mla prakash goud
-
మరుగుజ్జు ఎద్దు..దులియా జాతి గేదెలు!
హైదరాబాద్: పశుసంక్రాంతితో హైదరాబాద్ నగరశివారు గండిపేట మండలం నార్సింగి గ్రామం సందడిగా మారింది. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే రెండవ శుక్రవారం వివిధ రాష్ట్రాల నుంచి గేదెలను తెచ్చి వ్యాపారులు ఇక్కడ అమ్ముతారు. గుజరాత్, హరియాణా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ముర్రా, దులియా, ఆంధ్రా గుజ్జారీ లతో పాటు దేశీ ఆవులు అమ్మకానికి తరలి వచ్చాయి. ఇందులో మూడు అడుగుల లోపు ఎత్తున్న కొంగనూరు మరుగుజ్జు ఎద్దు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది ఇక్కడ పొట్టేళ్ల జాడే కనిపించలేదు. రికార్డు ధర దులియా జాతి గేదె రూ.2.10 లక్షలు పలకగా ముర్రాజాతి గేదె రూ.2లక్షలు పలికింది. నార్సింగి సమీపంలో పాల వ్యాపారి బి.భరత్ వాటిని దక్కించుకున్నారు. పూటకు 20లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలు కావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. వీటితో ఓ దున్నపోతు సైతం రూ.2లక్షల ధర పలికింది. దేశవ్యాప్త గుర్తింపు : ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నార్సింగిలో జరిగే పశుసంక్రాంతికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బందులు పడేకంటే స్థానికంగా కొనుగోలు చేస్తేనే నయమనే ఉద్దేశంతో ఇక్కడ కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేతోపాటు ఎంపీపీ తలారి మల్లేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పత్తి ప్రవీణ్‌కుమార్, మంచర్ల మమత శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు ఇక్కడకు వచ్చిన వారిలో ఉన్నారు. -
ప్రహరీ కూల్చివేత.. ఎమ్మెల్యేపై కేసు
-
ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పై కేసు
రాజేంద్రనగర్/మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ప్రగతి కాలనీకి వెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన గోడను కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తొలగించడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ సర్వే నెంబర్ 161లో మోహన్‌రెడ్డి పేరుపై రెండెకరాలు, శ్రీనాథ్‌రెడ్డి పేరిట 1.36 గుంటల స్థలం ఉంది. ఈ దారి గుండా ప్రగతి కాలనీ, లాల్‌బహదూర్‌శాస్త్రీ కాలనీ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం స్థలం చుట్టూ మోహన్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డిలు ప్రహారీని నిర్మించి గేటును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని శనివారం సాయంత్రం కాలనీ ప్రజలు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు తెలిపారు. దీంతో ఆయన ఆదివారం ఉదయం స్థలం వద్దకు వచ్చి స్థానికులతో కలిసి ప్రహారీని కూల్చివేశాడు. దీంతో స్థల యజమానులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థల యజమానులు ప్రహారీని పునర్ నిర్మించారు. స్థానికులు విషయాన్ని మరోసారి ఎమ్మెల్యేకు తెలపడంతో ఆయన కాలనీ ప్రజలతో వచ్చి మరోసారి ప్రహారీని కూల్చివేశారు. యజమానులు మరోసారి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్థల యజమాని శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... తమ స్థలంలో ప్రహారీని నిర్మించుకుంటే ఎమ్మెల్యే దౌర్జన్యంగా వచ్చి కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రగతి కాలనీ ప్రజలకు రాకపోకలు సాగించేందుకు దారి ఉందన్నారు. దారి కావాలంటే ప్రభుత్వ పరంగా తమకు తగు స్థలాన్ని లేదా నష్టపరిహారం ఇవ్వాలని.. అదేదీ లేకుండా ఎమ్మెల్యే దౌర్జన్యంగా ప్రహారీని కూల్చి తమను వేధించడం తగదన్నారు. కావాలనే ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తమను వేధిస్తున్నారని ఆరోపించారు. పరిహారం ఇస్తామని చెప్పా: ఎమ్మెల్యే ప్రగతి కాలనీ ప్రజలు దశాబ్దాలుగా రోడ్డును వినియోగిస్తున్నారు. ఇదే విషయాన్ని యజమానులకు తెలిపి దారి వదలాలని సూచించా. అందుకుగాను ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని ఇప్పిస్తానని కూడా చెప్పా. కానీ స్థల యజమానులు మాత్రం మొండిగా ప్రహారీని నిర్మించడంతో స్థానికులు ప్రహారీని కూల్చివేశారు. -
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. ఒకరి అరెస్ట్
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పై దుర్భాషలాడుతూ ఫేస్బుక్లో పోస్టు చేసిన ఒక వ్యక్తిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టుచేశారు. ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని నేటి (మంగళవారం) ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాటేదాన్‌కు చెందిన షానవాజ్ అనే వ్యక్తి శాసనసభ్యుడు ప్రకాష్గౌడ్ను దుర్భాషలాడుతూ ఫేస్బుక్లో ఇటీవల పోస్టుచేశాడు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికిరాగా, ఆయన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాటేదాన్ వెళ్లి షానవాజ్‌ను అరెస్టుచేశారు. విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
‘వారి బెదిరింపులకు భయపడను’
హైదరాబాద్: మజ్లీస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకుల ఆగడాలను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకువెళతానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తెలిపారు. మజ్లీస్ కార్పొరేటర్లు, బస్తీ నాయకుల బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. వర్షం కారణంగా శాస్త్రీపురం, సూలేమాన్‌నగర్ డివిజన్లలోని లోతట్టుప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారన్నారు. వారిని పరామర్శించేందుకు తాను ఈరోజు ఉదయం అధికారులతో కలిసి వెళ్ళానన్నారు. ఇదే సమయంలో శాస్త్రీపురం కార్పొరేటర్ మీస్భావుద్దీన్, సూలేమాన్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ భర్త కొంతమందిని పోగేసుకోని తనను అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. బాధితులు స్వయంగా తన వద్దకు వచ్చి తీసుకోని వెళ్ళడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. మజ్లీస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. తాను బస్తీలలో పర్యటిస్తుంటే ప్రతి ఇంటి నుంచి సమస్యలను తెలుపుతున్నారన్నారు. ఆయా సమస్యలను తాను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానన్నారు. అభివృద్దిని అడ్డుకునే మజ్లీస్‌కు రోజులు దగ్గర పడ్డాయని ప్రకాష్ గౌడ్ అన్నారు. బస్తీలలో అభివృద్ధిపనులను నిర్వహించకుండా మజ్లీస్ కార్పొరేటర్లు, స్థానికుల నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. ఇక వారి ఆగడాలు సాగవని అన్నారు. -
గ్రేటర్లో టీఆర్ఎస్ డిష్యుం డిష్యుం...
-
గ్రేటర్లో టీఆర్ఎస్ డిష్యుం డిష్యుం...
హైదరాబాద్: మైలార్దేవ్ పల్లిలో టీఆర్ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు. మేయర్ బొంతు రామ్మోహన్ సమక్షంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులు శనివారం మధ్యాహ్నం ఘర్షణకు తలపడ్డారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎమ్మెల్యే, కార్పొరేటర్ అనుచరులకు మధ్య గొడవకు దారితీసింది. ఇరువర్గాలు వ్యక్తిగత విమర్శలు చేసుకుని కొట్టుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేయర్, టీఆర్ఎస్ నేతలు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప జేసే ప్రయత్నం చేశారు. -
‘పది’ తప్పిన విద్యార్థులపై దృష్టిసారించాలి
శంషాబాద్ రూరల్: ఇక్కడి పాఠశాలలో ఈసారి ఎంతమంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.. వారంతా సప్లిమెంటరీ పరీక్షలు రాశారా.. వారంతా చదువుకు దూరంకాకుండా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. మండల పరిధిలోని పాల్మాకుల వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూలు ఆవరణలో హరితహారంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఎలాగో పైచదువులకు వెళ్తారు.. ఫెయిలైన వారు.. చదువు కొనసాగించేలా వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టరు సూచించారు. మొక్కల పెంపకంలో విద్యార్థుల పాత్ర కీలకమని తెలిపారు. పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు, స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో ఎన్సీసీ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. దీంతో స్పందించిన కలెక్టర్.. ఇక్కడ సర్వే చేరుుంచి బోరు వేయడానికి చర్యలు తీసుకుంటామని, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలోని సమస్యలను తనకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించాలని, ఒక వేళ సమస్యలు పరిష్కారం కాకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలో కిచెన్ షెడ్, ఫర్నీచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ హరీందర్‌గౌడ్, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, నాయకులు రమేష్, వెంకటేష్‌గౌడ్, సుభాష్, ఉమ్లానాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కు గుండెపోటు
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్ అస్వస్థతకు గురైయ్యారు. మైలార్‌దేవ్‌పల్లి, దుర్గానగర్‌లోని తన నివాసంలో శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యలు హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
టీఆర్ఎస్ నాయకుడిపై ఎమ్మెల్యే దాడి
కాటేదాన్: సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఎదుటే టీఆర్ఎస్ గ్రేటర్ ఉపాధ్యక్షుడు తోకల శ్రీశైలం రెడ్డిపై టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పలువురిని విస్మయానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే... మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో స్వామి గౌడ్ సమక్షంలో బుధవారం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న నాయకులు మొగల్స్ కాలనీలోకి చేరుకున్నారు. అక్కడ ఏళ్ల తరబడి దాసరి కులస్థులకు సంబంధించిన శ్మశాన వాటిక సమస్యను స్వామి గౌడ్‌కు ప్రజలు విన్నవించారు. అప్పటికే టీడీపీ నాయకులు గ్రేటర్ ఉపాధ్యక్షుడు శ్రీశైలంరెడ్డిపై దాడికి వ్యూహం రచించారు.‘ఏ అర్హతతో నీవు ప్రజల నుంచి విన్నపాలు స్వీకరిస్తున్నా’వని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీశైలం రెడ్డిని ఎమ్మెల్యే నె ట్టివేశారు. విషయాన్ని వెంటనే కార్యకర్తలు టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన ప్రకాశ్ గౌడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏసీపీ గంగారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలంరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న తమపై ఓ ఎమ్మెల్యే భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ప్రజలు స్వచ్ఛ హైదరాబాద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతుంటే స్థానిక టీడీపీ నాయకులు ఉనికి కోల్పోతామనే భయంతో దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా... శ్రీశైలంరెడ్డి తమను దుర్భాషలాడారంటూ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నిధులిస్తే.. పార్టీ మారుతా: ప్రకాశ్‌గౌడ్
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు నిధులు విడుదల చేస్తే పార్టీ మారేందుకు సిద్ధమని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ప్రకటించారు. మూడు నెలల క్రితం ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఇదే చెప్పానని, వారం క్రితం ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే విషయం స్పష్టం చేశానని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రంగారెడ్డి జిల్లా పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచినీటి ఎద్దడి నివారణ పనుల పూర్తికి రూ.314 కోట్లు అవసరమని, వాటిని మంజూరు చేసిన మరుక్షణమే టీడీపీని వీడి గులాబీ గూటికి చేరుతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
‘దేశం’ సారథిగా ప్రకాశ్‌గౌడ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ జిల్లా పగ్గాలను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు అప్పగించారు. పార్టీ సారథిగా వ్యవహరిస్తున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరుతున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీ అధ్యక్షుడిగా ప్రకాశ్ పేరును ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మహబూబ్‌నగర్‌లో గురువారం జరిగిన టీడీపీ ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకాశ్‌గౌడ్ పేరును ప్రకటించారు. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా తూళ్ల వీరేందర్‌గౌడ్ పేరు ఖరారు చేశారు. అదేవిధంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సూచన మేరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా సామ రంగారెడ్డిని నియమించారు. -
కారువైపు ప్రకాశ్ దౌడ్!
త్వరలో గులాబీ గూటికి టీడీపీ ఎమ్మెల్యే అతి త్వరలో ముహూర్తం కేటీఆర్‌తో మంతనాలు.. చేరిక లాంఛనమే! సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సైకిల్ దిగి.. కారెక్కేందుకు సిద్ధమవుతున్నాడు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఈ నెలాఖరున టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో కీలకమంతనాలు జరిపారు. ఈ సమావేశంలో పార్టీలో చేరే అంశం చర్చకు రాలేదని, కేవలం అభివృద్ధి పనులపై సమీక్షించినట్లు ఇరువర్గాలు చెబుతున్నా.. లోగుట్టు మాత్రం చేరికపై చర్చేనని తెలుస్తోంది. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత చూపారు. ఆ తర్వాత మనసు మార్చుకున్న ప్రకాశ్ అభివృద్ధి పనులపై చర్చించానే తప్ప.. తనకు టీఆర్ఎస్లో చేరే ఉద్ధేశంలేదని అప్పట్లో స్పష్టం చేశారు. అయితే, తన నియోజకవర్గంలో మంచినీటి సమస్య, అభివృద్ధికి విరివిగా నిధులిస్తే గులాబీ గూటికి చేరేందుకు వెనుకాడనని పలుమార్లు బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ క్షణాన్నయినా టీడీపీకి గుడ్‌బై చెప్పడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి మాట్లాడడంతో ఈ ప్రచారానికి తెరపడినట్లేనని భావించినా.. తాజాగా ఆయన కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే శాసనసభ సమావేశాలకంటే ముందే ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశముందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. నిధులతో గాలం వరుసగా రెండుసార్లు గెలుపొందినా టీడీపీ అధికారంలోకి రాకపోవడం.. మరోవైపు స్థానిక సమస్యలకు తగిన పరిష్కారం దొరక్కపోవడంతో ఆయన కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేస్తూ గులాబీ బలాన్ని పెంచుకునే ఎత్తుగడ వేస్తున్న అధికార పార్టీ.. ప్రకాష్‌పైనా గాలం విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నియోజకవర్గ సమస్యల్లో ప్రధానమైన తాగునీటి సరఫరాను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతూ.. భారీ నిధులిచ్చేందుకు పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో మంగళవారం సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు, రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు ప్రత్యేకంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ హాజరుకావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. -
నటుడు బ్రహ్మాజీ కుమారుడిపై దాడి
-
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్!
హైదరాబాద్: రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డిలతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ ను గురువారం ఉదయం ప్రకాష్ గౌడ్ కలిశారు. వీరందరూ టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. తలసాని శ్రీనివాస్, తీగల కృష్ణారెడ్డి... టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటన చేయగా ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డి పార్టీ మారుతున్నట్టు స్పష్టం చేయలేదు. సాయంత్రం చంద్రబాబును ప్రకాష్ గౌడ్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తానిప్పుడు పార్టీ మారడం లేదని చెప్పారు. తనను చేరమని టీఆర్ఎస్ ఆహ్వానించలేదన్నారు. టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు.