హైదరాబాద్‌లో విదేశీ మద్యం దుకాణాలు | Foreign liquor stores In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో విదేశీ మద్యం దుకాణాలు

Published Fri, Oct 2 2015 4:35 AM | Last Updated on Thu, Oct 4 2018 5:38 PM

హైదరాబాద్‌లో విదేశీ మద్యం దుకాణాలు - Sakshi

హైదరాబాద్‌లో విదేశీ మద్యం దుకాణాలు

- కనీసం వంద బ్రాండ్లతో ఏర్పాటుకు ఆహ్వానం
- నోటిఫికేషన్ జారీచేసిన ఎక్సైజ్ శాఖ

సాక్షి, హైదరాబాద్:
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా విదేశీ మద్యం దుకాణాలు రాబోతున్నాయి. ఎక్స్‌క్లూజివ్ ఫారిన్ లిక్కర్ బొటిక్స్ పేరుతో కనీసం 100 విదేశీ బ్రాండ్లకు తక్కువ కాకుండా దుకాణాలను ఏర్పాటుచేసే వారికి సర్కార్ ఆహ్వానం పలుకుతోంది. నగరానికి వచ్చే విదేశీ పర్యాటకులకు, ప్రముఖులకు విదేశీ మద్యం అందుబాటులో ఉండడం లేదని గతంలో ఎక్సైజ్ శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

దీనిపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేయగా అంతర్జాతీయ ప్రమాణాలతో తయారయ్యే వైన్ దేశీయ తయారీలో లేదని తేలింది. స్కాట్‌లాండ్‌కు చెం దిన జానీవాకర్ బ్రాండ్ మాత్రమే ఎక్కువగా లభిస్తుందని టీఎస్‌బీసీఎల్ అధికారులు తేల్చారు. దీంతో విదేశీ మద్యం కోసం బోటిక్స్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఇటీవల సీఎంతో కూడా చర్చించినట్లు సమాచారం.
 
ఔట్‌లెట్ల ఏర్పాటు కోసం నోటిఫికేషన్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీసం 100 ఫారిన్ బ్రాండ్లతో ‘ఫారిన్ లిక్కర్ బొటిక్స్’ నెలకొల్పేందుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం తొలుత రెండేళ్లకు  లెసై న్సు మంజూరు చేసి, తర్వాత మరో రెండేళ్లకు పొడిగించే వెసులుబాటు కల్పించింది. ఐటీ కారిడార్‌లలోని బార్లు, రెస్టారెంట్లలో డ్రాట్ బీర్ల తయారీ, రిటైల్ అమ్మకాలకు కూడా ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐటీ ప్రాంతాల్లో 6 మైక్రో బ్రేవరీలను ఏర్పా టు చేసుకొని అక్కడే పిచ్చర్‌లు లేదా మగ్‌ల ద్వారా వినియోగదారులకు బీరును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే జారీచేసిన 151 జీవోకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్ సూచించారు.
 
లిక్కర్ సరఫరాకు టెండర్లు
2015-16 సంవత్సరానికి గాను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన గోడౌన్లు, డిపోలకు మద్యం సరఫరా చేసేం దుకు దేశవ్యాప్తంగా ఉన్న డిస్టిలరీల నుంచి సంస్థ టెండర్లను ఆహ్వానించింది. బీరు మినహా దేశీయ, విదేశీ మద్యం  తయారీ డిస్టిలరీలు నిబంధనలకు అనుగుణంగా తెలంగాణలో వివిధ రకాల బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేయాల్సి ఉంటుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలతో ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్ల దాఖలుకు గడువు ముగియగా, 3 గంటలకు టెండర్లు తెరిచారు. 66 కంపెనీలు టెండర్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఏయే కంపెనీలకు మద్యం సరఫరా టెండ ర్లు వచ్చా యో సోమవారం తెలుస్తుందని టీఎస్‌బీసీఎల్‌కు చెందిన ముఖ్య అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement