రూ.3.5 కోట్ల కారు.. మంటల్లో | Rs 3.5 crore car .. Fire | Sakshi
Sakshi News home page

రూ.3.5 కోట్ల కారు.. మంటల్లో

Published Mon, Apr 13 2015 2:04 AM | Last Updated on Thu, Oct 4 2018 5:38 PM

రూ.3.5 కోట్ల కారు.. మంటల్లో - Sakshi

రూ.3.5 కోట్ల కారు.. మంటల్లో

విలువైన విదేశీ మోడల్ కారు దగ్ధం
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్ మండల పరిధిలోని హిమాయత్ సాగర్ వద్దగల ఔటర్ రింగురోడ్డుపై ఆదివారం ఓ కారు దగ్ధమైంది. దీని విలువ రూ.3.5 కోట్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నగరంలోని షేక్‌పేటకు చెందిన వ్యాపారి రవికుమార్ (45) ఆదివారం ఉదయం ‘పోర్షే’ విదేశీ మోడల్ కారులో గచ్చిబౌలినుంచి శంషాబాద్‌కు వెళ్తున్నారు.

హిమాయత్ సాగర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. రవికుమార్ కారు దిగి చూస్తుండగానే మంటలు చెలరేగి అది దగ్ధమైంది. దీంతో ఆయన అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు రాజేందర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి వేగమే సంఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా కారు విలువ రూ.3.5కోట్లు ఉండవచ్చని పోలీసుల అంచనా.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement