Foreign Goods
-
Sakshi Cartoon: తగ్గించుకోమన్నది విదేశీ యాత్రలు కాదయ్యా!
తగ్గించుకోమన్నది విదేశీ యాత్రలు కాదయ్యా! -
విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకోండి: ప్రధాని మోదీ
పుణె: విదేశీ వస్తువుల పట్ల మోజు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ బిజినెస్ మీట్‌నుద్దేశించి ఆయన శుక్రవారం వర్చువల్‌గా మాట్లాడారు. స్థానిక వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్వావలంబన దిశగా మనం సాగిపోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిభావంతులను, వాణిజ్యాన్ని, సాంకేతికతను సాధ్యమైనంత మేర ప్రోత్సహిస్తోందన్నారు. -
గారాల లూసీ
సిద్దిపేటజోన్ : లూసీ అంటే వారికి ఎంతో ప్రేమ, అభిమానం. రెండేళ్లుగా వారింట్లో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయింది. ముఖ్యంగా ఆ ఇంటి చిన్నారులకు ఆ పిల్లి అంటే చాలా ఇష్టం. అంతటి అభిమానాన్ని పొందిన లూసీ విదేశీ రకం పిల్లి కావడం విశేషం. కొందరు తమ ఇళ్లల్లో శునకాలు, కుందేళ్లు, ఇతర పెంపుడు జంతువులపై ప్రేమ చూపించడం సహజం. కానీ, మరికొందరు పిల్లులు అంటే వల్లమాలిన అభిమానం చూపుతారు. మూఢనమ్మకాలను పక్కన బెట్టి.. రోజంతా వాటితో సరదాగా గడుపుతారు. అలాంటి కోవకు చెందిన వారే సిద్దిపేటలోని మంగమ్మతోట కాలనీకి చెందిన ప్రభుత్వం ఉద్యోగి అస్కర్. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి.. అస్కర్తో పాటు వారి పిల్లలైన కబీర్, ఫర్మాన్, సోహాతబుసంకు పిల్లలంటే చాలా ఇష్టం. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని తమ బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లారు. అక్కడ వారికి ఒక అందమైన విదేశీ పిల్లి కలివిడిడా తిరగడం కనిపించింది. దీంతో ఆ బ్రీడ్ వివరాలు తెలుసుకొని.. రూ.20 వేలు ఖరీదు చేసి పెర్షియన్ క్యాట్(విదేశీ పిల్లి జాతి)ను కొనుగోలు చేశారు. అచ్చం కుక్కపిల్ల తరహాలో కనిపించే ఈ పిల్లికి లూసీ పేరు పెట్టుకున్నారు. ఆన్లైన్లో లభించే ఆహారంతో పాటు.. వారంలో రెండుసార్లు మాంసం లూసీకి అందిస్తున్నారు. అంతేకాకుండా రూ.2 వేలతో అన్ని వ్యాక్సిన్లు వేయించారు. లూసీ అంటే ప్రాణం మాకు లూసీ అంటే ప్రాణం. నా పిల్లలు దానిని విడిచిపెట్టి ఉండలేరు. రెండేళ్ల క్రితం చిన్న పిల్లగా ఉన్నప్పుడే కొనుగోలు చేశా. దాని నిర్వహణకు ప్రతి నెల రూ.2 వేలు వెచ్చిస్తున్నా. ప్రస్తుతం మా కుటుంబంలో అది కూడా ఓ భాగం. చుట్టుపక్కల వారు దాన్ని పిల్లి అంటే నమ్మరు. – అస్కర్ -
ఈ పక్షులకు ఏమైంది ?
మండ్య : మండ్య జిల్లా మద్దూరు తాలూకా లో కొక్కరె బెళ్లూరులో విదేశీ పక్షులు అస్వస్థతకు గురై మృతి చెందుతుండటం కలకలం రేపుతోంది. గురువారం నాలుగు ప క్షులు ఎగురుతూనే మృతి చెందాయి. కొ నప్రాణం ఉన్న పక్షిని పరిశీలించగా కొద్ది కాలంగా ఆహారం తీసుకున్నట్లు కనిపించకపోగా దానికి మళ్లీ ఎగిరే శక్తి లేకపో యింది. ఇదిలా ఉంటే ఈ పక్షులకు బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి పరిశోధనలు చేస్తున్నారు. బర్డ్ సోకినట్లు నిర్ధారణకు వచ్చిన విషయాన్ని బయటకు చెప్పడం లేదు. కొక్కరెబెళూరులో పక్షులు నివాసం ఉంటున్న గూళ్లకు ముందు జాగ్రత్త చర్యగా సిబ్బంది మందులు కూడా చల్లారు. బెంగళూరు పశుసంవర్ధక శాఖ జేడీ హలగప్ప నేతృత్వంలో అధికారుల బృదం పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా ఇక్కడి కారసవాడి పౌల్ట్రీ ఫారంలో వేలాది కోసం మృతి చెందాయి. వాటి నమూనాలు, పెలికాన్ నమూనాలు భోపాల్‌కు పంపిం చడంతో అక్కడి నివేదిక మేరకు కోళ్లు, పెలికాన్‌లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు ఉంది. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. -
విదేశీ..విహంగం..విన్యాసం
విదేశీ విహంగాలు రెక్కలు విప్పుకుని సందడి చేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో తోటి పక్షులతో ముచ్చటలాడుకుంటూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో విదేశీ పక్షుల విడిది కేంద్రంలో పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల విన్యాసాలు మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. ఈ పక్షుల విన్యాసాలు తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. -
రాజధానికి విదేశీ ‘దమ్ము’
- భారీగా విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా - ఓ ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు - రూ.19 లక్షల విలువైన సిగరెట్లు సీజ్ సాక్షి, హైదరాబాద్: బంగారం... ఎలక్ట్రానిక్ వస్తువులు... మాదకద్రవ్యాలు... అక్రమ రవాణా పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. నగరానికి చెందిన కొన్ని ముఠాలు మాత్రం కొన్నాళ్లుగా సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తున్నాయి. ఏటా రూ.వందల కోట్ల విలువైన సరుకు ‘దిగుమతి’చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి ఓ ముఠాను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్టు డీసీపీ బి.లింబారెడ్డి సోమవారం వెల్లడించారు. వీరి నుంచి రూ.19 లక్షల విలువైన బంగ్లాదేశ్ తయారీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ టు సిటీ వయా మెట్రోస్... నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో ప్యారిస్ బ్రాండ్‌కు చెందినవి ఎక్కువగా ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఇవి తయారవుతున్నది బంగ్లాదేశ్‌లో. అక్కడ నుంచి నేరుగా కాకుండా... కోల్‌కతా, ఢిల్లీల మీదుగా రైలు మార్గంలో హైదరాబాద్‌కు వచ్చిపడుతున్నాయి. బేగంబజార్‌కు చెందిన మహ్మద్ హస్నుద్దీన్ ఈ అక్రమ సిగరెట్ల దందాలో ఆరితేరాడు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి వీటిని ఖరీదు చేస్తున్నాడు. వివిధ రకాల పేర్లతో రైళ్లలో పార్సిల్ అవుతున్న వీటిని తన ఏజెంట్లు ఎజాజ్ అలీ, అలీ రజాల ద్వారా నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి బేగంబజార్‌కు తెప్పించుకుంటున్నాడు. ఒక్కో ప్యాకెట్ రూ.20కి ఖరీదు చేస్తున్న హస్నుద్దీన్... మార్కెట్లో రూ.30కి విక్రయిస్తుండగా... వినియోగదారులకు రూ.40కు చేరుతోంది. ఎక్కడా బిల్లులు లేకుండా ఈ దందా సాగడంతో ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ఒకటికి ఒకటిన్నర డ్యూటీ... ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం భారీగా విధిస్తోంది. ఈ సిగరెట్లపై ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గంలో వస్తున్న సిగరెట్లను కోల్‌కతా, ఢిల్లీలకు చెందిన వ్యాపారులు దేశ వ్యాప్తంగా వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఇలా వెలుగులోకి.. సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల గుట్కా వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి రైలులో గుట్కా వస్తోందనే సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద కాపుకాసింది. ఎజాజ్, రజాలను పట్టుకుని వారు ఆటోలో తరలిస్తున్న పార్సిల్స్‌ను తనిఖీ చేయగా... రూ.19 లక్షల విలువైన 48 వేల ప్యారిస్ సిగరెట్లు బయటపడ్డాయి. ఆరా తీయగా... అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వ్యాపారి హస్నుద్దీన్ కోసం అధికారులు గాలిస్తున్నారు. -
భారత్‌లో విదేశీ యాపిల్స్ హవా
⇒ ఏటా 20 కోట్ల కిలోలు దిగుమతి ⇒ తెలుగు రాష్ట్రాల్లో మూడో స్థానం వీటిదే ⇒ ప్రీమియం విభాగంలో క్లబ్ వెరైటీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడ్ డెలీషియస్, గోల్డెన్ డెలీషియస్, గ్రానీ స్మిత్, గలా, ఫ్యూజీ, హనీ క్రిస్ప్.. ఇవన్నీ భారత్‌లో ఇప్పుడు పాపులర్ అవుతున్న విదేశీ యాపిల్ పండ్ల రకాలు. రుచి, రంగు, రూపం, నాణ్యతలో ఆకర్షించే ఈ యాపిల్స్ కోసం మనవాళ్లు ఎంతైనా వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. ఇదే ఇప్పుడు విదేశీ ఎగుమతిదారులకు కాసులు కురిపిస్తోంది. టాప్–5 దిగుమతి మార్కెట్లలో స్థానం సంపాదించిన భారత్‌పై పలు ఉత్పత్తి దేశాలు పెద్ద ఎత్తున ఫోకస్ చేశాయి. భారత్‌కు ఏటా 20 కోట్ల కిలోల యాపిల్స్ దిగుమతి అవుతున్నాయంటే పరిస్థితిని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఇందులో వాషింగ్టన్ నుంచి 50 శాతం వచ్చి చేరుతున్నాయి. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో యాపిల్ పంట దిగుబడి తగ్గడం కూడా దిగుమతులు పెరగడానికి కారణమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. క్లబ్ వెరైటీలే ప్రియం.. ప్రపంచవ్యాప్తంగా 7,500 రకాల యాపిల్స్ ఉన్నాయి. వీటిలో క్లబ్ వెరైటీలు ప్రత్యేకమైనవి. స్వీట్యాంగో, పింక్ లేడీ, ఎవర్క్రిస్ప్, కికూస్, స్మిట్టెన్స్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. సరఫరా పరిమితం కాబట్టి ధర కూడా ఎక్కువే. దేశంలో రిటైల్ మార్కెట్లో క్లబ్ వెరైటీల ధర కిలోకు రూ.300 పైనే పలుకుతోంది. క్లబ్ వెరైటీ అంటే ఒక్కో రకం ఒకరు లేదా కొందరు రైతులకే పరిమితం అన్నమాట. నాణ్యత, రంగు, రుచి, రూపంలో క్లబ్ వెరైటీలు వేటికవే ప్రత్యేకం. వీటి అభివృద్ధికి రైతుల కృషి అంతా ఇంతా కాదు. ఇక ధరను తమ చేతుల్లో పెట్టుకోవటానికి వీటిని ఒకే కంపెనీ మార్కెట్ చేస్తుంది. పేటెంటు ఉన్న క్లబ్ వెరైటీలూ ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ వెరైటీ అయిన హనీ క్రిస్ప్ ఒకప్పుడు టాప్ క్లబ్ వెరైటీ. ఇప్పటికీ దీని అమ్మకాలే ఎక్కువ. క్లబ్ వెరైటీలకు ట్రేడ్ మార్క్ ఉంటుందని వాషింగ్టన్ యాపిల్ కమిషన్ మార్కెటింగ్ డైరెక్టర్ రెబెకా లాన్స్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. 5–7 ఏళ్లుగా క్లబ్ వెరైటీల సంఖ్య పెరుగుతోందని ఆమె తెలియజేశారు. యాపిల్ ఉత్పాదన పెంపు, మార్కెట్ విస్తృతి, వాషింగ్టన్ రైతుల సంక్షేమం కోసం ఈ కమిషన్ కృషి చేస్తోంది. భారత్‌లో సగటున కిలో.. భారత్‌లో ఏటా 200 కోట్ల కిలోల యాపిల్ పండుతోంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో పంట ఎక్కువ. 20 కోట్ల కిలోల యాపిల్స్ విదేశాల నుంచి వచ్చిపడుతున్నాయి. యూఎస్, చైనా, చిలీ, ఇటలీ, న్యూజిలాండ్, ఫ్రాన్స్, టర్కీ తదితర దేశాలు భారత్‌పై దృష్టిసారించాయని వాషింగ్టన్ యాపిల్ కమిషన్ భారత ప్రతినిధి కీత్ సుందర్‌లాల్ తెలిపారు. భారత్‌లో సగటున ఒక్కో వ్యక్తి ఒక కిలో యాపిల్స్ తింటున్నారని చెప్పారు. వినియోగం పరంగా తమిళనాడు, ఢిల్లీ రాజధాని ప్రాంతం తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర మూడో స్థానం కోసం పోటీపడుతున్నాయి. -
కిక్కిచ్చే విదేశీ మద్యంలో పిచ్చెక్కించే నిజాలు?
► విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్ను.. పేరేదైనా అంతా నాటు సారానే! ► విదేశాల్లో తృణధాన్యాలతో మద్యం తయారీ.. చెక్క పీపాల్లో నిల్వ ప్రధానం ► భారతదేశంలో 90 శాతం ఐఎంఎఫ్ఎల్ మద్యం మొలాసిస్ నుంచే తయారీ ► విస్కీ, బ్రాందీ తదితర రుచులు, వాసనల కోసం కృత్రిమ ఫ్లేవర్ల వినియోగం ► చెక్క పీపాల్లో నిల్వ ఊసే అరుదు.. డిస్టిలరీల నుంచి నేరుగా సీసాల్లో సరఫరా విస్కీ, బ్రాందీ, రమ్ము, జిన్ను, ఓడ్కా.. మందు ఏదైనా అంతా నాటు సారానే! భారత్‌లో తయారు చేసే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) పేరుతో మన దేశంలో తయారు చేసి తళతళలాడే కొత్త సీసాల్లో విక్రయిస్తున్న ఈ మద్యానికి.. మన ఊళ్లల్లో శివార్లల్లో చిట్టడవుల్లో అక్రమంగా కాచి పాత సీసాల్లో చౌకగా విక్రయించే నాటు సారాకు.. పెద్ద తేడా లేదు!! నాటు సారాలో రంగు కలపరు.. వేర్వేరు రుచులూ ఉండవు. ‘బ్రాండెడ్’ లిక్కర్లో కొన్ని రంగులు, కొన్ని కృత్రిమ రుచులు కలుపుతారు అంతే తేడా!!! ఇతర దేశాల్లో విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్ను వంటి మద్యపానీయాల తయారీకి.. మన దేశంలో అవే పేర్లతో విక్రయించే మద్యపానీయాల తయారీకి చాలా తేడా ఉంది. అక్కడ ఒక్కో రకం మద్యం తయారీకి నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది. అందులో ఉపయోగించే పదార్థాలు వేర్వేరుగా ఉంటాయి. తయారు చేసిన మద్యాన్ని ఓక్ చెక్క పీపాల్లో కొన్నేళ్ల పాటు నిల్వ ఉంచిన తర్వాత సీసాలకు నింపి మార్కెట్‌కు పంపిస్తారు. కానీ.. మన దేశంలో అన్ని రకాల మద్యాలనూ ఒకే పద్ధతిలో తయారు చేస్తారు. అన్నిట్లోనూ ఒకటే పదార్థం ఉపయోగిస్తారు. విస్కీ, బ్రాందీ, రమ్ము, ఓడ్కా, జిన్నుల పేర్ల ప్రకారం ఆయా రుచులు, రంగులు వచ్చేట్లు కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. తయారైన వెంటనే సీసాల్లో నింపి మార్కెట్‌కు తరలిస్తారు. నిజానికి మన దేశంలో చేసినట్లు విదేశాల్లో మద్యం తయారు చేసి విక్రయిస్తే.. అది పెద్ద స్కామ్ అవుతుంది. కానీ మన దేశంలో ఈ తయారీ విధానాలకు బ్యూరో ఆఫ్ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) చట్టబద్ధత కల్పిస్తోంది. ఐఎంఎఫ్ఎల్ పేరుతో అమ్ముడవుతున్న ఈ మద్యం మార్కెట్ విలువ ఇంటర్నేషనల్ వైన్ అండ్ రీసెర్చ్ సంస్థ ప్రకారం 2014లో రూ. 41,000 కోట్లు. అక్కడ తృణధాన్యాలు.. ఓక్ చెక్క పీపాలు: విస్కీ అంటే.. ఏదో ఒక రకమైన తృణధాన్యాలను ఇతర తృణధాన్యాలతో కలిపి లేదా కలపకుండా నానబెట్టి, పులియబెట్టి వాటి నుంచి తయారు చేసే మద్యపానీయం’ అనేది యూరప్2008లో ఇచ్చిన నిర్వచనం. అమెరికాలో, మెక్సికోలో కూడా వారి వారి సొంత నిర్వచనాలు ఉన్నాయి. కానీ.. విస్కీని తృణధాన్యాల నుంచి తయారు చేయాలని, తయారు చేసిన విస్కీని చెక్క పీపాల్లో నిర్దష్ట కాలం నిల్వ చేయాలనే కొన్ని పద్ధతులు వారందరికీ ప్రాధమిక సూత్రాలు. విస్కీ రంగు, రుచి, వాసన వంటి ప్రధాన లక్షణాలను అదనంగా వేరే పదార్థాలను కలపడం ద్వారా తీసుకురాకూడదు అనేది ఇంకా ముఖ్యమైన నియమం. బార్లీ, మొక్కజొన్న, రై, గోధుమల్లో ఏదో ఒక ధాన్యం పిండిని పులియబెట్టి ఈ మద్యాన్ని తయారు చేయాలి. తయారైన మద్యాన్ని కనీసం మూడు సంవత్సరాల పాటు ఓక్చెక్క పీపాల్లో నిల్వ ఉంచాలి. విభిన్న రంగులు, రుచుల కోసం ఈ ఓక్చెక్క పీపాల రకాలను మార్చడం, నిల్వ కాలాన్ని పెంచడం వంటి చర్యలు చేపడతారు. మొత్తం మీద తృణధాన్యాలతో తయారు చేసిన విస్కీని చెక్క పీపాల్లో కొన్నేళ్లు నిల్వ ఉంచితేనే అది నిజమైన విస్కీ అవుతుందనేది ప్రపంచ దేశాల్లో పాటించే పద్ధతి. నిర్దిష్ట కాలం నిల్వ ఉంచిన తర్వాత ఆ మద్యం తగిన ‘వయసు’కు వస్తుంది. అనంతరం దాన్ని సీసాల్లో నింపి మార్కెట్లోకి పంపుతారు. ఇక్కడ మొలాసిస్.. కృత్రిమ ఫ్లేవర్లు..: ప్రపంచంలో అత్యధిక శాతం విస్కీని వినియేగించే దేశం భారతదేశమే. కానీ.. మన విస్కీలో 90 శాతం పైగా అసలు విస్కీ కాదు. అది మొలాసిస్తో చేసిన సారాయి. మన దేశంలో తయారు చేసే మూడు రకాల విస్కీల్లో.. మాల్ట్ విస్కీ, గ్రెయిన్ విస్కీలు మాత్రమే అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా ఉంటాయి. సాధారణ విస్కీ మాత్రం.. మొలాసిస్నుంచి తయారు చేస్తారు. ఇదే దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న సామాన్య మద్యప్రియులు సేవించే విస్కీ. చెరకు గడల నుంచి పంచదారను తయారు చేసేటపుడు ఉప ఉత్పత్తిగా వచ్చే ఒక ద్రవపదార్థం మొలాసిస్. దీనిని డిస్టిల్ చేసి విస్కీని తయారు చేస్తారు. కాకపోతే విస్కీ రంగూ, రుచీ, వాసన కోసం కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. బ్రాందీ, రమ్ము, ఓడ్కా అన్నీ కూడా ఇలా మొలాసిస్తో చేసేవే. ఇది 19వ శతాబ్దంలో బ్రిటిష్పాలనలోనే ఆరంభమైంది. కారణం.. ఆ కాలంలో కరవు కాటకాలతో ఆహార ధాన్యాలకు ఎల్లప్పుడూ కొరత ఉండటం. ఫలితంగా మద్యం తయారీకి మొలాసిస్నే ప్రధాన ఆధారంగా ఎంచుకున్నారు. దేశీయంగా అభివృద్ది చెందిన ఈ షార్ట్ కట్ పద్ధతులనే అధికారిక మద్యం తయారీ విధానంగా మార్చేశారు. అందుకే.. 1500కు పైగా గల భారతీయ మద్యం బ్రాండ్లలో చాలా వాటిని యూరోపియన్ మార్కెట్లలోకి అనుమతించలేదు. మన ‘విదేశీ మద్యం’ తయారీ ఇలా..! మన దేశంలో మొలాసిస్ ను పులియబెట్టడం ద్వారా నాటు సారా తయారు చేస్తారు. ఇక వివిధ రకాల విదేశీ మద్యం ఎలా తయారు చేస్తున్నారో, అవే మద్యాలను విదేశాల్లో ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా చూస్తే... విస్కీ: అంతర్జాతీయంగా: పూర్తిగా తృణధాన్యాలు లేదా మాల్టెడ్తృణధాన్యాలు లేదా రెండిటినీ కలిపిన వాటి నుంచి తయారు చేస్తారు. కనీసం మూడు సంవత్సరాల పాటు ఓక్ చెక్క పీపాల్లో నిల్వ చేస్తారు. భారతదేశంలో: మొలాసిస్‌ను డిస్టిల్ చేసి విస్కీ తయారు చేస్తారు. కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతారు. అత్యధికభాగం నిల్వ ఉంచరు. ‘ఏజ్డ్’ అని లేబుళ్లపై పేర్కొనే రకాలను మాత్రం కనీసం ఒక ఏడాది నిల్వ ఉంచుతారు. రమ్ము: అంతర్జాతీయంగా: మొలాసిస్తో తయారు చేస్తారు. కనీసం రెండేళ్లు ఓక్ చెక్క పీపాల్లో నిల్వ ఉంచుతారు. తద్వారా రంగు, రుచి సహజంగా వస్తాయి. భారతదేశంలో: మొలాసిస్ లేదా కార్బొహైడ్రేడ్ల నుంచి చేసి, కృత్రిమ ఫ్లేవర్లు, రంగులు కలుపుతారు. నిల్వ చేయరు. బ్రాందీ: అంతర్జాతీయంగా: వైన్లేదా, పులియబెట్టిన ద్రాక్షపళ్ల నుండి తయారు చేస్తారు. ‘బ్లెండెడ్’ రకం బ్రాందీ కోసం మరొక పండును కూడా దీనికి కలపవచ్చు. కనీసం రెండేళ్ల పాటు నిల్వ చేస్తారు. భారతదేశంలో: కేవలం మొలాసిస్తో చేసి కృత్రిమ ఫ్లేవర్లు, రంగులు కలుపుతారు. నిల్వ ఉంచరు. దీనికి రెండు శాతం ద్రాక్ష బ్రాందీ కలిపితే దానిని బ్లెండెడ్బ్రాందీ అంటున్నారు. జిన్ను: అంతర్జాతీయంగా: తృణధాన్యం నుంచి తయారు చేసిన మద్యానికి జునిపర్మొక్క ఫ్లేవర్‌ను కలిపితే జిన్ను అవుతుంది. భారతదేశంలో: మన దేశంలో మొలాసిస్నుంచి తయారు చేసిన మద్యానికి కృత్రిమ జునిపర్ఫ్లేవర్కలుపుతారు. ఓడ్కా: అంతర్జాతీయంగా: బంగాళదుంపలు, ఏవైనా కూరగాయలు, చెరకులతో ఓడ్కాను చేస్తారు. వీటిలో కొన్నిటిని కలిపి కూడా చేస్తారు. భారతదేశంలో: మొలాసిస్లేదా పులియబెట్టిన తృణధాన్యం లేదా ఇతర కార్బొహైడ్రేడ్ల నుంచి తయారు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2010 లెక్కల ప్రకారం మద్యం మార్కెట్విక్రయాలు ఇలా... విస్కీ 75% రమ్ము 15% ఓడ్కా, జిన్ను 5% బ్రాందీ 5% (ఔట్లుక్మేగజీన్సౌజన్యంతో) -
విదేశీ చెత్తకు అనుమతి ఎలా?
ప్రజారోగ్యం పణంగా పెట్టి ధనార్జనా: కేంద్రంపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ: విదేశాలు ప్రమాదకర వ్యర్థాలను మన దేశంలో పారవేసేందుకు అనుమతించి, అందుకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం డబ్బు తీసుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ పౌరుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వం డబ్బు సంపాదిస్తోందని కోర్టు విమర్శించింది. విదేశాలు ప్రమాదకర వ్యర్థాలను మన దేశంలో పడేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారనీ, దీనివల్ల దేశ పౌరులపై దుష్ప్రభావాలు పడుతున్నాయని ‘రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ ’అనే స్వచ్ఛంద సంస్థ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై సుప్రీంకోర్టు అనేకసార్లు ఆదేశాలిచ్చినా అధికారులు అమలు చేయడం లేదనీ, కలుషిత పదార్థాలను భారత్‌లో పారవేసేందుకు అనుమతిస్తుండటంతో పౌరుల ఆరోగ్యం దెబ్బతింటోందని కోర్టుకు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన అంశమనీ, అధికారులు నిబంధనలను అతిక్రమించకూడదని జస్టిస్ జేఎస్ ఖేహర్ అన్నారు. సమగ్ర వివరాలతో ఒక అఫిడవిట్‌ను సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 31కి వాయిదా వేసింది. గతంలో అలస్కా ఆయిల్ లీకేజీ(1989)తో సంబంధం ఉన్న ఓడను గుజరాత్ తీరంలో నాశనం చేయడానికి ప్రయత్నించగా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదు. -
రూ.2 కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ సిగరెట్లకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించకుండా తీసుకువచ్చిన ఈ ఖరీదైన విదేశీ బ్రాండ్ల సిగరెట్ల విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. సిగరెట్ల బండిళ్లను సీజ్ చేసి, సంబంధీకుల కోసం విచారణ జరుపుతున్నారు. -
విదేశీ బాణసంచాపై నిషేధం
-
విదేశీ బాణసంచాపై నిషేధం
న్యూఢిల్లీ: త్వరలో దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో విదేశీ బాణసంచాపై ప్రభుత్వం నిషేధం విధించింది. విదేశీ బాణసంచాను కలిగి ఉండటం, అమ్మడం శిక్షార్హ నేరాలని వెల్లడించింది. గతకొన్నేళ్లుగా చైనా నుంచి వచ్చే బాణసంచా భారత మార్కెట్లను ముంచెత్తడం పరిపాటిగా మారింది. ఎక్కడైనా విదేశీ బాణసంచా అమ్మకాలు జరుగుతున్నట్లు, నిల్వలు ఉన్నట్లు తెలిస్తే దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్లో చెప్పాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. -
విచ్చలవిడిగా విదేశీ సిగరెట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశీయ సిగరెట్లకు పోటీగా విదేశీ సిగరెట్లు రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నాయి.పైగా చట్టబద్ధమైన హెచ్చరికలను తుంగలో తొక్కినట్లుగా విదేశీ సిగరెట్లు విఫణిలో చలామణి అవుతున్నాయి.పొగతాగడ ం వల్ల ఆరోగ్యపరంగా కలిగే తీవ్ర పరిణామాలపై ఎన్నో హెచ్చరికలు చేసినా, గొంతు, నోటి క్యాన్సర్ వస్తుందంటూ సిగరెట్ ప్యాకెట్లపై భయానకమైన బొమ్మలు ముద్రించి మార్కెట్లోకి తెస్తున్నా దేశీ య సిగరెట్ల అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గిన దాఖలా లు లేవు. ఈ పరిస్థితిలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లుగా విఫణి వీధుల్లో విదేశీ సిగరెట్ల విశృలంఖత్వం పెరిగిపోతోంది. ఇండోనేషియన్ బ్రాండ్ సిగరెట్లు వినియోగదారుల కోసం సిటీలో సిద్ధంగా ఉన్నాయి. రెవెన్యూ ఇంటలిజెన్స్ ఇటీవల ఉత్తర చెన్నైలో ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.7 కోట్ల విలువైన ‘డీజరుమ్ బ్లాక్’ సిగరెట్లను సీజ్ చేశారు. ఈ దాడుల తరువాత అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో సముద్రమార్గంలో విదేశీ సిగరెట్ల ప్రవేశిస్తున్నట్లు తేలింది. గతంలో విమానాల్లోని కంటైనర్ల ద్వారానే చేరవేశారు. అయితే చెన్నై, తిరుచ్చిరాపల్లి విమానాశ్రయాల కస్టమ్స్ అధికారులు కట్టుదిట్టం చేయడంతో నౌకల ద్వారా సరుకును తెప్పించుకుంటున్నారు. విమానంలో అక్రమరవాణా బంద్ కావడంతో స్మగ్లర్లు టూటుకోరిన్ పోర్టును ఎంచుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. డీజరుమ్ బ్లాక్ సిగరెట్లు దేశీయ సిగరెట్ల వలె ఎక్కువ ఘాటైనవి కాకపోవడంతో చెన్నైలోని మహిళలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. సిగరెట్ల అక్రమ రవాణాలో నూరుశాతం లాభం లభిస్తున్న కారణంగా విదేశీ సిగరెట్ల అమ్మకాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సింగపూరు, దుబాయ్, కాంబోడియా దేశాల నుంచే ఎక్కువగా విదేశీ సిగరెట్ల కంటైనర్లు చెన్నైకి చేరుతున్నట్లు సమాచారం. చెన్నైకి ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలోని న్యూమనలి వద్ద రెవెన్యూ ఇంటెలిజన్స్ కొన్ని రోజుల క్రితం జరిపిన కంటైనర్ల తనిఖీలో రెండువైపులా ప్లైవుడ్ షీట్లను అమర్చి రహస్యంగా దాచి ఉంచిన 700 కార్టూన్స్ విదేశీ సిగరెట్ల సరుకు పట్టుపడగా సింగపూరు నుంచి తీసుకువచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు. ఒక్కో కార్టూన్ 50 ప్యాకెట్ల బ్లాక్ సిగరెట్లు కలిగి ఉంటుంది. అంటే సింగపూరు నుంచి చెన్నైకి మొత్తం 70 లక్షల సిగరెట్ స్టిక్స్ అక్రమరవాణా జరిగింది అన్నమాట. సిగరెట్ స్మగ్లర్లకు తమిళనాడు ఒక అతిపెద్ద మార్కెట్‌గా మారిందని అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ రూ.30 వేలు నుంచి రూ.40 వేలు చెల్లించి 20 కేరియర్ల సరుకును కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
విదేశీ పూలు విరిశాయి..!
నెయిల్ ఆర్ట్ ఇది ‘హవాయిన్ ఫ్లవర్స్’ నెయిల్ ఆర్ట్. ఈ హవాయిన్ ఫ్లవర్స్ ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ఫేమస్. వీటి డిజైన్స్ ఎక్కడ ఉన్నా... వాటి క్రేజే వేరు. డ్రెస్సులు, చీరలు, దుప్పట్లు... ఇలా వేటిపై ఈ ఫ్లవర్ డిజైన్ వేసినా, వాటి సేల్ విపరీతంగా పెరిగిపోతుంది. అంతటి స్పెషల్ ఫ్లవర్లను మీ గోళ్లపైనా వేసుకోవాలని ఉందా...? అయితే.. ముందుగా మీ గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకొని, అందంగా కత్తిరించుకోండి. తర్వాత ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకోండి. ఎలా అంటారా? ఇలా... 1. ముందుగా ట్రాన్స్పరెంట్, ఆరెంజ్, తెలుపు రంగుల నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అన్ని గోళ్లకూ ఆరెంజ్ కలర్ పాలిష్‌ను పూయాలి. 2. తర్వాత ఏదైనా సూది లాంటి పరికరాన్ని తీసుకొని, వైట్ కలర్ పాలిష్‌లో ముంచండి. ఆ పాలిష్‌తో ఇప్పుడు చూపుడు, మధ్య వేళ్లపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా గీయాలి. 3. ఇప్పుడు మిగతా వేళ్లకు కూడా ఫొటోలను చూసుకుంటూ వైట్ పాలిష్‌తో డిజైన్ వేసుకోవాలి. 4. సూది లాంటి పరికరం తీసుకొని, పెట్టిన తెల్ల చుక్కలను మామూలు పూరేకుల్లా మార్చుకోవాలి. 5. అదే పరికరంతో ఆ పూరేకులను హవాయిన్ పూల డిజైన్లోకి తీసుకురావాలి. 6. మళ్లీ వైట్ కలర్ పెయింట్‌తో అన్ని వేళ్లకూ అక్కడక్కడా చుక్కలు పెట్టుకోవాలి. చివరగా ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఫైనల్ కోటింగ్ ఇవ్వాలి. అలా ఎంతో అందమైన పూలు మీ గోళ్లపై పూస్తాయి. ఆరెంజ్‌కి బదులుగా ఏ రంగునైనా వేసుకోవచ్చు. -
చైనా..టు హైదరాబాద్ వయా చెన్నై
రూ.1.60 కోట్ల విలువైన విదేశీ మద్యం పట్టివేత, ముగ్గురి అరెస్ట్ ఉక్రేయిన్, చైనాల నుంచి రవాణా మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణయ్యు అక్రమ వ్యాపారం హిమాయత్‌నగర్: చైనా, ఉక్రేయిన్ల నుంచి విదేశీ మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.60 కోట్ల విలువైన విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నారాయణగూడలోని ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ వరప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ భగవాన్‌రెడ్డితో కలసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న ధూల్‌పేటలోని మంగళ్‌హట్ ప్రాంతంలో పోలీసులు కార్డెన్‌సర్చ్ నిర్వహిస్తుండగా ఓ కారులో తరలిస్తున్న 120 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించడం జరిగిందన్నారు. దీనిపై కారు డ్రైవర్ సునీల్‌ను ప్రశ్నించగా సదరు కారు మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ అలియాస్ రాధయ్యదిగా తెలిపాడు. దీంతో పోలీసులు మౌలాలీలోని అతని ఇంటిపై దాడులు నిర్వహించగా ‘ఎస్వి ఓడ్కా గ్రాన్ ప్రిక్స్, ఎస్వి ఓడ్కా ఒరిజనల్’ 146 బాటిళ్లు లభ్యమైయ్యాయి. అనంతరం రాధాకృష్ణను ప్రశ్నించగా గాంధీనగర్‌లోని గోదాంలో మద్యం బాటిళ్లను నిల్వ చేసినట్లు చెప్పడంతో తనిఖీలు నిర్వహించి 455 కార్టన్లు (ఒక్కో దానిలో 15 చొప్పున 10,800 బాటిళ్లు) స్వాధీనం చేసుకున్నామన్నారు. చైనా, ఉక్రెయిన్ల నుంచి అక్రమ రవాణా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ 2010లో ‘ఇంపోర్ట్’ లెసైన్స్ తీసుకుని మద్యం బాటిళ్లను తెప్పించేవాడు. 2014నవంబర్‌లో లెసైన్స్ గడువు ముగియడంతో చైనా, ఉక్రేయిన్ దేశాల్లోని మద్యం వ్యాపారులతో రహస్య వ్యాపారం ప్రారంభించాడన్నారు. అక్కడి నుంచి ‘ఎస్వి ఓడ్కా గ్రాన్ ప్రిక్స్, ఎస్వి ఓడ్కా ఒరిజనల్’ బాటిళ్లను షిప్ ద్వారా చెన్నైకు తెప్పించి.. కంటైనర్లలో హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాడన్నారు. గాంధీనగర్‌లోని గోదాంలో నిల్వ చేసి రహస్యం గా సన్నిహితులకు, బంధువుల ద్వారా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైయ్యిందన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం సరిగా లేనందన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతను కోలుకోగానే మరిన్ని వివరాలు రాబట్టి చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ముగ్గురి అరెస్ట్, మరొకరి కోసం గాలింపు అక్రమ మద్యం వ్యాపారంలో మరో నలుగురి పాత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైయ్యిందని కమిషనర్ వివేకానందరెడ్డి తెలిపారు. వారిలో కారు డ్రైవర్ సునీల్ కుమార్(ఏ-1), అభినయ్‌కుమార్(ఏ-2), హర్మిందర్‌సింగ్(ఏ-3), మహేష్‌సింగ్(ఏ-4)లపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
విదేశీ మద్యం స్వాధీనం..మాజీ ఎమ్మెల్సీ అరెస్ట్
హైదరాబాద్: నగరంలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ కేసులో సంబంధమున్న ఓ మాజీ ఎమ్మెల్సీతో సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణగూడ, గాంధీనగర్, మీర్‌చౌక్, మంగళ్‌హాట్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది 7,255 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 1.71 కోట్ల వరకు ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య అలియాస్ రాధయ్యతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. గతంలో రాధయ్య ఆర్టీసీ పాలకవర్గ సభ్యుడిగాను, కార్మిక సంఘం నేతగా పనిచేశారు. ఈ మద్యం ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. -
విదేశీ సిగరెట్టు.. గుట్టురట్టు
► అక్రమంగా విక్రయిస్తున్న రూ.5 కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత ► రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 32 బృందాలతో దాడులు సాక్షి, హైదరాబాద్: విదేశీ సిగరెట్‌కు సెగ తగిలింది. అక్రమ వ్యాపారులకు వాణిజ్యపన్నుల శాఖ పొగ పెట్టింది. విదేశీ చౌకధర సిగరెట్ల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. వాణిజ్యపన్నుల శాఖకు చెందిన 32 బృందాలు బుధవారంరాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేశాయి. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సిగరెట్ అక్రమ రవాణా ఏజెంట్ల గోడౌన్లు, ఇతర అడ్డాలపై దాడులు చేసి రూ. 5 కోట్ల విలువైన సిగరెట్ కార్టన్లను సీజ్ చేశాయి. బ్లాక్, మోండ్, ఎస్సె, డన్హిల్, కేమల్, ఎల్.ఎమ్ బ్రాండ్లతో గల విదేశీ ప్రీమియం సిగరెట్లతోపాటు పారిస్, విన్, ఇంపాక్ట్, ఎలవెన్ 10, రూలి రివర్, రిచ్‌మ్యాన్, వేణుస్ తదితర బ్రాండ్లతో గల లోకల్ సిగరెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సీజ్ చేసిన అక్రమ విదేశీ సిగరె ట్ కార్టన్లకు సంబంధించి కోటి రూపాయల వరకు పన్నురూపంలో వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేయనుంది. సిగరెట్టు కంపెనీల ఫిర్యాదుతో... మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి విదేశాల్లో తయారైన ప్రీమియం, ఆర్డినరీ సిగరెట్లతోపాటు కోల్‌కతా, ముంబై, బంగ్లాదేశ్, ఇండోనేషియాల్లో తయారైన లోకల్ ఆర్డినరీ సిగరెట్లు కొన్నేళ్లుగా దేశీయ మార్కెట్‌ను ముంచెత్తాయి. ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ, సేల్స్ టాక్స్ లేకుండా నేరుగా మార్కెట్లోకి వస్తున్న ఈ సిగరెట్ల ధర కూడా చాలా తక్కువ. సిగరెట్టు డబ్బాలపై చట్టపరమైన హెచ్చరిక ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే అక్షరాలు గాని, క్యాన్సర్‌కు సంబంధించిన ఫొటోలుగానీ లేకుండా మార్కెట్లోకి వచ్చేశాయి. కొత్తగా సిగరెట్టును అలవాటు చే సుకునే యువత, తక్కువ ధరకు సిగరెట్లు వస్తుండడంతో బీడీ, సిగరెట్టుకు అలవాటు పడ్డవారు ఈ విదేశీ సిగరెట్లను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిగరెట్ తయారీ కంపెనీలైన ఐటీసీ, వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ వాణిజ్యపన్నుల శాఖకు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ రేవతి రోహిణిల నేతృత్వంలో దాడులు జరిగాయి. హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ప్రధాన డీలర్‌తోపాటు పలువురిని గుర్తించారు. వాణిజ్యపన్నుల శాఖకు రావలసిన పన్ను వసూలు నోటీసులు జారీ చేశారు. -
భారీగా విదేశీ సిగరెట్ల పట్టివేత
వాణిజ్యపన్నుల శాఖ బుధవారం రాత్రి ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో విదేశీ సిగరెట్ల నిల్వలను వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సిగరెట్ అక్రమ రవాణా ఏజెంట్ల గోడౌన్లు, ఇతర అడ్డాలపై జరిపిన దాడుల్లో రూ. 5కోట్ల విలువైన సిగరెట్ కార్టన్లను సీజ్ చేశారు. బ్లాక్, మోండ్, ఎస్సె, డన్హిల్, కేమల్, ఎల్.ఎమ్ బ్రాండ్లతో గల విదేశీ ప్రీమియం సిగరెట్లతో పాటు పారిస్, విన్, ఇంపాక్ట్, ఎలవెన్ 10, రూలి రివర్, రిచ్‌మ్యాన్, వేణుస్ తదితర బ్రాండ్లతో గల లోకల్ సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పాన్‌షాపులు, ఇతర హోల్‌సేల్ దుకాణాల్లో కోట్లాది రూపాయల విలువైన సిగరెట్లు విక్రయించడం గమనార్హం. కాగా సీజ్ చేసిన అక్రమ విదేశీ సిగరె ట్ కార్టన్లకు సంబంధించి రూ. కోటి వరకు పన్ను రూపంలో వాణిజ్యపన్నుల శాఖ వసూలు చేయనుంది. కమిషనర్ అనిల్‌కుమార్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ రేవతి రోహిణిల నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ప్రధాన డీలర్‌తో పాటు పలువురిని గుర్తించారు. వాణిజ్య పన్నుల శాఖకు రావలసిన పన్ను వసూలు నోటీసులు జారీ చేసి, చేతులు దులుపుకున్నారు. -
గ్రేటర్లో ‘విదేశీ మద్యం దుకాణాలు’
♦ విదేశీ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ♦ విదేశీ మద్యం దుకాణాలు ♦ ఔట్లెట్లలో 401 బ్రాండ్ల విదేశీ మద్యం.. ♦ సిద్ధంగా ఉన్న 18 మంది దిగుమతిదారులు ♦ సర్కార్‌కు ఎక్సైజ్ కమిషనర్ లేఖ.. సీఎం సుముఖత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యాటకులతో పాటు ఉన్నతాదాయ వర్గాలు లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విదేశీ మద్యం దుకాణాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ‘ఎలైట్ ఔట్లెట్స్’ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాల్లో సుమారు 400కు పైగా విదేశీ స్కాచ్, విస్కీ, వైన్, బీరు ఇతర మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. ఈ మద్యం దుకాణాల్లో విదేశాల్లో తయారైన మద్యం మాత్రమే అందుబాటులో ఉంచాలని, దేశీయ తయారీ మద్యం(ఐఎంఎల్)కు చోటివ్వకూడదని ఎక్సైజ్ అధికారుల ప్రాథమిక ఆలోచన. ఈ ఎలైట్ ఔట్లైట్స్కు వచ్చే స్పందనను బట్టి అవసరమైతే 50 శాతానికిపైగా విదేశీ మద్యం, ప్రీమియం, మీడియం ఐఎంఎల్ విక్రయాలు జరుపుకునే అవకాశం కూడా ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ పలు ప్రతిపాదనలతో ఏప్రిల్ 28న ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర పరిశ్రమల విధానం, టూరిజం అభివృద్ధి అంశాలకు విదేశీ మద్యం ముడిపడి ఉన్నట్లు గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన నేపథ్యంలో కమిషనర్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడమే తరువాయి. అదే జరిగితే జూలై నుంచి విదేశీ మద్యం దుకాణాలు ‘ఎలైట్ ఔట్లెట్స్’ పేరుతో ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. గ్రేటర్‌లోనే భారీగా ఏర్పాటు.. రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలకుగానూ హైదరాబాద్‌లోనే 503 ఉన్నాయి. వీటిలో 73 దుకాణాలను గత అక్టోబర్‌లో వేలం సందర్భంగా ఎవరూ తీసుకోలేదు. తద్వారా గ్రేటర్‌లోని ఒక్కో దుకాణం లెసైన్స్ ఫీజు రూ. 1.08 కోట్ల లెక్కన సుమారు రూ.75 కోట్లు ప్రభుత్వం నష్టపోయింది. ఈ నేపథ్యంలో ‘ఎలైట్ ఔట్లెట్స్’ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబై మెట్రో నగరాల తరహాలో విదేశీ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. గ్రేటర్లో ఎవరూ తీసుకోని 73 మద్యం దుకాణాల స్థానంలోనే విదేశీ ఔట్లెట్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రూ.1.25 కోట్ల లెసైన్స్ ఫీజు.. 10 వేల అడుగుల దుకాణం ప్రతిపాదిత ఎలైట్ ఔట్లెట్లకు వార్షిక లెసైన్సు ఫీజును రూ.1.25 కోట్లుగా నిర్ణయించాలని సర్కార్‌కు రాసిన లేఖలో కమిషనర్ చంద్రవదన్ పేర్కొన్నారు. 10 వేల అడుగుల విశాలమైన ఏసీ దుకాణం, లక్ష రూపాయల దరఖాస్తు రుసుము తప్పనిసరి చేయనున్నారు. ఈ దుకాణాల్లో దేశీయ మద్యం విక్రయాలు జరుపుకునే అవకాశం కల్పించినా, సి-కేటగిరీ మద్యం, బీర్లు, వైన్ వంటివాటిని మాత్రం విక్రయించకూడదని ప్రతిపాదించారు. కాగా, 18 మంది దిగుమతిదారులు 401 బ్రాండ్ల విదేశీ మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చినట్లు ప్రభుత్వానికి తెలిపారు. ప్రస్తుతం విదేశీ మద్యం లభిస్తున్న బార్లు, మద్యం దుకాణాల్లో సైతం యథాతథంగానే అందుబాటులో ఉంటుందని కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. -
పే...ద్ద కారు
బాపట్లలో విదేశీకారు హల్చల్ సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ బాపట్ల: పొడవాటి విదేశీ కారు బాపట్లలో హల్చల్ చేసింది. ఎంపీ మురళీమోహన్ బంధువులకు చెందిన ఈ కారు బుధవారం సూర్యలంక తీరానికి వచ్చింది. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఆయిల్ కోసం స్థానికుల సూచన మేరకు రాత్రి 9.30 గంటల సమయంలో బాపట్లలోని కోన ఫిల్లింగ్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. 30 అడుగులు పొడవు ఉన్న ఈ కారులో 25 మందికిపైగా ప్రయాణించే వీలుంది. బాత్రూములతో సహా కారులో ఉండటంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. దాని ముందు నిలబడి సెల్ఫీలు తీసుకోవడానికి యువత పోటీ పడ్డారు. ఈ కారు ఖరీదు రూ.6 కోట్లు ఉంటుందని డ్రైవర్ తెలిపాడు. -
కోట్ల రూపాయల విదేశీ సిగరెట్లు సీజ్
కొచి: దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణాచేస్తున్న 91లక్షల రూపాయల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కేరళలోని కోచి పోర్ట్‌లో ఓ కంటెయినర్ లో తీసుకువస్తున్న సిగరెట్లను గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతవారం 67లక్షల రూపాయల విలువ చేసే విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ కెఎన్ రాఘవన్ మీడియాకు తెలిపారు. కంటెయినర్లో ఉన్న ఫర్నిచర్స్లో సిగరెట్లను దాచి ఉంచినట్లు గుర్తించినట్లు చెప్పారు. విదేశీ సిగరెట్లను ఇంత భారీ మొత్తంలో సీజ్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 1.58కోట్ల రూపాయల విదేశీ సిగరెట్లను సీజ్ చేశామని విచారణ చేపట్టినట్లు రాఘవన్ వివరించారు. -
నేను నా లవర్‌తోనే ఉన్నాను
నేను నా లవర్‌తోనే ఉన్నాను. చాలా సంతోషంగానూ ఉన్నాను. పనికట్టుకుని మరీ కొందరు నాపై వదంతులు ప్రచారం చేస్తున్నారు అంటూ ఫైర్ అవుతోంది నటి ఇలియానా. ఇంతకు ముందు దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగులో హీరోయిన్గా టాప్ లెవల్లో వెలిగిన ఈ గోవా సుందరి తమిళంలో మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. తొలి రోజుల్లో కేడీ చిత్రంలో నటించినా ఆ చిత్రం అపజయంతో కోలీవుడ్‌ను వదిలి టాలీవుడ్‌ను పట్టుకున్న ఇలియానా అక్కడ విజయాల మీద విజయాలు వచ్చిపడడంతో టాప్ హీరోయిన్గా వెలిగిపోయింది. అలాంటి సమయంలో అమ్మడికి బాలీవుడ్ మోహం పెరిగింది. దీంతో అక్కడ మకాం పెట్టింది. హిందీలో బర్ఫీ చిత్రం నటిగా ఆమెకు మంచి పేరే తెచ్చి పట్టినా అక్కడ ఆశించిన స్థాయిని మాత్రం పొందలేక పోయింది. ఫలితంగా ప్రస్తుతం ఇలియానా చేతిలో ఒక్క చిత్రం లేదు.దీంతో మళ్లీ దక్షిణాదిపై దృష్టి సారించినట్లు త్వరలోనే ఒక చిత్రంలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి మాత్రం మోడలింగ్ , వాణిజ్య ప్రకటనలతో కాలం గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక విదేశీ వ్యక్తి ప్రేమలో పడ్డట్టు తనే స్వయానా తన ట్విట్టర్లో పేర్కొంది. అయితే ఇప్పుడతనికి టాటా చెప్పేసి బాలీవుడ్ నటుడొకరితో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. అయితే ఇలాంటి ప్రచారాన్ని పెడ చెవిన పెట్టే ఇలియానా ఈ సారి మాత్రం ఘాటుగానే స్పందించింది. తనపై గాసిప్స్ ప్రచారం చేయడంలో మీడియా అత్యుత్సాహం కనబరుస్తూనే ఉందని ఆరోపించారు. తాను తన లవర్‌తోనే ఉన్నాననీ, అతనితో చాలా సంతోషంగా ఉన్నాననీ అంది. అయితే తన లవర్ పని మీద ఆస్ట్రేలియా వెళ్లడంతో కొన్ని నెలలుగా అతన్ని కలవలేదనీ తాము ఫోన్లో టచ్‌లోనే ఉన్నామని పేర్కొన్నారు. అంతేగానీ తానెవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండు కథలను విన్నాననీ వాటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఇలియానా అంటోంది. -
హైదరాబాద్‌లో విదేశీ మద్యం దుకాణాలు
- కనీసం వంద బ్రాండ్లతో ఏర్పాటుకు ఆహ్వానం - నోటిఫికేషన్ జారీచేసిన ఎక్సైజ్ శాఖ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రత్యేకంగా విదేశీ మద్యం దుకాణాలు రాబోతున్నాయి. ఎక్స్‌క్లూజివ్ ఫారిన్ లిక్కర్ బొటిక్స్ పేరుతో కనీసం 100 విదేశీ బ్రాండ్లకు తక్కువ కాకుండా దుకాణాలను ఏర్పాటుచేసే వారికి సర్కార్ ఆహ్వానం పలుకుతోంది. నగరానికి వచ్చే విదేశీ పర్యాటకులకు, ప్రముఖులకు విదేశీ మద్యం అందుబాటులో ఉండడం లేదని గతంలో ఎక్సైజ్ శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేయగా అంతర్జాతీయ ప్రమాణాలతో తయారయ్యే వైన్ దేశీయ తయారీలో లేదని తేలింది. స్కాట్లాండ్కు చెం దిన జానీవాకర్ బ్రాండ్ మాత్రమే ఎక్కువగా లభిస్తుందని టీఎస్‌బీసీఎల్ అధికారులు తేల్చారు. దీంతో విదేశీ మద్యం కోసం బోటిక్స్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఇటీవల సీఎంతో కూడా చర్చించినట్లు సమాచారం. ఔట్లెట్ల ఏర్పాటు కోసం నోటిఫికేషన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీసం 100 ఫారిన్ బ్రాండ్లతో ‘ఫారిన్ లిక్కర్ బొటిక్స్’ నెలకొల్పేందుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం తొలుత రెండేళ్లకు లెసై న్సు మంజూరు చేసి, తర్వాత మరో రెండేళ్లకు పొడిగించే వెసులుబాటు కల్పించింది. ఐటీ కారిడార్లలోని బార్లు, రెస్టారెంట్లలో డ్రాట్ బీర్ల తయారీ, రిటైల్ అమ్మకాలకు కూడా ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐటీ ప్రాంతాల్లో 6 మైక్రో బ్రేవరీలను ఏర్పా టు చేసుకొని అక్కడే పిచ్చర్లు లేదా మగ్‌ల ద్వారా వినియోగదారులకు బీరును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే జారీచేసిన 151 జీవోకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్ సూచించారు. లిక్కర్ సరఫరాకు టెండర్లు 2015-16 సంవత్సరానికి గాను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన గోడౌన్లు, డిపోలకు మద్యం సరఫరా చేసేం దుకు దేశవ్యాప్తంగా ఉన్న డిస్టిలరీల నుంచి సంస్థ టెండర్లను ఆహ్వానించింది. బీరు మినహా దేశీయ, విదేశీ మద్యం తయారీ డిస్టిలరీలు నిబంధనలకు అనుగుణంగా తెలంగాణలో వివిధ రకాల బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేయాల్సి ఉంటుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలతో ఇ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల దాఖలుకు గడువు ముగియగా, 3 గంటలకు టెండర్లు తెరిచారు. 66 కంపెనీలు టెండర్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఏయే కంపెనీలకు మద్యం సరఫరా టెండ ర్లు వచ్చా యో సోమవారం తెలుస్తుందని టీఎస్‌బీసీఎల్‌కు చెందిన ముఖ్య అధికారి తెలిపారు. -
ముందుగా వెల్లడిస్తే ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ
నల్లధనంపై ప్రభుత్వం ఆఫర్ న్యూఢిల్లీ: ప్రత్యేక పథకాన్ని ఉపయోగించుకుని విదేశీ అక్రమ ఆస్తులను ముందస్తుగా వెల్లడించిన వారికి ఫెమా సహా ఐదు చట్టాల కింద ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ లభించగలదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇలాంటి వారికి అదాయ పన్ను చట్టం, సంపద చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం, కంపెనీల చట్టం, కస్టమ్స్ చట్టం కింద ప్రాసిక్యూషన్ ఉండదని పేర్కొంది. అయితే, ఈ ఐదు మినహా.. ఇతరత్రా చట్టాలేమైనా వర్తించే పక్షంలో చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అవినీతి ద్వారా సొమ్ము కూడబెట్టిన వారికి, జూన్ 30కి ముందుగానే నోటీసులు అందుకున్న వారికి మినహాయింపులు వర్తించబోవని పేర్కొంది. నల్లధన కుబేరులు విదేశీ ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఉద్దేశించిన వన్ టైమ్ కాంప్లియన్స్ విండో సదుపాయంపై సందేహాలను నివృత్తి చేసే దిశగా కేంద్రం ఈ విషయాలు తెలిపింది. విదేశాల్లో అక్రమంగా కలిగి ఉన్న బ్యాంకు ఖాతా విలువను.. అది ప్రారంభించినప్పటి నుంచి జమ అవుతూ వచ్చిన డిపాజిట్ల మొత్తం ఆధారంగా లెక్కించి.. పన్నులు, జరిమానాలు విధించడం జరుగుతుందని పేర్కొంది. ఒకవేళ భారత్‌లో ఆర్జించిన ఆదాయంపై ఇక్కడ పన్ను చెల్లించకుండా, విదేశాల్లో ఆస్తి కొన్న పక్షంలో దాన్ని కూడా చట్టప్రకారం వెల్లడించని విదేశీ ఆస్తిగానే పరిగణించడం జరుగుతుందని తెలిపింది. ఇక, విద్యార్థులకు ఊరటనిచ్చే విధంగా.. క్రితం సంవత్సరంలో రూ. 5 లక్షల కన్నా తక్కువగా డిపాజిట్లు ఉన్న విదేశీ బ్యాంకు ఖాతాల విషయంలో ఎటువంటి పెనాల్టీలూ ఉండబోవని పేర్కొంది. -
రూ.3.5 కోట్ల కారు.. మంటల్లో
విలువైన విదేశీ మోడల్ కారు దగ్ధం హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్ మండల పరిధిలోని హిమాయత్ సాగర్ వద్దగల ఔటర్ రింగురోడ్డుపై ఆదివారం ఓ కారు దగ్ధమైంది. దీని విలువ రూ.3.5 కోట్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నగరంలోని షేక్‌పేటకు చెందిన వ్యాపారి రవికుమార్ (45) ఆదివారం ఉదయం ‘పోర్షే’ విదేశీ మోడల్ కారులో గచ్చిబౌలినుంచి శంషాబాద్‌కు వెళ్తున్నారు. హిమాయత్ సాగర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. రవికుమార్ కారు దిగి చూస్తుండగానే మంటలు చెలరేగి అది దగ్ధమైంది. దీంతో ఆయన అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు రాజేందర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి వేగమే సంఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా కారు విలువ రూ.3.5కోట్లు ఉండవచ్చని పోలీసుల అంచనా. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన జీఎంఆర్ వాటా
10 శాతం వాటాను రూ. 492 కోట్లకు కొన్న జీఎంఆర్ పూర్తిగా వైదొలిగిన మలేషియా ఎయిర్పోర్ట్ లిమిటెడ్ దీంతో 64 శాతానికి పెరిగిన వాటా జీఎంఆర్ వాటా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(డీఐఏఎల్) నుంచి విదేశీ భాగస్వామ్య కంపెనీ మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెరహాద్ (ఎంఏహెచ్‌బీ) పూర్తిగా వైదొలిగింది. ఎంఏహెచ్‌బీ కలిగి ఉన్న 10 శాతం వాటాను సుమారు రూ. 492 కోట్లు (7.9 కోట్ల డాలర్లు) జీఎంఆర్ ఇన్ఫ్రా కొనుగోలు చేసింది. దీంతో డీఐఏఎల్‌లో జీఎంఆర్ వాటా 54 శాతం నుంచి 64 శాతానికి పెరిగింది. ప్రస్తుత చట్టాల ప్రకారం విదేశీ భాగస్వామ్య కంపెనీకి యాజమాన్య నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడంతో వైదొలుగుతున్నట్లు మలేషియన్ ఎయిర్‌పోర్ట్స్ ప్రకటించింది. సుమారు 22 మిలియన్ డాలర్ల లాభంతో ఎంఏహెచ్‌బీ వైదొలిగినట్లు అంచనా. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఎంఏహెచ్‌బీ 57.6 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. మలేషియా ఎయిర్‌పోర్ట్స్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కీలకమైన ఎయిర్‌పోర్ట్‌లో వాటా పెంచుకున్నట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిదార్థ కపూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఈ వాటా కొనుగోలుకు ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించాల్సి ఉంది. -
తుంగభద్ర తీరంలో అరుదైన అతిథులు
కర్ణాటక (బళ్లారి) : బళ్లారి జిల్లా హువినహడగలి నియోజకవర్గ పరిధిలో తుంగభద్ర నదీ తీరాన ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన విదేశీ వలస పక్షులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. హువినహడగలి సమీపంలోని బన్నిగోళ గ్రామ పరిసరాల్లోని తుంగభద్ర నదీ పరివాహకంలోని డ్యాం బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంలో రంగు రంగుల పక్షులు వేలాదిగా తరలిరావడంతో ఆ ప్రాంతం అంతా ఎంతో అందంగా కనిపిస్తోంది. రాజహంస అనే పక్షి గులాబీ, తెలుపు, నలుపు తదితర అందమైన రంగులు కలిగి ఉండటంతో ఎగురుతూ ఉన్నప్పుడు ఎంతో అందంగా కనిపించడంతో వాటిని చూడడానికి పెద్ద ఎత్తున పక్షిప్రేమికులు తరలి వస్తున్నారు. దాదాపు 15 వేల నుంచి 20 వేలకు పైగా రాజహంస అనే విదేశీ పక్షులు తరలి వచ్చినట్లు తెలుస్తోంది. వేలాది పక్షులు ఒకేసారి తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో విహరిస్తుండటంతో ఎంతో చూడముచ్చటగా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అందమైన రాజహంస విదేశీ పక్షులు ఆకాశంలో విహరిస్తున్నప్పుడు రంగురంగుల దృశ్యాలు కనిపిస్తుండటంతో వాటిని చూస్తూ పక్షి ప్రేమికులు తనివి తీరా ఆనందిస్తున్నారు. ప్రప్రథమంగా వేలాది విదేశీ పక్షులు ఈ ప్రాంతానికి తరలి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రాజహంస అనే పక్షులు ఆఫ్రికా దేశానికి చెందిన వలస పక్షులు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేటి సరస్సు, ఒడిసా, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే సమయంలో అప్పుడప్పుడు కనిపిస్తాయని పలువురు పక్షి ప్రేమికులు తెలిపారు. వేలాది అందమైన రాజహంస పక్షులు తరలి రావడంతో వాటిని కొందరు పట్టుకుని తినడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నందువల్ల సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేస్తూ అందమైన పక్షులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
జీవ వైవిధ్యం..పూడికతో విధ్వంసం
హుస్సేన్‌సాగర్ తీరంలో కొలువుదీరిన సహజవనం కొన్నేళ్ల కింద ‘వెట్‌ల్యాండ్ ఎకో కన్జర్వేషన్’ జోన్‌గా అభివృద్ధి ఇప్పుడు హుస్సేన్‌సాగర్ పూడిక తొలగింపు పేరుతో ఎసరు పూడిక మట్టిని వేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర యంత్రాంగం ఇప్పటికే పొదలు దహనం.. చిన్న చిన్న చెట్ల నరికివేత సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచిన హుస్సేన్‌సాగర్ నెక్లెస్ రోడ్డులో దాదాపు 13 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ప్రకాశ్‌నగర్ నాలా సాగర్‌లో కలిసే ప్రాంతంలో ఉన్న ఈ స్థలం చాలాకాలం పాటు కోర్టు వివాదాల్లో ఉంది. తర్వాత ప్రభుత్వం చేతిలోకి చేరేసరికే అందులో ఓ చిట్టడివి పెరిగి ఉంది. దానిని ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై సర్వే చేసే క్రమంలో... అప్పట్లోనే ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. చుట్టూ ఉన్న జనారణ్యం మధ్యలో... పలు రకాల పక్షులు, సీతాకోక చిలుకలు, పాములు, వివిధ జాతుల చెట్లు వంటి అద్భుతమైన జీవ వైవిధ్యం ఈ 13 ఎకరాల స్థలంలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ ప్రాంతాన్ని ఇతర పార్కుల్లాగా తీర్చిదిద్దితే వీటన్నింటికీ ప్రమాదకరమని గుర్తించిన అప్పటి హుడా అధికారులు ‘వెట్‌ల్యాండ్ ఎకో-కన్జర్వేషన్ జోన్ (పర్యావరణ రక్షిత ప్రాంతం)’గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆ స్థలంలో పొగడ, ఇప్ప, నెమలినార, రావి, మేడి, మర్రి, తెల్లమద్ది, గంగరావి, ఈతలాంటి రకరకాల మొక్కలు నాటి పెంచారు. ప్రస్తుతం అవన్నీ పెరిగి ఆ ప్రాంతమంతా ఒక చిట్టడవిలాగా మారింది. సహజ వైవిధ్యం.. ఈ 13 ఎకరాల ప్రాంతాన్ని ఎకో కన్జర్వేషన్ జోన్‌గా అభివృద్ధి చేయడంతో... కొన్ని రకాల విదేశీ పక్షులు సహా పాములు, సీతాకోక చిలుకలు, సాలీళ్లు, తూనీగలు, స్థానిక పక్షులు ఇక్కడ ఆవాసం ఏర్పరుచుకున్నాయి. దాదాపు అన్నిరకాలూ కలిపి దాదాపు 300 జాతులు ఇక్కడ జీవిస్తున్నట్లు ‘ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ ఫండ్ (డబ్ల్యూ డబ్యూఎఫ్)’ ఇండియా విభాగం ప్రతినిధులు ప్రత్యేక సర్వేలో గుర్తించారు. హుస్సేన్‌సాగర్ తీరంలోని ఇతర ప్రాంతాల్లో లేని కొన్ని జీవజాతులు ఈ 13 ఎకరాల్లో ఉన్నాయని తేల్చారు. అయితే ఇప్పుడు ఈ జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడింది. కొంతకాలంగా హుస్సేన్‌సాగర్‌లో తీరం వెంబడి పూడికను తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత పూడిక మట్టిని తీసి అందులోని తడి పోయేవరకు ఒడ్డున డంప్ చేసి తర్వాత వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు మూడు నాలాల పరిధిలో పూడిక తీత పూర్తయింది. నాలుగోది కూకట్పల్లి నాలా. అత్యంత ప్రమాదకర రసాయనాలు ఇందులోంచే సాగర్‌లో చేరుతాయి. దీని పరిధిలో పూడికను తీసి తొలుత డంప్ చేసేందుకు ఈ ‘ఎకో కన్జర్వేషన్ జోన్’ స్థలాన్ని వినియోగించుకోనున్నారు. వద్దన్నా వింటేగా... గత ఏడాదే ఈ వనంలోని చె ట్లను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం వాల్టా చట్టం మేరకు ఏర్పడ్డ ‘ట్రీ ప్రొటెక్షన్ కమిటీ’కి దరఖాస్తు చేశారు. కానీ ఆ వనం జీవ వైవిధ్యపరంగా ప్రత్యేకమైనదని స్పష్టం చేస్తూ... కమిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు తొలుత ఆ ప్రాంతం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో సాగర్ పూడిక డంప్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ఇంతలో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాగర్ నీటిని పూర్తిగా తొలగించి పూడిక తీయాలనేది ఈ కొత్త ఆలోచన. అయితే ఆ పని మొదలయ్యేలోపు కూకట్పల్లి నుంచి వచ్చే నాలా కలిసే చోట మేటవేసిన ప్రమాదకర రసాయనాల పూడిక తొలగించాలని భావిస్తున్నారు. కానీ ఈ బాధ్యతను హెచ్ఎండీఏ తీసుకుంటుందా, జీహెచ్ఎంసీ నిర్వహిస్తుందా? అన్న విషయంలో అధికారులకు స్పష్టత రాలేదు. దీంతో తాత్కాలికంగా డంప్ యోచనను నిలిపేశారు. ‘మంట’ పెట్టేస్తున్నారు..! పూడికతీత పనులు ఎప్పుడు మొదలుపెట్టినా... ఈ 13 ఎకరాల వెట్ కన్జర్వేషన్ జోన్లోనే పూడిక మట్టిని వేస్తామని అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. ఇందుకోసం ఇప్పటికే ఈ ప్రాంతం లోపలివైపు మంటలు పెట్టి పొదలను ధ్వంసం చేశారు. కొన్ని చిన్న చెట్లను తొలగించేశారు. పెద్ద చెట్లు తొలగిస్తే పర్యావరణ ప్రేమికుల నుంచి వ్యతిరేకత వస్తుందనే యోచనతో వాటి మధ్యలోనే పూడిక మట్టి వేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే పూడికలోని రసాయనాల ధాటికి చెట్లు చనిపోవటం ఖాయమని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యుఫోర్బియా సెబెస్టినీ అనే అతి అరుదైన మొక్క కూడా ఈ ప్రాంతంలో కనిపించింది. 65 ఏళ్ల కిందట ఓ విదేశీ శాస్త్రవేత్త దీనిని మొదటిసారిగా మూసీ నది ఒడ్డున కనుగొన్నారు. ఆ తర్వాత మళ్లీ దాని జాడ దొరకలేదు. ఇప్పుడు హుస్సేన్‌సాగర్ ఒడ్డున కనిపించింది. జపాన్, చైనా, అసోంలలో కనిపించే అరుదైన ‘గ్రే హెడెడ్ లాప్విన్’ అనే పక్షి వానాకాలంలో ఇక్కడ తారసపడింది. ఆ జాతి పక్షులు హుస్సేన్‌సాగర్ ప్రాంతాన్ని తమ వలస కేంద్రంగా భావిస్తున్నాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు తేల్చిన అంశాలు.. సాగర్ చుట్టూ 117 జాతుల మొక్కలున్నాయి. 77 రకాల పక్షులు ఇక్క సంచరిస్తున్నాయి. కొన్ని విదేశీ వలస పక్షులు కూడా ఉన్నాయి. 40కిపైగా జాతుల సీతాకోకచిలుకలు, 14 రకాల సాలె పురుగులు, 6 రకాల తూనీగలు, 3 రకాల పాములు, 6 రకాల చేపలు ఉన్నాయి. వెరసి దాదాపు 300 రకాల జీవజాతులు సాగర్ చుట్టూ బతుకుతున్నాయి. ఆ ఊపు ఏమైంది..? హైదరాబాద్‌లో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు జరిగినప్పుడు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా జీవ వైవిధ్య సూచికను రూపొందించారు. దేశంలో ఈ సూచీ ఏర్పాటు చేసిన తొలి నగరం మనదే. 2012లో ఆ సూచీ ఆధారంగా హైదరాబాద్‌ను బేరీజు వేసుకుంటే 31 పాయింట్లు వచ్చాయి. అంటే నగరం పలు విషయాల్లో వెనకబడి ఉందని వెల్లడైంది. దీంతో భవిష్యత్‌లో పరిస్థితిని మెరుగుపరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇవి కూడా కోర్టు ధిక్కారమే ‘‘పర్యావరణాన్ని బాగు చేయాలనే ఆలోచనే మన యంత్రాంగానికి లేదు. 2003లోనే దీనిపై కోర్టుకు వెళ్లాం. పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలను నిలిపివేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పుడు వెట్‌ల్యాండ్ ఎకో కన్జర్వేషన్ జోన్లో చె ట్లకు నష్టం చేసే ప్రయత్నం కోర్టు ధిక్కారమే అవుతుంది’’ - జీవానందరెడ్డి, ఫోరం ఫర్ సస్టెయినబుల్ ఎన్విరాన్మెంట్ కన్వీనర్ ఇప్పటికే తిరస్కరించినా... ‘‘సాగర్ పూడిక మట్టి వేసేందుకు ఆ 13 ఎకరాల్లో చెట్లు కొట్టేస్తామని హెచ్ఎండీఏ అనుమతి కోరింది. కానీ దానిని ట్రీ ప్రొటెక్షన్ కమిటీ తిరస్కరించింది. అక్కడి చెట్లు ధ్వంసం చేయడం జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతుంది. - ఫరీదా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా హైదరాబాద్ డెరైక్టర్ -
పక్షులకు పరిచిన నేలపట్టు పానువు
నేలపట్టు. ఈ పేరు వింటే రంగు రంగుల విదేశీ వలస పక్షులు గుర్తుకొస్తాయి. పేరుకు విదేశీ పక్షులే అయినా వాటి జన్మస్థలం నేలపట్టే. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న ఈ నేలపట్టు దశాబ్దాల కాలంగా పక్షులకు విడిది కేంద్రంగా ఉంటోంది. పక్షులకు ఆహారమైన చేపలు ఇక్కడ సమృద్ధ్దిగా దొరుకుతాయి. అందుకే విదేశీపక్షులు ప్రతి ఏటా అక్టోబర్ నెల నుంచి నేలపట్టుకురావటం ప్రారంభిస్తాయి. అప్పటి నుంచి ఆరునెలల పాటు వెదురుపట్టు, బోరులింగలపాడు, శ్రీహరికోట, చింతవరం, మొనపాళెం, మనుబోలు ప్రాంతాల్లో చెట్లపై గూళ్లు కట్టుకుని విడిది ఏర్పాటు చేసుకుంటాయి. భూతల స్వర్గం... ఫ్లెమింగోలు (సముద్రరామచిలుక), పెలికాన్(గూడబాతులు), పెయింటెడ్‌స్టార్క్స్(ఎర్రకాళ్లకొంగలు), ఓపెన్‌బిల్ స్టార్క్స్ (నల్లకాళ్లకొంగ), సీగల్ (సముద్రపు పావురాళ్లు), గ్రేహారన్ (నారాయణపక్షి), నల్లబాతులు, తెల్లబాతులు, పరజలు, తెడ్డుముక్కు కొంగ, నీటికాకులు, చింతవక్క, నత్తగుల్లకొంగ, చుక్కమూతి బాతులు, సూదిమొన బాతులు, నీటికాకులు, స్వాతికొంగలులాంటి అనేక విదేశీ, స్వదేశీ పక్షులు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. అందుకే పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల భూతల స్వర్గంగా పేరుపొందాయి. రక్షితకేంద్రం... పక్షులు వచ్చాయంటే ఆ సంవత్సరం వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయనేది స్థానికుల నమ్మకం. అందుకే వీటిని దేవతా పక్షులుగా పిలుచుకుంటారు. పక్షులను వేటగాళ్ల బారినుంచి కాపాడేందుకు సూళ్లూరుపేట, నేలపట్టులో పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇలా మొదలైంది... పులికాట్‌కు వచ్చీపోయే పక్షులను పట్టించుకునే వారు కాదు. ప్రకృతి ప్రేమికులు మాత్రం విదేశీపక్షుల రాకను గమనించి చూసి వెళ్లేవారు. 2000లో నెల్లూరు జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన ప్రవీణ్‌కుమార్ ఒకరోజు కుటుంబంతో పులికాట్ సందర్శనకు వచ్చారు. తడ రేవు వద్ద పడవ షికారు చేస్తుండగా వేల సంఖ్యలో ఫ్లెమింగోలు గుంపులు గుంపులుగా కనిపించి కనువిందు చేశాయి. ఇది గమనించిన కలెక్టర్ నాటి స్థానిక శాసనసభ్యులు పరసా వెంకటరత్నయ్య దృష్టికి తీసుకెళ్లి 2001లో ఫ్లెమింగో ఫెస్టివల్(పక్షుల పండుగ) కు శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి ప్రతి ఏటా మూడురోజులపాటు పక్షుల పండుగను నిర్వహించడం ప్రారంభించారు. పులికాట్ సరస్సు అభివద్దికోసం పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. నాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పక్షుల పండుగకు గుర్తింపు వచ్చింది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి చొరవతో అప్పటి పర్యాటకశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ‘పక్షుల పండగ’ను రాష్ట్రస్థాయి పండగగా గుర్తించడమే కాకుండా క్యాలెండర్లో కూడా చేర్చి ప్రాధాన్యత కల్పించారు. అప్పటి నుంచి ఏటా జనవరి నెలలో పక్షుల పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పండగను ఎగ్జిబిషన్ స్టాల్స్, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా నిర్వహిస్తారు. పక్షుల పండుగకు ఇలా చేరుకోవచ్చు... చెన్నై నుంచి సూళ్లూరుపేటకు చేరుకోవడానికి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంటుంది. దూరం 68 కి.మీ. బస్సు చార్జీ: *60 చెన్నై నుంచి సూళ్లూరుపేటకు ప్రతి గంటకు సబర్బన్ రైలు సౌకర్యం ఉంది. చార్జి *25 నెల్లూరు రైల్యేస్టేషన్ నుంచి సూళ్లూరుపేటకు... ఉదయం 4.30 గంటలకు చెన్నై ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.30 గంటలకు చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11గంటలకు పినాకిని ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 1.50కి మెమో రైలు సాయంత్రం 6 గంటలకు మెమో రైలు రాత్రి 7.30 గంటలకు జనశతాబ్దిరైలు రాత్రి 8.30 గంటలకు మెమో రైలు సాధారణ చార్జీ రూ.28 ఎక్స్‌ప్రెస్‌కు రూ.100 బస్సు సౌకర్యం నెల్లూరు నుంచి సూళ్లూరుపేటకు ప్రతి గంటకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంటారు ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.98 హైటెక్ చార్జీ రూ.115 - తిరుమల రవిరెడ్డి సాక్షి, నెల్లూరు - మొలకల రమణయ్య, సాక్షి, సూళ్లూరుపేట ఉచిత బస్సులు పక్షుల పండుగకు వచ్చేవారు సూళ్లూరుపేటలో దిగాలి. అక్కడే ప్రైవేటు లాడ్జిలు ఉన్నాయి. అద్దెలు రూ.600 నుంచి రూ.3వేల వరకు. సూళ్లూరుపేట నుంచి నేలపట్టు, పులికాట్ సరస్సుకు ఉచిత బస్సులు. బీములవారిపాళెంలో బోటుషికారు విద్యార్థులకు ‘షార్’ సందర్శన. సందర్శకుల కోసం... పర్యావరణ విజ్ఞానకేంద్రం. అందులో పక్షుల పండుగ గురించి వీడియో ప్రదర్శన. పక్షులను వీక్షించేందుకు వేలాడు మార్గంలో శ్రీహరికోట మార్గంలో టవర్లు, బైనాకులర్లు ఏర్పాటు చేశారు. -
చారిట్రీట్
విలాసవంతమైన పరిసరాలు..వీనుల విందైన సంగీతం.. చవులూరించే దేశ విదేశీ వంటకాలు.. వెచ్చగా ఆహ్వానించే విదేశీ పానీయాలు.. తిన్నంత తిని, తాగినంత తాగి.. అతిరథ మహారథులైన ప్రముఖులతో ముచ్చటించి.. కొన్ని గంటలపాటు హాయిగా గడిపేయడం..ఈ లక్షణాలు సిటీలోని పేజ్ త్రీ పార్టీలవి. ఇప్పుడు ఇదే లక్షణాలతో వచ్చిన మరొక సందడి నగరవాసుల్ని ఆకట్టుకుంటోంది. ఎందుకంటే దీని ద్వారా ఆహ్లాదకరమైన అనుభవంతో పాటు అవసరార్థులకు చేయూత అందించామన్న సంతోషంఅదనంగా లభించడమే ఇందుకు కారణం. వెస్ట్రన్ కంట్రీస్‌లో బాగా పాపులరైన చారిటీ విందు.. సిటీలోకి అడుగుపెట్టింది. సరికొత్త పార్టీయింగ్ కల్చర్‌కు తెర తీసింది. ..:: ఎస్.సత్యబాబు అమెరికా, బ్రిటన్.. యురోపియన్ దేశాల్లో చారిటీ డిన్నర్లు సర్వసాధారణం. అక్కడి సంపన్నులు, భోజనప్రియులు తమ సరదాలను కానిస్తూనే.. చక్కని పరమార్థాన్ని వాటికి జోడిస్తుంటారు. తద్వారా పార్టీలు, కాస్ట్లీ హ్యాపెనింగ్స్.. వంటివి కేవలం రిచ్సర్కిల్ తమ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి మాత్రమే అనే సామాజిక అపోహను తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. సిటీలో ఎంట్రీ వెనుక... సిటీలోనూ రిచ్పీపుల్ నానాటికీ పెరుగుతుండ టం, రోజుకో రకమైన పార్టీలు ఊపందుకోవడం తెలిసిందే. ఇలాంటి కల్చర్‌ని అనుసరించేవారితో పాటు విమర్శించే వారూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వెస్ట్రన్ స్టైల్ ఈవెంట్ రంగప్రవేశం చేసింది. వైన్ అండ్ డైన్ పార్టీలకు చక్కని మానవీయ కోణాన్ని అద్దింది. ‘నాలుగేళ్ల కిందట తొలిసారి మేం నగరంలో చారిటీ డిన్నర్ నిర్వహించాం. జాయ్ ఫుల్ డైనింగ్ని హెల్ప్‌ఫుల్ ఈవెంట్‌గా మలచడం అనే కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంది’ అని తరచుగా చారిటీ డైనింగ్ ఈవెంట్స్ నిర్వహించే ప్రియ మదోక్ వర్మ చెప్పారు. అయితే ఇవి కేవలం డిన్నర్లకే పరిమితం కావడం లేదు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఏదో ఒక సమయాన్ని తీసుకుని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు గత వాలంటైన్స్ డే రోజున జూబ్లీహిల్స్‌లోని బోంబే డెక్ డైనింగ్ కంపెనీలో జరిగిన లంచ్ పార్టీ, ఏప్రిల్ లో రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేసిన బ్రంచ్, అక్టోబర్‌లో క్లబ్‌హౌస్‌లోని ట్రెండ్‌సెట్ వింజ్లో ఏర్పాటు చేసిన పాట్లాక్ లంచ్ వంటివన్నీ ఈ కోవలోనివే. పార్టీస్‌కి గ్లోబల్ లుక్.. నగరంలో విదేశీయులు పెద్దసంఖ్యలో నివసిస్తుండటం కూడా ఈ చారిటీ పార్టీలకు ఊపునిస్తోంది. ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో ఉన్న విదేశీయులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వెస్ట్రన్ కల్చర్‌కు బాగా దగ్గరగా ఉండే వారిని ఆకర్షించి, పార్టీకి గ్లోబల్ లుక్ తేవడానికి మంచి మార్గంగా ఉపయోగపడుతున్నాయి. తద్వారా పేజ్ త్రీ పార్టీలకు తమకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనబరుస్తున్నాయి. రూ.5 వేలు ఆ పైన ధరలో ఎంట్రీకి అవకాశం కల్పించే ఈ చారిటీ డిన్నర్స్ని స్టార్ హోటల్స్ లేదా రిచ్ రెస్టారెంట్స్, లాంజ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రసిద్ధ రాక్ బ్యాండ్ లైవ్ మ్యూజిక్, టాప్ క్లాస్ చెఫ్‌లు వండి వడ్డించే కాస్మొపాలిటన్ రుచులు, విదేశీ వైన్ వంటివి అతిథులను ఆకట్టుకునే రీతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఆక్షన్.. రియాక్షన్.. ఈ పార్టీస్‌లో డిన్నర్‌తో పాటు ఆక్షన్ కూడా ఉంటుంది. అయితే ఇదంతా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వంటి అరుపులు కేకలు లేకుండా సెలైంట్‌గా సాగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు చారిటీ కోసం ప్రత్యేకంగా పంపించినవి అక్కడ ప్రదర్శిస్తారు. ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలు, నటీనటులు, క్రీడాకారుల సంతకాలతో టీషర్ట్స్, బుక్స్.. ఇంకా అనేకం అక్కడ కొలువుదీరుతాయి. కనీస ధర ఎంత అనే తెలియజేసే స్టిక్కర్ సదరు చిత్రం లేదా వస్తువు మీద అతికిస్తారు. ఆ ధరకు పైన తాను ఎంత వరకూ కొనాలనుకుంటున్నాడో అతిథి పక్కనే ఉన్న ఒక పేపర్ మీద రాసి, తన పేరు, ఫోన్ నంబర్ వేయాలి. అలా ఒకరు ఎన్నింటి మీదైనా, ఎన్నిసార్లయినా తాము వేలం పాడ దలచుకున్న ధరలు తెలియజేయవచ్చు. చివరగా అంటే పార్టీ పూర్తయ్యే సమయానికి అధిక మొత్తాన్ని కోట్ చేసిన వ్యక్తి ఆక్షన్‌లో గెలిచినట్టు. ఎంట్రీ టికెట్ ద్వారా వసూలైన ఆదాయంతో పాటు, మరింత వెచ్చించగలిగే స్థోమత ఉన్నవారి కోసం ఈ వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ‘మేం నిర్వహించిన చారిటీ డిన్నర్లో ఆహూతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ సైన్ చేసిన బ్యాట్, సల్మాన్ ఖాన్ ధరించిన టీ షర్ట్.. వంటివి కొనడానికి గెస్ట్స్ పోటీపడ్డారు. వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని సిటీలోని పలు ఆర్ఫన్ హోమ్స్‌కు అందించాం’ అని అడ్వకేట్స్ బేబీస్ ఫర్ క్రైసిస్ సొసైటీ (ఏబీసీ) స్వచ్ఛంద సంస్థ కోసం గచ్చిబౌలిలోని హయత్ హోటల్లో నిర్వహించిన చారిటీ డిన్నర్ నిర్వాహకుల్లో ఒకరైన అనిత చెప్పారు. ఆనందించే సందర్భం అంటే అవసరార్థులకు చేయూతను అందించే మార్గం కూడా అనే చక్కని సందేశాన్ని అందిస్తున్న ఈ చారిటీ పార్టీ కల్చర్ రోజు రోజుకూ ఊపందుకోవడం అనేది నిరుపేదలకు మరింతగా మేలు చేసేదేనడంలో సందేహం లేదు. స్పందన బాగుంది... ఆహ్లాదకరమైన పరిసరాలు, విందు, వినోదాలు, చక్కని సంగీతాన్ని మనం ఎంజాయ్ చేస్తూనే నిరుపేదలకు సాయం చేసే అవకాశాన్ని ఈ తరహా పార్టీలు అందిస్తాయి. కొంతకాలంగా మా ఏబీసీ చారిటీ ఆర్గనైజేషన్ తరపున సిటీలోని రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్‌లో ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. నగరవాసుల స్పందన బాగుంది. వీటి ద్వారా సేకరించిన నిధులను అవసరార్ధులకు వినియోగిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇదొక ట్రెడషన్గా మారితే... మరింత మంది నిరుపేదలకు మేలు కలుగుతుంది. -ప్రియా మధోక్ వర్మ, ఏబీసీ సంస్థ ప్రతినిధి -
ఫిట్ 2 హిట్
పిజ్జాల నుంచి ఫెంగ్‌షుయ్ దాకా సిటీలో ఎందెందు వెదికినా అందందే కనబడే విదేశీ ‘కళ’.. ఇప్పుడు ఫిట్నెస్ రంగానికీ జతయింది. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తరలి వస్తున్న కండల వీరులు సిటీవాసుల ఫిజిక్‌లను చూడముచ్చటగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. సంపన్నుల దేహాలను చక్కదిద్దుతూ.. భారీ మొత్తంలో చెక్‌లు అందుకుంటున్నారు. టాలీవుడ్ హీరోల నుంచి సిటీ సెలిబ్రిటీల వరకూ.. కొత్త సోకుల వెనుక విదేశీ హస్తాల పనితనం ఉంది. ప్రసిద్ధ ఫిట్నెస్ నిపుణుల గురించి నెట్లో ఆరా తీసి మరీ సిటీకి రప్పిస్తున్నారు మనవాళ్లు. ఫ్యాషన్ రంగంలో దూసుకొచ్చిన ఫారిన్ తళుకులు.. ఫిట్నెస్ విషయంలోనూ స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. తమ శరీరాకృతి అందరూ మెచ్చే విధంగా ఉండాలని బలంగా ఫిక్సయిన యంగ్ తరంగ్‌లు విదేశీ నిపుణులకు జై కొడుతున్నారు. వారిని పర్సనల్ ట్రైనర్లుగా నియమించుకుంటున్నారు. బాలీవుడ్ టు టాలీవుడ్ బాలీవుడ్లో జాన్ అబ్రహాం, హృతిక్‌రోషన్, ప్రియాంక చోప్రా.. ఇలా టాప్ సెలిబ్రిటీలందరూ విదేశీ కోచ్‌లను పర్సనల్ ట్రైనర్స్‌గా నియమించుకున్నారు. అదే ఒరవడిని టాలీవుడ్ అందిపుచ్చుకుంది. మహేష్‌బాబు, ఎన్టీఆర్, నాగచైతన్య, రామ్‌చరణ్, నవదీప్.. ఇంకా ఫుల్ ఎంట్రీ ఇవ్వని అఖిల్ అక్కినేని సహా హీరోలంతా విదేశీయుల దగ్గరే ట్రైనప్ అవుతున్నారు. వీరినే స్ఫూర్తిగా తీసుకుంటున్న సిటీలోని సంపన్నులు కూడా అదే బాట పడుతున్నారు. నెలకు రూ.50 వేలు మొదలు రూ.10 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునే విదేశీ ట్రైనర్లు సిటీలో ఉన్నారంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. పొలిటికల్ హీరోలూ.. మంత్రులు, రాజకీయ ప్రముఖులు, వారి వారసులు, బిజినెస్మెన్.. సమాజంలో కాస్త స్టేటస్ ఉన్న వారంతా ఇప్పుడు ఫిజికల్ పర్సనాలిటీపై కన్నేశారు. కాస్త అందంగా.. ఇంకాస్త ఆకర్షణీయంగా కనిపించాలనే వారి కోరిక.. విదేశీ ట్రైనర్ల వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. దీంతో ఐదారేళ్లుగా సిటీకి విదేశీ ఫిట్నెస్ నిపుణుల రాక పుంజుకుంది. రెడ్ కార్పెట్.. ఈ విదేశీ ఫిట్నెస్ శిక్షకులు సెలిబ్రిటీలకు మాత్రమే పరిమితం కాలేదు.. వారి సేవలు జిమ్‌ల వరకూ విస్తరించాయి. ఫారిన్ ట్రైనర్లకు పెరుగుతున్న క్రేజ్ గమనించిన జిమ్, ఫిట్నెస్ సెంటర్స్ నిర్వాహకులు విదేశీ కోచ్‌లకు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలుకుతున్నారు. మాదాపూర్‌లోని ప్రొటెన్స్ జిమ్‌లో విదేశీయులే ట్రైనర్లు. ‘జిమ్ ప్రారంభించిన కొత్తలో అమెరికాకు చెందిన జంటను శిక్షకులుగా నియమించుకున్నాం. ప్రస్తుతం అమెరికాకే చెందిన ట్రైనర్ కేలబ్ మా దగ్గర ట్రైన్ చేస్తున్నారు. క్రాస్‌ఫిట్ వంటి వర్కవుట్స్‌పై విదేశీ ట్రైనర్సే పక్కాగా శిక్షణ ఇవ్వగలరు’ అని చెప్పుకొచ్చారు ప్రొటెన్స్ జిమ్ నిర్వాహకుడు రాము. మనకు సెట్ కాదు.. ఓ వైపు విదేశీ ట్రైనర్లకు ఆదరణ పెరుగుతుంటే.. మరో వైపు సిటీలైఫ్ స్టైల్‌కు ఫారిన్ సరుకు సెట్ కాదంటున్నారు లోకల్ ట్రైనర్లు. ‘ఇక్కడివారి జీవనశైలి, ఆహారపు అలవాట్లను, జెనిటిక్స్ను, బోన్స్ట్రక్చర్ను అర్థం చేసుకోవడంలో విదేశీయులకు సరైన అవగాహన ఉండద’ని సిటీలో తొలి సర్టిఫైడ్ ట్రైనర్‌గా, సెలబ్రిటీ స్పెషలిస్ట్‌గా పేరొందిన హెలియోస్ జిమ్ నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డి చెబుతున్నారు. ఈయన అభిప్రాయాలతో మరికొందరు సిటీ ట్రైనర్లు కూడా ఏకీభవిస్తున్నారు. ఇప్పటి వరకు స్థానిక ట్రైనర్ల పర్యవేక్షణలోనే హీరోలు సిక్స్‌ప్యాక్స్ సాధించారని గుర్తు చేస్తున్నారు. విదేశీ ట్రైనర్ల రాకతో ఈ రంగంలో యువత ఉపాధి అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవల సిటీలో ఊపందుకున్న విదేశీ ట్రైనర్ల హవా మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. - ఫ్లోరిడా నుంచి వచ్చిన అంబర్, షూమేట్ల జంట గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫిజిక్‌ని తీర్చిదిద్దుతున్నారని సమాచారం. - మహేష్‌బాబు ట్రైనర్‌గా ఫేమస్ అయిన క్రిస్ గెథిన్ నెలకు రూ.7 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఛార్జ్ చేస్తాడట. ముంబై నుంచి నగరానికి రాకపోకలు సాగించే ఈ సెలబ్రిటీ ట్రైనర్ ఇక్కడ తన స్వంత జిమ్ కూడా ప్రారంభించే పనిలో ఉన్నాడు. - హీరో రామ్‌చరణ్ ఆస్ట్రేలియాకు చెందిన సమీర్జోరాను ట్రైనర్‌గా నియమించుకున్నారట - సినీనటుడు నవదీప్, మోడల్ శిల్పారెడ్డి వంటి వారికి డేనియల్ మెక్కీ ట్రైనర్‌గా చేశారు. అపోలో ఆస్పత్రికి అనుబంధంగా ప్రారంభించిన జిమ్‌లోనూ వర్కవుట్స్‌ని ఈయన డిజైన్ చేశారు. - ప్రస్తుతం మాదాపూర్‌లోని ప్రొటెన్స్లో ట్రైనర్‌గా ఉన్న అమెరికా వాసి కెలబ్ క్రాస్‌ఫిట్ ట్రైనింగ్‌కు పేరొందారు. - ఎస్.సత్యబాబు -
కొల్లేరుకు కొత్త అందాలు!
రాష్ట్ర విభజనతో కొల్లేరుకు పెరిగిన ప్రాధాన్యం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం ఆటపాక పక్షుల కేంద్రానికి ఆధునిక హంగులు కైకలూరు : ప్రకృతి రమణీయతకు మారుపేరైన కొల్లేరు తీరం సరికొత్త అందాలను సంతరించుకోనుంది. విదేశీ పక్షుల సందడితో పర్యాటకులకు కనువిందు చేసే ఆటపాకలో ఆధునిక వసతులు కొలువుదీరనున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా పర్యాటక రూట్ మ్యాప్‌కు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొల్లేరు మత్స్య సంపద ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసమైనా కొల్లేరు ప్రాంతంలో వసతులు మెరుగుపరిచే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.418 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో కొంత అయినా ఖర్చు చేసి కొల్లేరు ఆభయారణ్యంలో వసతులు కల్పించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొల్లేరు తీరం ఇలా... కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 77,125 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉన్నట్లు నిర్ధారించారు. కైకలూరు, మండవల్లి మండలాల్లో 14 గ్రామాలు కొల్లేరు పరిధిలో ఉన్నాయి. అరుదైన పక్షులను తిలకించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో గుడివాకలంక, మొండికోడు, కృష్ణా జిల్లాలో ఆటపాక, మణుగునూరులంక గ్రామాల్లో ప్రదేశాలు ఉన్నాయి. విదేశీ పక్షులను దగ్గర నుంచి చూసే అవకాశం మాత్రం కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రంలోనే ఉంది. ఈ కేంద్రం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిపాదనలకే పరిమితం.. కొల్లేరు ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టారు. ఆయన కృషి మేరకు కొల్లేరు అభివృద్ధి, యాత్రికులకు సదుపాయాల కోసం రూ.950 కోట్లు అవసరమని 2009లో విస్సా అనే ప్రయివేటు సంస్థ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు అందజేసింది. ఈ నిధులతో రహదారులు, రిసార్ట్లు, పక్షుల సంరక్షణ కేంద్రాల నిర్మాణం వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. వైఎస్ మరణానంతరం ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. మళ్లీ 2013లో కోస్తా ప్రాంత పర్యాటక అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రకటించారు. కొండపల్లి హెరిటేజ్ పేరుతో విజయవాడలోని భవానీ ద్వీపం, గాంధీహిల్, కూచిపూడి, మొవ్వ, హంసలదీవి, పెడన కలంకారీ, కొల్లేరులో పర్యాటక అభివృధికి రూ.50 కోట్లును కేటాయిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొల్లేరుకు వచ్చే పర్యాటకులు విశ్రాంతి తీసుకోడానికి ఆలపాడు ఉప్పుటేరు వద్ద కాటేజీలు నిర్మించాలని భావించారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం రేవు వద్ద నుంచి ఉప్పుటేరు మీదుగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు బోటు యాత్ర, ఆటపాక పక్షుల కేంద్రం నుంచి కొల్లేటి పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు బోటు యాత్రకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఉప్పుటేరు వద్ద కాటేజీలు నిర్మిస్తే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల యాత్రికులకు అనుకూలంగా ఉంటుందని ప్రణాళికలు రూపొందించినా, పనులు పూర్తికాలేదు. పుణ్యక్షేత్రాలకు అనుసంధానం : బాపూజీ కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని భావిస్తున్నట్లు టూరిజం డీఎం బాపూజీ చెప్పారు. అదే విధంగా కొల్లేరులో బోటు షికారు, కాటేజీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలిపారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా ఆగడాలలంక వద్ద కొల్లేరు సందర్శకుల కోసం రిసార్ట్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అటవీ పర్యావరణాన్ని అభివృద్ధి చేస్తాం : శ్రీదర్ ఆటపాక పక్షుల కేంద్రం మాదిరిగా మరిన్ని విహార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉందని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శ్రీధర్ చెప్పారు. విదేశీ పక్షులు విడిది కేంద్రంగా కొల్లేరు నిలిచిందని పేర్కొన్నారు. ఆటపాక పక్షుల కేంద్రంలో ఇప్పటికే పక్షుల ఆవాసల కోసం కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. మణుగునూరులంక వద్ద మరో విహార కేంద్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. రానున్న రోజుల్లో పక్షుల సంరక్షణ కేంద్రాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన తెలిపారు. -
జనావాసాల మధ్యే ఆయుధాల తయారీ!
భువనేశ్వర్: ఒడిశాలో అక్రమ ఆయుధాల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు చందంగా కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో జనావాసాల మధ్యే అక్రమ ఆయుధ తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. అంగూల్ జిల్లా బడాపడాలో అక్రమంగా ఆయుధాలను తయారుచేస్తున్న ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు బీహార్ వాసులను అదుపులోకి తీసుకున్నారు. ఆయుధ తయారీ కేంద్రం నుంచి 31 దేశీయ తుపాలకులతో పాటు 5 వందల బుల్లెట్స్, గన్ మెటీరియల్‌ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారం మేరకు మరిన్ని అక్రమ ఆయుధ కేంద్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్రమ ఆయుధాల తయారీ వెనక కొన్ని సంస్థల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. . -
విదేశీ మధువులకంటే స్వదేశీ మధువులే మెండు
దేశి మధువులందు దీటైన మధువేది? జిలుగులీనెడు జీడి మధువుగాక వేడి చేసెడు వేళలందున వైనుతేయ! విరుగుడగునదియె విశ్వసింపు! ‘మధు’రోక్తి: తొంభైతొమ్మిది శాతం సమస్యలు డబ్బుతో పరిష్కారమైపోతాయి. మిగిలిన ఒక్కశాతం సమస్యలకూ మధువు ఉందిగా! - క్వెంటిన్ ఆర్ బఫోగ్లే, అమెరికన్ రచయిత రాజ్యాంగం సాక్షిగా మనది లౌకిక దేశం. అలాగని దేశ జనాభాలో అంతా లౌకికవాదులే కాదు, అలౌకికవాదులూ ఉంటారు. అలౌకికవాదుల్లోనూ చాలా శాఖోపశాఖలు ఉన్నా, వారిలో ‘తీర్థం’కరులు అగ్రగణ్యులు. ‘తీర్థం’కరుల్లో కొందరికి దేశభక్తి మెండు. స్వతంత్ర దేశంలో విదేశీ మధువులు హోదాచిహ్నంగా చలామణీ అవుతున్నా, స్వదేశీ మధువులతోనే వారు గొంతు తడుపుకుంటారు. దేశవాళీ సరుకుల్లో తాటికల్లు, ఈతకల్లు చిరకాలంగా ప్రాచుర్యం పొందాయి. చక్కెర మిల్లులు వచ్చాక గుడుంబాగా పిలుచుకునే నాటుసారా గుబాళింపులు గల్లీగల్లీకి పాకాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో విప్పసారా విశిష్టతను చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇవన్నీ విరివిగా దొరుకుతాయి. ప్రపంచంలో విరివిగా దొరికే వాటికి పెద్దగా విలువ ఉండదు. అవి మధుభాండాలైనా సరే, కళాఖండాలైనా సరే! ఎంత అరుదో అంత విలువ. దేశవాళీ మధువుల్లో అరుదైనది, కించిత్ అపురూపమైనది జీడి మధువు. గోవాలో మాత్రమే దొరికే జీడి మధువును ‘ఫెనీ’గా పిలుచుకుంటారు. తయారీ ప్రక్రియలో విదేశీ మధువులకు ఇది ఏమాత్రం తీసిపోదు. దేశి మధువుల్లో జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ పొందిన ఘనత ఫెనీకి మాత్రమే దక్కుతుంది. దేశ భక్తులైన అలౌకిక ‘తీర్థం’కరుల కోసం ఈవారం... దేశీ ఎలిక్సిర్ ఫెనీ : 30 మి.లీ. వోడ్కా : 15 మి.లీ. డార్క్ రమ్ : 15 మి.లీ. కోకాకోలా : 90 మి.లీ. సోడా : 50 మి.లీ. గార్నిష్ : కొద్దిగా పుదీనా ఆకులు - వైన్‌తేయుడు -
మియ్యాం.. మియ్యాం.. మేడ్ ఇన్ ఫారెన్
నేడు పిల్లుల దినోత్సవం పెట్ కార్నర్ : పిల్లి కొందరికి అపశకునం. మార్జాల ప్రేమికులకు మాత్రం అది ముద్దుల పెంపుడు జంతువు. పిల్లుల పెంపకం ఇప్పుడొక భారీ వ్యాపారం. ఆన్లైన్లో పిల్లుల వ్యాపారం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా సాగుతోంది. పర్షియన్, హిమాలయన్ వంటి విదేశీ మార్జాలాలకు రూ.5 వేల నుంచి రూ. 30 వేల వరకు ధర పలుకుతోంది. నగరంలో కుక్కలను పెంచుకునేవారు లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. ఇప్పుడిప్పుడే పిల్లులను పెంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫక్తు సంప్రదాయవాదులు సైతం పిల్లుల పెంపకానికి ముందుకొస్తున్నారంటే, ‘పెట్’బడిదారుల ట్రెండ్‌లో వచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు. ఫారిన్ క్యాట్స్‌పై మక్కువ చూపుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో పిల్లుల పోషణ కూడా ఇప్పుడు లాభసాటి వ్యాపారంగా మారింది. వేల రూపాయలు వెచ్చించి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. వాటి పోషణకూ నెలకు వేలల్లోనే ఖర్చుపెడుతున్నారు. పిల్లుల పెంపకం కొందరికి హాబీ అయితే, హోదా చిహ్నాలను కలిగి ఉండటమే గర్వకారణమనుకునే వారికి ఇది లేటెస్ట్ ఫ్యాషన్. డబ్బుకు వెనుకాడకుండా వివిధ జాతుల విదేశీ పిల్లికూనలను తెచ్చుకుంటున్నారు. వాటి సంరక్షణ కోసం కూడా ధారాళంగా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో పిల్లికి నెలకు కనీసం మూడువేల రూపాయలకు పైగా కూడా ఖర్చుపెట్టే వారు ఉన్నారు. వర్ణ వివక్ష... పిల్లుల పెంపకంలో కాసింత వర్ణవివక్ష లేకపోలేదు. వీటిని పెంచుకోవాలనుకునే వారు ఎక్కువగా తెలుపు రంగు పిల్లులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఆ తర్వాతి స్థానం బ్రౌన్ కలర్ పిల్లులది. నగరంలో ఎక్కువగా పర్షియన్, హిమాలయన్ జాతుల మార్జాలాలను పెంచుకుంటున్నారు. ఈ జాతుల పిల్లికూనలను నెలకు కనీసం పది వరకు విక్రయిస్తుంటామని బంజారాహిల్స్‌లోని ‘ఫర్ అండ్ ఫెదర్స్’ పెట్స్ షాపు మేనేజర్ ఎండీ నవీన్ చెబుతున్నారు. పర్షియన్ బ్రీడ్ పిల్లులు చూడచక్కగా ఉంటాయి. మనుషులకు తేలికగా మచ్చికవుతాయి. ఒకసారి మచ్చికయ్యాక యజమానుల పట్ల వాటి శైలిలో ప్రేమాభిమానాలు చూపుతాయి. అందుకే ఎక్కువ మంది వీటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మార్జాల మమకారం... మ్యావ్.. మ్యావ్మనే పిల్లి అరుపు వింటేనే సహించలేరు కొందరు. అలాంటిది, నిత్యం పిల్లుల కూతతోనే తాము మేలుకుంటామని సోమాజిగూడకు చెందిన మహబూబ్ బాషా, జుబేరా దంపతులు చెబుతున్నారు. రెండేళ్లుగా వీరు పర్షియన్ జాతి షార్ట్‌లెగ్ పిల్లులను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం వారింట్లో ఐదు పిల్లులు ఉన్నాయి. పిల్లులతో ఆడుకోవడానికి అసలు టైమే సరిపోవడం లేదని, వాటితో విడదీయలేని బంధం ఏర్పడిందని చెబుతున్నారు ఈ దంపతులు. పిల్లుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్న వీరు తమ పిల్లులు పెట్టే పిల్లికూనలను ఆన్లైన్లో విక్రయిస్తుంటారు. అయితే, పెట్ లవర్స్‌కు మాత్రమే తాము పిల్లులను విక్రయిస్తామని, అది కూడా నమ్మకం కుదిరితేనేనని వీరు చెబుతున్నారు. - మహి -
విదేశీ కంపెనీలూ.. వెళ్లిపోండి ఖబడ్దార్!!
విదేశీ కంపెనీలు వెంటనే తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ పాకిస్థానీ తాలిబన్లు హెచ్చరించారు. అఫ్ఘాన్ సరిహద్దుల వెంట ఉన్న ఈ జిల్లాలో వేలాది మంది సైనికులతో తాలిబన్లను వేటాడేందుకు చర్యలు మొదలుకావడంతో వారీ హెచ్చరికలు చేశారు. ''మొత్తం విదేశీ పెట్టుబడిదారులు, విమానయాన సంస్థలు, బహుళ జాతీయ సంస్థలు వెంటనే పాకిస్థాన్‌తో తమ లావాదేవీలు ఆపేసి, పాకిస్థాన్ వదిలి వెళ్లిపోవాలి. లేకపోతే వాళ్లకు ఎదురయ్యే నష్టాలకు వాళ్లే బాధ్యులవుతారు'' అని తాలిబన్ల ప్రతినిధి షహీదుల్లా షహీద్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఉత్తర వజీరిస్థాన్‌లోని ఈ గిరిజన జిల్లాలో తాలిబన్లకు చాలా గట్టి పట్టుంది. ఇక్కడ ఆదివారం రాత్రి నుంచి పాక్ సైన్యం తన ఆపరేషన్లు మొదలుపెట్టింది. కరాచీలోని ప్రధాన విమానాశ్రయంపై తాలిబన్ ఉగ్రవాదులు వరుసపెట్టి దాడులు చేసి అనేకమందిని హతమార్చడంతో పాక్ సైన్యం సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారి వారిపై దాడులు మొదలుపెట్టింది. అయితే, ఈ దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు. -
బంగ్లాదేశ్‌లో విదేశీ జెండాలకు రెడ్‌కార్డ్
ఢాకా: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సాకర్ ఫీవర్.. క్రికెట్ అంటే పడిచచ్చే బంగ్లాదేశ్‌లో సాకర్ మానియా మరీ ఎక్కువగా ఉంది. ప్రపంచకప్ కోసం ఎప్పుడెప్పుడాని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొందరైతే తమ అభిమానాన్ని బహిరంగంగా చాటుకుంటున్నారు. రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో వేలాది మంది తాము అభిమానించే జట్ల దేశాల జెండాలను ఇళ్లపై ప్రదర్శిస్తున్నారు. సాకర్ మోజులో విదేశీ జెండాలను డాబాలపై ప్రదర్శించడం అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంతే ఇళ్లపై ఏ దేశానికి చెందిన జెండాను ప్రదర్శించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే అభిమానులు మాత్రం అధికారుల హెచ్చరికలను పట్టించుకోవడం లేదు -
మోడీ ప్రధాని కాకుండా 'విదేశీ శక్తులు' కుట్ర
కేంద్రంలో అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం రెండవ రోజు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలన కుంభకోణాల మయమని ఆయన అభివర్ణించారు. పొరుగుదేశమైన చైనా సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకువచ్చిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందని రాజనాథ్ సింగ్ యూపీఏ ప్రభుత్వ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని దేశ ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని సింగ్ ఆరోపించారు. -
నిజాయతీ చాటుకున్న హైదరాబాద్ ఆటోడ్రైవర్
హైదరాబాద్: తన ఆటోలో విదేశీ ప్రయాణికులు మరిచిపోయిన డాలర్ల కట్టను తిరిగి అప్పగించి నిజాయతీని చాటుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్మెట్కు చెందిన ఆటోడ్రైవర్ పి.వి.శంకర్రావు మంగళవారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రి వద్ద కెన్యాకు చెందిన రోగి గాడ్‌ఫ్రె కిషాహ్ గగన్‌ను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. పేషంట్‌తోపాటు అటెండెంట్ ఫిలిప్స్ కోబా ఆల్ఫ్రెడ్ కూడా ఆటో ఎక్కాడు. వీరిని బంజారాహిల్స్‌లో దింపాక ఆటో తీసుకుని శంకర్రావు వెళ్లిపోయాడు. సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో వెనుకసీటులో డాలర్ల బండిల్‌ను గమనించాడు. అది విదేశీయులదేనని భావించిన శంకర్రావు వెంటనే అపోలో ఆస్పత్రికి వెళ్లాడు. సెక్యూరిటీ మేనేజర్ యాదగిరిరెడ్డిని కలిసి డాలర్ల బండిల్‌ను అప్పగించి.. విదేశీయులకిమ్మని చెప్పాడు. రాత్రి 7.30 గంటలకు కెన్యా దే శీయులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక డాలర్ల బండిల్ పోయిన విషయాన్ని గుర్తించారు. ఆటోలో మర్చిపోయి ఉంటామని భావించిన వారు.. విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చి విచారించగా డాలర్ల బండిల్‌ను ఆటోడ్రైవర్ అప్పగించిన విషయం తెలిసింది. వీటి విలువ రూ.3.50 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు. నిజాయతీగా తమ సొమ్మును అప్పగించిన ఆటోడ్రైవర్‌ను అభినందించి.. పారితోషికంగా 200 డాలర్లు ఇచ్చారు. ఆటోడ్రైవర్‌ను బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.మురళీకృష్ణ కూడా అభినందించారు. -
డాలరు జోరు మెడికల్ టూరు
కలిసి వస్తున్న కరెన్సీ పతనం భారత్‌కి పెరుగుతున్న విదేశీ పేషెంట్లు చికిత్స వ్యయాలు మరింత తగ్గుతుండటమే కారణం కరెన్సీ పతనం కష్టాలు ఎలా ఉన్నప్పటికీ.. ఎగుమతి కంపెనీలతో పాటు హెల్త్‌కేర్ రంగానికి బాగానే కలిసి వస్తోంది. విదేశీయులకు ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ఇప్పటికే చౌకగా వైద్యం లభిస్తుండగా... రూపాయి క్షీ ణతతో చికిత్స ఖర్చులు మరింత తగ్గుతున్నాయి. దీంతో, చికిత్స కోసం వ చ్చే విదేశీయుల సంఖ్య ఈసారి 30% దాకా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. చౌకగా వైద్య సేవలు అందించడంలో సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో భారత్ పోటీపడుతోంది. సంపన్న దేశాల్లో అయ్యే వైద్య ఖర్చులతో పోలిస్తే మన దగ్గర నాలుగు నుంచి పదో వంతు ఖర్చుతోనే చికిత్స పూర్తయిపోతోంది. పెపైచ్చు మెడికల్ టూరిజంలో ఆకట్టుకుంటున్న ఇతర దేశాలలకు భారత్‌లో చికిత్స వ్యయాలకు మధ్య ఇప్పటిదాకా 20-25% వ్యత్యాసం ఉండేది. తాజాగా రూపాయి పతనంతో ఈ వ్యత్యాసం 30-35 శాతానికి పెరిగింది. డాలర్‌తో పోలిస్తే కొరియా కరెన్సీ వాన్ ఈ ఏడాది ఇప్పటిదాకా నాలుగు శాతం, ఫిలిప్పీన్స్ పెసో సుమారు 6%, థాయ్ బాహ్త్ దాదాపు మూడు శాతం మాత్రమే పతనమైతే.. భారత రూపాయి మారకం మాత్రం 18 శాతం పైచిలుకు క్షీణించింది. దీంతో.. గతంలో 8,000 డాలర్ల దాకా వ్యయమయ్యే చికిత్స ప్రస్తుతం రూపాయి పతనం కారణంగా 7,000 డాలర్లకే అందుబాటులోకి వస్తోందని ‘మెడాంటా మెడిసిటీ’ వర్గాలు తెలిపాయి. విదేశీయులకు తక్కువ వ్యయం అవుతుండటంతో కొన్నేళ్లుగా 20-22 శాతం మేర వృద్ధి చెందుతున్న వైద్య రంగం... రూపాయి పతనం కారణంగా ఈసారి 25-30 శాతం మేర వృద్ధి నమోదు చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. చికిత్స వ్యయాలు ఇలా: కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ 2011లో రూపొందించిన నివేదిక ప్రకారం.. అమెరికా లో కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీకి 70,000 డాలర్ల నుంచి 1,33,000 డాలర్ల దాకా ఖర్చయితే.. భారత్‌లో కేవలం 7,000 డాలర్లలో పూర్తయిపోతోంది. దక్షిణ కొరి యాలో ఈ వ్యయం 31,750 డాలర్లు, థాయ్‌లాండ్‌లో 22,000 డాలర్లుగా ఉంది. అలాగే, మోకాలి చిప్ప రిప్లేస్‌మెంట్‌కి అమెరికాలో 30,000-53,000 డాలర్ల దాకా ఖర్చవుతుంటే.. భారత్‌లో 9,200 డాలర్లే అవుతోంది. ఇదే సర్జరీకి దక్షిణ కొరి యాలో 11,800 డాలర్లు, థాయ్‌లాండ్‌లో 11,500 డాలర్లు అవసరమవుతాయి. అమెరికన్లపై దృష్టి: అపోలో హాస్పిటల్స్ వంటి పెద్ద ఆస్పత్రులకు వచ్చే విదేశీ పేషంట్లలో సార్క్ దేశాల నుంచి 36 శాతం మంది, ఆఫ్రికా నుంచి 26 శాతం, పశ్చిమాసియా నుంచి 26 శాతం, అమెరికా.. యూరప్‌ల నుంచి చెరి మూడు శాతం మంది ఉంటున్నారు. ఈసారి వీరి సంఖ్య మరింతగా పెరగొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక ఫోర్టిస్ హెల్త్‌కేర్ గ్రూప్‌కి వచ్చే విదేశీ పేషెంట్ల సంఖ్య గత రెండేళ్ల దాకా 20-25 శాతం ఉండగా... రూపాయి క్షీణత ప్రభావంతో ఈసారి 28-30 శాతానికి కూడా పెరగొచ్చని అంచనా. ప్రధానంగా మాత్రం అమెరికా నుంచి వచ్చే వారిపైనే ఈ ఆసుపత్రులు దృష్టిపెడుతున్నాయి. రెండేళ్ల కిందటిదాకా వైద్య చికిత్స కోసం ఇతర దేశాలకు వెళ్లే అమెరికన్ల సంఖ్య 85,000 పైచిలుకు ఉంటే.. ఇందులో చాలా తక్కువ మంది భారత్ వచ్చేవారు. అయితే, ఇప్పుడు విదేశాలకు వెళ్లే అమెరికన్ల సంఖ్య 20 లక్షల పైచిలుకు ఉంటోందని, చికిత్స ఖర్చులు తక్కువగా ఉండటంతో పాటు నాణ్యమైన వైద్యం అందుతున్న నేపథ్యంలో వీరిలో చాలా మంది భారత్‌కి రావొచ్చని అంచనా వేస్తున్నారు. చాలా మంది భారతీయ డాక్టర్లు అమెరికాలో శిక్షణ పొందడం, అక్కడివారితో పరిచయాలు ఉండటం కూడా అమెరికన్లు భారత్ వైపు మొగ్గుచూపడానికి కారణంగా నిలవగలదని భావిస్తున్నారు. భారీ అవకాశాలు: అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం గతేడాది దాదాపు పది లక్షల విదేశీ పేషంట్లు భారత్ వచ్చారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చని అంచనా. అంతర్జాతీయంగా మెడికల్ టూరిజం మార్కెట్ సుమారు 100 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. ఇందులో భారత్ వాటా మూడు శాతం. వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటి కావటంతో... కరెన్సీ క్షీణత ఈ వాటాను మరింత పెంచేందుకు దోహదపడవచ్చనేది విశ్లేషకుల భావన. అడ్డంకులూ ఉన్నాయి: పెద్ద సంఖ్యలో విదేశీ పేషెంట్లు వచ్చే అవకాశాలున్నప్పటికీ కొన్ని అడ్డంకులు ఉంటున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. విదేశీయులకు చికిత్స అందించే ఖరీదైన ఆస్పత్రుల్లో సీనియర్ డాక్టర్లకు జీతభత్యాలు భారీగానే ఉంటున్నా.. నర్సులు తదితర సిబ్బందికి మాత్రం అరకొర వేతనాలే ఉంటున్నాయి. పైగా పనిగంటలు కూడా ఎక్కువగా ఉండటం మొదలైన కారణాలు వారిలో నిరాసక్తతకు దారితీస్తున్నాయి. ఆస్పత్రుల యాజమాన్యాలు దీన్నిసరిదిద్దితే మరింత మంది పేషెంట్లు రావడానికి ఆస్కారం ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఆస్పత్రుల లోపల మౌలిక వసతులు బాగానే ఉంటున్నా..అక్కడిదాకా రావాలంటే మిగతా మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండటం లేదని, ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి.