కురవి (వరంగల్): మండలంలోని నేరడ శివారు బాల్య తండాలో ఆదివారం ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టేందుకు వస్తున్న డోర్నకల్ తాజా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కాన్వాయ్‌ను అదే తండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భూక్య విజయ్ అడ్డుకునేందుకు యత్నించాడు. తన ఇంటి పక్కన సీసీ రోడ్డు నిర్మించకపోవడంతో రెండేళ్ల నుంచి ఇబ్బం ది పడుతున్నామని, తండాకు ఎందుకు ప్రచారా నికి వచ్చారని విజయ్ ఆగ్రహంతో డీజే సౌండ్ సిస్టంతో వస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఆ వాహనం వెనుక భాగంలోనే మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వాహనం ఉంది. గమనించిన తండాకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు విజయ్‌కు సర్దిచెప్పేందుకు యత్నించి నా ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి బయటికి లాక్కెళ్లారు. అయినా వినకుండా గొడవ చేయడంతో టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవి, కొండయ్య అతడిని కొట్టి పక్కకు లాగిపడేశారు. తర్వాత విజయ్‌ని రెడ్యానాయక్ వద్దకు టీఆర్‌ఎస్ నాయకులు తీసుకొచ్చారు.
మీ బాధ ఏమిటని రెడ్యానాయక్ విజయ్‌ని అడగగా రెండేళ్ల నుంచి సీసీ రోడ్డు నిర్మించాలని ఎంత మొత్తుకు న్నా పట్టించుకోలేదని, బురదలో నడవలేకపోతున్నామని చెప్పడంతో రెడ్యానాయక్ అతడికి సర్దిచెప్పి మార్చి వరకు 30 ఫీట్ల సీసీ రోడ్డు నిరా ్మణం చేయిస్తానని, ఆ పనిని గోవర్ధన్‌రెడ్డికి అప్పగిస్తున్నట్లు రెడ్యానాయక్ ప్రకటించడంతో లొల్లి సద్దుమనిగింది.
Comments
Please login to add a commentAdd a comment