small rice
-
సన్నాలు పైపైకి
సాక్షి, హైదరాబాద్: సన్న బియ్యం సామాన్యులు కొనలేని పరిస్థితి దాపురించింది. దిగుబడి తగ్గడం ఒక కారణమైతే... మిల్లర్లే ఎక్కువగా కొనుగోలు చేయడం మరో కారణం. రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి పాత సన్న బియ్యం ధర క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి 8వేల వరకు ఉండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా వచ్చిన వానాకాలం బియ్యాన్ని కూడా రూ.6వేలకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. హైపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో సైతం బియ్యం ధరలు సామాన్య, మధ్య తరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. జై శ్రీరామ్ క్వింటాల్‌కు రూ.7,800 వరకు సన్నబియ్యంలో అగ్రగామిగా చెప్పుకునే జైశ్రీరాం రకం పాత బియ్యం ధర నాలుగు రోజుల క్రితం క్వింటాల్‌కు రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో పలికింది. తర్వాత రూ. 200 వరకు తగ్గినా, మళ్లీ ధర పెరిగింది. మంగళవారం రూ. 7,500 నుంచి రూ. 7,800 వరకు రిటైల్ మార్కెట్లో అమ్మినట్టు సమాచారం. హెచ్ఎంటీ రకం బియ్యం(పాతవి) రూ.7,200 వరకు, కొత్తవి రూ.6,500 నుంచి 7,000 వరకు రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనాలను రూ. 5,500 నుంచి 6,500 వరకు అమ్ముతున్నారు. దొడ్డు బియ్యం అంతంతే దొడ్డు బియ్యం ధర క్వింటాల్ రూ.4,500 నుంచి ఉన్నా, వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరగని సన్నాల దిగుబడి రాష్ట్రంలో యాసంగి సీజన్లో 80 శాతానికి పైగా దొడ్డు రకాలైన 1010, 1001, 1061, ఐఆర్ 64, తెల్లహంస వంటి వరి రకాలనే ఎక్కువగా పండిస్తారు. ఉత్తర తెలంగాణలో యాసంగిలో సన్న రకాలు పండే పరిస్థితి ఏమాత్రం లేదు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మంలలో అదే పరిస్థితి. మిర్యాలగూడ, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కొన్నిచోట్ల సన్నాలు పండించినా, సొంత అవసరాలకే వినియోగిస్తారు. ఇక వానాకాలం సీజన్లో నిజామాబాద్ మినహా ఉత్తర తెలంగాణలో రైతులు తమ పొలాల్లో సంవత్సరకాలం తిండి అవసరాలు, స్థానిక అవసరాలకు మాత్రమే సన్న రకాలను పండించి, దొడ్డు వరి వైపే మొగ్గు చూపుతారు. నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రమే ఖరీఫ్ సీజన్లో సన్నాలు ఎక్కువగా పండిస్తారు. సన్నాలను బియ్యంగా మార్చి విక్రయించే రైతులు కొందరైతే , సన్న ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించే వారు ఎక్కువ మంది. అయితే ఈసారి వానాకాలం సీజన్లో నాగార్జునసాగర్ కింద పంట తక్కువగా రావడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద కూడా వాతావరణ ప్రతికూల పరిస్థితులతో సన్న ధాన్యాన్ని తెగులు సోకినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా కొంత పంట దెబ్బతింది. కేవలం బోర్లు, కరెంటు మోటార్ల కింద పండిన పంట మాత్రమే ఎక్కువ దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 99 మెట్రక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినా, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం 43 ఎల్ఎంటీ మాత్రమే మరో 2 ఎల్ఎంటీ ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. గత యాసంగిలో 67 ఎల్ఎంటీ మేర దొడ్డు ధాన్యం వచ్చినా, అదంతా మిల్లుల్లోనే నిల్వ ఉంది. -
సన్న బియ్యం జాడేది.?
నెన్నెల : అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా ప్రకటనలకే పరిమితమవుతోంది. పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం పెడుతుంది. అయినా అంగన్వాడీ కేంద్రాల్లో ఇంకా దొడ్డు బియ్యం కొనసాగిస్తున్నారు. దీంతో గర్భిణులతో పాటు చిన్నారులు అన్నం తినలేక అర్ధాకలితో ఉంటున్నారు. బండరాళ్లంటి దొడ్డు బియ్యమే వడ్డిస్తుండడంతో అన్నం గొంతులోకి దిగుతలేదని వాపోతున్నారు. అందని పౌష్టికాహారం.. అంగన్వాడీ కేంద్రాల్లో దొడ్డు బియ్యమే వడ్డిస్తుండడంతో రుచికరమైన పౌష్టికాహారం ఊసే లేకుండా పోయింది. కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. కానీ దొడ్డు బియ్యం పెడుతుండడంతో చాలా చోట్ల కేంద్రాల్లో తినేందుకు గర్భిణులు, బాలింతలు అనాసక్తి చూపుతున్నారు. గొంతు దిగడం లేదు... అంగన్వాడీ కేంద్రాల్లో చాలా చోట్ల గర్భిణులు, బాలింతలు భోజనం చేయడం లేదు. కానీ చిన్నారులకు మాత్రం వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో దొడ్డు బియ్యం పెడుతుండడంతో చిన్నారులకు గొంతు దిగడం లేదు. చాలా వరకూ అన్నం తినకుండానే నిద్రలోకి జారిపోతున్నారు. కొద్దిపాటిగా తిన్నా అరగడం కష్టంగా మారుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. కానీ గర్భిణులు, బాలింతలు మాత్రం ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దొడ్డు బియ్యం తింటే కడుపు నొప్పిగా ఉంటుందని చెబుతున్నారు.ప్రగతి భవన్ సాక్షిగా అంగన్వాడీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు. కానీ ఆ హామీ నేటికీ నెరవేరడం లేదు. ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేసి పౌష్టికాహారం అందించాలని గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులు కోరుతున్నారు. కడుపు నొప్పి వస్తుంది దొడ్డు బియ్యం తింటే కడుపులో నొప్పి వస్తుంది. అంగన్వాడీల్లో దొడ్డు బియ్యం పెడుతున్నారు. తినలేకపోతున్నాం. ఈ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు చెబుతున్నాం. ఇంత వరకు సన్నబియ్యం రాలేదు. ఇలా ఉంటే చిన్నపిల్లలు ఎలా తింటారు. సన్నబియ్యం సరఫరా చేయాలి. – ధనలక్ష్మీ, బాలింత, నెన్నెల -
సన్నబియ్యంకుతకుత !
► పెరుగుతున్న సన్నబియ్యం ధరలు ► పది రోజుల్లోనే క్వింటాలుపై రూ.800 పెరుగుదల ► మార్కెట్లో క్వింటాలు రూ.4800 నుంచి రూ.5600 ► మిల్లర్ల వద్ద అక్రమ నిల్వలు ► పట్టించుకోని విజిలెన్స్‌శాఖ కడప అగ్రికల్చర్ : ఒక వైపు వర్షాభావంతో కేసీ కెనాల్‌కు సాగు నీరు విడుదల కాక వరిసాగుకు నోచుకోలేదు. మరోవైపు నిరుడి ధాన్యపు నిల్వలను బియ్యంగా మలచి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇక ధాన్యం పండే సూచనలు కనిపించలేదని ప్రచారం చేస్తూ వ్యాపారులు బియ్యం ధరలు అమాం తంగా పెంచేశారు. సన్నబియ్యానికి కొరత బూచి చూపి ఇష్టారాజ్యంగా ధరను పెంచి సామాన్యులతోపాటు మధ్య తరగతి వారికి దడ పుట్టిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువుల్లోను, ప్రాజెక్టుల్లోను నీరు లేక బోసి ఉన్నాయి. దీంతో బోరుబావుల్లో నీరు అడుగంటింది. ఏటా బోరుబావుల కింద ఎంతోకొంత వరిసాగు చేసే రైతులు ఈ ఏడాది వరిసాగు చేయలేకపోయారు. అలాగే కేసీ కెనాల్‌కు అధికారికంగా నీరు విడుదల కాకపోవడంతో పెద్దగా పంటసాగుకు నోచుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు, మిల్లర్లు ధరలను అమాంతం పెంచేశారని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం ధరలు (జిలకర్ర, సోనామసూర) ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు వాటి ధరలను వ్యాపారులు, మిల్లర్లు పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది నుంచి బియ్యం ధరలు నెలకునెలకూ పెరగడమే గాని తగ్గడం లేదు. వారం క్రితం క్వింటాలు రూ. 4800 ఉండగా సన్నబియ్యం ధర ఇప్పుడు మార్కెట్లో రూ. 5600 ధర పలుకుతున్నాయి. ఇవి కూడా కొత్త బియ్యం 25 కి లోల బస్తా వారం క్రితం రూ.850లు ఉం డగా అదే బియ్యం ఇప్పుడు రూ.1000 పలుకుతున్నాయి. అలాగే పాత బియ్యం ధర 25కిలోల బస్తా రూ.1200 ఉండగా నేడు అదే బస్తా రూ.1400లు పలుకుతున్నాయి. పాత బి య్యమైతే ఒకరేటు, కొత్త బియ్యమైతే మరో రేటు పలుకుతుండడం విశేషం. మిల్లర్లు గోడౌన్లలో అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. విజిలెన్స్ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, వారు గోడౌన్లపై దాడులు చేస్తే మిల్లర్ల, వ్యాపారుల బాగోతం బయటపడుతుందని వినియోగదారులు అంటున్నారు. తగ్గిన పంట సాగు.. : జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో 91,970 ఎకరాలలో వరిసాగయ్యేది. ఈ ఏడాది వర్షాభావం వల్ల ఖరీఫ్ సీజన్ అంతా కలిపి బోరుబావుల కింద కేవలం 52,537 ఎకరాలలోనే సాగు చేశారు. ఈ సాగు కూడా సన్నబియ్యం ధరల పెరుగుదలపై ప్రభా వం చూపుతోంది. ఏటా ఖరీఫ్ సీజన్లో 1,36,155 ఎకరాల మొత్తంలో వరి పంటసాగైతే 32.67 లక్షల క్వింటాళ్ల ధా న్యం దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది 52,537 ఎకరాలకుగాను 12.60 లక్షల క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సన్నబియ్యం కిలో రూ. 30లకే ఒట్టిమాట.. : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటనలో ఓ కూలీ బియ్యం ధరలపై ప్రస్తావించినప్పుడు బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో కిలో 30 రూపాయలకే సన్న రకాల బియ్యం అందిస్తామని ముఖ్యమంత్రి మాట చెప్పారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లలో తప్పని సరిగా విక్రయించేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి నెల రోజులు దాటినా ఇంత వరకు అతీగతీ లేదని నిరుపేదలు, సామాన్యులు విమర్శిస్తున్నారు. బయో మెట్రిక్ పద్ధతి వచ్చినా రేషన్ బియ్యం పక్కదారి..: జిల్లాలోని రేషన్ షాపుల్లో బియ్యానికి బయోమెట్రిక్ పద్ధతిని ప్రభుత్వం అమలు చేస్తున్నా కొందరు డీలర్లు పాత కార్డులను తమ వద్ద ఉంచుకుని కార్డు రేషన్‌తో అవసరంలేని ఆయా కార్డుదారులను రప్పించుకుని వేలి గుర్తులను బయోమెట్రిక్‌లో వేయించి వారికి అంతోఇంతో ఇచ్చి వారి కోటా బియ్యాన్ని తీసుకుని ఆ బియ్యాన్ని వ్యాపారులకు, మిల్లర్లకు అందజేస్తున్నట్లు సమాచారం. అలాగే మరి కొందరు కార్డులు రద్దు కాకుండా ఆయా కార్డుల బియ్యం, ఇతర సరుకులు డీలరే అమ్ముకునేలా వేలి గుర్తులు వేసి పోతున్నారని తెలిసింది. ఈ బియ్యాన్ని రైస్‌మిల్లుల్లో పాలిష్ చేసి సన్నబియ్యంలో కల్తీ చేసి బయటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండడం వల్లే అధిక ధరల పెరుగుదలకు కారణంగా అవుతోందని వినియోగదారులు వాపోతున్నారు. -
సన్నబియ్యం సక్రమంగా అందించాలి: ఎస్ఎఫ్ఐ
మహబూబ్‌నగర్: ప్రభుత్వం అమలు చేస్తున్న హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పథకాన్ని సక్రమంగా అమలుచేయాలి. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నాణ్యమైన బియ్యాన్ని సరఫరాచేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ అన్నారు. ఈ మేరకు అచ్చంపేట డిప్యూటి తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. (అచ్చంపేట) -
సన్న బియ్యం తరుగు
- పాఠశాలలు, వసతి గృహాలకు సన్నబియ్యం - క్వింటాలుకు ఐదు కిలోలు తక్కువస్తోంది - ఆందోళన చెందుతున్న హెచ్ఎంలు - కొట్టిపారెస్తున్న సివిల్ సప్లయ్ అధికారులు - డివిజన్‌కు 250 టన్నుల సన్నబియ్యం సరఫరా బోధన్ : సన్నబియ్యం భోజన పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్ర భుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పథకాన్ని ప్రారంభిం చారు. ప్రారంభంలోనే లుకలుకలు బయటపడుతున్నాయి. సివిల్ సప్లయ్ సరఫరా చేస్తున్న సన్నబియ్యం 50 కిలోల బస్తాకు 5 కిలోల వరకు తరుగు వస్తోందని ప్రధాన ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. తరుగు బియ్యం వల్ల తనిఖీకి వచ్చే అధికారుల నుంచి తాము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు బియ్యం తరుగుదల పై చర్యలు తీసుకోవాలంటున్నారు. లేకపోతే తాము బలైపోయే అవకాశం ఉందని హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బోధన్ మండలంలో ని ఎరాజ్‌పల్లి జడ్పీహెచ్ఎస్లో సన్నబియ్యం భోజనం ప్రారంభించేందుకు వచ్చిన స్థానిక సర్పం చ్ ప్రమీల సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీ గోపాల్‌లకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్కుమార్ సన్నబియ్యం బస్తాను తూకం వేయించి, తరుగు సమస్యను వివరించారు.అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. డివిజన్‌కు 250 టన్నుల బియ్యం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సన్నబియ్యం భోజన పథకానికి సంబంధించి 250 టన్నుల సన్నబియ్యం వచ్చాయని బోధన్ సివిల్ సప్లయ్ ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు వెల్లడించారు. డివిజన్లోని బోధన్‌తో పాటు బాన్సువాడ, బిచ్కుంద, వర్ని, పిట్లం ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా అయ్యాయని అంటున్నారు. బోధన్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలోని బోధన్ టౌన్, బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్ మండలంలోని పాఠశాల లు, సంక్షేమ వసతి గృహాలకు 41 టన్నుల బియ్యం వచ్చాయని అధికారులంటున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలకు బియ్యం సరఫరా పూర్తి చేయగా, కొన్ని సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేశామంటున్నారు. తూకంపై అనుమానాలు.. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్దనే బియ్యం తూకంలో లోపాలు చోటు చేసుకుంటున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ బస్తాల తూకం సరిగ్గా ఉంటే, 50 కిలోల బస్తాకు ఐదు కిలోల వరకు తరు గు ఎలా వస్తుందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నా యి. బస్తాకు 50 నుంచి 100 గ్రాముల వరకు తరు గు రావచ్చుకాని 4 నుంచి 5 కిలోల వరకు తరుగు రాదని అధికారులంటున్నారు.ఉన్నత స్థాయి అధికారులు పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం బస్తాల ను తూకం వేస్తే తరుగు వివరాలు బహిర్గమవుతుం దని హెచ్ఎంలు అంటున్నారు. -
నేటి నుంచి ‘సంక్షేమం’లో ‘సన్న’ అన్నం
* జిల్లా వ్యాప్తంగా 146 హాస్టళ్లలో అమలు * రెండు,మూడు రోజుల్లో లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి ఇందూరు : ఎప్పుడెప్పుడా అని సంక్షేమ విద్యార్థులు ఎదురు చూస్తున్న రోజు రానేవచ్చింది. ఇన్ని రోజులుగా తిన్న దొడ్డు అన్నానికి బదులు సన్న అన్నాన్ని గురువారం నుంచి తినబోతున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి సంక్షేమ వసతిగృహంలో ఉంటున్న విద్యార్థులకు సన్న బియ్యం ద్వారా అన్నం వండిపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మొత్తం 146 వసతి గృహాలకు సివిల్ సప్లయ్ అధికారులు సన్న బియ్యాన్ని సరఫరా చేశారు. 15,114మంది విద్యార్థులకు ప్రతి రోజు 400 నుంచి 500 గ్రాముల బియ్యాన్ని వండి పెడతారు. అయితే నెలకు సరిపడా రేషన్ అందుబాటులో లేని సందర్భంగా ప్రస్తుతానికి వారం పది రోజులకు సరిపడే విధంగా రేషన్ సరఫరా చేశారు. మిగతా మొత్తాన్ని త్వరలో సరఫరా చేయనున్నారు. గురువారం నుంచి సన్న బియ్యం వండి పెట్టనున్న నేపథ్యంలో సంబంధిత వసతిగృహ వార్డెన్లు విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా, సరిపోయే విధంగా నాణ్యమైన భోజనం వండిపెట్టాలని, ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకు రావాలని ఆయా సంక్షేమ శాఖల జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అధికారింగా మంత్రిచే ప్రారంభించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిచే ప్రారంభించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
చుక్కల్లో ‘సన్నాలు’
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు సన్న బియ్యం కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. పక్షం రోజుల్లో క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు పెరిగాయి. పదిహేను రోజుల క్రితం బ్రాండేడ్ జై శ్రీరాం బియ్యం క్వింటాల్‌కు రూ.4,800 ఉండగా, ప్రస్తుతం రూ.5,800 చేరాయి. లోకల్ జైశ్రీరాం రూ.4,200 నుంచి రూ.5,200, బీపీటీ రూ.3,400 నుంచి రూ.4,000, హెచ్ఎంటీ రూ.4,000 నుంచి రూ.4,600 పెరిగాయి. స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలు పెరగడంతో ప్రజలు జంకుతున్నారు. తుపాన్ ప్రభావం.. మిల్లర్ల మాయాజాలం ఇటీవల ఆంధ్ర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన నీలం, పై-లీన్, హెలెన్ తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా పంటల నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో వరి పంటలపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆంధ్రలో పంటలు నష్టపోవడంతో బియ్యం కొరత ఏర్పడింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రాకు టన్నుల కొద్ది బియ్యం ఎగుమతి అవుతున్నాయి. దీనికి తోడు రైస్ మిల్లుర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యాన్ని నిల్వ ఉంచిన మిల్లర్లు అక్రమార్జన కోసం ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు. ప్రభుత్వం బియ్యం ధరలు నియంత్రించక పోవడంతో ప్రజలు వ్యాపారులు చెప్పిన ధరలకే కొనాల్సి వస్తుంది. జిల్లాలో కూడా ఈఏడు అత్యధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఏటా ఆంధ్ర ప్రాంతం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌తోపాటు మహారాష్ట్ర నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. కానీ, ఈసారి జిల్లా నుంచే ఎగుమతి చేయడంతో కొరత ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయి.