Civil Supply officials
-
25.2 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఖమ్మం: నగరంలో పలుచోట్ల గురువారం సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 25.2 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఖమ్మంలో సివిల్ సఫ్లై అధికారుల దాడులు
ఖమ్మం: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై బుధవారం సివిల్ సఫ్లై అధికారులు ఆకస్మికదాడులు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న 50 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేశారు. -
సన్న బియ్యం తరుగు
- పాఠశాలలు, వసతి గృహాలకు సన్నబియ్యం - క్వింటాలుకు ఐదు కిలోలు తక్కువస్తోంది - ఆందోళన చెందుతున్న హెచ్ఎంలు - కొట్టిపారెస్తున్న సివిల్ సప్లయ్ అధికారులు - డివిజన్‌కు 250 టన్నుల సన్నబియ్యం సరఫరా బోధన్ : సన్నబియ్యం భోజన పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్ర భుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పథకాన్ని ప్రారంభిం చారు. ప్రారంభంలోనే లుకలుకలు బయటపడుతున్నాయి. సివిల్ సప్లయ్ సరఫరా చేస్తున్న సన్నబియ్యం 50 కిలోల బస్తాకు 5 కిలోల వరకు తరుగు వస్తోందని ప్రధాన ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. తరుగు బియ్యం వల్ల తనిఖీకి వచ్చే అధికారుల నుంచి తాము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు బియ్యం తరుగుదల పై చర్యలు తీసుకోవాలంటున్నారు. లేకపోతే తాము బలైపోయే అవకాశం ఉందని హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బోధన్ మండలంలో ని ఎరాజ్‌పల్లి జడ్పీహెచ్ఎస్లో సన్నబియ్యం భోజనం ప్రారంభించేందుకు వచ్చిన స్థానిక సర్పం చ్ ప్రమీల సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీ గోపాల్‌లకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్కుమార్ సన్నబియ్యం బస్తాను తూకం వేయించి, తరుగు సమస్యను వివరించారు.అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. డివిజన్‌కు 250 టన్నుల బియ్యం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సన్నబియ్యం భోజన పథకానికి సంబంధించి 250 టన్నుల సన్నబియ్యం వచ్చాయని బోధన్ సివిల్ సప్లయ్ ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు వెల్లడించారు. డివిజన్లోని బోధన్‌తో పాటు బాన్సువాడ, బిచ్కుంద, వర్ని, పిట్లం ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా అయ్యాయని అంటున్నారు. బోధన్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలోని బోధన్ టౌన్, బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్ మండలంలోని పాఠశాల లు, సంక్షేమ వసతి గృహాలకు 41 టన్నుల బియ్యం వచ్చాయని అధికారులంటున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలకు బియ్యం సరఫరా పూర్తి చేయగా, కొన్ని సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేశామంటున్నారు. తూకంపై అనుమానాలు.. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్దనే బియ్యం తూకంలో లోపాలు చోటు చేసుకుంటున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ బస్తాల తూకం సరిగ్గా ఉంటే, 50 కిలోల బస్తాకు ఐదు కిలోల వరకు తరు గు ఎలా వస్తుందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నా యి. బస్తాకు 50 నుంచి 100 గ్రాముల వరకు తరు గు రావచ్చుకాని 4 నుంచి 5 కిలోల వరకు తరుగు రాదని అధికారులంటున్నారు.ఉన్నత స్థాయి అధికారులు పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం బస్తాల ను తూకం వేస్తే తరుగు వివరాలు బహిర్గమవుతుం దని హెచ్ఎంలు అంటున్నారు. -
10 గ్యాస్ సిలిండర్లు సీజ్
నర్సింహులపేట : అక్రమంగా నిల్వ చేసిన 10 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లయ్ అధికారులు సీజ్ చేసిన సంఘటన మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నారుు. గ్రామంలో కొన్నాళ్లుగా అధిక ధరకు భారత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న వ్యవహారంపై ఇటీవల కొందరు గ్రామస్తులు జాయింట్ కలెక్టర్, డీఎస్ఓకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాలతో సివిల్ సప్లై డీటీ అశోక్ కుమార్ గ్రామానికి చేరుకుని కొనకటి దామోదర్‌రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా 10 గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యూయి. ఇంట్లో నిల్వ చేసినందుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేసి, నాగార్జున భారత్ గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. నిందితుడు దామోదర్‌రెడ్డిపై 6ఏ కేసు నమోదు చేశారు. మూడు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్‌కు రూ.550 వసూలు చేయడంపై గ్రామానికి చెందిన వీరభద్రి అనే యువకుడు ఇటీవల భారత్ గ్యాస్ కంపెనీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. అరుుతే విషయం తెలుసుకున్న కొనకటి దామోదర్‌రెడ్డి కుమారుడు వెంకట్‌రెడ్డి అతడిని గత నెల 27న పిలిచి దుర్భాషలాడాడు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. అంతేగాక కనీసం ఫిర్యాదు స్వీకరించినట్లు రశీదు కూడా ఇవ్వలేదని బాధితుడు తెలిపాడు. కాగా తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ల సమాచారం ఇచ్చాడనే నెపంతో అదే రాత్రి సమీపంలోని మరో యువకుడి ఇంటికి వెళ్లి దామోదర్‌రెడ్డి కుమారుడు దుర్భాషలాడి, భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది. ఇతడి విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. -
‘బోగస్’ ఏరివేత వేగవంతం
- వారం రోజుల్లో పదివేల కార్డులు స్వాధీనం - డీలర్లదే ముఖ్య పాత్రగా గుర్తించిన సివిల్ సప్లయ్ అధికారులు - అక్రమ డీలర్ల వివరాలు రహస్యంగా ఉంచిన అధికారులు ప్రగతినగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డులపై ఉక్కుపాదం మోపింది. బోగస్ కార్డుల ఏరివేతను వేగవంతం చేసిం ది. అర్హత లేకున్నా తెల్ల రేషన్ కార్డులను పొంది ప్రభుత్వ సొమ్మును అప్పనంగా పొం దుతున్న వారి భరతం పట్టడానికి చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో బోగస్ కార్డులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించిం ది.ఈ దిశగా బోగస్ కార్డులు కలిగి ఉన్న కొంత మంది రేషన్ డీలర్ల వివరాలు సివిల్ సప్లయ్ ఎండీకి అధికారులు పంపించారు.వారి వివరాలను రహస్యంగా దాచిపెట్టారు. బోగస్ కార్డుల కోసం అన్ని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సరెండర్ బాక్సులను ఏర్పాటుచేశారు. అప్రమత్తమైన డీలర్లు బోగస్ రేషన్ కార్డుల విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించడంతో బోగస్ కార్డులు కలిగి ఉన్న డీలర్లు ముందుగా అప్రమత్తమయ్యారు. దళారులను తహశీల్దార్ కార్యాలయాలకు పంపించి వారి దగ్గర ఉన్న కార్డులను సరెండర్ బాక్స్ లో వేసి జారుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 7,06,451 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో అంత్యోదయ కార్డులు 43,726,అన్నపూర్ణ కార్డులు 1106,ఆర్ఏపీ కార్డులు 90,390 రచ్చబండ మూడో విడతలో అం దించిన 63,458 కార్డులు, తెల్లరేషన్ కార్డులు 5,54 ,301, గులాబీ కార్డులు 40 వేల వరకు ఉన్నాయి. ప్రభుత్వం కూడా బోగస్ కార్డుల ఏరివేతలో డీలర్లను భాగస్వామ్యం చేద్దామని భావిస్తోంది. డీలరైతేనే షాపు పరిధిలో ఉన్న బోగస్ లబ్ధిదారులను గుర్తిస్తాడని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మొత్తం ఆయనకే అవగాహన ఉంటుందని భావిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా డీలర్‌పై ఒత్తిడి తీసుకువస్తే బోగస్ కార్డులను సులువుగా ఏరివేయచ్చనే ఆలోచన కూడా ఉంది. నిజామాబాద్ డివిజన్ పరిధిలో సుమారు 8 వేల కార్డులు,కామారెడ్డి డివిజన్ పరిధిలో 1200, బోధన్ డివిజన్ పరిధిలో 880 బోగస్ కార్డులు స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సరెండర్ బాక్సులో వేశారు. నేటి నుంచి జిల్లాలోటాగింగ్ సిస్టమ్ అమలు బోగస్‌కార్డులు కలిగి ఉన్నవారిని గుర్తించడానికి ప్రభుత్వం టాగింగ్ సిస్టిమ్ ఉపయోగించనుంది. జిల్లాలో సోమవారం నుంచి దీనిని ప్రారంభించనున్నా రు. ఈ టెక్నాలజీ ప్రస్తుతం తమిళనాడులో అం దుబాటులో ఉండగా, తెలంగాణ ప్రభుత్వం దీనిని ఇక్కడ కూడా అమలుచేయనుంది. ఈ టాగింగ్ సిస్టమ్ ద్వారా బోగస్ కార్డులే కాదు బినామీ షాపులు, డీలర్ల ఆటకట్టించనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ముందుగా బోగస్ డీలర్ల భరతం పట్టనున్నారు.