himayat sagar
-
ఉధృతంగా ఈసీ, మూసీ వాగులు.. ఆ రోడ్డు మూసివేత
సాక్షి, రంగారెడ్డి: కుండపోత వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్, తాండూర్, శంకర్పల్లి, షాబాద్, షాద్ నగర్, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చదవండి: మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం? -
హిమాయత్ సాగర్ వద్ద ఇదీ పరిస్థితి
-
ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తనున్న అధికారులు.. మూసీతో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌ల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు లోతట్టు ప్రాంతాలు సైతం జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా.. నగరంలోని జంట జలాశయాలకు సైతం వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు ఉస్మాన్ సాగర్ గేట్లను లిఫ్ట్ చేయనున్నారు అధికారులు. ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేయనున్నారు. ఇక, ఇప్పటికే అధికారులు హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో, మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో మూసీ ఏడు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మూసీ పరిస్థితి.. ఇన్ ఫ్లో: 13140 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 10047 క్యూసెక్కులు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు ప్రస్తుత మట్టం: 642.40 అడుగులు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 4.46 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 3.79 టీఎంసీలు. ఇది కూడా చదవండి: భారీ వర్షాల ఎఫెక్ట్.. టెన్షన్ పెడుతున్న మున్నేరు, పాలేరు -
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: జీవో 111 రద్దు అనంతర పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. జీవో ఎత్తివేత తర్వాత ఎదురయ్యే పర్యావరణ సమస్యలను అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా మార్గదర్శకాల జారీకి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా జీవో రద్దుతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే పర్యావరణ వేత్తల ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటూ అచితూచి అడుగులేస్తోంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా.. జలాశయాల ఉనికికి భంగం కలుగకుండా ప్రణాళికా బద్ధమైన అభివృద్ధికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భారీ నిర్మాణాలు, పరిశ్రమలతో జంట జలాశయాలు కలుషితం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోనుంది. స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకోకుండా.. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, వరద కాల్వల నిర్మాణం, గ్రీన్‌బెల్ట్, బఫర్ జోన్ పరిధుల నిర్ధారణ తదితర అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ల నుంచి అభ్యంతరాలు రాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు, నిపుణుల కమిటీ కొత్త నిబంధనల రూపకల్పనలో తలమునకలైంది. జీవో 111 పరిధిలోని ఏడు మండలాల్లో 84 గ్రామాలుండగా వీటిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కలుపుకొని సుమారు 1.35 లక్షల ఎకరాల భూమి ఉంది. జెడ్‌ఎల్‌డీ ప్రాంతాల్లో నివాస సముదాయాలు వర్షపాతాన్ని అధ్యయన నివేదిక ఆధారంగా తక్కువ వర్షపాతం ఉండి, జలాశయాల మనుగడకు ఇబ్బంది లేని ప్రాంతాన్ని జీరో లెవల్ డిశ్చార్జి (జెడ్‌ఎల్‌డీ)గా గుర్తించనున్నారు. ఈ ప్రాంతంలో హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారమే నివాస సముదాయాల నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. వాణిజ్య కార్యకలాపాలకు అస్సలు అనుమతులు ఉండవు. ఇక ఈ ప్రాంతాల్లోని నివాసాల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేసి, తిరిగి ఆ నీటిని అక్కడే వివిధ ఇతర అవసరాలకు వినియోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. శాటిలైట్ మ్యాపుల ద్వారా గ్రీన్ చానళ్ల గుర్తింపు.. మురుగు, వర్షపు నీరు జంట జలాశయాలకు చేరితే వాటి ఉనికికే ప్రమాదమనేది పర్యావరణవేత్తల ప్రధాన అభ్యంతరం. దీనికి పరిష్కారం చూపించగలిగితే సమస్య ఉండదని భావించిన నిపుణులు కమిటీ.. అసలు వరద నీరు జలశయాలకు ఏ ప్రాంతం నుంచి చేరుతుందో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. గత 50 ఏళ్ల వర్షపాతాన్ని అధ్యయనం చేసి నీటి ప్రవాహ మార్గాన్ని శాటిలైట్ మ్యాపుల ద్వారా గుర్తించనున్నారు. జలాశయాల ఎగువ నుంచి వచ్చే ఈ నీరు జీవో 111 పరిధిలోని 84 గ్రామాల గుండా ఎలా ప్రవహిస్తుందో నిర్ధారిస్తారు. ఈ ప్రవాహ మార్గాన్ని గ్రీన్ ఛానల్‌గా గుర్తిస్తారు. ఈ చానల్స్ వద్ద వరద కాలువలను నిర్మిస్తారు. ఒకవేళ కాలువల నిర్మాణం కోసం భూములు తీసుకోవాల్సి వస్తే గనక ప్రస్తుత మార్కెట్ రేటు కట్టి ఇవ్వాలని, అప్పుడే భూ యజమానులు ముందుకొస్తారని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. బఫర్ జోన్ 500 మీటర్లే! ప్రస్తుతం జంట జలాశయాల చుట్టూరా 10 కిలో మీటర్ల ప్రాంతాన్ని చెరువు పూర్తి స్థాయి సామర్థ్యం (ఎఫ్టీఎల్)గా పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతంలో కేవలం పదిశాతం విస్తీర్ణంలో మాత్రమే నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. అయితే కొత్త నిబంధనలలో ఎఫ్టీఎల్ స్థానంలో 500 మీటర్ల వరకే బఫర్ జోన్ ఉండనుంది. ఈ జోన్ పరిధిలో నిర్మాణాలపై ఆంక్షలుంటాయి. కాగా 300 చదరపు మీటర్లకు పైన ఉన్న ప్లాట్లకు కనిష్టంగా మీటరు వెడల్పుతో ఒకవైపున గ్రీన్ బెల్ట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
111 జీవో రద్దు ఓకే.. వాట్ నెక్ట్స్..?
హైదరాబాద్ మహానగర శివారులోని గ్రామాలకు ట్రిపుల్ వన్ ట్రబుల్స్ ఇక తప్పినట్టేనా? కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి?. 84 గ్రామాలకు 111 జీవో నుంచి విముక్తి దొరికినట్టేనా ? జంట జలాశయలా పరిరక్షణకు కొత్త రూల్స్ ఎలా ఫామ్ చేయబోతున్నారు ? లోకల్ పబ్లిక్‌లో ఉన్న అనుమానాలేంటీ ? HMDA రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి ? రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 84 గ్రామాల ప్రజలు జీవో 111తో రెండు దశాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్ ట్రిపుల్ వన్ జీవో రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోద ముద్ర వేశారు. దీంతో జీవో పరిధిలోని గ్రామాల్లో సంబరాలు, సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేశారు. అంత వరకు ఓకే.. కానీ.. స్థానిక ప్రజలను అనేక అనుమానాలు వేధిస్తున్నాయి. జీవో ఎత్తివేసిన తర్వాత అనుమతులు ఎలా ఇస్తారు? గ్రీన్ జోన్ పరిధిలో ఏయే గ్రామాలను ఎంపిక చేస్తారు? గ్రీన్ జోన్ పరిధిని ఏ ప్రాతిపాదికన నిర్ణయిస్తారు? జంట జలాశయాలపైన ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు జలాశయాల్లో కలవకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అక్రమంగా లే అవుట్లు వెలిశాయి. వాటికి అనుమతులు ఎలా ఇస్తారు? ట్రిపుల్ వన్ జీవో రద్దు తర్వాత.. కొత్త విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని గ్రీన్ జోన్‌గా నిర్ధారించే అవకాశాలున్నాయి. గ్రీన్ జోన్లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతించే అవకాశం లేదు. ఇక మురుగునీరు జంటజలాశయాల్లో కలవకుండా 11 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. గండిపేట జలాశయం చుట్టూ 5, హిమాయత్ సాగర్ జలాశయం చుట్టూ 6 ఎస్టీపీలు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జంట జలాశయాల పరిరక్షణపై పర్యావరణ వేత్తలు ఆందోళణ చెందాల్సిన పనిలేదని మాత్రం చెబుతున్నారు లోకల్ ఎంపీ రంజిత్ రెడ్డి చెబుతున్నారు. చదవండి: Telangana University: రిజిస్ట్రార్ నియామకంలో మళ్లీ వివాదం ఇక మొయినాబాద్, శంకర్ పల్లి, శంషాబాద్ మండలాల్లో ఇప్పటికే చాలా వరకు HMDA అనుమతులు లేకుండా అక్రమ లే అవుట్లు భారీగా వెలిశాయి. వాటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. HMDA పరిధిలో దాదాపుగా పది వేల ఎకరాల్లో అక్రమ వెంచర్లు వెలిసినట్లు ప్రాథమిక అంచనా. 111 జీవో నేపథ్యంలో ఆ ప్లాట్లను ఇన్నాళ్లు నిషేధిత జాబితాలో ఉంచారు. వాటికి సంబంధించి నోటరీతో ఇన్నాళ్లు సరిపెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేయలేదు. జీవో రద్దు ప్రకటన తర్వాత. విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. చదవండి: ఓవైపు విగ్రహాలకు అభిషేకం.. మరోవైపు ఈవో జలకాలాట అయితే గ్రామాల్లో తమ భూములు అమ్ముకోకుండా ఉన్న కొద్ది పాటి రైతులు మాత్రం జీవో రద్దుతో తమ భూములకు విలువ పెరుగుతుందని సంబరపడుతున్నారు. మొత్తంగా జీవో 111 రద్దు పరిధిలో HMDA కనీసం ఒక్క లేఅవుట్‌కు అధికారికంగా అనుమతి ఇచ్చే వరకు ఇక్కడ ప్రాంతవాసుల్లో అనుమానాలు మాత్రం క్లియర్ అయ్యేలా కనిపించని పరిస్థితి నెలకొంది. -
హిమాయత్ సాగర్ చెరువులో యువకుడు గల్లంతు
-
Hyderabad Floods Photos: నిండా ముంచేసిన మూసీనది (ఫొటోలు)
-
హైదరాబాద్: మూసీ నదికి పోటెత్తిన వరద.. రాకపోకలు బంద్
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఉస్మాన్, హియాయత్‌సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కో రిజర్వాయర్‌కు 8 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు గాను ప్రస్తుతం 1761.9 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో 8000 క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 10700 క్యూ సెక్కులు ఉంది. దీంతో 8 గేట్లు 4 అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1789.10 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో 8000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 8281 క్యూసెక్కులుగా ఉంది. 13 గేట్లు ఆరు అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని వదులుతున్నారు. రాకపోకలు బంద్ మూసీ నది ఉధృతితో అధికారులు అలర్ఠ్ అయ్యారు. అంబర్‌పేట-కాచిగూడ, మూసారాంబాగ్- మలక్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోవైపు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. మరికొన్ని గంటల్లో అల్వాల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంఠ్ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశ ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సీపీ సందర్శన ఉస్మాన్ సాగర్, ఓఆర్ఆర్ వద్ద వరద ప్రవాహాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. వర్షం ముంపునకు గురైన ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడుతో కలిసి హిమాయత్ సాగర్ చెరువు, హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు, గండిపేట చెరువులను సందర్శించారు. భారీ వర్షాల కారణంగా హిమాయత్, ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద నీరు పెరుగుతోందని, పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు. సైబరాబాద్ పోలీసులు ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలదిపారు. పోటెత్తిన వరద మూసీ ప్రాజెక్టుకు అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ముందస్తుగా మూసీనది ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి నాలుగు అడుగుల ఎత్తిత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో 5,733.36 క్యూసెక్కులు వస్తుండగా 17, 809 క్యూసెక్కులు కాగా. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీటి సామర్థ్యం 637.500 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.67 టీఎంసీలుగా కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారులో లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బీబీనగర్ మండలం, రుద్రవల్లి, భూదాన్ పోచలంపల్లి మండలం జూలురు గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవ్ బ్రిడ్జికి ఇరువైపుల వాహనదారులు, ప్రజలు ప్రయాణించకుండా బీబీనగర్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవల వంతెనపై మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో భువనగిరి మండలం, భుల్లేపల్లి, వలిగొండ మండలం, సంగెం గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. -
హిమాయత్ సాగర్ వరదల్లో చిక్కుకున్న వ్యక్తి.. కాపాడిన పోలీసులు
-
హిమాయత్ సాగర్: ప్రమాదకర విన్యాసాలతో యువకులు
సాక్షి, బండ్లగూడ: జలమండలి అధికారుల పర్యావేక్షణ లోపంతో హిమాయత్‌సాగర్ చెరువులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ చెరువు నిండుకుండలా మారడంతో గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. సందర్శకులకు డ్యామ్ పైకి అనుమతి లేని విషయం తెలిసిందే. కానీ కొంతమంది యువకులు చెరువు ఒడ్డుకు వెళ్లి ప్రమాదకరంగా సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
Hyderabad Rains: మూడ్రోజులుగా ముసురుకుంది.. స్తంభించిన జనజీవనం
సాక్షి, హైదరాబాద్: ఆకాశానికి చిల్లులు పడ్డాయా.. మేఘాలు వర్ష ధారలయ్యాయా అన్నట్లు మూడ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో నగరం తడిసిముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం హఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్లు, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లిలలో 6, గాజుల రామారం ఉషోదయ కాలనీలో 5.6, బాలానగర్‌లో 5.3, మియాపూర్, జూపార్కులలో 5.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రాయదుర్గంలో కనిష్టంగా 4.5 సెంటీమీటర్ల వాన కురిసింది. రామంతాపూర్, కందికల్ గేట్, జీడిమెట్ల, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. మురుగునీటి కాల్వకు మరమ్మతులు కొనసాగుతున్న అనేక చోట్ల వరదనీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చదవండి: ప్రాజెక్టులకు వరద పోటు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లపై గుంతల్లో వాననీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. Its not a rivulet, #Waterlogging on roads due to continuous #HeavyRains near #Attapur area in #Hyderabad, Traffic interrupts. #Telangana govt alerted citizens, declared 3 days holidays to Educational Institutions.#HyderabadRains #heavyrain #Telanganarains #TelanganaFloods pic.twitter.com/Tn1MJblQLo — Surya Reddy (@jsuryareddy) July 10, 2022 జంట జలాశయాలకు వరద ప్రవాహం మణికొండ: గత రెండు రోజులుగా శివారు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గండిపేట (ఉస్మాన్‌సాగర్) చెరువులోకి వరదనీరు పోటెత్తుతుండటంతో ఆదివారం సాయంత్రం రెండు గేట్లను వదలి నీటిని కిందకు వదిలారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785.80 అడుగులకు చేరుకుంది. పైనుంచి 208 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 7,9 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 100 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. గండిపేట గేట్లను ఎత్తుతున్న అధికారులు దాంతో మూసీ నదిలో నీటి ప్రవాహం మొదలయ్యింది. గండిపేటలోని గేట్లకు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, జలమండలి డీజీఎంలు నరహరి, వెంకట్రావులు పూజలు నిర్వహించి గేట్లను పైకి ఎత్తారు. రాత్రికి మరింత వరద ఎక్కువైతే అవే గేట్లను మరింత ఎత్తటం, మరిన్ని గేట్లను ఎత్తేందుకు యంత్రాంగం సిద్దంగా ఉందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గండిపేట కౌన్సిలర్లు విజిత ప్రశాంత్ యాదవ్, నాయకులు గోపాల గణేష్, సీఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వరద నీటితో హిమాయత్‌సాగర్ Waves in Hyderabad @balaji25_t @Rajani_Weather#HyderabadRains pic.twitter.com/1L1TCEjNGt — karthikavsk(sharzsCAr) (@karthikavsk) July 10, 2022 నిండుకుండలా హిమాయత్‌సాగర్.. బండ్లగూడ: భారీ వర్షాలు కురుస్తుండడంతో హిమాయత్‌సాగర్ చెరువు వరద నీటితో నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1760.50 అడుగులుగా ఉంది. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జలమండలి మేనేజర్ రేణుక, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌ల ఆధ్వర్యంలో 10, 5వ నంబర్ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. -
69 జీఓను రద్దు చేయాలి: పలు సంఘాల సంయుక్త ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీఓను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన 69 జీఓను తక్షణం రద్దు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 84 గ్రామాల పరిధిలో పట్టణీకరణ కోసం జారీచేసిన తాజా జీఓతో జంట జలాశయాలు మురుగు కాల్వల్లా మారతాయని ఆక్షేపించారు. నగర జనాభా 2050 నాటికి రెట్టింపవుతుందని, తాగునీటి అవసరం అనూహ్యంగా పెరుగుతుందన్నారు. పట్టణీకరణ వల్ల వర్షపునీటి ప్రవాహానికి అడ్డంకులు తలెత్తి వరదల ఉద్ధృతి పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రకటన విడుదల చేసినవారిలో హెచ్ఆర్ఎఫ్ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.బాల్‌రాజ్, తిరుపతయ్య, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.వసంతలక్ష్మి, డబ్ల్యూఐసీసీఐ అధ్యక్షుడు లుబ్నాసర్వత్, సిటిజన్స్ ఫర్ హైదరాబాద్ ప్రతినిధి కాజల్ మహేశ్వరి, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ప్రతినిధి ఫరిహా ఫాతిమా, అనన్య సంగమేశ్వర్లున్నారు. (క్లిక్: హైదరాబాద్ కలెక్టర్‌గా అమయ్‌కుమార్) -
కేసీఆర్ కీలక నిర్ణయం.. నెరవేరనున్న 26 ఏళ్ల కల
మొయినాబాద్: జీవో 111 ఎత్తివేతకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఆ జీవో పరిధిలోని ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ 26 ఏళ్ల కల నెరవేరనుందని, అభివృద్ధికి అడ్డు తొలగిపోనుందని స్థానికులు చెబుతున్నారు. 84 గ్రామాల్లోని సుమారు లక్షా 32 వేల ఎకరాల భూ మికి విముక్తి లభిస్తుందని అంటున్నారు. నిజాం కాలంలో హైదరాబాద్‌కు తాగునీరు అందించడం కోసం నిర్మించిన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీళ్లు కలుషితం కాకుండా ఉండటం కోసం 1996లో అప్పటి ప్రభు త్వం 111 జీవోను తీసుకొచ్చింది. జలాశయాల ఎగువ ప్రాంతంలోని 84 గ్రామాలను జీవో పరిధిలో చేర్చి కొన్ని నిబంధనలను విధించింది. అయితే దీనివల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి కుం టు పడుతోందని, భూములకు ధరలు పెరగడం లేదని స్థానిక రైతులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నో ఏళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. జీవో ఎత్తివేయాలనే డిమాండ్ స్థానికంగా మరింత ఊపందుకోవడంతో ఎన్నికల సమయంలో రాజ కీయ పార్టీలు ఈ మేరకు హామీ ఇచ్చాయి. సీఎం కేసీఆర్ కూడా జీవో 111 ఎత్తివేతకు హామీ ఇచ్చా రు. (చదవండి: హెచ్చార్సీలో మంత్రి హరీశ్‌రావుపై కేసు ) ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం అసెంబ్లీలో.. హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం కృష్ణా, గోదా వరి నీళ్లు సరఫరా అవుతున్నందున జంట జలాశయాల నీటిని వినియోగించడంలేదని, అందువల్ల జీవో 111ను ఎత్తేస్తామని ప్రకటించారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో జీవో పరిధిలోని రైతులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. మొయినాబాద్ మండల కేం ద్రంతో పాటు పలు గ్రామాల్లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. 111 జీవో ఎత్తివేతతో ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయని, అభివృద్ధి జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభపరిణామం: ఎంపీ రంజిత్‌రెడ్డి జీవో 111 ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవ డం శుభ పరిణామమని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తివేతపై హామీ ఇచ్చారని.. ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చే దిశగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొ న్నారు. చేవెళ్ల ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 26 ఏళ్ల కల సాకారం అవుతోంది జీవో 111 కారణంగా తమ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌కు చెందిన కొత్త నర్సింహారెడ్డి చెప్పారు. ఆ జీవో ఎత్తేయాలని ఏళ్ల తరబడి పోరాటాలు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో జీవో రద్దు కానుండటంతో 26 ఏళ్ల కల ఇప్పుడు సాకారం అవుతోందని చెప్పారు. (చదవండి: జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్) -
జీవో 111 రద్దు చేస్తే ప్రకృతికి శాపం
బంజారాహిల్స్: హైదరాబాద్‌కు ఒక వరంగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్లకు రక్షణకవచమైన జీవో 111 రద్దు చేస్తే ప్రకృతికి శాపంగా మారుతుందని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కన్వీనర్ లుబ్నా సారావత్ అన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోపోతే పర్యావరణ ప్రేమికులు, చెరువుల పరిరక్షకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కొద్దిరోజుల క్రితం జీవో 111 రద్దు చేస్తామని, ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో పర్యావరణ ప్రేమికులు, పర్యావరణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. లుబ్నా సారావత్ మాట్లాడుతూ జీవో 111 రద్దు నిర్ణయాన్ని, కమిటీని ఉపసంహరించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే సీఎం ప్రయత్నిస్తున్నారని, ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్ధాలే.. ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌లపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారని సారావత్ దుయ్యబట్టారు. వీటిని కాపాడుకోకపోతే భవిష్యత్ కాలుష్యమయం అవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఉద్యమానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు చెరువులు వరదలను ఆపడమే కాకుండా ఎన్నో వనరులకు కేంద్ర బిందువుగా ఉన్నాయని, శక్తి మేర నగరవాసుల దాహార్తి తీరుస్తున్నాయని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరగడానికి, హైదరాబాద్ చుట్టూ ప్రకృతి విరాజిల్లడానికి కారణమవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి మద్దతు కూడగడతామని, ప్రజలకు వీటి అవసరాన్ని గుర్తు చేస్తామని వెల్లడించారు. ఐఏసీటీ విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు మాట్లాడుతూ జీవో 111 రద్దు నిర్ణయాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రకృతికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే, వాటి దుష్పరిణామాలు తట్టుకోలేరన్నారు. ప్రజలందరితో చర్చించిన తర్వాతనే జీవో 111పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
లారీని ఢీకొన్న కారు..
-
ఆరు నెలలైనా కౌంటర్ వేయరా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి హిమాయత్‌సాగర్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు వర్షపునీరు ప్రవహించే కాలువలన్నీ కూల్చిన భవనాల వ్యర్థాలు, అక్రమ కట్టడాలతో నిండిపోయాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని లేకపోతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వర్షం నీరు ప్రవహించే కాలువలన్నీ వ్యర్థపదార్థాలతో పూడుకుపోవడంతో పాటు, అక్రమ నిర్మాణాల వల్ల నీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయిందని, కాల్వల్లో నీరు ప్రవహించేలా చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాష్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. -
Balancing Stones: కోట్ల ఏళ్లుగా.. కొండ కొసన..
సిద్దిపేట సమీపంలోని హస్తాల్పూర్ శివారు గుట్టమీద అంచుపై ఉన్న గుండు రాయి ఇది. కాస్త పట్టుకుని ఉన్నట్టుండే ఈ రాయి కూడా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. ..పైన చెప్పినవన్నీ ఒకే రకంగా ఏర్పడిన రాళ్లే. తెలంగాణలో పలుచోట్ల ఇలాంటివి ఉన్నాయి. కానీ వాటి ప్రత్యేకతలపై అవగాహన లేక ధ్వంసమైపోతున్నాయి. ఒక్కదాన్ని కూడా పురావస్తు శాఖ (ప్రస్తుతం వారసత్వ శాఖ) రక్షిత ప్రాంతంగా గుర్తించలేదు. ప్రకృతి చెక్కిన ఈ రాళ్లను పరిరక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. విదేశాల్లో ఇలాంటి వాటిని రక్షిత ప్రాంతంగా గుర్తించి, కాపాడుకుంటున్నారని పేర్కొంటున్నారు. రెండేళ్ల కింద ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలిపురంలో ద్వైపాక్షిక చర్చలు జరిపిన వేళ.. పెద్ద పరుపు బండపై నిలిచిన గుండ్రటి రాయి వద్ద ఫొటో దిగారు. కృష్ణుడి చేతిలోని వెన్నెముద్దగా పిలిచే ఆ రాయి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముట్టుకుంటే జారిపోతుందేమో అన్నట్టున్న ఆ రాయి.. అలా ఎలా నిలిచి ఉందన్న ప్రశ్న అందరినీ తొలిచేసింది. ఇది హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉన్న ఓ చిత్రమైన రాయి. అడ్డంగా ఉన్న అంత పెద్ద రాయి.. మధ్యలో చిన్న భాగం మాత్రమే కింద తాకుతుంది. మిగతా భాగమంతా గాలిలో తేలుతూ ఉంటుంది. అయినా బలంగా నిలిచి ఉంది. దీన్ని ‘మష్రూమ్ (పుట్టగొడుగు) రాక్’గా పిలుచుకుంటారు. హిమాయత్‌సాగర్ జలాశయం పక్కనే.. చిన్నగుట్టపై ఒకదానిమీద మరొకటి పేర్చినట్టుగా ఉన్న రాళ్లు ఇవి. ఏ క్షణాన్నయినా జలాశయంలోకి దొర్లిపోయేట్టుగా కనిపిస్తాయి. ఆ రాళ్ల పక్కన గుట్ట భాగాన్ని గతంలోనే తొలిచేశారు. ఎప్పుడో అప్పుడు ఇవీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఎలా ఏర్పడతాయి? భూమ్యాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉన్నట్టు భ్రమింపజేసే ఈ రాళ్లను బ్యాలెన్సింగ్ స్టోన్స్‌గా పిలుస్తారు. భూమిపై 350–250 కోట్ల ఏళ్ల క్రితం గ్రానైట్, ఇతర రాళ్ల పొరలు ఏర్పడ్డాయని.. వాటిలో క్రమంగా పగుళ్లు ఏర్పడి, దిగువకు కూరుకుపోవడమో, పడిపోవడమో జరిగిందని నిపుణులు చెప్తున్నారు. అలాంటి సమయంలో కొన్ని రాళ్లు అలాగే నిలిచిపోతాయని.. అవే ఈ బ్యాలెన్సింగ్ రాళ్లు అని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఆరు కోట్ల ఏళ్ల నాటివి ‘‘కోట్ల ఏళ్ల క్రమంలో భూమిలో వచ్చే మార్పుల వల్ల బ్యాలెన్సింగ్ రాళ్లు ఏర్పడతాయి. తెలంగాణలో కనిపిస్తున్న ఈ బ్యాలెన్సింగ్ రాళ్లు దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం నాటివిగా అంచనా. పురాతన ప్రాధాన్యమున్న ఈ రాళ్లను పర్యాటకులకు చేరువ చేయాలి’’ – చకిలం వేణుగోపాల్, విశ్రాంత డిప్యూటీ డీజీ, జీఎస్ఐ మనవద్ద గుర్తింపు రాలేదు ‘‘బ్యాలెన్సింగ్ రాళ్లకు విదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. రాష్ట్రంలో కొన్ని గుట్టల్లో ఇలాంటి రాళ్లున్నా వాటికి గుర్తింపు లేదు. స్థానికంగా ఏ అవగాహనా లేదు. క్రషర్లలో, ఇళ్ల నిర్మాణాల్లో వాడే రాళ్లుగా వినియోగిస్తున్నారు. వాటిని పరిరక్షించాలి’’ – శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ -
హిమాయత్ సాగర్‌కు భారీగా చేరుతున్న వరద నీరు
-
నేడు హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లు ఎత్తివేత
-
నిండుకుండలా హిమాయత్‌సాగర్ జలాశయం
-
రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం!
-
రాజేంద్రనగర్‌లో ఘోరరోడ్డుప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి వెంట ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడింది. అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టి.. పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న యువకులు కూడా గాయపడ్డారు. కారును నడిపింది మైనర్ బాలుడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మితిమీరిన వేగమే కారణం! కారు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని, బైక్‌ను ఢీ కొన్న అనంతరం కారు రోడ్డుపక్కన ఉన్న కాలువలోకి దూసుకువెళ్లిందని స్థానికులు చెప్తున్నారు. కారును నడిపిస్తున్న మైనర్ బాలుడితోపాటు మరో ఇద్దరు మైనర్లు కారులో ఉన్నారని, వారు కూడా గాయపడ్డారని అంటున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాగరాజుగా గుర్తించారు. భార్యాబిడ్డతో కలసి తన బైక్‌పై హిమాయత్ సాగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు అతను వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు.. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. -
ఇన్‌ఫ్లో చా‘నిల్’
సాక్షి,హైదరాబాద్ : ఒకవైపు క్యుములోనింబస్ మేఘాలు కుమ్మే శాయి. కుండపోతకు నగరం గజగజలాడింది. మరోవైపు నగర దాహార్తిని తీర్చే జంటజలాశయాలు వెలవెలబోయాయి. నగరంలోని ఏ రోడ్డుపై చూసినా నడుంలోతు వరకు నీరే... కానీ, ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లలో కనీసం ఒక్క అడుగైనా నీటిమట్టం పెరగలేదు. రహదారులన్నీ గోదారులయ్యాయి. కానీ, నీటికాల్వలన్నీ మూసుకుపోయాయి. ఇదీ సోమవారం కనిపించిన దృశ్యాలు. జూబ్లీహిల్స్, షేక్‌పేట్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యన 6.7 సెం.మీ. కుంభవృష్టి కురిసింది. శేరిలింగంపల్లి, మాదాపూర్ ప్రాంతాల్లోనూ రెండు గంటల్లో 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల క్యుములోనింబస్ ప్రభావంతో కొన్నిచోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది కంటే తక్కువే ఉస్మాన్‌సాగర్(గండిపేట్) గరిష్టమట్టం 1,790 అడుగులకుగాను ప్రస్తుతం 1,762.300 అడుగులమేర మాత్రమే నీటినిల్వలున్నాయి. హిమాయత్‌సాగర్ గరిష్టమట్టం 1,763.500 అడుగులకుగాను ప్రస్తుతం 1,741 అడుగుల మేర నీటినిల్వలున్నాయి. ఈ సీజన్లో జూన్–సెపె్టంబర్ మధ్యకాలంలో జలాశయాల ఎగువ ప్రాంతాల్లోని చేవెళ్లలో 26 శాతం, శంకర్పల్లి మండలంలో 37 శాతం తక్కువ వర్షపాతం నమోదవడం కూడా నీటిమట్టాలు పెరగకపోవడానికి మరో కారణమని జలమండలి అధికారులు చెబుతున్నారు. హిమాయత్ సాగర్ రోజురోజుకూ చిన్నబోతూ... జంటజలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111 పరిధిలో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జంటజలాశయాలకు వరదనీటిని చేర్చే కాల్వలు(ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం, ఇటుకబట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌస్‌లు, ఇంజనీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో దారులు మూసుకుపోయాయి. దీంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. దాహార్తి తీర్చడానికి.. నిత్యం ఈ రెండు జలాశయాల నుంచి జలమండలి 113 మిలియన్ లీటర్ల నీటిని నగర తాగునీటి అవసరాలకు తరలిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం జంటజలాశయాల్లో ప్రస్తుతం డెడ్‌స్టోరేజి నిల్వలున్నాయి. పానీ పరేషాన్ లేదు గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న నాగార్జునసాగర్(కృష్ణా), ఎల్లంపల్లి(గోదావరి) జలాశయాల్లోకి ఇటీవల భారీగా వరదనీరు రావడంతో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలతో నిండుకుండల్లా మారాయి. నగరానికి నిత్యం కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశసహా జంటజలాశయాల నుంచి మొత్తంగా 2,115 మిలియన్ లీటర్ల నీటిని సేకరించి శుద్ధి చేసి నగరంలోని 9.80 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫరా చేస్తున్నాం. గ్రేటర్‌కు మరో ఏడాదివరకు పానీ పరేషాన్ ఉండబోదని భావిస్తున్నాం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
జంట జలాశయాలు నిష్ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు ఎన్నో దశాబ్దాలుగా తాగునీరు అందిస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ రెండు జలాశయాలు కూడా నిష్ప్రయోజనకరంగా మారాయని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు గురువారం హైకోర్టుకు నివేదించారు. ఈ జలాశయాల వల్ల తాగునీరు తగినంత అందడం లేదని, కృష్ణా జలాలనే తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ జంట జలాశయాల పరిధిలో జీవో 111కు విరుద్ధంగా భారీ ఎత్తున వెలసిన అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు ఎదుట ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై పిటిషనర్ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో ఏఏజీ స్పందిస్తూ, జీవో 111పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అంగీకరిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 111 జీవో పరిధిలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయని, వీటి విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అలాగే జీవో 111 చట్టబద్ధతను సవాలు చేస్తూ కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏఏజీ వాదనలు వినిపిస్తూ జంట జలాశయాలు నిష్ప్రయోజనకరంగా మారాయని కోర్టుకు నివేదించారు. -
హిమాయత్, ఉస్మాన్‌సాగర్‌ల లెక్కలూ చెప్పాలి
వాటర్‌గ్రిడ్, భక్తరామదాస నీటి వినియోగం తెలపాలి రాష్ట్రానికి కృష్ణా బోర్డు ఆదేశం అదనపు నీటి వినియోగం ఆపాలంటూ రాష్ట్రానికి మరో లేఖ హైదరాబాద్ తాగునీటికి మాత్రమే నీరు వాడాలని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటున్న కొత్త, పాత ప్రాజెక్టుల వివరాలన్నీ తమకు సమర్పించాల్సిందేనని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత చేపట్టి.. నీటి వినియోగం చేస్తున్న ప్రాజెక్టుల నీటి వాడకం వివరాలు చెబితేనే నీటి ప్రణాళిక ఖరారు సులువవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖలు రాసింది. ‘కృష్ణాజలాలను వినియోగిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి 2014–15, 15–16 ఏడాదుల్లో నీటి వినియోగ వివరాలన్నీ ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతున్నా ఇరు రాష్ట్రాలు ఇంతవరకు స్పందించలేదు. కేవలం అదనపు, వరద జలాలను వినియోగిస్తూ చేపట్టిన ఏఎంఆర్పీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు–నగరి, ముచ్చుమర్రి వినియోగాలు మాత్రం సమర్పిస్తున్నారు. అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం చేపట్టిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లతో పాటు వాటర్‌గ్రిడ్, భక్త రామదాల, ఇతర ఎత్తిపోతల పథకాల కింది వినియోపు వివరాలను తెలంగాణ చెప్పడం లేదు. ఇక గురు రాఘవేంద్ర, శివభాష్యం సాగర్ల వివరాలను ఆంధ్రప్రదేశ్ తెలపలేదు. ఇప్పటికైనా తెలంగాణ హిమాయత్, ఉస్మాన్‌సాగర్‌ల కింద చేస్తున్న వినియోగంతో పాటు మిగతా ప్రాజెక్టుల కింద గత మూడేళ్లుగా జరుగుతున్న వినియోగాన్ని తెలపాలి’అని లేఖలో స్పష్టం చేసింది. నీటి వాటాల వినియోగంలో పారదర్శకత పెంచేందుకు, వాటాల ఆధారంగా తగిన నీటి కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ ప్రాజెక్టుల వివరాలు అత్యావశ్యకమని పేర్కొంది. అదనపు వినియోగం ఆపండి... కాగా కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటాకు మించి వినియోగం చేసిందని ఏపీ, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ అదనంగా 3.26 టీఎంసీలు వాడిందని బోర్డు దృష్టికి తెచ్చింది. ఇందులో సాగర్ ఎడమ కాల్వ కిందే 2.28 టీఎంసీలు వాడగా, ఏఎంఆర్పీ కింద 0.477 టీఎంసీలు వినియోగించిందని తెలిపింది. ప్రస్తుతం సాగర్‌లో 503 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల మట్టానికి ఎగువన 17.64 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఆ నీరంతా తమకే దక్కుతుందని స్పష్టం చేసింది. ఈ నీటినుంచి కృష్ణాడెల్టా అవసరాలకు 9 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ అవసరాలకు 7.5 టీఎంసీలు తక్షణమే విడుదలయ్యేలా చూడాలని, తెలంగాణ అదనపు వినియోగం చేయకుండా చూడాలని ఏపీ, బోర్డుకు విన్నవించింది. ఈ లేఖపై స్పందించిన బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, ఇప్పటికే అదనపు వినియోగం చేసినందున, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తప్ప, మరెలాంటి వినియోగం చేయరాదని తెలంగాణను ఆదేశిస్తూ లేఖ రాశారు. ఇదే సమయంలో రెండో విడతలో చేపట్టాల్సిన టెలీమెట్రీ పరికరాల అమరిక ప్రతిపాదనలు ఓకే చేసి, వాటికి సంబంధించిన ప్రక్రియ చేపట్టాలంటూ ఏపీకి బోర్డు మరో లేఖ రాసింది. -
ఘనంగా సినీ నటుడు శ్రీహరి జయంతి
హిమాయత్‌సాగర్ గ్రామ ప్రజలకు సినీ నటుడు స్వర్గీయ శ్రీహరికి మధ్య ఉన్న సంబంధం ఎనలేనిదని ఎంపీపీ తలారీ మల్లేష్ వెల్లడించారు. శ్రీహరి జయంతిని హిమాయత్‌సాగర్ గెస్ట్‌హౌజ్ వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలోఆయన మాట్లాడుతూ శ్రీహరి తన ప్రతి చిత్రాన్ని హిమాయత్‌సాగర్ గ్రామంలో షూటింగ్ నిర్వహించేవరన్నారు. గ్రామంలోని పలువురిని పేరు పేరునా పిలిచి పలకరించేవారన్నారు. -
వాటర్‌ప్లాంట్‌పై పోలీసుల దాడి
రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్, కిస్మత్పూర్లో అక్రమంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్‌పై బుధవారం సాయంత్రం ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. సురేశ్, బాదం అనే వ్యక్తులు కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్వాపెన్, కిండ్లీ పేర్లతో వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి, వాటర్ క్యాన్లతోపాటు ఫిల్టర్లను సీజ్ చేసి నిర్వాహకులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. -
జల ‘సిరి’ ఆవిరి
సాక్షి, హైదరాబాద్/ మొయినాబాద్: మండుటెండల్లోనూ నిండు కుండల్లా పరవళ్లు తొక్కిన జంట జలాశయాలు ఆవిరైపోతున్నాయి. దశాబ్దాలుగా భాగ్యనగరి గొంతు తడుపుతున్న ఈ ‘సాగర్’లు నైబారి బీడు భూములుగా మారాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం... అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు తల్లడిల్లి నీటి జాడలు అడుగంటుతున్నాయి. 1790 అడుగుల గరిష్ట మట్టం ఉన్న ఉస్మాన్‌సాగర్ ప్రస్తుతం 1753.880 అడుగుల డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఇక్కడి నుంచి రోజుకు 15 మిలియన్ గ్యాలన్లను నగర తాగునీటి అవసరాలకు తరలించే జలమండలి... జలాశయం వట్టిపోవడంతో నీరు తోడటం నిలిపివేసింది. ఇక హిమాయత్‌సాగర్ 1763.5 అడుగుల గరిష్ట మట్టం నుంచి 1,734.41 అడుగుల అట్టడుగు స్థాయికి పడిపోయింది. దీని నుంచి గతంలో 20 ఎంజీడీల నీటిని తోడే జలమండలి ప్రస్తుతం 4.400 ఎంజీడీలకే పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. ఇవి కూడా మరో నెలకు మాత్రమే సరిపోతాయి. వీటి చుట్టూ వెలసిన ఫామ్‌హౌస్‌లు, రియల్ఎస్టేట్ వెంచర్లు, కళాశాలలు, ఇసుక తవ్వకాలతో ఈ జలాశయాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటి దారులు క్రమంగా మూసుకుపోయి ఈ దుస్థితి తలెత్తింది. -
మురుగు మరుగయ్యేనా!
జంట జలాశయాల్లో కలుస్తున్న ఎగువ ప్రాంతంలోని మురుగు మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు శూన్యం శంషాబాద్ రూరల్: నగరవాసుల దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో ‘మురుగు’ పెద్ద సమస్యగా మారింది. మురుగునీరు జలాశయాల్లోకి చేరకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో జీఓ 111 అమలులో ఉండగా ఎగువ ప్రాంతం గ్రామాల్లోని మురుగంతా వరదనీటితో పాటు జలాశయాల్లో కలుస్తోంది. ఆయా గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. దీంతో జలాశయాల్లోని నీరు కలుషితమవుతోంది. వర్షాకాలంలో వరదనీటితోపాటు మురుగంతా జలాశయాల్లోకి చేరుతోంది. శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండల పరిధిలోని 84 గ్రామాల్లో జీఓ 111 నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆయా గ్రామాల మీదుగా వచ్చే వరదనీరు వాగులు, కాలువల ద్వారా జంట జలాశయాల్లో కలుస్తోంది. వీటికి ఈసీ, మూసీ వాగుల నుంచి వచ్చే వరదనీరు ప్రధానమైనది కాగా సమీపంలో ఉన్న గ్రామాల నుంచి మురుగునీరు నేరుగా వీటిల్లోకి చేరుతోంది. గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాలు లేకపోవడంతో మురుగును స్థానికంగా ఉన్న చిన్నపాటి గుంతలు, పొలాలు, చెరువులు, కుంటల్లోకి వదిలేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మురుగు కాలువలను నేరుగా వరదకాలువలు, వాగులు, చెరువుల్లోకి కలిపేస్తున్నారు. నోటీసులతో సరి.. శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో ఇబ్బడి ముబ్బడిగా విద్యా సంస్థలు ఏర్పాటు కాగా వీటి నుంచి వెలువడే మురుగు జలాశయాల్లో కలుస్తోంది. పరీవాహక ప్రాంతంలో ఉన్న సుమారు 50 ఇంజినీరింగ్, ఇతర విద్యా సంస్థలను మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని పీసీబీ గతంలో నోటీసులు జారీ చేసింది. తర్వాత వీటి గురించి పట్టించుకునే వారు లేక ఆచరణ అమలు సాధ్యం కావడంలేదు. దీనికి తోడు గ్రామాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జనావాసాల సంఖ్య గత 20 ఏళ్లలో రెట్టింపు అయింది. అక్కడి జనాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడానికే పంచాయతీలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. వీటికి తోడుగా మురుగు శుద్ధి ఇప్పుడు పెద్దసమస్యగా మారింది. నిధుల కొరతతో.. జీఓ 111 నిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత వేదిస్తోంది. పంచాయతీ నిధులతో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చే సుకోవాలని జలమండలి అధికారులు చెబుతున్నారు. ఒక్కో మురుగు శుద్ధి కేంద్రానికి సుమారు రూ.20 లక్షల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు గ్రామాల్లో అనువైన స్థలాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో సొంత ఖర్చులతో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు పంచాయతీలు ముందుకు రావడంలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామాల్లో మురుగును నేరుగా వరదకాలువల్లోకి వదలుతున్నారు. జంట జలాశయాలకు ఎగువ ప్రాంతంలోని గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి కృషి జరగడంలేదని సర్పంచులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామాల్లో సమస్య జటిలం.. జంట జలాశయాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాల్లో మురుగు సమస్య జటిలంగా మారింది. శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ, కవ్వగూడ, నర్కూడ, సుల్తాన్‌పల్లి, కె.బి.దొడ్డి, మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డిగూడ, అజీజ్‌నగర్, అమ్డాపూర్, బాకారం, వెంక టాపూర్, నక్కలపల్లి, చిన్నమంగళారం, చిలుకూరు, రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్, వట్టినాగులపల్లి తదితర గ్రామాల్లోని మురుగు జలాశయాల్లో కలుస్తోంది. జలాశయాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాల్లో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు జలమండలి ప్రణాళికలు రూపొందించినా అమలు కావడంలేదు. సుమారు రూ.35 కోట్ల నిధులతో మినీ ఎస్టీపీ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు గతంలోనే ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. -
రూ.3.5 కోట్ల కారు.. మంటల్లో
విలువైన విదేశీ మోడల్ కారు దగ్ధం హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్ మండల పరిధిలోని హిమాయత్ సాగర్ వద్దగల ఔటర్ రింగురోడ్డుపై ఆదివారం ఓ కారు దగ్ధమైంది. దీని విలువ రూ.3.5 కోట్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నగరంలోని షేక్‌పేటకు చెందిన వ్యాపారి రవికుమార్ (45) ఆదివారం ఉదయం ‘పోర్షే’ విదేశీ మోడల్ కారులో గచ్చిబౌలినుంచి శంషాబాద్‌కు వెళ్తున్నారు. హిమాయత్ సాగర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. రవికుమార్ కారు దిగి చూస్తుండగానే మంటలు చెలరేగి అది దగ్ధమైంది. దీంతో ఆయన అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు రాజేందర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి వేగమే సంఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా కారు విలువ రూ.3.5కోట్లు ఉండవచ్చని పోలీసుల అంచనా. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
111 జీవో ఉండాల్సిందే
పభుత్వానికి ఇరిగేషన్ శాఖ నివేదిక వరద నివారణ, తాగునీటి అవసరాల కోసమే జంట జలాశయాలు అవసరంలేని గ్రామాలను కూడా జీవోలో పొందుపరిచారు అనవసరంగా నాలుగు గ్రామాలను మినహాయించారు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జీవో 111 అమలు తప్పనిసరని, దానిని రద్దు చేస్తే జంట జలాశయాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని 84 గ్రామాల పరిధిలో పరిశ్రమలు, నిర్మాణాలపై ఆంక్షలు విధిస్తూ 1996లో అప్పటి ప్రభుత్వం జీవోనంబర్ 111ను జారీ చేసింది. ఎగువ ప్రాంతంలోనే కాకుండా జలాశయాలకు దిగువన 10 కి.మీ. పరిధిలోనూ ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. పరీవాహక ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, చేవెళ్ల, షాబాద్ మండలాలు, మహబూబ్‌నగర్‌లోని కొత్తూరు మండలం ఈ జీవో పరిధిలోకి వచ్చాయి. దీంతో ఈ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇతరగ్రామాల్లో భూముల విలువలు ఆకాశాన్నంటుతున్నా, తమ ప్రాంతంలో మాత్రం ఆంక్షలతో భూములను కొనలేని, అమ్మలేని పరిస్థితి ఏర్పడినందున జీవోను సడలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జీవోరద్దుకు కేసీఆర్ హామీ ... అధికారంలోకి వస్తే 111 జీవోను రద్దు చేస్తామని కేసీఆర్ కూడా ఎన్నికల్లో ప్రకటించారు. అయితే, ఈ జీవోపై సర్వోన్నత న్యాయస్థానం పలు తీర్పులు ఇచ్చినందున, వాటికి లోబడి నిర్ణయం తీసుకోవాలని భావించారు. అందుకే ఇటీవల ఈ జీవో ఎత్తివేతపై జిల్లా కలెక్టర్ నుంచి నివే దిక కోరారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాలు, వరదనీటి ప్రవాహంపై సర్వే నిర్వహించాలని నీటి పారుదల శాఖకు సూచించారు. తప్పులతడకగా జీవో నిబంధనలు... దీంతో రంగంలోకి దిగిన ఆ శాఖ జీవో జారీలో శాస్త్రీయత పాటించలేదని, ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే శంకర్‌పల్లిలోని నాలుగు గ్రామాలను ఉద్దేశపూర్వకంగా జీవో పరిధి నుంచి తప్పించినట్టు గుర్తించింది. అంతేకాకుండా జాడలేని నాలుగుగ్రామాలను మాత్రం బయో కన్జర్వేషన్ జోన్లోకి తెచ్చారని, మొయినాబాద్ మండల గ్రామాలను శంషాబాద్ మండలంలో చూపారని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టేందుకే పది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి పరిశ్రమలు రావద్దనే ఆంక్షలు విధించారని, వీటిని సవరిస్తే నీరు కలుషితమయ్యే అవకాశముందని నీటిపారుదలశాఖ అభిప్రాయపడింది. 1908లో హైదరాబాద్‌ను మూసీవరద ముంచెత్తినందున ఈ చెరువుల నిర్మాణాన్ని చేపట్టారని, దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుందని పేర్కొంది. జంట జలాశయాలకు భంగం వాటిల్లకూడదనే పర్యావరణవేత్తల సూచనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది. -
111 జీవో కరెక్టే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: 111 జీవోను సవరిస్తే రంగారెడ్డి జిల్లాలోని జంట జలాశయాల అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని నీటి పారుదలశాఖ తేల్చిచెప్పింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరివాహక ప్రాంతంలోని 86 గ్రామాలను జీవ పరిరక్షణ మండలి (బయో కన్జర్వేషన్ జోన్)గా పరిగణిస్తూ 1996లో రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను జారీచేసింది. జంటనగరాల దాహార్తిని తీర్చే ఈ జలాశయాలకు వరద నీరు సులువుగా చేరాలంటే అంక్షలు తప్పనిసరని అప్పటి ప్రభుత్వం అభిప్రాయపడింది. రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని 86 గ్రామాలను 111 జీవో పరిధిలోకి తెచ్చింది. అయితే, తమ ప్రాంతాల అభివృద్ధికి ఈ జీవో ప్రతిబంధకంగా మారిందని, దీన్ని సవరించాలని చాలా ఏళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జంట జలాశయాలకు భంగం వాటిల్లకూడదనే అంశంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినందున.. గత పాలకులు దీనిని సవరించే ందుకు సాహసించలేదు. ఒకవైపు బడాబాబులు, సినీరంగప్రముఖులు, ప్రజాప్రతినిధులు మాత్రం జీవోను అదనుగా చేసుకుని అడ్డగోలుగా ల్యాండ్‌బ్యాంకును సమకూర్చుకున్నారు. కారుచౌకగా భూములు లభించడంతో రిసార్టులు, ఫామ్‌హౌస్‌లను నెలకొల్పుకున్నారు. సవరణ కుదరదు 111 జీవోను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినందున.. జీవో ఎత్తివేత , సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాస్త్రీయత పాటించకుండా అప్పట్లో జీవో జారీ చేశారని, దిగువ ప్రాంతాలపై కూడా ఆంక్షలు విధించారనే ఆరోపణలున్నందున.. అవి నిజమైతే కనీసం ఆ గ్రామాలకైనా జీవోనుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భావించారు. శాసనసభ సమావేశాలనంతరం దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ మేరకు సీఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు అందుకున్న జిల్లా కలెక్టర్... బయో కన్జర్వేషన్ జోన్‌ను పునఃసమీక్షించాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇరిగేషన్ శాఖతో ప్రత్యేక సర్వే చేయించారు. 111 జీవో వర్తింపజేస్తున్న 86 గ్రామాలు జలాశయాల ఎగువ ప్రాంతంలోకే వస్తాయని, శాస్త్రీయంగానే ఈ గ్రామాలపై ఆంక్షలు విధించారని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది. ఏ మాత్రం అంక్షలు సడలించినా.. ఈ జలాశయాల ఉనికి దెబ్బతింటుందని తెగేసి చెప్పింది. ఈ మేరకు తమకు నివేదిక అందజేసినట్లు జిల్లా ముఖ్యఅధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. -
111 జీవో కరెక్టే..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: 111 జీవోను సవరిస్తే జిల్లాలోని జంట జలాశయాల అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని నీటి పారుదలశాఖ తేల్చిచెప్పింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరివాహక ప్రాంతంలోని 86 గ్రామాలను జీవ పరిరక్షణ మండలి (బయో కన్జర్వేషన్ జోన్)గా పరిగణిస్తూ 1996లో రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను జారీచేసింది. జంటనగరాల దాహార్తిని తీర్చే ఈ జలాశయాలకు వరద నీరు సులువుగా చేరాలంటే ఆంక్షలు తప్పనిసరని అప్పటి ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ క్రమంలో రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని 86 గ్రామాలను 111 జీవో పరిధిలోకి తెచ్చింది. అయితే, తమ ప్రాంతాల అభివృద్ధికి ఈ జీవో ప్రతిబంధకంగా మారిందని, దీన్ని వెంటనే సవరించాలని చాలా ఏళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూ క్రయ విక్రయాలు, నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ ఉత్తర్వులను సడలించాలని కోరుతున్నారు. అయితే, జంట జలాశయాలకు భంగం వాటిల్లకూడదనే అంశంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినందున... గత పాలకులు కూడా దీనిని సవరించే ందుకు సాహసించలేదు. ఒకవైపు బడాబాబులు, సినీరంగప్రముఖులు, ప్రజాప్రతినిధులు మాత్రం జీవోను అదనుగా చేసుకుని అడ్డగోలుగా ల్యాండ్‌బ్యాంకును సమకూర్చుకున్నారు. కారుచౌకగా భూములు లభించడంతో రిసార్టులు, ఫామ్‌హౌజ్‌లను నెలకొల్పుకున్నారు. సవరణ కుదరదు 111 జీవోను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినందున... జీవో ఎత్తివేత , సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాస్త్రీయత పాటించకుండా అప్పట్లో జీవో జారీ చేశారని, దిగువ ప్రాంతాలపై కూడా అంక్షలు విధించారనే ఆరోపణలున్నందున.. అవి నిజమైతే కనీసం ఆ గ్రామాలకైనా జీవోనుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భావించారు. ఈ అంశంలో పర్యావరణ, సామాజిక వేత్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని యోచించారు. శాసనసభ సమావేశాలనంతరం దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ మేరకు సీఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు అందుకున్న జిల్లా కలెక్టర్... బయో కన్జర్వేషన్ జోన్‌ను పునఃసమీక్షించాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇరిగేషన్ శాఖతో ప్రత్యేక సర్వే చేయించారు. 111 జీవో వర్తింపజేస్తున్న 86 గ్రామాలు జలాశయాల ఎగువ ప్రాంతంలోకే వస్తాయని, శాస్త్రీయంగానే ఈ గ్రామాలపై ఆంక్షలు విధించారని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది. ఏ మాత్రం అంక్షలు సడలించినా.. ఈ జలాశయాల ఉనికి దెబ్బతింటుందని తెగేసి చెప్పింది. ఈ మేరకు తమకు నివేదిక అందజేసినట్లు జిల్లా ముఖ్యఅధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. -
షహర్‌కీ షాన్ తటాకాల నగరం
భాగ్యనగరం ఒకప్పుడు తటాకాల నగరంగా ఉండేది. ఎక్కడికక్కడ ఉద్యానవనాలతో విరాజిల్లేది. మండు వేసవిలోనూ ఎండల తీవ్రత ఎరుగని చల్లని నగరంగా ప్రజలను సేదదీర్చేది. కాకతీయుల కాలంలో వర్ధిల్లిన గొలుసుకట్టు చెరువుల పరిజ్ఞానాన్ని ఇక్కడి కుతుబ్‌షాహీ పాలకులూ అందిపుచ్చుకోవడంతో ఇది సాధ్యమైంది. అప్పట్లో ప్రస్తుతం భాగ్యనగరం ఉన్న ప్రాంతంతో పాటు చుట్టుపక్కల యాభై మైళ్ల వ్యాసం పరిధిలో దాదాపు మూడున్నర వేలకు పైగా చెరువులు ఉండేవి. వాటిని ఆసరా చేసుకుని వేలాది ఎకరాల్లో తోటలు ఉండేవి. అప్పట్లో హైదరాబాద్ నగరం వేసవి విడిదిగా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలు వేసవి తీవ్రతకు భగభగలాడిపోతున్నా, హైదరాబాద్ పరిసరాలు మాత్రం ఆహ్లాదకరంగా ఉండేవి. అప్పట్లో వేసవి కాలంలో చుట్టుపక్కల జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 9 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యేవి. చెరువులు, ఉద్యానవనాలు చాలా వరకు అంతరించడంతో ఇప్పుడీ వ్యత్యాసం 3-5 డిగ్రీలకు మించడం లేదు. జలసిరులు.. శుభకార్యాలకు ఆనవాళ్లు కుతుబ్‌షాహీలు హుస్సేన్‌సాగర్‌కు ప్రాణం పోస్తే, నిజాం నవాబులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను తవ్వించారు. తాగునీటికి వనరులు పుష్కలంగా ఉన్నా, చెరువుల తవ్వకాన్ని ఆపలేదు. నవాబుల ఇంట శుభకార్యాలు జరిగినప్పుడు ఆ సందర్భాలకు గుర్తుగా చెరువును తవ్వించడం, వనాన్ని పెంచడం ఆనవాయితీగా ఉండేది. తర్వాతి కాలంలో చెరువులు అంతరించాయి. అప్పట్లో 3,750 చెరువులు ఉండగా, ఇప్పుడు 170 మాత్రమే మిగిలాయి. గుట్టల మధ్య వెలసిన భాగ్యనగరంలో అప్పటి నవాబులు గుట్టలపై వనాలను పెంచారు. ఇప్పటికీ వృక్షసంపద గణనీయంగానే ఉన్నందున సాయంత్రం కాగానే నగరం చల్లబడుతోంది. వికారాబాద్‌కు చేరువలోని అనంతగిరి హిల్స్ ప్రభావం కూడా ఇక్కడి వాతావరణంపై ఉంది. మూసీనది పుట్టిన ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ హార్స్లీ హిల్స్‌గా అభివర్ణిస్తుంటారు. ఇక్కడి అటవీ ప్రాంతం నగరానికి చల్లగాలులు పంచుతోంది. ఇప్పటికీ జూపార్కు, ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కేబీఆర్ పార్కు, హరిణ వనస్థలి, చిలుకూరు అభయారణ్యం, బొల్లారం, గోల్కొండ మిలటరీ స్థావరాలు దట్టమైన చెట్లతో నిండి ఉన్నందునే వేసవి తీవ్రత నుంచి కొంతవరకైనా రక్షణ లభిస్తోంది. -
హిమాయత్ సాగర్‌కు లీకేజీలు
రాజేంద్రనగర్: హిమాయత్‌సాగర్‌లోకి చేరిన వరదనీరు వృథాగా పోతోంది. లీకేజీల కారణంగా 17 వరద గేట్ల నుంచి నీరంతా కిందికి వెళ్తోంది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువప్రాంతం నుంచి హిమాయత్‌సాగర్‌కు భారీగా వరదనీరు చేరింది. ఈ నీరు రానున్న వేసవికాలం వరకు నగర వాసుల దాహార్తిని తీర్చనుంది. అయితే లీకేజీల కారణంగా గేట్ల నుంచి నీరంతా వృథాగా వెళ్తోంది. వరద గేట్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించకపోడంతో ఈ పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయంత్రానికి హిమాయత్‌సాగర్ నీటిమట్టం 1,755.5 అడుగులు, గండిపేట్ జలాశయం నీటిమట్టం 1,772 అడుగులుగా నమోదైంది. -
లారీని ఢీ కొన్న కారు: ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: హిమాయత్ సాగర్ వద్ద కారు లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులలో ఇద్దరు విదేశీయులు ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
84 గ్రామాల వ్యధ!
మొయినాబాద్ : జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్‌ల పరిరక్షణకు టీడీపీ హయాంలో జారీ చేసిన 111జీఓ ఆయా చెరువుల ఎగువ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి శాపంగా పరిణమించింది. గతంలో జంటనగరాలకు దాదాపు పూర్తిగా ఈ చెరువుల ద్వారానే తాగునీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం నగర విస్తీర్ణం పెరగడంతో మంజీరా, కృష్ణా, గోదావరి జలాలు సరఫరా అవుతున్నాయి. జంట జలాశయాల నుంచి సరఫరా నామమాత్రంగానే కొనసాగుతోంది. 1996లో చంద్రబాబు హయాంలో ఈ రెండు చెరువుల పరిరక్షణకు జీఓ 111 జారీ చేశారు. జిల్లాలోని ఎగువ ప్రాంతాలైన చేవెళ్ల, మొయినాబాద్, శంషాబాద్, శంకర్పల్లి, షాబాద్, రాజేంద్రనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు మండలాల పరిధిలోని 84 గ్రామాలను ఈ జీఓ పరిధిలోకి తీసుకురావడంతో ఆయా గ్రామాల్లో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ ఆంక్షలు తమ గ్రామాల అభివృద్ధికి శాపంగా మారాయంటూ ఆయా గ్రామాల ప్రజలు 111జీఓ ఎత్తివేయాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. రాజకీయ పార్టీలు సైతం ఉద్యమంలో పాల్గొన్నాయి. 2009, ఇటీవలి సార్వత్రిక ఎన్నిక సందర్భంగానూ ఈ జీఓ ఎత్తివేతకు అన్ని పార్టీలూ హామీ ఇచ్చాయి. చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. జీఓ పరిధిలో ఇవీ ఆంక్షలు.. * జీఓ 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. వెంచర్లు, లేఅవుట్లు చేయవద్దు. * ఒకవేళ లేఅవుట్ చేస్తే అందులో పది శాతం భూమిలోనే నిర్మాణం చేపట్టాలి. అంటే పది ఎకరాల భూమిలో లేఅవుట్ చేస్తే అందులో ఒక ఎకరంలోనే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇక మిగిలిన భూమంతా పార్కులు, పచ్చదనం, ఇతర అవసరాలకు వదిలేయాలి. * ఇందులో వ్యవసాయానికీ ఆంక్షలు విధించారు. పంటల సాగులో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకూడదు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి వీల్లేదు. * జీఓ పరిధిలోని గ్రామాల మురుగు నీరు జలాశయాల్లోకి వదలకూడదు. ఈ సమస్యను తీర్చేందుకు గ్రామాల్లోనే మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి. * ఈ భారాన్ని గ్రామ పంచాయతీలే భరించాలి. ప్లాంట్ల ఏర్పాటుకు ఒక్కోదానికి రూ.10లక్షలు ఖర్చవుతుంది. అంత భారాన్ని మోయలేమని అవి చేతులెత్తేశాయి. అడుగడుగునా ఉల్లంఘనలే జీఓ 111 నిబంధనలు పకడ్బందీగా అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆంక్షలతో రైతులు, సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న అధికారులు.. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న బడాబాబులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రాంతంలో బడా నిర్మాణాలు జరిగేందుకు వీల్లేదు. కానీ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలతోపాటు కార్పొరేట్ పాఠశాలలు ఈ ప్రాంతంలో అనేకం వెలిశాయి. వాస్తవానికి కళాశాలలు, పాఠశాలల భవనాలను వ్యవసాయేతర భూముల్లోనే నిర్మించాలి. ఈ ప్రాంతంలోని భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు వీలు లేకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు. కనీసం గ్రామ పంచాయతీలకు పన్నులు సైతం చెల్లించడంలేదు. వీటితోపాటు చాలా రకాల పరిశ్రమలు, వెంచర్లు, జలాశయాలను ఆనుకుని రిసార్ట్స్‌లు, ఫాంహౌస్‌లు తామరతంపరగా వెలిశాయి. వీటిలోంచి వెలువడే మురుగునీరంతా నేరుగా జలాశయాల్లో కలుస్తోంది. జలాశయాల చెంతనే ఉన్న గ్రామాల్లోంచి సైతం మురుగునీరు వాటిలో కలుస్తోంది. మరోపక్క స్వచ్ఛంద, పర్యావరణ పరిరక్షణ సంస్థలు జలాశయాలను పరిరక్షించేందుకు జీఓ 111పై కోర్టులకెక్కాయి. ఈ వ్యవహారం ఎటూ తేలలేదు. ప్రత్యామ్నాయమేంటి? ప్రస్తుతం గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల నుంచి నగరంలోని కొన్ని ప్రాంతాలకే తాగునీరు అందిస్తున్నారు. కృష్ణా మూడోదశ పనులు పూర్తి చేసి నీటి సరఫరా చేయడం, గోదావరి నీటిని సైతం హైదరాబాద్‌కు తీసుకురావడం, గ్రామాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ప్రభుత్వమే ఏర్పాటు చేయడం, అవసరమైతే అండర్‌గ్రౌండ్ డైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని మూసీలోకి కలపడం వంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ఆలోచించాలని రైతులు కోరుతున్నారు. అవసరానికి భూములు అమ్ముకోలేకపోతున్నాం హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నా.. ఇక్కడి భూములకు మాత్రం ధరలు రావడంలేదు. ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపల ఉన్న ప్రాంతంలో ఎకరం భూమి రూ.10 కోట్లు పలికితే మా భూములకు మాత్రం రూ.10 లక్షలు కూడా రావడంలేదు. దీంతో సామాన్య రైతులు తమ కుటుంబ అవసరాలకు భూములు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. - గడ్డం వెంకట్‌రెడ్డి, సురంగల్, మొయినాబాద్ మండలం ఉద్యమించినా ఫలితంలేదు 111 జీఓ ఎత్తేయాలని 84 గ్రామాల రైతులతో కలిసి నాయకులు ఉద్యమం చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రిని కూడా కలిశాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు.ఈ జీఓ మా పాలిట శాపంగా మారింది. మా దుస్థితిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదు. ప్రస్తుత పాలకులైనా పట్టించుకుంటారో లేదో చూడాలి. - క్యామ పద్మనాభం,ఎంపీటీసీ మాజీ సభ్యుడు,కనకమామిడి, మొయినాబాద్ మండలం -
111 జీవోకు స్వస్తి పలకాలి
మొయినాబాద్/చేవెళ్ల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే జంట జలాశయాల ఎగువ ప్రాంతంలోని 84 గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన 111 జీవోను ఎత్తివేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరతున్నారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించేందుకు నిజాం కాలంలో గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలను ఏర్పాటు చేశారు. 1996లో తెలుగుదేశం ప్రభుత్వం జంటజలాశయాల పరిరక్షణ కోసమంటూ జీవో 111ను తీసుకొచ్చింది. దీంతో జిల్లాలోని మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, రాజేంద్రనగర్, షాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు మండలాల్లోని 84 గ్రామాలకు ఇబ్బంది ఏర్పడింది. జీవో పరిధిలోని గ్రామాల్లో కొత్త నిర్మాణాలు చేపట్టడానికి, పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకూడదని నిబంధనలు పెట్టారు. కొత్తగా వెంచర్లు సైతం ఏర్పాటు చేసే అవకాశంలేదు. ఈ నిబంధనలతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగలేదు. జీఓ 111ను ఎత్తివేయాలంటూ 84 గ్రామాల పరిధిలోని నాయకులు, ప్రజలు 2007, 2008లో ఉద్యమం చేపట్టారు. 111 జీవో వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు, దీక్షలు చేశారు. అప్పటి ముఖ్యమంతి స్వర్గీయ వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి విషయాన్ని తెలియజేడయంతో ఈ నిబంధనలను కొంత వరకు సడలించేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మరణానంతరం జీవో యథావిధిగా కొనసాగుతోంది. కారుచౌకగా భూములు కాజేయాలనే.. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చాలనే పేరుతో తీసుకొచ్చిన 111 జీఓ వెనుక వేరే ఉద్దేశముందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి ధరలు పెరగకుండా చూసి కారుచౌకగా భమూలు కాజేయాలనే దురుద్దేశంతోనే ఈ జీఓను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చినట్లు వారు చెబుతున్నారు. పేదల ఇళ్లకు అనుమతులివ్వని అధికారులు పెద్ద రియాల్టి సంస్థల ఆగడాలను మాత్రం అడ్డుకోకపోవడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చని పేర్కొంటున్నారు. పేదల కడుపులు కొట్టి పెద్దలకు పెట్టే ఈ జీఓకు తెలంగాణ రాష్ట్రంలో చరమగీతం పాడాలని కోరుతున్నారు. మళ్లీ ఉద్యమిస్తాం.. 84 గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన 111 జీవోను ఎత్తివేయాలని 2007 నుంచి ఉద్యమం చేస్తున్నాం. అప్పట్లో ఆందోళననలు, నిరహారదీక్షలు, రాస్తారోకోలతో ఎద్ద ఎత్తున ధర్నాలు చేశాం. అప్పట్లో కొంత వరకైనా సడలింపు వస్తుందని భావించాము. కాని ఎలాంటి సడలింపు రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక గండిపేట, హిమాయత్సారగ్ జలాశయాల పరిధిలోని ఎగువ ప్రాంతంలోని నీరు జలాశయాల్లోకి వెళ్లకుండా చెక్‌డ్యాంలు నిర్మించి సాగునీరుకు వాడుకునే ఏర్పాట్లు చేయాలి. జలాశయాలను నింపేందుకు నాగార్జునసాగర్ నుంచి కృష్ణా నీళ్లు తీసుకురావాలి. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి జీవో 111ను ఎత్తివేయాలి. అందుకోసం ఇప్పుడు మళ్లీ ఉద్యమం చేస్తాం. -కొమ్మిడి వెంకట్‌రెడ్డి, 111 జీవో వ్యతిరేక పోరాట సమితి ప్రధాన కార్యదర్శి, మొయినాబాద్ అభివృద్ధికి ఆమడ దూరం హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉండి, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా శంషాబాద్ మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. నగరానికి చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినా 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడంలేదు. 111 జీవో నిబంధనలతో సామాన్య ప్రజలు, రైతులు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారు. డబ్బున్న బడాబాబులు మాత్రం నయానో భయానో తమ పనులు సాఫీగానే చేసుకుంటున్నారు. అక్రమంగా నిర్మాణాలు సైతం చేస్తున్నారు. వాటిలో నుంచి మురుగు హిమాయత్‌సాగర్‌లో కలుస్తూనే ఉంది. అలాంటి వాళ్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. సామాన్యులు చిన్న ఇళ్లు కట్టుకోవాలన్నా నిబంధనలు అడ్డువస్తున్నాయి. -కె.అంజయ్యగౌడ్, మాజీ సర్పంచ్, తొండుపల్లి, శంషాబాద్ తెలంగాణలోనైనా న్యాయం చేయాలి షాబాద్ మండలంలోని మద్దూర్, సోలిపేట్ గ్రామాలు 111 జీఓ పరిధిలోకి వస్తాయి. మండలంలోని మిగితా గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నా.. ఈ రెండు గ్రామాల్లో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మిగితా గ్రామాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. నగర జనాభా తాగునీటి అవసరాలను తీర్చడానికి 84 గ్రామాల ప్రజల పొట్ట కొట్టడం న్యాయం కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 111 జీఓను ఎత్తివేయాలి. లేకపోతే ప్రత్యేక రాష్ట్రంలోనూ ఈ గ్రామాల పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ జీఓ ఎత్తివేత గురించి ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేశాం. మరోసారి నిరవధిక ఆందోళనకు వెనకాడం. -జనార్దన్ రెడ్డి, సోలిపేట్ మాజీ సర్పంచ్, షాబాద్ రైతులకు మేలు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాల రైతులకు మేలు జరగాలి. జీవో నిబంధనలతో పదిహేడేళ్లుగా పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడనివ్వడంలేదు. అవసరానికి భూమి అమ్ముకుందామన్నా ధర రావడం లేదు. ఎవరూ కొనడానికి కూడ ముందుకు వస్తలేరు. సొంత భూమిలోనైనా కొత్తగా ఇళ్లు కట్టుకుండామన్నా ఇబ్బందిగానే ఉంది. ఇన్ని నిబంధనలు పెట్టినా అవి పెద్దవాళ్లకు మాత్రం వర్తిస్తలేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వమే 111 జీవోను ఎత్తివేవేసి రైతులను ఆదుకోవాలి. -దర్గ ప్రభాకర్, రైతు, చిలుకూరు, మొయినాబాద్ పదేళ్లుగా అవే ధరలు వందల ఎకరాల భూమి వున్న మా గ్రామం 111 జీఓ కారణంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. జీఓను ఎత్తివేయాలని అధికారులకు, ప్రజాప్రతినిదులరు మొర పెట్టుకున్నా ఫలితం మాత్రం లేదు. నగరానికి సమీపంలో ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నా మా గ్రామాల్లో మాత్రం పదేళ్లుగా ధరలు స్థిరంగా ఉన్నాయి. జంట జలాశయాల సమీపంలో ఉండటమే మేం చేసిన తప్పా. నగర నీటి అవసరాలను పూర్తిగా నాగార్జున సాగర్ నీటితోనే సరిపుచ్చాలి. అనంతరం జీఓ 111ను ఎత్తివేయాలి. అప్పుడే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. -రాంరెడ్డి, రైతు, మద్దూర్, షాబాద్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే మేలు గ్రామాలలోని మురుగు నీరు గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల్లోకి వెళ్లకుండా 111 జీవో పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వమే ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఓ ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామం మొత్తనికి సంబంధించిన మురుగు నీరు ఒకే చోటుకు చేరేటట్లు నిర్మాణాలు చేపట్టాలి. అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించి ఆ మురుగు అందులోకి వెళ్లేవిధంగా చూడాలి. ట్రీట్మెంట్ ప్లాంట్‌లో మురుగు నీరు శుభ్రం చేసి ఆ నీటిని పంటలకు వాడుకునే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుని 111 జీవోను ఎత్తివేయాలి. -సన్వల్లి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్, శ్రీరాంనగర్, మొయినాబాద్ రాజకీయ కుట్రతోనే.. రాజకీయ కుట్రతోనే 111జీవోను చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదల చేశారు. రైతులకు, ప్రజలకు గుదిబండగా మారిన ఈజీవోను కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా ఎత్తివేయాలి. ఎన్టీ.రామారావును ముఖ్యమంత్రి పీఠంనుంచి పదవీచ్యుతిని చేసి అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబునాయుడుతో అప్పటి హోంమంత్రి, చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్న పి.ఇంద్రారెడ్డి తీవ్రంగా విభేదించారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా దించివేయడం భావ్యంకాదని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. జిల్లాలో మాస్‌లీడర్‌గా పేరొందిన ఇంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కడానికే ఈ జీవోను విడుదల చేశారనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇది వాస్తవం కూడా. అప్పటినుంచి జీవోను ఎత్తివేయాలని ఎన్నో పోరాటాలు చేసినా ఇంకా రైతులనెత్తిన కత్తిలా వేలాడుతూనే ఉంది. జీవో 111ను ఎట్టిపరిస్థితులలోనూ ఉపసంహరించుకోవాల్సిందే. లేకపోతే ఈ ప్రాంతానికి భవిష్యత్ అంధకారమే. -పడాల వెంకటస్వామి, రాష్ట ఎస్సీసెల్ కన్వీనర్, చేవెళ్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు సీమాంధ్ర నాయకుల ఆధిపత్యం, పెత్తనం అధికంగా ఉన్నప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని విలువైన భూములపై వారి కన్నుపడింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒప్పించి 1996లో నదీపరీవాహక ప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా) పేరుతో 111 జీవోను విడుదల చేశారు. ఈ జీవో నిజానికి ఈ ప్రాంత రైతులకు ఎంతో నష్టాన్ని కలిగించింది. అత్యంత ఖరీదైన, విలువైన ఈ భూములను కారుచౌకగా కాజేయడానికి సీమాంధ్రనాయకులు పన్నిన పన్నాగమే ఇది. ఈ జీవో విడుదలైనప్పటినుంచి జీవో పరిధిలోని భూములను కొనడానికి అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో కారుచౌకగా ఇక్కడ భూములు కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు ఇక్కడ రిసార్ట్లు, ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. ఈ జీవోను ఎత్తివేయాలని గతంలో సర్పంచుల సంఘం తరఫున ఎన్నో పోరాటాలు చేశాం. అయినా ఫలితం మాత్రం లేకపోయింది. కొత్త పంచాయతీ పాలకవర్గాలతో మరోసారి ఈ జీఓకు వ్యతిరేకంగా ఉద్యమించాలని భావిస్తున్నాం. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం. -చింపుల సత్యనారాయణరెడ్డి, రాష్ట్రసర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు, చేవెల్ల