rice seized
-
జోరుగా పీడీఎస్ దందా!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): సివిల్ సప్లయి శాఖలో ఎన్ని సంస్కరణలు తెచ్చినా జిల్లాలో పీడీఎస్ దందా యథేచ్ఛగా సాగుతోంది. వాహనాల్లో తరలిస్తున్న, ఇంట్లో దాచి ఉంచిన బియ్యం బస్తాలను అధికారులు పట్టుకుంటున్నా.. ఈ అక్రమ వ్యాపారం మాత్రం పెరుగుతూనే వస్తోంది. ఇందుకు ఈ ఏడాదిలో పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం, నమోదైన కేసులే నిదర్శనం. గడిచిన రెండేళ్లలో 100 కేసులు నమోదైతే ,ఈ ఏడాదిలోనే 96 పైగా కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన 4,869.38 క్వింటాళ్ల బియ్యం పట్టుకోవడం గమనార్హం. కేసుల పరంగా, పట్టుబడిన బియ్యం పరంగా చూసినా రెండేళ్లలో కంటే ఎక్కువగానే ఉన్నాయి. గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ–పాస్, బయోమెట్రిక్ విధానం రాకముందు తక్కువ కేసులు నమోదు కాగా, అమల్లోకి వచ్చిన తరువాత కేసులు ఎక్కువైయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ బియ్యం అక్రమ దందాను అరికట్టడానికి రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానాన్ని 2017 నవంబర్‌లో అమలులోకి తెచ్చింది. దీంతో రేషన్ డీలర్ల చేతి వాటానికి దాదాపు అడ్డుకట్ట పడింది. అయితే కొన్ని చోట్ల రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ మెషిన్లు పని చేయడం లేదని, లబ్ధిదారుల బయోమెట్రిక్ వేలిముద్రలు రావడం లేదని సాకు చూపి అందిన కాడికి బియ్యాన్ని దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. లబ్ధిదారులు కూడా పీడీఎస్ బియ్యం పొంది వ్యాపారులకు రూ.10 నుంచి రూ.14 వరకు విక్రయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులు ఎక్కువైయ్యారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన బియ్యంను రెండవ వ్యాపారికి, రెండవ వ్యాపారి నుంచి ప్రధాన వ్యాపారికి విక్రయిస్తున్నారు. ప్రధాన వ్యాపారి తన వద్దకు చేరిన పెద్ద మొత్తం పీడీఎస్ బియ్యంను ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నారు. ఇలా క్షేత్ర స్థాయి నుంచి పెద్ద వ్యాపారమే కొనసాగుతోంది. ఈ వ్యాపారంపై పూర్తిస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అవగాహన ఉన్నప్పటికీ కొన్ని కేసులపైనే దృష్టిసారించి పట్టుకుంటున్నారని, వారికి అనుకూలంగా ఉన్న వారి జోలికి పోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. నామమాత్రపు చర్యలు.. పైగా మంతనాలు జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా పెరుగుతుందడానికి చాలా కారణాలున్నాయి. 2016 సంవత్సరంలో పట్టుబడిన 58 కేసుల్లో 3171.09 క్వింటాళ్ల బియ్యం పట్టుకోగా, 2017లో 42 కేసులకు గాను 2002.76 క్వింటాళ్లు, అదే విధంగా 2018లో ఇప్పటి వరకు 96 కేసులకు గాను 4869.38 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఈ మూడేళ్లలో 196 కేసులకు గాను 10,004 క్వింటాళ్ల బియ్యంను పట్టుకుని 258 మందిపై (6ఏ) కేసు నమోదు చేయగా, రూ.7,55,000 జరిమానా విధించారు. అయితే పీడీఎస్ బియ్యం పట్టుబడిన వారికి తక్కువ శిక్ష, జరిమాన పడే విధంగా కేసును పట్టుకున్న వారే మంతనాలు జరుపుతున్నారే ఆరోపణలున్నాయి. అందుకే ఇది వరకే రెండు, మూడ్లు సార్లు పట్టుడిన కొంతమంది సులువుగా కేసు నుంచి తప్పించుకోవడం సాధ్యమైందని తెలుస్తోంది. పీడీఎస్ బియ్యం ప్రకారంగా అక్రమ వ్యాపారం చేసే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, జైలు శిక్షతో పాటు, భారీ మొత్తంలో జరిమానా విధించాల్సి ఉంటుంది. కానీ చిన్నపాటి చర్యలు, తక్కువ జరిమానాలు విధించడంతో పట్టుబడిన వారే మళ్లీ పీడీఎస్ బియ్యంతో వ్యాపారం చేస్తున్నారు. మచ్చుకు కొన్ని ఘటనలు.. గతేడాది మాక్లూర్‌లో పెద్ద ఎత్తున పట్టుడిన పీడీఎస్ బియ్యం కేసులో కేవలం రూ.50వేలు జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేశారు. అదే విధంగా గత ఏడాదితో పాటు ఈ ఏడాదిలో కూడా నిజామాబాద్ నగరంలో పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన రెండు వాహనాలను సీజ్ చేసిన అధికారులు ఒకరికి రూ.45వేలు, మరొకరికి రూ.40వేలు జరిమానా విధించారు. -
357 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
దేవరకొండ : ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఎన్ని యాక్టులు వచ్చినా.. క్రిమినల్ కేసులు నమోదవుతున్నా.. వ్యాపారులు బెదరడం లేదు. కేసులను కూడా లెక్క చేయని బియ్యం వ్యాపారులు ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు..దేవరకొండ డివిజన్లో కొన్నేళ్లుగా బియ్యం అక్రమ రవాణా వ్యాపారం మూడు క్వింటాళ్లు.. ఆరు టన్నులు అన్న చందంగా సాగుతోంది. వ్యాపారులు డీలర్లు, గ్రామాల్లో చిరు వ్యాపారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు సరఫరా చేస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. పక్కదారి పడుతోంది.. ఇలా.. వ్యాపారులు నిత్యం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల డీలర్ల నుంచి, కిరాణ షాపుల నుంచి, వినియోగదారుల నుంచి 10 కేజీల నుంచి మొదలు పెట్టి 100 కేజీల వరకు సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని దేవరకొండలోని తమ ఇళ్లల్లో నిల్వ ఉంచుతున్నారు. అనంతరం రాత్రికిరాత్రి డీసీఎంల్లో కల్వకుర్తి, హైదరాబాద్, మాల్ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాల్లో కేజీకి రూ.5 నుంచి రూ.10 వరకు కొనుగోలు చేసి తాము మాత్రం మిల్లు యాజమాన్యాలకు రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా దేవరకొండలో ఉన్న వ్యాపారులు నెలలో ఒక్కొక్కరు 4 నుంచి 6లోడ్ల వరకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా గోదాము నుంచే.. గతంలో దేవరకొండలో పీడీఎస్ బియ్యం పలుమార్లు సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నప్పటికీ అవి కేవలం చిన్న మొత్తంలో మాత్రమే ఉన్నాయి. కానీ ఈ సారి అధికారులు నిఘా వేసి నేరుగా గోదాం నుంచి తరలిస్తుండగా మాటు వేసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ సారి అధికారులు 357 బస్తాలను దేవరకొండకు సమీపంలోని బ్రిడ్జి తండాలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచగా పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. అయితే తరలించిన బియ్యం మాత్రం రేషన్ షాపుల నుంచి కాకుండా నేరుగా దేవరకొండలోని స్టాక్ పాయింట్ నుంచే తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేవరకొండలోని డిండి రోడ్డులో అడ్డా ఏర్పాటు చేసుకున్న ఓ వ్యాపారి డీలర్ల నుంచి తక్కువ మొత్తానికి బియ్యాన్ని కొనుగోలు చేశాడు. ఆ బియ్యం బస్తాలను మార్చేందుకు వీలుగా దేవరకొండ సమీపంలోని ఓ తండాలో నిల్వ ఉంచాడు. సదరు సివిల్ సప్లై ముద్రలున్న బస్తాల నుంచి గోనే బస్తాల్లోకి మార్చేందుకు ఖాళీ బస్తాలను డీసీఎంలో తరలిస్తుండగా అనుమానం వచ్చి రెక్కీ నిర్వహించి ఈ బియ్యాన్ని పట్టుకున్నారు. గత ఏడాదిలో ఆరు నెలల క్రితం మాల్లో 16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత ఆర్టీసీ బస్సులో లోయపల్లి నుంచి మాల్‌కు అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఏడాది క్రితం చింతపల్లి మండలం మధనాపురంలో పీడీఎస్ బియ్యం పట్టుకున్న అధికారులు. చందంపేట మండలం బుగ్గతండాలోని ఓ ఇంట్లో 16 క్వింటాళ్లు.. ఇదే మండలంలోని కొత్తపల్లిలోని ఓ మిల్లులో 16 క్వింటాళ్లు.. దేవరకొండ మండలం ముదిగొండలో ఆరు నెలల క్రితం 15 క్వింటాళ్ల బియాన్ని అధికారులు సీజ్ చేశారు. -
180 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లాయగూడెంలో పౌరసరఫరాల శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయనే సమాచారంతో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
25.2 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఖమ్మం: నగరంలో పలుచోట్ల గురువారం సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 25.2 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నవీపేట(నిజామాబాద్): అక్రమంగా తరలిస్తున్న 100 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం నుంచి ఓ డీసీఎంలో రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారంతో రెవన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. సరైన సమయంలో దాడి చేసి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
రూ.61 లక్షల విలువైన ధాన్యం సీజ్
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో భారీగా ధాన్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. రాజానగరంలోని విష్ణుగురుదత్త రైస్‌మిల్లులో అధికారులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకూ దాడులు జరిపారు. అధికారులు రాత్రంతా మిల్లులో రికార్డులు పరిశీలించారు. ధాన్యం, బియ్యం నిల్వలను సోదా చేశారు. 3,889 క్వింటాళ్ల ధాన్యం, 208 క్వింటాళ్ల బియ్యం, 76 క్వింటాళ్ల నూకలతో పాటు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ దానికి మరింత పాలిష్ పట్టి రీసైక్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. మిల్లు రికార్డుల్లో కూడా కొన్ని తప్పిదాలున్నట్టు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో తహసీల్దారు గోపాలరావు, రూరల్ ఏఎస్ఓ కేఎస్వీ ప్రసాద్, గ్రేడింగ్ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. -
రూ. 58 లక్షల విలువైన బియ్యం బస్తాలు పట్టివేత
నెల్లూరు: నెల్లూరు నగరంలోని స్టోనౌన్ పేటలోని రైస్‌మిల్లుపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే జిల్లాలోని కావలి పట్టణంలో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు లారీలలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యంతో పాటు లారీలను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ రూ. 8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.