రూ.61 లక్షల విలువైన ధాన్యం సీజ్ | huge rice seized in east godavari district rice mill | Sakshi
Sakshi News home page

రూ.61 లక్షల విలువైన ధాన్యం సీజ్

Published Tue, Apr 5 2016 8:56 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

huge rice seized in east godavari district rice mill

రాజానగరం: తూర్పు గోదావరి జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడుల్లో భారీగా ధాన్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. రాజానగరంలోని విష్ణుగురుదత్త రైస్‌మిల్లులో అధికారులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకూ దాడులు జరిపారు.

అధికారులు రాత్రంతా మిల్లులో రికార్డులు పరిశీలించారు. ధాన్యం, బియ్యం నిల్వలను సోదా చేశారు. 3,889 క్వింటాళ్ల ధాన్యం, 208 క్వింటాళ్ల బియ్యం, 76 క్వింటాళ్ల నూకలతో పాటు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ దానికి మరింత పాలిష్ పట్టి రీసైక్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. మిల్లు రికార్డుల్లో కూడా కొన్ని తప్పిదాలున్నట్టు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో తహసీల్దారు గోపాలరావు, రూరల్ ఏఎస్‌ఓ కేఎస్‌వీ ప్రసాద్, గ్రేడింగ్ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement