నిధులిస్తే.. పార్టీ మారుతా: ప్రకాశ్‌గౌడ్ | give a funding Party led : prakasgaud | Sakshi
Sakshi News home page

నిధులిస్తే.. పార్టీ మారుతా: ప్రకాశ్‌గౌడ్

Published Fri, May 8 2015 1:00 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

నిధులిస్తే.. పార్టీ మారుతా: ప్రకాశ్‌గౌడ్ - Sakshi

నిధులిస్తే.. పార్టీ మారుతా: ప్రకాశ్‌గౌడ్

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు నిధులు విడుదల చేస్తే పార్టీ మారేందుకు సిద్ధమని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ప్రకటించారు. మూడు నెలల క్రితం ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఇదే చెప్పానని, వారం క్రితం ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే విషయం స్పష్టం చేశానని పేర్కొన్నారు.

  గురువారం హైదరాబాద్‌లో జరిగిన రంగారెడ్డి జిల్లా పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచినీటి ఎద్దడి నివారణ  పనుల పూర్తికి రూ.314 కోట్లు అవసరమని, వాటిని మంజూరు చేసిన మరుక్షణమే టీడీపీని వీడి గులాబీ గూటికి చేరుతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement