గ్రేటర్లో టీఆర్ఎస్ డిష్యుం డిష్యుం...
హైదరాబాద్: మైలార్దేవ్ పల్లిలో టీఆర్ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు. మేయర్ బొంతు రామ్మోహన్ సమక్షంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి వర్గీయులు శనివారం మధ్యాహ్నం ఘర్షణకు తలపడ్డారు.
ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎమ్మెల్యే, కార్పొరేటర్ అనుచరులకు మధ్య గొడవకు దారితీసింది. ఇరువర్గాలు వ్యక్తిగత విమర్శలు చేసుకుని కొట్టుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేయర్, టీఆర్ఎస్ నేతలు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప జేసే ప్రయత్నం చేశారు.