గోధుమపిండికి ఎగనామం | atta cancel of ration items | Sakshi
Sakshi News home page

గోధుమపిండికి ఎగనామం

Published Fri, Jun 23 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

గోధుమపిండికి ఎగనామం

గోధుమపిండికి ఎగనామం

అనంతపురం అర్బన్‌ : జిల్లాలో తెల్లకార్డుదారులకు ఈ నెల కోటా గోధుమపిండి పంపిణీ చేయలేదు. జిల్లావ్యాప్తంగా 11.92 లక్షల తెల్లకార్డుదారులు ఉండగా, ఇందులో 1.31 లక్షల మంది ముస్లిం కార్డుదారులు ఉన్నట్లు అంచనా. ముస్లిం లబ్ధిదారులకు రంజాన్‌ తోఫా ఇస్తున్న ప్రభుత్వం అందులో భాగంగా అందజేస్తున్న ఐదు కేజీల గోధుమ పిండిని అదనంగా తెప్పించలేదు. తెల్లకార్డుదారులకు నెలవారీగా ఇచ్చే కేజీ గోధుమపిండిని అటు మళ్లించింది. వారికి కూడా తోఫా కింద ఇచ్చే గోధుమపిండి తప్ప నెలవారీగా రావాల్సింది ఇవ్వలేదు. అంత్యోదయ కార్డుదారులకు మాత్రం ఒక కిలో చొప్పున చక్కెర ఇచ్చినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ డి.శివశంకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement