
25.2 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఖమ్మం: నగరంలో పలుచోట్ల గురువారం సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 25.2 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.