కొచి: దుబాయ్ నుంచి భారత్కు అక్రమంగా రవాణాచేస్తున్న 91లక్షల రూపాయల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కేరళలోని కోచి పోర్ట్లో ఓ కంటెయినర్ లో తీసుకువస్తున్న సిగరెట్లను గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతవారం 67లక్షల రూపాయల విలువ చేసే విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ కెఎన్ రాఘవన్ మీడియాకు తెలిపారు.
కంటెయినర్లో ఉన్న ఫర్నిచర్స్లో సిగరెట్లను దాచి ఉంచినట్లు గుర్తించినట్లు చెప్పారు. విదేశీ సిగరెట్లను ఇంత భారీ మొత్తంలో సీజ్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 1.58కోట్ల రూపాయల విదేశీ సిగరెట్లను సీజ్ చేశామని విచారణ చేపట్టినట్లు రాఘవన్ వివరించారు.
కోట్ల రూపాయల విదేశీ సిగరెట్లు సీజ్
Published Tue, Dec 22 2015 8:18 PM | Last Updated on Thu, Oct 4 2018 5:38 PM
Advertisement