నర్సింహులపేట : అక్రమంగా నిల్వ చేసిన 10 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లయ్ అధికారులు సీజ్ చేసిన సంఘటన మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నారుు. గ్రామంలో కొన్నాళ్లుగా అధిక ధరకు భారత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న వ్యవహారంపై ఇటీవల కొందరు గ్రామస్తులు జాయింట్ కలెక్టర్, డీఎస్‌ఓకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాలతో సివిల్ సప్లై డీటీ అశోక్ కుమార్ గ్రామానికి చేరుకుని కొనకటి దామోదర్‌రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా 10 గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యూయి. ఇంట్లో నిల్వ చేసినందుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేసి, నాగార్జున భారత్ గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. నిందితుడు దామోదర్‌రెడ్డిపై 6ఏ కేసు నమోదు చేశారు.
మూడు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు
ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్‌కు రూ.550 వసూలు చేయడంపై గ్రామానికి చెందిన వీరభద్రి అనే యువకుడు ఇటీవల భారత్ గ్యాస్ కంపెనీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. అరుుతే విషయం తెలుసుకున్న కొనకటి దామోదర్‌రెడ్డి కుమారుడు వెంకట్‌రెడ్డి అతడిని గత నెల 27న పిలిచి దుర్భాషలాడాడు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది.
అంతేగాక కనీసం ఫిర్యాదు స్వీకరించినట్లు రశీదు కూడా ఇవ్వలేదని బాధితుడు తెలిపాడు. కాగా తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ల సమాచారం ఇచ్చాడనే నెపంతో అదే రాత్రి సమీపంలోని మరో యువకుడి ఇంటికి వెళ్లి దామోదర్‌రెడ్డి కుమారుడు దుర్భాషలాడి, భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది. ఇతడి విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
10 గ్యాస్ సిలిండర్లు సీజ్
Published Tue, Dec 2 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM
Advertisement
Advertisement