఇటీవల గోవాలో కొన్ని తాటిచెట్లను తరలించి కాపాడినట్టు గుర్తించారు. వెంటనే ఆ సంస్థను సంప్రదించగా నిర్వాహకులు అంగీకరించారు. సాంకేతిక, ఆర్థిక సాయం అందించేందుకు అక్కడి జిల్లా కలెక్టర్ ముందుకొచ్చారు. వాచ్చే వారం వాటి ట్రాన్స్‌లొకేట్ పనులు మొదలు కాబోతున్నాయి. ఉపాధి వేటలో.. వెనకబడ్డ బంకురా జిల్లా ప్రాంతంలో కొంతకాలంగా తాటిచెట్లను ఉపాధికి అవకాశంగా మార్చుకోవటం ప్రారంభించారు. తాటి కల్లు నుంచి బెల్లం, ఇతర స్వీట్ల తయారీని నేర్చుకున్నారు. అందుకు తాటిచెట్లకు కొదవ లేదు. ఎన్ని చెట్లున్నా.. రోడ్డు విస్తరణలో కోల్పోయే చెట్లను వదలకూడదని స్థానికులు నిర్ణయించుకుని హైదరాబాద్ సంస్థను, జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి కాపాడుకుంటున్నారు. -
గండిపేట గుట్టల్లో అమెరికా సైక్లిస్ట్ మృతి
రాజేంద్రనగర్: సైక్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అమెరికా వాసి మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన జాన్ రాబర్ట్ పాల్ (38), ఆయన భార్య అంజలీనాతో కలసి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. అంజలీనా హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. రాబర్ట్ ఆదివారం ఉదయం ఇంటినుంచి సైక్లింగ్కి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలించగా ఖానాపూర్ గండిపేట రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న గుట్టల మధ్య రాబర్ట్ పాల్ మృతదేహం కనిపించింది. -
నగరవాసులకు తప్పని నీటి కష్టాలు
-
పిల్లల ముందు ఉపాధ్యాయుల వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పారు. బాధ్యతలను విస్మరించి విద్యార్థులు చూస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి వారి ముందే బూతులు తిట్టుకున్నారు. ఈ ఘటన గండిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉపాధ్యాయురాలు మనోరమ, హెడ్ మాస్టర్ రాములు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో పాఠశాలలో పిల్లల ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా బూతులు తిట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు సెల్‌ఫోన్ విసురుకున్నారు. ఆ తర్వాత మనోరమ హెడ్ మాస్టర్‌పై నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఫుల్ జోష్.. యమా కిక్కు
సాక్షి, హైదరాబాద్: ఒకేవైపు చూస్తూ భోజనం చేయడం బోర్... చుట్టూ అన్ని వైపుల ప్రదేశాలను చూస్తూ తింటే అదో కిక్కు. అదీ 60 మీటర్ల ఎత్తున. అదే రివాల్వింగ్ రెస్టారెంట్ అంటే. అంతేనా.. భోజనంతో పాటు అందించే మద్యం మరింత కిక్కునిస్తుంది. అంతేనా.. రోజంతా నీళ్లలోనే సేదతీరేలా హౌస్ బోటింగ్‌లు.. రంగు రంగుల పక్షుల కిలకిలారావాలు. కేబుల్ కార్లు, రాక్ క్లైంబింగ్, జిప్‌లైన్, గోల్ఫ్ కోర్టులు, స్విమ్మింగ్ ఫూల్ ఇలా ఎన్నో ఎన్నెన్నో అన్ని ఒకేచోట నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం సమయంతో పాటు పరిగెత్తే సిటిజనులకు ఉల్లాసాన్ని పంచనున్నాయి. దీనికి హైదరాబాద్‌లోని గండిపేట చెరువు వేదిక కానుంది. 2020 నాటికి గండిపేట చెరువు ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం విభాగంతో కలసి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సరికొత్త ప్రణాళికలతో ముందుకెళుతోంది. గండిపేట చెరువు సమీపంలో 60 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయనున్న ఈ ‘స్కై టవర్ రెస్టారెంట్’అటుఇటు కదులుతూ పర్యాటకులకు వినోదాన్ని అందించనుంది. భోజనంతో పాటు మద్యం కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. కేరళ, అహ్మదాబాద్‌లో కదులుతున్న రెస్టారెంట్ల మాదిరిగానే దాదాపు 20 అంతస్తుల్లో నిర్మాణంచేసి ‘ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోష్’అందిస్తామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. నీళ్ల మధ్యలోనే సేద తీరేలా హౌస్ బోటింగ్... గండిపేట చెరువు మధ్యలో పర్యాటకులు పగలు, రాత్రంతా సేద తీరేలా హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక్కడికి వచ్చిన వారు రాత్రంతా నీళ్ల మధ్యలో బోట్లోనే ఉండేలా ఇళ్లు (హౌస్ బోటింగ్), కాటేజెస్‌ల్లో కాలక్షేపం చేయడంతో పాటు ఆనందంగా గడిపేలా అన్ని వసతులు సమకూర్చాలని నిర్ణయించింది. దాదాపు 10 కిలోమీటర్ల వరకు నీళ్ల పైభాగంలో రోపింగ్ వే మాదిరిగానే కేబుల్ కారును ఏర్పాటుచేసి పర్యాటకులు ఒకచోట నుంచి మరోచోటికి ప్రయాణిస్తూ థ్రిల్‌గా ఫీలయ్యేలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది. ప్రతిపాదిత 47 కిలోమీటర్లలో తొలుత 25 కిలోమీటర్లలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ గండిపేట చెరువు అభివృద్ధి పనులకు త్వరలోనే మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పక్షులతో హాయిగా గడిపేలా... జనావాసాలతో పాటు అడవుల్లో చక్కర్లు కొట్టే పక్షులు కూడా గండిపేటలో ఆకర్షణగా ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దాదాపు కిలోమీటర్ మేర ఏర్పాటుచేసే ఫెన్సింగ్‌లో విభిన్న జాతుల పక్షుల మధ్యలో నుంచి పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లాపాపలతో వచ్చే కుటుంబసభ్యులకు ఈ పక్షులతో కాలక్షేపం హాయినిస్తుందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఇవేకాకుండా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రిక్రియేషనల్ సెంటర్ ఉండేలా మెరుగులు దిద్దనున్నారు. వారాంతాల్లో ఎంటర్టైన్మెంట్ కోసం శివారు ప్రాంతాలకు వెళ్లే నగరవాసులు జాగింగ్, స్కేటింగ్, సైక్లింగ్, బురదలో పరిగెత్తేలా ఏర్పాట్లు, గుట్టలు చకచక ఎక్కేలా రాక్ క్లైంబింగ్, నడుంకు తాడుకట్టుకొని రోప్‌వే సాయంతో ముందుకెళ్లేలా జిప్‌లైన్, అవుట్డోర్ జిమ్, గోల్ఫ్ కోర్టులు, స్విమ్మింగ్ ఫూల్ తదితర సౌకర్యాలు ఏర్పాటుచేయడంపై హెచ్ఎండీఏ అధికారులు దృష్టి సారించారు. అవసరమైతే డ్రోన్ కెమెరాలతో సర్వే చేసి గండిపేట అభివృద్ధికి తుదిరూపు ఇవ్వనున్నారు. అహ్మదాబాద్‌లోని పతంగ్ రివాల్వింగ్ రెస్టారెంట్ -
సీబీఐటీ వద్ద ఐదోరోజుకి చేరిన విద్యార్థుల ఆందోళన
-
ఉధృతమైన సీబీఐటీ విద్యార్థుల ఆందోళన..!
సాక్షి, హైదరాబాద్: ఫీజుల పెంపును నిరసిస్తూ గండిపేట్ సీబీఐటీ కాలేజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన సోమవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఐదురోజులుగా ఆందోళన చేస్తున్నా.. సీబీఐటీ యాజమాన్యం తమ గోడును పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన ఏబీవీపీ కార్యకర్తలు.. పిన్సిపల్ రూమ్‌లోకి చొచ్చుకెళ్లి బైఠాయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపుటాల చోటుచేసుకుంది. విద్యార్థులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ప్రిన్సిపాల్ చాంబర్లోనే ఏబీవీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో సీబీఐటీ కాలేజీ వారం రోజులు సెలవు ప్రకటించింది. మేనేజ్మెంట్తో మాట్లాడి ఫీజుల పెంపు సమస్యను పరిష్కరిస్తామని ప్రిన్సిపాల్ ప్రకటించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు కొనసాగిస్తున్న ఆందోళనకు ఏబీవీపీతోపాటు పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున గుమిగూడిన విద్యార్థులు గండిపేట్ నుంచి కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. సీబీఐటీ యాజమాన్యం పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. శంకర్పల్లి చౌరస్తాలో సీబీఐటీ కాలేజీ బస్సులను ఏబీవీపీ అడ్డుకుంది. దీంతో ఏబీవీపీ కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. -
గండిపేట CBITలో కార్పీడియం ఫెస్ట్ ప్రమోషన్
-
గండిపేటలో పతంగులపై నిషేధం
హైదరాబాద్: గండిపేట చెరువు పరిసరాల్లో గాలిపటాల ఎగురవేతను పోలీసులు నిషేధించారు. ప్లాస్టిక్, రసాయనిక రంగులు కలిగిన పతంగులు, మాంజా (దారం) కారణంగా గండిపేట ప్రాంతంలోని జీవవైవిధ్యం దెబ్బతింటోందని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా, వీటివల్ల గండిపేట చెరువు నీరు కలుషితమవుతోందని కమిషనరేట్ తెలిపింది. గండిపేట ప్రాంతానికి వలస వచ్చే అరుదైన పక్షులను రక్షించుకుందామని పిలుపునిచ్చింది. పతంగులు ఎగురవేసేందుకు వచ్చేవారు అదనంగా తీసుకువచ్చే ప్లాస్టిక్ బ్యాగులలో ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, వాటర్ బ్యాగ్‌లను అక్కడే వదిలివేస్తున్నారని తెలిపింది. వీటితో పాటు మద్యం తాగి ఆ బాటిళ్లను పగులగొట్టడం, అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోవడంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోందని వివరించింది. పర్యావరణం కలుషితమవుతోందని, అందుకే గండిపేట చెరువు (ఉస్మాన్ సాగర్) పరిసర ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేత పూర్తిగా నిషేధించినట్లు కమిషనరేట్ తెలిపింది. -
గండిపేట.. జల(న) కళ
మణికొండ: గండిపేట(ఉస్మాన్‌సాగర్) జలకళను సంతరించుకుంది. ఇటీవల వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు చేరడంతో చెరువుకు పూర్వవైభవం వచ్చింది. దీంతో సందర్శకులు పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో చెరువును తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చారు. జలకళతో పాటు జనకళ సంతరించుకోవడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లలో ఇంత పెద్ద ఎత్తున జనం రావడం ఇదే మొదటిసారి అని పోలీసులు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వకుండా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంది. -
నిండుకుండ గండిపేట
సాక్షి,మొయినాబాద్: వేసవిలో పూర్తిగా ఎండిపోయిన గండిపేట జలాశయంలోకి వరదనీరు చేసింది. ఎగువ ప్రాంతాలైన చేవెళ్ల, శంకర్పల్లి, నవాబ్‌పేట్, మోమిన్‌పేట్, మర్పల్లి మండలాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మూసీ వాగులో వరద వచ్చింది. దీంతో గండిపేట చెరువులో ఒక అడుగు మేర నీరు చేరింది. గండిపేట జలాశయంలోకి కొత్త నీరు చేరడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. -
గండిపేట గుండెకోత
అడుగంటుతున్న జలాశయం పెద్ద సంఖ్యలో చేపల మృత్యువాత మహా నగర దాహార్తిని తీర్చే జలాశయాలే దాహంతో అలమటిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్నాయి. తమనే నమ్ముకున్న జీవరాశులకు సైతం భరోసా ఇవ్వలేకపోతున్నాయి. సువిశాల విస్తీర్ణంలోని గండిపేట జలాశయం తనపై ఆధారపడిన చేపలను నిర్జీవంగా ఒడ్డున పడేసిన ‘చిత్రం’.. చూసిన వారి గుండెలు తరుక్కుపోతున్నాయి. సిటీబ్యూరో:మహా నగరంలో ఎండల తీవ్రతకు జలాశయాలు అడుగంటుతున్నాయి. పశుపక్ష్యాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి. జనం అల్లాడుతున్నారు. మండుటెండలతో చారిత్రక ఉస్మాన్ సాగర్ (గండిపేట) నీళ్లు లేక చిన్నబోయి కనిపిస్తోంది. ఈ జలాశయ గరిష్ట మట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1750 అడుగులకు పడిపోయింది. నీటి మట్టం తగ్గడంతో ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేపలు వేసవి తాపాన్ని తాళలేక మృత్యువాత పడుతున్నాయి. ఈ దృశ్యం చూసిన వారిని కలచివేస్తోంది. జలాశయం దుస్థితికి కారణాలివే... ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జంట జలాశయాలకు వరద నీటిని చేర్చే కాల్వలు (ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం, ఇటుక బట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారాయి. ఉస్మాన్ సాగర్ పరిరక్షణకు పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ ‘నీరి’ నిపుణులు 2011లో సమగ్ర అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వా నివేదిక సమర్పించారు. కానీ ఆ సంస్థ సిఫారసులకు ఐదేళ్లుగా మోక్షం లభించలేదు. సమీప గ్రామాల నుంచి మురుగు నీరు జంట జలాశయాల్లో కలుస్తుండడంతో చారిత్రక సాగరాలు కలుషితమవుతున్నాయి. జలాశయం ఎగువ ప్రాంతాల్లో ఉన్న 45 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి నిత్యం మురుగునీరు సాగరాల్లోకిచేరుతోంది. కళాశాలల యాజమాన్యాలు సొంతంగా చిన్నపాటి మురుగు శుద్ధి కేంద్రాల (మినీ ఎస్టీపీలు)ను నిర్మిం చుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పరిష్కారాలు... సుమారు పదివేల కి.మీ. సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయాల సరిహద్దులు, జీఓ. నెం 111 ప్రకారం ఎగువ ప్రాంతాల్లో మరో పది కి.మీ. వరకు సరిహద్దుల ను పక్కాగా గుర్తించేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) సాయం తీసుకోవాల్సి ఉంది.జీఐఎస్, శాటిలైట్ చిత్రాలు, టోటల్ స్టేషన్ వంటి ఆధునిక సాంకేతికత ఆధారంగా ఎన్జీఆర్ఐ సంస్థ సరిహద్దులను గుర్తించిన తరువాత జలాశయాల సరిహద్దులను గుర్తిస్తూ డిజిటల్ మ్యాపులు సిద్ధం చేయాలి.ఎగువ ప్రాంతాల్లో కబ్జాల నిరోధం, ఇసుక ఫిల్టర్లను నిర్వహిస్తున్న అసాంఘిక శక్తుల ఆట కట్టించాలి.కృష్ణా నాలుగో దశ ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మీదేవి పేట నుంచి కృష్ణా జలాలను నగరానికి తరలించి ఈ జలాశయాల్లో నింపేందుకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నీటి పారుదల రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ వేసవిలో జంట జలాశయాల్లో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని సూచిస్తున్నారు. జంతు, చెట్ల అవశేషాలు, గుర్రపుడెక్క తొలగింపు, అడుగున పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించాలని సూచిస్తున్నారు.నీటి రంగు మారకుండా జలాశయంలో ఏరియేషన్(ఆక్సిజన్ స్థాయి పెంపునకు) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. జలాశయంలోకి వర్షపు నీటిని చేర్చే ఇన్‌ఫ్లో చానల్స్‌ను ఈ వేసవిలోనే యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా వెలసిన ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, రియల్ వెంచర్లను తొలగించాలి. ఈ జలాశయాలు పూర్వపు స్థాయిలో నిండుకుండల్లా జలకళను సంతరించుకుంటే నగరానికి రోజువారీగా 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని పొందే అవకాశం ఉంటుందని, దాదాపు పాతనగరం దాహార్తి సమూలంగా దూరమవుతుందని నిపుణులు తెలిపారు. -
‘మహానాడు’ ఏర్పాట్ల పరిశీలన
* గండిపేటలోని ఎన్టీఆర్ కుటీరంలో పనులు ప్రారంభం * దాదాపు 50వేల మందికి సౌకర్యాలు: ఎల్. రమణ మొయినాబాద్ రూరల్: గండిపేటలోని ఎన్టీఆర్ కుటీరంలో ఉభయ రాష్ట్రాల మహానాడును భారీఎత్తున నిర్వహించనున్నామని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్ సమీపంలోగల గండిపేట ఎన్టీఆర్ కుటీరంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు సభాస్థలాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ.. మహానాడుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు తరలిరానున్నట్లు తెలిపారు. ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం, భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహానాడును గత ఏడాది కంటే ఈసారి భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు 50వేల మందికి సరిపడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాగంటి గోపీనాథ్, వెంకటవీరయ్య, సుధాకర్ యాదవ్, బుక్క గోపాల్, కంజర్ల శేఖర్, మాణిక్యం, రాజు పాల్గొన్నారు. -
‘మహానాడు’ ఏర్పాట్లు ప్రారంభం'
హైదరాబాద్: హైదరాబాద్‌లోని గండిపేట.. ‘తెలుగు విజయం’లో మహానాడు ఏర్పాట్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నేతలు ఉమ్మడిగా తెలుగు విజయాన్ని పరిశీలించడంతో పాటు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, మహానాడు ఏర్పాట్ల కమటీ కన్వీనర్ టీడీ జనార్దనరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మాగంటి గోపీనాథ్, మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.