ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. ఒకరి అరెస్ట్
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పై దుర్భాషలాడుతూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఒక వ‍్యక్తిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టుచేశారు. ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని నేటి (మంగళవారం) ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాటేదాన్‌కు చెందిన షానవాజ్ అనే వ‍్యక్తి శాసనసభ‍్యుడు ప్రకాష్‌గౌడ్‌ను దుర్భాషలాడుతూ ఫేస్‌బుక్‌లో ఇటీవల పోస్టుచేశాడు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికిరాగా, ఆయన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాటేదాన్ వెళ్లి షానవాజ్‌ను అరెస్టుచేశారు. విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.