
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నవీపేట(నిజామాబాద్): అక్రమంగా తరలిస్తున్న 100 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం నుంచి ఓ డీసీఎంలో రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారంతో రెవన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. సరైన సమయంలో దాడి చేసి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.