111 జీవో రద్దు ఓకే.. వాట్ నెక్ట్స్..? | What Next After 111 Go Abolish Impact On People Ranga Reddy | Sakshi
Sakshi News home page

111 జీవో రద్దు ఓకే.. విధివిధానాలు, చర్యలు ఏంటి? అనేక సందేహాలు!

Published Fri, May 26 2023 5:38 PM | Last Updated on Fri, May 26 2023 6:18 PM

What Next After 111 Go Abolish Impact On People Ranga Reddy - Sakshi

హైదరాబాద్ మహానగర శివారులోని గ్రామాలకు  ట్రిపుల్ వన్ ట్రబుల్స్ ఇక తప్పినట్టేనా? కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి?. 84 గ్రామాలకు 111 జీవో నుంచి విముక్తి దొరికినట్టేనా ? జంట జలాశయలా పరిరక్షణకు  కొత్త రూల్స్ ఎలా ఫామ్ చేయబోతున్నారు ? లోకల్ పబ్లిక్‌లో ఉన్న అనుమానాలేంటీ ? HMDA రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి ? 

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 84 గ్రామాల ప్రజలు జీవో 111తో రెండు దశాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్ ట్రిపుల్ వన్ జీవో రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోద ముద్ర వేశారు. దీంతో జీవో పరిధిలోని గ్రామాల్లో సంబరాలు, సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేశారు. అంత వరకు ఓకే.. కానీ.. స్థానిక ప్రజలను అనేక అనుమానాలు వేధిస్తున్నాయి.

జీవో ఎత్తివేసిన తర్వాత అనుమతులు ఎలా ఇస్తారు? గ్రీన్ జోన్ పరిధిలో ఏయే గ్రామాలను ఎంపిక చేస్తారు? గ్రీన్ జోన్ పరిధిని ఏ ప్రాతిపాదికన నిర్ణయిస్తారు? జంట జలాశయాలపైన ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు జలాశయాల్లో కలవకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అక్రమంగా లే అవుట్లు వెలిశాయి. వాటికి అనుమతులు ఎలా ఇస్తారు?  ట్రిపుల్ వన్ జీవో రద్దు తర్వాత.. కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది.  

గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని గ్రీన్ జోన్‌గా నిర్ధారించే అవకాశాలున్నాయి. గ్రీన్ జోన్‌లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతించే అవకాశం లేదు. ఇక మురుగునీరు జంటజలాశయాల్లో కలవకుండా 11 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. గండిపేట జలాశయం చుట్టూ 5, హిమాయత్ సాగర్ జలాశయం చుట్టూ 6 ఎస్టీపీలు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జంట జలాశయాల పరిరక్షణపై పర్యావరణ వేత్తలు ఆందోళణ చెందాల్సిన పనిలేదని మాత్రం చెబుతున్నారు లోకల్ ఎంపీ రంజిత్ రెడ్డి చెబుతున్నారు.
చదవండి: Telangana University: రిజిస్ట్రార్‌ నియామకంలో మళ్లీ వివాదం

ఇక మొయినాబాద్, శంకర్ పల్లి, శంషాబాద్ మండలాల్లో ఇప్పటికే చాలా వరకు HMDA అనుమతులు లేకుండా అక్రమ లే అవుట్లు భారీగా వెలిశాయి. వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది.  HMDA పరిధిలో దాదాపుగా పది వేల ఎకరాల్లో అక్రమ వెంచర్లు వెలిసినట్లు ప్రాథమిక అంచనా. 111 జీవో నేపథ్యంలో ఆ ప్లాట్లను ఇన్నాళ్లు నిషేధిత జాబితాలో ఉంచారు.  వాటికి సంబంధించి నోటరీతో ఇన్నాళ్లు సరిపెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేయలేదు. జీవో రద్దు ప్రకటన తర్వాత. విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.  
చదవండి: ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట

అయితే గ్రామాల్లో తమ భూములు అమ్ముకోకుండా ఉన్న కొద్ది పాటి రైతులు మాత్రం జీవో రద్దుతో తమ భూములకు విలువ పెరుగుతుందని సంబరపడుతున్నారు. మొత్తంగా జీవో 111 రద్దు పరిధిలో  HMDA కనీసం ఒక్క లేఅవుట్‌కు అధికారికంగా అనుమతి ఇచ్చే వరకు ఇక్కడ ప్రాంతవాసుల్లో అనుమానాలు మాత్రం క్లియర్ అయ్యేలా కనిపించని పరిస్థితి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement