
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
హైదరాబాద్: పేరుమోసిన అంతర్రాష్ట్ర దొంగను కాచిగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో 41 కేసులలో అతడు నిందితుడని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ మీడియా సమావేశంలో తెలిపారు. అతని వద్ద నుండి 2 బైక్ లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు.