one arrested
-
వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కావలిరూరల్ : ఈ నెల 2న హత్యకు గురైన ఓ వృద్ధురాలి కేసులో నిందితుడు షేక్ రసూల్‌ను ఆదివారం కావలి ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కఠారి రఘు నిందితుడి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఇషాక్‌మియా వీధిలో నివసం ఉంటున్న శైలారాణి దంపతులు ఈ నెల 2వ తేదీ ఉదయం ఉద్యోగానికి వెళ్లారు. ఇంట్లో శైలారాణి తల్లి కోసూరి పద్మావతమ్మ(76) ఒక్కటే ఉంది. శైలారాణి విధులు ముగించుకుని ఆ రోజు మధాహ్నం ఇంటికి వచ్చి చూడగా మరణించి ఉంది. వృద్ధురాలు కావడంతో బీపీ, హార్ట్ అటాక్తోనో మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. అనంతరం మృతురాలి స్వగ్రామం ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం మూలగుంటపాడులో అంత్యక్రియలు నిర్వహిం చారు. ఈ నెల 12న ఇంటికి వచ్చి ఇంట్లోని బంగారు నగలను చూసుకోగా అవి కనిపించలేదు. వాటితో పాటు ఒక ట్యాబ్, సెల్‌ఫోన్, కెమెరా సైతం అపహరణకు గురైనట్లు గుర్తించారు. దీంతో నగల కోసం పద్మావతమ్మను హతమార్చినట్లు అనుమనాలు తలెత్తాయి. అయితే ఘటన జరిగిన రోజు శైలారాణి విధులకు వెళ్లిన తర్వాత తల్లికి ఫోన్ చేసిన సమయంలో పనిమనిషి, గతంలో కప్‌బోర్డులు తయారు చేసిన కార్పెంటర్ వచ్చి వెళ్లారని తెలిపిన విషయం గుర్తు చేసుకుంది. కార్పెంట ర్ రసూల్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని నిర్ధారించుకుని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఎం.రోశయ్య, ఎస్సై గుంజి అంకమ్మ, హెడ్ కానిస్టేబుళ్లు రవికుమార్, విజయ్‌కుమార్, కానిస్టేబుల్ సతీష్ నిందితుడిన అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి, అపహరించి కుదువ పెట్టిన 147 గ్రాముల బంగారు నగలు, సెల్‌ఫోన్, ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.63 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో నిందితుడు రసూల్‌ది స్వస్థలం బుచ్చిరెడ్డిపాళెం మండలం మునులపూడి కాగా ప్రస్తుతం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం పెద్దపవనిలో ఉంటున్నాడు. ఈ హత్య కేసులో త్వరగా నిందితుడిని పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
వారంలో పెళ్లి స్మగ్లింగ్ కేసు అరెస్ట్
-
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
హైదరాబాద్: పేరుమోసిన అంతర్రాష్ట్ర దొంగను కాచిగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో 41 కేసులలో అతడు నిందితుడని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ మీడియా సమావేశంలో తెలిపారు. అతని వద్ద నుండి 2 బైక్ లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. -
ఎంత తెలివిగా మోసం చేస్తున్నారు!
ముంబై: కేటుగాళ్లు తెలివి మీరిపోతున్నారు. రైళ్లల్లో, విమానాల్లో, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణిస్తూ డ్రగ్స్, బంగారం లాంటివి పోలీసులు, నిఘా అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తుంటారు. తాజాగా ఓ గ్యాంగ్ ఇలాంటి ప్రయత్నం చేయగా సిబ్బంది మాత్రం చాకచక్యంగా వ్యవహరించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి గుట్టు రట్టు చేసింది. బ్యాగులు, షూలు, బాడీలో దాస్తూ తరచుగా విమానాలలో అక్రమంగా తరలించి చివరగా ఎయిర్ పోర్టు అధికారులకు దొరికిపోతుండటం చూస్తూంటాం. ముంబైలో 1048 గ్రాముల బంగారాన్ని కరిగించి ఎలక్ట్రికల్ జ్యూస్ మిక్సర్ లో పాత్రగా చేసి తీసుకెళ్తుంటే గుర్తించారు. ఓ వ్యక్తి అనుమానంగా కనిపించడంతో నిఘా అధికారులు అతడిని తనిఖీ చేయగా బ్యాగులో మిక్సర్ ఉన్నట్లు చూసి, పరిశీలించగా అందులో బంగారంతో ఉన్న పాత్రను గుర్తించారు. బంగారం ఇలా కూడా అక్రమరవాణా చేస్తారా అని వాళ్లు ఆశ్చర్యపోయారు. దీని బరువు కేజీ పైగా ఉందని, ఈ బంగారం విలువ దాదాపు రూ.28 లక్షల రూపాయలు ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. ఒకరి అరెస్ట్
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పై దుర్భాషలాడుతూ ఫేస్బుక్లో పోస్టు చేసిన ఒక వ్యక్తిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టుచేశారు. ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని నేటి (మంగళవారం) ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాటేదాన్‌కు చెందిన షానవాజ్ అనే వ్యక్తి శాసనసభ్యుడు ప్రకాష్గౌడ్ను దుర్భాషలాడుతూ ఫేస్బుక్లో ఇటీవల పోస్టుచేశాడు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికిరాగా, ఆయన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాటేదాన్ వెళ్లి షానవాజ్‌ను అరెస్టుచేశారు. విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడులకు మళ్లీ కుట్ర!
పారిస్: న్యూ ఇయర్ దగ్గర పడతున్న కొద్దీ ఇతర దేశాలు ఎలా ఉన్నాయో కానీ, ఫ్రాన్స్ మాత్రం చాలా అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేసినట్లు ఫ్రాన్స్ అధికారులు గుర్తించి తనిఖీలు మొదలుపెట్టారు. బుధవారం ఫ్రాన్స్ నైరుతి దిశగా అధికారులు చేపట్టిన విస్తృత తనిఖీలలో భాగంగా ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. టోలూస్ ప్రాంతంలో పోలీసులే లక్ష్యంగా చేసుకుని దాడుకలు పథకం పన్నిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరిని అదుపులోకి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల వరకూ తనిఖీలు చేపట్టి, ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. మరికొన్ని నగరాలలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆ దేశాల నిఘావర్గాలు భావిస్తున్నాయి. అందుకే ముఖ్యంగా ఈ దేశాలలో ముఖ్యంగా జనం రద్దీగా ఉండే మార్కెట్లు, ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. పారిస్ దుర్ఘటన తర్వాత అగ్రరాజ్యం అమెరికాలోనూ కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయి. గత ఏడాది నవంబర్‌లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 130 మందికి పైగా మృతిచెందగా, దాదాపు 300 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. -
రూ. 2000 నోటును కలర్ జిరాక్స్ తీసి...
ముంబై: ఒక పక్క జనం కొత్త నోట్ల కోసం నానా తిప్పలు పడుతుంటే మరోపక్క కలర్ జిరాక్స్ చేసిన నోట్లు ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జిరాక్స్ తీసిన రూ.2,000 నోటును మద్యం షాపులో ఇచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నగర శివారు ప్రాంతమైన విరార్‌లో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. విరార్ ప్రాంతానికి చెందిన తుషార్ చికలే (26) అంధేరిలోని ఓ నోటరీ వకీలు కార్యాలయంలో పని చేస్తున్నాడు. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే ముందు కార్యాలయంలో ఉన్న జిరాక్స్ మెషన్‌లో కొత్తగా వచ్చిన రూ.2,000 నోటును ఇరువైపులా కలర్ జిరాక్స్ తీశాడు. అనుమానం రాకుండా రెండు ముక్కలను ఒక్కటిగా అతికించాడు. విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రాజా వైన్స్ వద్ద విపరీతంగా రద్దీ ఉంది. ఇదే అదనుగా కలర్ జిరాక్స్ చేసిన రెండు వేల నోటును వైన్ షాపు సిబ్బందికి అందజేసి ఓ బీరు కావాలని అడిగాడు. కాని, ఆ నోటు చేతితో పట్టుకున్న సిబ్బంది అది నకిలీదని వెంటనే గ్రహించడంతో విషయం బయటపడింది. దీంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తుషార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రగ్స్ కేసులో ఒకరి అరెస్ట్
నెల్లూరు క్రైం: మాదక ద్రవ్యాల సరఫరా కేసులో నెల్లూరు నగరానికి చెందిన మారంరెడ్డి శ్రీహరిరెడ్డిని నెల్లూరు టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన బ్రౌన్ సుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగర డీఎస్పీ వెంకటానంద రెడ్డి తెలిపారు. -
రూ. 80 వేలకే ఇంజనీరింగ్ సర్టిఫికెట్!
పదో తరగతి నుంచి ఇంజనీరింగ్, పీజీ వరకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా.. ఏ యూనివర్సిటీ నుంచి కావాలన్నా నిమిషాల్లో తెప్పిస్తాడు.. కాదు, ముద్రిస్తాడు. కేవలం రూ. 80వేలు పెడితే ఇంజనీరింగ్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఇలా నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తూ పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టుచేశారు. మహ్మద్ జుమైర్ అలియాస్ జుబైర్ అలియాస్ హుస్సేన్ (43) ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇతడు మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్, మదురై కామరాజ్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ స్టడీస్, ఛత్రపతి సాహూజీ మహరాజ్ యూనివర్సిటీ, కాన్పూర్, సత్యభామ యూనివర్సిటీ, డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ యూనివర్సిటీ ఆగ్రా, మానవ్ భారతి యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓఖ్లా, ఢిల్లీ, వినాయక మిషన్స్ యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ మధ్య భారత్ గ్వాలియర్, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లాంటి సంస్థల పేరు మీద నకిలీ డిగ్రీలను సప్లై చేసేవాడు. అతడి వద్దనుంచి వివిధ వర్సిటీలకు చెందిన 60 నకిలీ సర్టిఫికెట్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక కలర్ ప్రింటర్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 2011 సంవత్సరంలో మహ్మద్ జుమైర్ క్విక్ జాబ్ సొల్యూషన్స్ అనే కన్సల్టెన్సీని మలక్‌పేట సమీపంలోని సిటీటవర్స్లో ప్రారంభించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి చివరకు దుకాణం ఎత్తేశాడు. తర్వాత 2015లో హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ పేరుతో సంతోష్‌నగర్‌లోని చంపాపేట రోడ్డులో మరో దుకాణం తెరిచాడు. అక్కడ వ్యాపారం బాగోకపోవడంతో పంజాగుట్ట మోడల్ హౌస్ ప్రాంతానికి మార్చాడు. అక్కడ ఎ. హరిబాబుతో కలిసి వివిధ యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసేవాడు. బషీర్‌బాగ్ లోని బాబూఖాన్ ఎస్టేట్‌లో మరో ఆఫీసు తెరిచి, దాని బాధ్యతలు హరిబాబుకు ఇచ్చాడు. వన్ సిట్టింగ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ కోర్సుల పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, అక్కడకు వచ్చినవారి నుంచి పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని వాళ్లతో పరీక్షలు రాయించకుండానే ఈ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. సుదూర ప్రాంతాల్లో ఉన్న బ్రోకర్లతో కూడా ఇతడికి సంబంధాలుండేవి. వాళ్లకు విద్యార్థుల వివరాలు వాట్సప్ ద్వారా పంపితే వాళ్లు కొరియర్లో సర్టిఫికెట్లు పంపేవారు. ఇంజనీరింగ్‌కు రూ. 80వేలు, ఎంబీఏ కావాలంటే రూ. 40 వేలు, ఎంసీఏకు రూ. 50వేలు, డిగ్రీకి రూ. 40వేలు, ఇంటర్‌కు రూ. 15వేలు తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. ఇలా ఇప్పటివరకు 80-100 మందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఇతగాడు పోలీసులకు చిక్కాడు. -
చోరీ చేస్తూ అడ్డంగా దొరికిన ఎస్ఐ
హైదరాబాద్: సామాన్య ప్రజలను దొంగల భయం నుంచి రక్షించాల్సిన ఓ పోలీస్ చోరీలకు పాల్పడుతున్నాడు. కథ అడ్డం తిరగడంతో చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన నగరంలోని మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మహేందర్ రెడ్డి నగరంలో సీసీఎస్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే నేటి(శుక్రవారం) ఉదయం మహేందర్ రెడ్డి మీర్ పేట ఏరియాలో దొంగతనానికి యత్నించాడు. సరిగా అదే సమయంలో మీర్ పేట పోలీసులకు మహేందర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. మహేందర్ రెడ్డిని మీర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
యువకుడి అరెస్ట్.. 24 బైక్స్ స్వాధీనం
ఏలూరు(పశ్చిమగోదావరి): జల్సాలకు అలవాటుపడి దొంగతనాల బాటపట్టి ద్విచక్రవాహనాలను తస్కరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మడగల విజయ్‌కుమార్ గత కొన్ని రోజులనుంచి బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఓ బైక్ అమ్మడానికి యత్నిస్తుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా అసలు విషయాలు బయటకొచ్చాయి. అతని వద్ద నుంచి చోరీ చేసిన 24 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
చోరీ చేసి.. గొయ్యిలో దాచి
పోలీసుల సోదాల్లో రూ. 3 లక్షలు వెలికితీత దొంగ అరెస్టు, రిమాండ్‌కు తరలింపు ఆదిలాబాద్ క్రైం : చోరీ చేసిన సొమ్మును గొయ్యిలో దాచి పెట్టాడో దొంగ. ఎవరికంట పడొద్దని గొయ్యిలో దాచినప్పటికీ పోలీసులు అనుమానంతో సోదాల్లో ఇల్లును జల్లెడ పట్టారు. దీంతొ గొయ్యి జాడ వెలుగులోకి వచ్చింది. గొయ్యిలో రూ. 3 లక్షలు బయటపడ్డాయి. మంగళవారం సదరు దొంగను అరెస్టు చేసిన వివరాలు ఆదిలాబాద్ డీఎస్పీ లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 19 తేదీ రాత్రి మోచిగల్లిలోని కార్తీక ఫెస్టిసైడ్స్‌లో దొంగతనం జరిగింది. షాపులోనిపై రేకులు తొలగించి దొంగతనానికి పాల్పడి రూ. 3.86 లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు, 5 గ్రాముల గోల్డ్‌రింగ్‌ను ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీలో పాతనేరస్తుడైన పట్టణంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన అశ్విన్‌కుమార్‌పై అనుమానాలు రావడంతో వన్‌టౌన్, సీసీఎస్ పోలీసులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఐ సత్యనారాయణ, సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో అశ్విన్‌కుమార్ ఇంట్లో సోదాలు చేశారు. ఇళ్లంతా గాలించిన పోలీసులు ఓగదిలో అనుమానం రావడంతో తవ్విచూడగా అందులో ఉన్న నగదు బయటపడింది. దీంతో అశ్విన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చోరీచేసిన సొత్తులో రూ. 73 వేలు నిందితుడు ఖర్చు చేసుకోగా, ఒక సెల్‌ఫోన్‌ను పడేశాడు. మిగతా సొమ్ము రూ. 3.13 వేల నగదు, మూడు సెల్ఫోన్లు, బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, వన్‌టౌన్ సత్యనారాయణ, సీసీఎస్ ఎస్సైలు రాజు, సత్యనారాయణ, వన్‌టౌన్ ఏఎస్సై అప్పారావు, పోలీసు సిబ్బంది రాహత్, రాంరెడ్డి, సీసీఎస్ హెచ్‌సీ ఎండి సిరాజ్‌ఖాన్, రమేశ్, గంగాధర్, అబ్దుల్ జాహీర్, తదితరులు ఉన్నారు. -
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నవీపేట(నిజామాబాద్): అక్రమంగా తరలిస్తున్న 100 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం నుంచి ఓ డీసీఎంలో రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారంతో రెవన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. సరైన సమయంలో దాడి చేసి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
వ్యసనాలకు బానిసై చోరీల బాట
నిందితుడు అరెస్ట్ రూ.2.60 లక్షల సొత్తు స్వాధీనం నెల్లూరు (క్రైమ్) : చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు చోరీల బాటపట్టాడు. ఆదివారం పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. నెల్లూరు సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ ఎం. బాలసుందరం నిందితుడి వివరాలను వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాళెం ఖాజానగర్‌కు చెందిన షేక్ షాహుల్ అలియాస్ రోహిత్ అలియాస్ పీపాలు చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసై చోరీల బాట పట్టాడు. తొలుత సెల్ఫోన్లు దొంగలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకునేవాడు. 2013లో దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కి తిరుపతిలోని జువైనల్‌కు వెళ్లాడు. అక్కడ నుంచి బయటకు వచ్చి కావలి, నెల్లూరు రెండో నగర పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జిల్లా కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవించారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన షాహూల్ ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన గాంధీనగర్ సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లో ఎస్కే యూసఫ్ ఇంట్లో దొంగతనం చేశాడు. అతని కదలికలపై సీసీఎస్, ఐదోనగర పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం అయ్యప్పగుడి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా తిరుగుతున్న షాహుల్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేన్కు తరలించారు. అతన్ని తమదైన శైలిలో విచారించగా యూసఫ్ ఇంట్లో దొంగతనం చేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రూ. 2.60 లక్షలు విలువ చేసే 13 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టుటకు కృషిచేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారెడ్డి, బాజీజాన్‌సైదా, ఐదోనగర ఎస్ఐ జగత్సింగ్, సిబ్బంది రమేష్, భాస్కర్, సుధా, రాజేష్ తదితరులను డిఎస్పీ అభినందించారు. ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు డిఎస్పీ తెలిపారు. -
సెల్ఫోన్ల దొంగ అరెస్ట్
మూడు సెల్ఫోన్లు స్వాధీనం నెల్లూరు (క్రైమ్) : ఓ మొబైల్ దుకాణంలో సెల్‌ఫోన్ దొంగతనానికి పాల్పడిన దొంగను బుధవారం మూడోనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ట్రంకురోడ్డులోని లాట్ మొబైల్ షాపులో ఈ నెల 15వ తేదీన గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. సెల్ఫోన్లు కొంటున్నట్లు నటిస్తూ రూ.38,239 వేలు విలువ చేసే శ్యామ్‌సంగ్ జె7, ఓపో మోడల్, మైక్రోమాక్స్ టాప్ సెల్ఫోన్లను అపహరించుకుని వెళ్లాడు. ఈ ఘటనపై షాపు మేనేజర్ ఈ నెల 25వ తేదీన మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ పి. రామకృష్ణ పరిశీలించారు. షాపులోని సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితుడి ఛాయాచిత్రం లభ్యమైంది. దాని ఆధారంగా సెల్ఫోన్లను దొంగలించిన వ్యక్తి గూడూరు పట్టణం శాంతినగర్‌కు చెందిన పాలేటి నవీన్‌చంద్ర అలియాస్ నవీన్‌గా గుర్తించారు. అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు బుధవారం నిందితుడు బృందావనంలోని తిక్కన టెలిఫోన్ భవన్ వద్ద ఉండగా అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఒకరి అరెస్ట్ మర్రిపాడు : మండలంలోని ఎర్రకొండ అడవి నుంచి అక్రమంగా తరలిస్తున్న 53 ఎర్రచందనం దుంగలను, ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు మర్రిపాడు ఎస్సై వైవీ సోమయ్య తెలిపారు. గురువారం ఆయన మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎర్రకొండ అడవుల్లో ఎర్రచందనం తరులుతుందనే సమాచారంతో గురువారం ఉదయం కూంబింగ్ చేపట్టామన్నారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోస్తూ తారసపడ్డారని వెంటనే వారిని వెంబండించగా ఓ వ్యక్తి పరరయ్యాడని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని ద్వారా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 53 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందన్నారు. పట్టుబడిన వ్యక్తి ఏఎస్‌పేటకు చెందిన చిలకపాటి వేణుగా గుర్తించామన్నారు. పరారైన వ్యక్తి మానం రామాంజనేయులుగా గుర్తించామని, అతని కోసం గాలింపు చేపడుతున్నామని తెలిపారు. -
నందిని కుటుంబానికి అమ్మ సాయం
చెన్నై: జీతం సొమ్మును లాక్కేళ్తున్న దొంగలను పట్టుకునే క్రమంలో మృత్యు ఒడిలోకి చేరిన ఉపాధ్యాయిని నందిని, దొంగల మోటారు సైకిల్ ఢీకొనడంతో మరణించిన శేఖర్ కుటుంబాలకు ముఖ్యమంత్రి జయలలిత సానుభూతి తెలియజేశారు. ఆ ఇద్దరి కుటుంబాలకు తలా రూ.మూడు లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇదే ఘటనలో గాయపడ్డ నజ్జూకు మెరుగైన వైద్యసేవలకు ఆదేశిస్తూ, రూ.లక్ష సాయం అందజేయనున్నారు. ఈ నెల నాలుగో తేదిన పట్టినపాక్కంలో శ్రీనివాసపురానికి చెందిన ఉపాధ్యాయిని నందిని (24), బంధువు నజ్జూలు ఏటీఎంలో జీతం డ్రా చేసి మోటారు సైకిల్‌పై వస్తుండగా, మరో మోటారు బైక్ మీద అతి వేగంగా దూసుకొచ్చిన ఇద్దరు వారి బ్యాగ్‌ను లాక్కేళ్లారు. వారిని వెంటాడి పట్టుకునే క్రమంలో కింద పడ్డ నందిని సంఘటనా స్థలంలో మరణించింది. ఆ దొంగలు తప్పించుకునే క్రమంలో అతి వేగంగా దూసుకెళ్తూ, శేఖర్ అనే వృద్ధుడ్ని ఢీకొట్టారు. ఈ దొంగల కారణంగా ఇద్దరు సంఘటనా స్థలంలో మరణించారు. నజ్జూ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ నేపథ్యంలో మృతి చెందిన ఆ ఇద్దరి కుటుంబాలకు తన సానుభూతిని సీఎం జయలలిత తెలియజేశారు. ఈ ఘటన తనను ఎంతో వేదనకు గురి చేసిందంటూ అమ్మ జయలలిత తన సానుభూతి ప్రకటనలో వివరించారు. నందిని, శేఖర్ల కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తూ, ఆ కుటుంబాలకు తలా రూ. మూడు లక్షలు చొప్పున సాయాన్ని ప్రకటించారు. అలాగే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నజ్జూకు మెరుగైన వైద్య సేవల్ని అందించాలని ఆదేశించారు. నజ్జూ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష సాయాన్ని ప్రకటించారు. చదవండి....(వెంటాడిన ప్రాణం!) -
వెంటాడిన ప్రాణం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఫ్పై రోజులు కష్టపడి సంపాదించుకున్న జీతాన్ని మూడు నిమిషాల్లో దొంగలు తన్నుకుపోతుంటే తట్టుకోలేని ఓ యువతి వారి వెంటపడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన చెన్నైలో సోమవారం రాత్రి జరిగింది. ఇదే సంఘటనలో మరో వృద్ధుడు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో యువతి విషమ పరిస్థితిలో చికిత్స పొందుతోంది. క్రైంసినిమాలా సాగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై పట్టినపాక్కం శ్రీనివాసపురానికి చెందిన వడివేలు కుమార్తె నందిని (24) నీలాంగరైలోని ఒక ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటలకు జీతం సొమ్మును డ్రా చేసేందుకు హోండా యాక్టివా టూ వీలర్లో మైలాపూర్ రామకృష్ణ మఠ్ సమీపంలోని ఏటీఎంకు వెళ్లారు. డాక్టర్ ఎంజీఆర్ నగర్ జానకీ మహిళా కళాశాలలో చదువుతున్న నందినీ అత్త కూతురు న జ్జూను తోడుగా తీసుకుని ఏటీఎంకు చేరుకున్నారు. ఏటీఎం నుంచి రూ.25 వేలు డ్రా చేసి హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుని ఇంటికి బయలుదేరారు. డబ్బున్న హాండ్ బ్యాగ్‌ను నజ్జూ పట్టుకోగా బైక్‌ను నందిని నడుపుతోంది. కొద్ది దూరం వీరు ప్రయాణించగానే ఒక బైక్‌లో వాయువేగంలో దూసుకువచ్చిన ఇద్దరు యువకులు నజ్జూ చేతిలోని హాండ్‌బ్యాగ్‌ను లాక్కుని ఉడాయించారు. జీతం సొమ్మును దోచుకుపోవడంతో కంగారుపడిన నందిని తన టూవీలర్‌పై దొంగల బైక్‌ను వెంబడించింది. పట్టినబాక్కం బీచ్, కరుమారి అమ్మన్ కోవిల్ ఆలయం మీదుగా రెండు బైక్‌లు 80 కిలోమీటర్ల వేగంతో ఒకదాని వెనుక ఒకటి వేగంగా పరుగులుపెట్టాయి. దొంగ తన బైక్‌కు సడన్ బ్రేక్ వేసి అకస్మాత్తుగా వెనక్కుతిప్పి శ్రీనివాసపురం వైపు పరుగులు పెట్టించాడు. విపరీతమైన వేగంతో వస్తున్న నందిని తన బైక్‌ను అదుపుచేయలేక పోవడంతో వెనుక కూర్చుని ఉన్న నజ్జూ కిందపడి పోయి తీవ్రగాయాలకు గురైంది. ఆ తరువాత కూడా ముందుకు పరుగులు తీస్తున్న బైక్‌పై నుంచి కిందపడిన నందిని తలకు సిమెంట్ దిమ్మె తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనపై పట్టినపాక్కం పోలీసులు సమాచారం ఇవ్వడంతో పాటూ దొంగ శ్రీనివాసపురం వైపు వెళ్లాడని తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో తప్పించుకునేందుకు వీలులేని దొంగ తాను వచ్చిన మార్గంలోని మళ్లీ తిరుగు ప్రయాణమై ప్రజల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శేఖర్ అనే వృద్ధుడిని ఢీకొట్టి కిందపడిపోయాడు. వెంటనే ప్రజలు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. బైక్ ఢీకొన్న వేగానికి తీవ్రంగా గాయపడిన శేఖర్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న నజ్జూను ఆసుపత్రిలో చేర్పించారు. పెరియమేడుకు చెందిన దొంగల్లో కరుణాకరన్ పట్టుబడగా మరో దొంగ తప్పించుకున్నాడు. నందినికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు తీవ్ర ప్రయత్నాల్లో ఉండగా మృత్యు ఒడిలోకి చేరి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కట్టలు తెంచుకున్న ఆగ్రహం: ప్రజలు చూస్తుండగానే దొంగలు స్వైర విహారం చేయడం, ఇద్దరి ప్రాణాలను హరించడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుమారు రెండు వందలకు పైగా జనం గుంపులుగా చేరి పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. దొంగ వినియోగించిన బైక్‌ను తగులబెట్టారు. పట్టుబడిన దొంగను తీసుకుని పోతున్న పోలీసులను ప్రజలు అనుసరించారు. పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకు రావడంతో ఆగ్రహించిన పోలీసులు ‘వెళ్లిపోండి లేకుంటే తుపాకీతో కాల్చి వేస్తాను’ అని బెదిరించడంతో ప్రజలు మరింతగా రెచ్చిపోయారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని అనేక విడత చర్చ తరువాత అందోళనను విరమింపజేశారు. -
దొంగను పట్టుకునే ప్రయత్నంలో మహిళా టీచర్ మృతి
► పారిపోతూ వృద్దుడిని బలితీసుకున్న దొంగలు ► టీచర్ వెంట ఉన్న యువతికి తీవ్రగాయాలు చెన్నై: నెల రోజుల కష్టార్జితమైన జీతం సొమ్మును దోచుకెళుతున్న దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఓ మహిళా టీచర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో వృద్ధుడు సైతం ప్రాణాలు కోల్పోగా, మరో యువతి పరిస్థితి విషమంగా మారింది. సోమవారం రాత్రి చెన్నైలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై, పట్టినపాక్కం శ్రీనివాసపురానికి చెందిన నందిని (24) నీలాంగరైలోని ప్రైవేటు పాఠశాలలో టీచరుగా పనిచేస్తోంది. తన జీతం డబ్బులు డ్రా చేసుకునేందుకు సోమవారం రాత్రి తన అత్తకూతురు నజ్జూను తోడుగా తీసుకుని ఏటీఎంకు వెళ్లింది. రూ.25 వేలు డ్రా చేసి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని ఇంటికి వెళుతుండగా బైక్ పై దూసుకొచ్చిన ఇద్దరు యువకులు నజ్జూ చేతిలోని హాండ్‌బ్యాగ్‌ను లాక్కుని పారిపోయారు. వేగంగా పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు అతివేగంతో వెంటపడిన నందిని తన స్కూటీని అదుపుచేయలేక కిందపడ్డారు. ఆమె తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నజ్జూకు తీవ్రగాయాలయ్యాయి. పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు ప్రజలు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగలు తమ బైక్‌తో శేఖర్ అనే వృద్ధుడిని ఢీకొట్టడంతో అతనూ అక్కడికక్కడే చనిపోయాడు. దొంగలు బైక్ పై నుంచి పడిపోవడంతో స్థానికులు దొంగల్లో ఒకడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా, మరో దొంగ చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశీ కరెన్సీ స్వాధీనం..ఒకరి అరెస్ట్
హైదరాబాద్:చెలామణీలో లేని విదేశీ కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట్‌కు చెందిన వరప్రసాద్ అనే యువకుడు మైత్రీవనం సమీపంలో శనివారం మధ్యాహ్నం టర్కీ దేశ కరెన్సీ లిరాలను మార్పిడి చేసుకునేందుకు యత్నించాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 89 లిరా నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ల విలువ రూ.100 కోట్లు ఉంటుందని, అయితే అవి ఇప్పుడు చెల్లుబాటు కావని చెబుతున్నారు. ఈ కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చెల్లెల్ని ప్రేమించిన వ్యక్తిని కత్తితో పొడిచాడు!
హైదరాబాద్: ప్రేమ వ్యవహారం చివరికి కత్తితో దాడికి దారి తీసింది. ఈ సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చివరికి కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ జగదీష్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.....కాకతీయనగర్‌కు చెందిన టి. వినయ్ కొన్ని రోజుల నుంచి సమతానగర్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి సోదరితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ విషయమై మంగళవారం భాస్కర్‌రెడ్డి, వినయ్ మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన భాస్కర్‌రెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్‌పై దాడి చేశాడు. దీంతో వినయ్ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వినయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బికే గూడలో బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మూడు సెల్ఫోన్లు, రెండు ఎల్ఈడీ టీవీలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కండోమ్స్‌లో కొకైన్ నింపి మింగేశాడు !!
బెంగళూరు: అక్రమంగా డబ్బు సంపాదించడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొకైన్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. సినిమాల్లో చేసే స్మగ్లింగ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా నిజ జీవితంలో కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా కొకైన్ నింపిన కండోమ్స్‌ను మింగి స్మగ్లింగ్ చేయటానికి యత్నించిన వ్యక్తిని మంగళవారం బెంగళూరు విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన ఇరోన్శ్యామురన్ పర్యాటక ముసుగులో కండోమ్స్‌లో కొకైన్ నింపుకుని వాటిని మింగేశాడు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు కెంపేగౌడ విమానాశ్రయంలో అతడు దిగిన వెంటనే అరెస్ట్ చేసి విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు విరోచన మందులు ఇచ్చి కొకైన్ క్యాప్సుల్‌ను బయటకు తీశారు. కొకైన్ విలువ రూ. 3.71 లక్షలు ఉంటుంటుందని తెలుస్తుంది. -
కిడ్నీ రాకెట్లో మరొకరి అరెస్ట్
-
కోట్ల రూపాయల విదేశీ సిగరెట్లు సీజ్
కొచి: దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణాచేస్తున్న 91లక్షల రూపాయల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కేరళలోని కోచి పోర్ట్‌లో ఓ కంటెయినర్ లో తీసుకువస్తున్న సిగరెట్లను గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతవారం 67లక్షల రూపాయల విలువ చేసే విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ కెఎన్ రాఘవన్ మీడియాకు తెలిపారు. కంటెయినర్లో ఉన్న ఫర్నిచర్స్లో సిగరెట్లను దాచి ఉంచినట్లు గుర్తించినట్లు చెప్పారు. విదేశీ సిగరెట్లను ఇంత భారీ మొత్తంలో సీజ్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 1.58కోట్ల రూపాయల విదేశీ సిగరెట్లను సీజ్ చేశామని విచారణ చేపట్టినట్లు రాఘవన్ వివరించారు. -
న్యూడుల్స్ ఫ్యాక్టరీ సీజ్
హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటలో ఓ న్యూడుల్స్ ఫ్యాక్టరీని పోలీసులు సోమవారం సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ పొందకుండా ఫ్యాక్టరీని నడుపుతున్నందుకు హమీద్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 14 వందల కేజీల నూడుల్స్, 18 వందల కేజీల మైదా, ఒక వెయింగ్ మెషిన్, 9 వందల కేజీల లూజ్ న్యూడుల్స్, నూడుల్స్ తయారు చేసే ఓ మెషిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
నకిలీ నెయ్యి సూత్రధారుడు ఫణీంద్ర ఆరెస్ట్
-
తమిళనాడులో శ్రీలంక జాతీయుడి అరెస్ట్
రామేశ్వరం: అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, ఇక్కడే ఉంటున్న శ్రీలంక జాతీయుడిని పోలీస్ అధికారులు శుక్రవారం అరెస్టుచేశారు. తమిళనాడు లోని రామేశ్వరం తీరప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని 'క్యూ' బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... దనుష్ కోడి, చెరాన్కోట్టాయ్ మధ్యలోని తీరప్రాంతంలో శ్రీలంక జాతీయుడు రాజేంద్రన్(35)ని గుర్తించినట్లు తెలిపారు. అయితే, అతడు గత పదేళ్లుగా భారత్‌లోనే తలదాచుకుంటున్నాడని అధికారులు తెలుసుకున్నారు. నిందితుడు రాజేంద్రన్ లంకలోని మన్నార్ జిల్లాకు చెందినవాడు కాగా, 2005లో పర్మిషన్ లేకుండా భారత భూభాగంలోకి ప్రవేశించాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు స్వదేశమైన లంకకు వెళ్లాని నిర్ణయించుకున్నాడు. బోటు ద్వారా తిరిగి తన స్వంత ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తికి గురువారం రాత్రి రూ.10 వేలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. రాజేంద్రన్ నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
బాలికపై అత్యాచారం.. ఒకరు అరెస్ట్
పహాడీషరీఫ్ (హైదరాబాద్): బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడగా.. అందులో ఒకరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పహాడీషరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 18న బాలాపూర్ బిస్మిల్లా కాలనీలో 13 ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లోనే రాషేద్, అక్బర్ ఖాన్(30) అత్యాచారం చేశారు. జరిగిన దారుణంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుక్ను పోలీసులు అక్బర్ ఖాన్‌ను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. -
ఆకాశ మార్గంలో కొకైన్ స్మగ్లింగ్
బెంగళూరు: మాదకద్రవ్యాల అక్రమరవాణా కోసం పాతాళంలో భారీ సొరంగాలు తొవ్వడం మెక్సికన్ స్మగ్లర్ల స్టైల్. అంతకు తక్కువేమీ కాదంటూ బాహాటంగా ఆకాశమార్గంలో ఇండియాకు కొకైన్ తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నార్కోటిక్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఎమిరెట్స్ విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ. 20 కోట్ల విలువైన 3.34 కేజీల కొకైన్ ను ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెక్ నగరం బెంగళూరులో జరిగే నైట్ పార్టీల కోసమే ఈ కొకైన్ సరఫరా అవుతున్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. నిందితుడ్ని జ్యుడిషిల్ కస్టడీకి తరలించామని, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశామని తెలిపారు. ఎయిర్ పోర్టులో ఇంత భారీ స్థాయిలో కొకైన్ పట్టుబడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
సినీనటిపై గ్యాంగ్ రేప్.. ఒకరి అరెస్టు
మహిళలపై నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ ప్రాంతంలో ఓ మరాఠీ సినీ నటిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. వారిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై శివారు ప్రాంతానికి చెందిన ఈ నటి సినిమా షూటింగ్ కోసం పైఠాన్ జిల్లాకు వెళ్లింది. రెండు నెలల పాటు అక్కడే ఉన్న ఆమె.. ఆదివారం నాడు తన డబ్బు తీసుకోడానికి ఔరంగాబాద్‌కు వచ్చింది. దర్శకుడి స్నేహితుడి వద్దకు తన పారితోషికం కోసం వెళ్లగా, అతడు ఆమెను అక్కడి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైఠాన్ వద్దకు తీసుకెళ్లి, అక్కడ మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారం చేశారని ఔరంగాబాద్ క్రైం బ్రాంచి ఇన్స్పెక్టర్ కంచన్ కుమార్ చెప్పారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆనంద్ మఘాడే అనే డైరెక్టర్ తన స్నేహితుడైన గోవింద్ చిట్లాంగేకు.. సినిమా కోసం ఓ హీరోయిన్ కావాలని చెప్పాడు. దాంతో ముంబైకి చెందిన ఆ అమ్మాయిని ఎంపిక చేసి, రెండు నెలల పాటు షూటింగ్ చేశారు. అయితే ఆమెకు డబ్బులు మాత్రం ఇవ్వలేదు. తన డబ్బుల గురించి గోవింద్ చిట్లాంగేను సంప్రదించగా, అతడు ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారం చేసినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. చిట్లాంగేను ఇప్పటికే అరెస్టు చేయగా.. మిగిలిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. -
ఇవీ చైనా నుంచే వచ్చాయి!
చైనా నుంచి బొమ్మలు వచ్చాయి.. చవగ్గా వచ్చాయని సంతోషించాం. గాలిపటాలు వచ్చాయి.. ధర తక్కువ, నాణ్యత ఉందని అనుకున్నాం. చైనా ఫోన్లు వచ్చాయి.. బ్రహ్మాండమైన ఫీచర్లు నామమాత్రపు ధరకే వచ్చాయని సంతోషించాం. అయితే ఇప్పుడు చైనా తన అసలు స్వరూపం బయటపెట్టుకుంది. భారీ స్థాయిలో ఆయుధాలను కూడా భారతదేశంలోకి స్మగుల్ చేస్తోంది. చైనాలో తయారైన ఆయుధాలు భారీ సంఖ్యలో నాగ్‌పూర్‌లోని ఓ కిరాణా కొట్టులో దొరికాయి. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఆ కొట్టుపై దాడి చేయగా.. అక్కడ దాడి చేసిన పోలీసులకు దిమ్మ తిరిగింది. ఏకంగా 102 ఆయుధాలు అక్కడున్నాయి. వాటిలో కత్తులు, కర్రల్లో దాచి ఉంచే కత్తులు, ఖంజర్ (వంపు తిరిగి ఉండే కత్తి)లు, కుక్రీలు (గూర్ఖాల వద్ద ఉండే కత్తులు) వివిధ పరిమాణాల్లో చాకులు కూడా ఉన్నాయి. వాటి విలువ దాదాపు రూ. 50 వేల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో వారు రూ. 4.70 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ నయీమ్ అబావుద్దీన్ అన్సారీ (49) అనే వ్యక్తిని ఈ ఆయుధాలు అమ్ముతున్నందుకు అరెస్టు చేశారు. -
పోలీసుల అదుపులో మత్తు మందు విక్రయిస్తున్న వ్యక్తి
గుంటూరు(తెనాలి) : శస్త్రచికిత్సల సమయంలో రోగులకు ఇచ్చే మత్తు ఇంజక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీనివాసరావు అనే వ్యక్తి మత్తు ఇంజక్షన్లను అక్రమంగా తెప్పించి విక్రయిస్తుంటాడు. వైద్యుల ప్రిస్ర్కిప్షన్ లేకుండా విక్రయించకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఈ ఇంజక్షన్‌ను రూ.5 లకు చెన్నై, ఒరిస్సా ప్రాంతాల నుంచి లారీ డ్రైవర్ల ద్వారా తెప్పించి ఒక్కో వయల్‌ను రూ. 80కు విక్రయిస్తున్నాడు. ఈ ఇంజక్షన్ ను వ్యక్తి నరానికి నేరుగా ఇన్జక్ట్ చేస్తే రెండు రోజుల పాటు మత్తులో జోగుతాడు. వీధి బాలలు, కళాశాల విద్యార్థులు కొందరు ఈ మత్తుకు బానిసలవుతున్నారు. ఇతను గతంలో కూడా ఇంజక్షన్లు అమ్మి జైలుపాలయ్యాడు . జైలు జీవితం గడిపినప్పటికీ బుద్ధి మార్చుకోకుండా మళ్లీ అదే అక్రమ వ్యాపారం కొనసాగిస్తూ పోలీసులకు చిక్కాడు. -
43 లక్షల విలువైన ఏనుగు దంతాలు స్వాధీనం
బెంగళూరు: ఏనుగు దంతాలను విక్రయించడానికి యత్నించిన వ్యక్తిని ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన పోచియప్పన్ గురువారం రాత్రి యశ్వంతపురం సమీపంలోని మారప్పనపాళ్యలో ఎనిమిది కేజీలకు పైగా బరువున్న ఏనుగు దంతాలను విక్రయించడానికి యత్నించాడు. గస్తీ పోలీసులకు అనుమానం వచ్చి అతడి వద్ద బ్యాగులను తనిఖీ చేశృ఼రు. బ్యాగ్‌లోని విలువైన ఏనుగు దంతాలు బయటపడటంతో అతన్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడులో ఏనుగులను చంపి దంతాలను తీసుకు వచ్చి బెంగళూరులో విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించడాని పోలీసులు తెలిపారు. ఈ దందాలో ఎంత మంది ఉన్నారలో ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.