trs leaders fighting
-
‘రెడ్యా’ కాన్వాయ్ అడ్డగింత
కురవి (వరంగల్): మండలంలోని నేరడ శివారు బాల్య తండాలో ఆదివారం ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టేందుకు వస్తున్న డోర్నకల్ తాజా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కాన్వాయ్‌ను అదే తండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భూక్య విజయ్ అడ్డుకునేందుకు యత్నించాడు. తన ఇంటి పక్కన సీసీ రోడ్డు నిర్మించకపోవడంతో రెండేళ్ల నుంచి ఇబ్బం ది పడుతున్నామని, తండాకు ఎందుకు ప్రచారా నికి వచ్చారని విజయ్ ఆగ్రహంతో డీజే సౌండ్ సిస్టంతో వస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ వాహనం వెనుక భాగంలోనే మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వాహనం ఉంది. గమనించిన తండాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు విజయ్‌కు సర్దిచెప్పేందుకు యత్నించి నా ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి బయటికి లాక్కెళ్లారు. అయినా వినకుండా గొడవ చేయడంతో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవి, కొండయ్య అతడిని కొట్టి పక్కకు లాగిపడేశారు. తర్వాత విజయ్‌ని రెడ్యానాయక్ వద్దకు టీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చారు. మీ బాధ ఏమిటని రెడ్యానాయక్ విజయ్‌ని అడగగా రెండేళ్ల నుంచి సీసీ రోడ్డు నిర్మించాలని ఎంత మొత్తుకు న్నా పట్టించుకోలేదని, బురదలో నడవలేకపోతున్నామని చెప్పడంతో రెడ్యానాయక్ అతడికి సర్దిచెప్పి మార్చి వరకు 30 ఫీట్ల సీసీ రోడ్డు నిరా ్మణం చేయిస్తానని, ఆ పనిని గోవర్ధన్‌రెడ్డికి అప్పగిస్తున్నట్లు రెడ్యానాయక్ ప్రకటించడంతో లొల్లి సద్దుమనిగింది. -
‘కొండా’ ముద్రతో మమల్ని పక్కన పెట్టొద్దు
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాల్లో పనిచేశామని, టీఆర్ఎస్ నుంచి నిలబడిన వారి గెలుపు కోసం కృషి చేసిన తమను ఇప్పుడు గ్రూపుల పేరుతో పక్కన పెడుతున్నారని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీలోని ముఖ్యకార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బూత్ కమిటీ సమావేశాలకు గతంలో కొండా దంపతులతో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులను ఆహ్వానించకపోవడం, వారికి ఎలాంటి ప్రా«ధాన్యం ఇవ్వకపోవడంతో వారు పలువురు నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఎల్బీనగర్లోని క్రిస్టల్ గార్డెన్స్, సిటీ ఫంక్షన్ ప్యాలెస్‌లో మంగళవారం బూత్ కమిటీల ఎంపిక కోసం నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే వర్గీయులుగా ముద్రపడిన వారిని స్టేజీ మీదకు ఆహ్వానించకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారితో ఉన్నామని, ఇప్పుడు మేయర్ వర్గీయులు తమను కావాలనే దూరం పెడుతున్నారని ఎంపీల దృష్టికి తీసుకెళ్లారు. కొండా దంపతులు పార్టీ మారితే తాము పార్టీ వీడలేదని, టీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్టు ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చే స్తామన్నారు. ఇదిలా ఉండగా కొండా దంపతులు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గంలో మేయర్ వర్గంగా చిత్రీకరించి అభివృద్ధి పనులతో పాటు ఇతరాత్ర విషయాల్లో వేధింపులకు తాము గురయ్యేందుకు కొంతమంది ముఖ్యపాత్ర పోషించినందున వారిని గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వొద్దని మరికొందరు నాయకులు నేతల దృష్టికి తీసుకుపోయారు. రెండువర్గాల వాదనలు విన్న ఎంపీలు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. -
గ్రేటర్లో టీఆర్ఎస్ డిష్యుం డిష్యుం...
హైదరాబాద్: మైలార్దేవ్ పల్లిలో టీఆర్ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు. మేయర్ బొంతు రామ్మోహన్ సమక్షంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులు శనివారం మధ్యాహ్నం ఘర్షణకు తలపడ్డారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎమ్మెల్యే, కార్పొరేటర్ అనుచరులకు మధ్య గొడవకు దారితీసింది. ఇరువర్గాలు వ్యక్తిగత విమర్శలు చేసుకుని కొట్టుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేయర్, టీఆర్ఎస్ నేతలు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప జేసే ప్రయత్నం చేశారు.