
ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కు గుండెపోటు
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్ అస్వస్థతకు గురైయ్యారు. మైలార్‌దేవ్‌పల్లి, దుర్గానగర్‌లోని తన నివాసంలో శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యలు హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.