- పాఠశాలలు, వసతి గృహాలకు సన్నబియ్యం
- క్వింటాలుకు ఐదు కిలోలు తక్కువస్తోంది
- ఆందోళన చెందుతున్న హెచ్‌ఎంలు
- కొట్టిపారెస్తున్న సివిల్ సప్లయ్ అధికారులు
- డివిజన్‌కు 250 టన్నుల సన్నబియ్యం సరఫరా
బోధన్ : సన్నబియ్యం భోజన పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్ర భుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పథకాన్ని ప్రారంభిం చారు. ప్రారంభంలోనే లుకలుకలు బయటపడుతున్నాయి. సివిల్ సప్లయ్ సరఫరా చేస్తున్న సన్నబియ్యం 50 కిలోల బస్తాకు 5 కిలోల వరకు తరుగు వస్తోందని ప్రధాన ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. తరుగు బియ్యం వల్ల తనిఖీకి వచ్చే అధికారుల నుంచి తాము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా స్థాయి అధికారులు బియ్యం తరుగుదల పై చర్యలు తీసుకోవాలంటున్నారు. లేకపోతే తాము బలైపోయే అవకాశం ఉందని హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బోధన్ మండలంలో ని ఎరాజ్‌పల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో సన్నబియ్యం భోజనం ప్రారంభించేందుకు వచ్చిన స్థానిక సర్పం చ్ ప్రమీల సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీ గోపాల్‌లకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్‌కుమార్ సన్నబియ్యం బస్తాను తూకం వేయించి, తరుగు సమస్యను వివరించారు.అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
డివిజన్‌కు 250 టన్నుల బియ్యం
రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సన్నబియ్యం భోజన పథకానికి సంబంధించి 250 టన్నుల సన్నబియ్యం వచ్చాయని బోధన్ సివిల్ సప్లయ్ ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారులు వెల్లడించారు. డివిజన్‌లోని బోధన్‌తో పాటు బాన్సువాడ, బిచ్‌కుంద, వర్ని, పిట్లం ఎంఎల్‌ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా అయ్యాయని అంటున్నారు.
బోధన్ ఎంఎల్‌ఎస్ పాయింట్ పరిధిలోని బోధన్ టౌన్, బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్ మండలంలోని పాఠశాల లు, సంక్షేమ వసతి గృహాలకు 41 టన్నుల బియ్యం వచ్చాయని అధికారులంటున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలకు బియ్యం సరఫరా పూర్తి చేయగా, కొన్ని సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేశామంటున్నారు.
తూకంపై అనుమానాలు..
ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్దనే బియ్యం తూకంలో లోపాలు చోటు చేసుకుంటున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ బస్తాల తూకం సరిగ్గా ఉంటే, 50 కిలోల బస్తాకు ఐదు కిలోల వరకు తరు గు ఎలా వస్తుందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నా యి. బస్తాకు 50 నుంచి 100 గ్రాముల వరకు తరు గు రావచ్చుకాని 4 నుంచి 5 కిలోల వరకు తరుగు రాదని అధికారులంటున్నారు.ఉన్నత స్థాయి అధికారులు పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం బస్తాల ను తూకం వేస్తే తరుగు వివరాలు బహిర్గమవుతుం దని హెచ్‌ఎంలు అంటున్నారు.
సన్న బియ్యం తరుగు
Published Sat, Jan 3 2015 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM
Advertisement