పే...ద్ద కారు | Hulchul foreign car in BAPATLA | Sakshi
Sakshi News home page

పే...ద్ద కారు

Published Thu, Jan 21 2016 1:04 AM | Last Updated on Thu, Oct 4 2018 5:38 PM

పే...ద్ద కారు - Sakshi

పే...ద్ద కారు

బాపట్లలో విదేశీకారు హల్‌చల్
సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ


 బాపట్ల: పొడవాటి విదేశీ కారు బాపట్లలో హల్‌చల్ చేసింది. ఎంపీ మురళీమోహన్ బంధువులకు చెందిన ఈ కారు బుధవారం సూర్యలంక తీరానికి వచ్చింది. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఆయిల్ కోసం స్థానికుల సూచన మేరకు రాత్రి 9.30 గంటల సమయంలో బాపట్లలోని కోన ఫిల్లింగ్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.

30 అడుగులు పొడవు ఉన్న ఈ కారులో 25 మందికిపైగా ప్రయాణించే వీలుంది. బాత్‌రూములతో సహా కారులో ఉండటంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. దాని ముందు నిలబడి సెల్ఫీలు తీసుకోవడానికి యువత పోటీ పడ్డారు. ఈ కారు ఖరీదు రూ.6 కోట్లు ఉంటుందని డ్రైవర్ తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement