DS redya Naik
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. ముక్కున వేలేసుకున్న కార్యకర్తలు
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నోరు జారారు. ప్రతిపక్షాలను పరుష పదజాలంతో దూషించారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని.. ఇతర ల.. కొడుకులకు లేదని రెడ్యానాయక్ నోరు పారేసుకున్నారు. రేవంత్ రెడ్డిని బోసి.. కే అంటూ సంబోధించారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకుడు రెడ్యానాయక్ ఇలాంటి మాటలు మాట్లాడటంతో సభకు వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాగా మాట్లాడేది అనే గుసగుసలు వినిపించాయి. చదవండి: ‘పాత నంబర్ ఎందుకు మార్చారు?.. చైనాకు కాల్స్ ఎందుకు వెళ్లాయి?’ -
మంత్రిగారి తండాలో నాకు ఓట్లు పడలె..!
కురవి: ‘గత ఎన్నికల్లో మంత్రిగారి సొంత తండాలో నాకు ఓట్లు పడలె..’అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మంత్రి సత్యవతి రాథోడ్ బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు. అదృష్టం బాగుంది. మహిళ అనో.. భర్త లేడనో.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చరిత్రలో ఎవరూ చేయలేని పని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు’అని పేర్కొన్నారు. సత్యవతికి మంత్రి పదవి వచ్చినందుకు తనకు అభ్యంతరం లేదన్నారు. అయితే.. గత సొసైటీ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన నూకల వేణుగోపాల్‌రెడ్డిని వెంటేసుకొని తిరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జెడ్పీటీసీ, ఎంపీపీ ఊర్లో పార్టీ అభ్యర్థి గెలవడు. మంత్రి గారి తండాలో ఓట్లు రావు. పార్టీకి ద్రోహం చేసిన వారి గురించి అసలు పట్టించుకోవడం లేదు.. పైగా నాకు కూడా చెప్పకుండా తన నియోజకవర్గంలో వారిని వెంబడేసుకుని తిరగడం ఎంత వరకు సమంజసమో మంత్రి గారి విజ్ఞతకే వదిలేస్తున్నా’అని రెడ్యానాయక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పిలిస్తేనే ఆ నియోజకవర్గంలో రావాలి.. 33 జిల్లాలు ఉన్నాయి. ఎక్కడన్నా తిరుగు వద్దంటారా? అని ఎద్దేవా చేశారు. తామందరమూ ఒకే పార్టీకి చెందిన వారమని, ఎక్కడైనా వర్గపోరుంటే సరిచేయాలే గానీ, ఇలా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. గతంలో కూడా తనను దెబ్బతీద్దామని చూశారని, తాను జాగ్రత్తలు తీసుకోవడానికి వారు నేర్పిన విద్యేనని పేర్కొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పార్టీ ద్రోహులపై ఓ కన్నేసి ఉంచాలని, లేకుంటే ఏనాడైనా దెబ్బతినడం ఖాయమని రెడ్యానాయక్ జోస్యం చెప్పారు. -
ఎంపీగా కవితను గెలిపించండి
సాక్షి, కురవి: మహబూబాబాద్ ఎంపీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన కవితను ప్రజలు ఆదరించి అధిక మెజారిటీతో గెలిపించాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. రెండోరోజు మంగళవారం మండలంలోని నేరడ, తట్టుపల్లి, కురవి, మొగిలిచర్ల, కంచర్లగూడెం, బలపాల, రాజోలు, గుండ్రాతిమడుగు(స్టేషన్), కొత్తూరు(జీ) గ్రామాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరడ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన వంద మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కురవిలో ఏకైక టీడీపీ సర్పంచ్ నూతక్కి పద్మనర్సింహరావుతో పాటు వార్డు సభ్యులు, టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మొగిలిచర్లలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముగ్గురు నాయకులు టీఆర్ఎస్లో చేరడంతో ఆ గ్రామంలో ఏ ఒక్క పార్టీ లేకుండా పోయింది. మొగిలిచర్ల గులాబీమయమైంది. కంచర్లగూడెంలో సైతం ఇదే మాదిరిగా కాంగ్రెస్‌లో ఉన్న వారంతా టీఆర్ఎస్లో చేరారు. బలపాల గ్రామంలో వార్డు సభ్యులు పార్టీలో చేరారు. మొత్తం మీద మండలంలో 90శాతం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ డోర్నకల్ ఆడబిడ్డ, మానుకోట రాజకీయ నాయకురాలు, ఇల్లందు కోడలు మాలోత్ కవితను అధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మొదటి సారిగా మానుకోట నుంచి పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం మహిళకు వచ్చిందన్నారు. ప్రతీ గ్రామం నుంచి ఐదు వందల మెజారిటీ సాధించాల్సిన అవసరం ఉందన్నారు. కురవి మండలం నుంచి 20వేల మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కొణతం కవిత, ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కృష్ణారెడ్డి, మండల పరిశీలకుడు కేశబోయిన కోటిలింగం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోటలాలయ్య, మండల రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్ ముండ్ల రమేష్, టీఆర్ఎస్ నాయకులు డీఎస్ రవిచంద్ర, బండి వెంకటరెడ్డి, గోవర్థన్‌రెడ్డి, గుగులోత్ రవినాయక్, బాదావత్ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘రెడ్యా’ కాన్వాయ్ అడ్డగింత
కురవి (వరంగల్): మండలంలోని నేరడ శివారు బాల్య తండాలో ఆదివారం ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టేందుకు వస్తున్న డోర్నకల్ తాజా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కాన్వాయ్‌ను అదే తండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భూక్య విజయ్ అడ్డుకునేందుకు యత్నించాడు. తన ఇంటి పక్కన సీసీ రోడ్డు నిర్మించకపోవడంతో రెండేళ్ల నుంచి ఇబ్బం ది పడుతున్నామని, తండాకు ఎందుకు ప్రచారా నికి వచ్చారని విజయ్ ఆగ్రహంతో డీజే సౌండ్ సిస్టంతో వస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ వాహనం వెనుక భాగంలోనే మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వాహనం ఉంది. గమనించిన తండాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు విజయ్‌కు సర్దిచెప్పేందుకు యత్నించి నా ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి బయటికి లాక్కెళ్లారు. అయినా వినకుండా గొడవ చేయడంతో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవి, కొండయ్య అతడిని కొట్టి పక్కకు లాగిపడేశారు. తర్వాత విజయ్‌ని రెడ్యానాయక్ వద్దకు టీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చారు. మీ బాధ ఏమిటని రెడ్యానాయక్ విజయ్‌ని అడగగా రెండేళ్ల నుంచి సీసీ రోడ్డు నిర్మించాలని ఎంత మొత్తుకు న్నా పట్టించుకోలేదని, బురదలో నడవలేకపోతున్నామని చెప్పడంతో రెడ్యానాయక్ అతడికి సర్దిచెప్పి మార్చి వరకు 30 ఫీట్ల సీసీ రోడ్డు నిరా ్మణం చేయిస్తానని, ఆ పనిని గోవర్ధన్‌రెడ్డికి అప్పగిస్తున్నట్లు రెడ్యానాయక్ ప్రకటించడంతో లొల్లి సద్దుమనిగింది. -
వీరభద్రుడికి కోరమీసాలు
-
కాంగ్రెస్ ఓ దొంగల ముఠా!
ప్రాజెక్టులను అడ్డుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కేసీఆర్ ► కురవిలో వీరభద్రుడికి కోరమీసాల మొక్కు చెల్లింపు సాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. ప్రాజెక్టులను అడ్డుకునేం దుకు ఓ దొంగల ముఠా తయారైందని విమర్శించారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. రూ.36 వేల కోట్లతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో గుంట పొలం కూడా ఎండిపోకుండా ఉండేందుకు ఇప్పటికే 9,500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసి పంటలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. మరో 500 మెగావాట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘తెలంగాణ’ మొక్కుల్లో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీవీరభద్ర స్వామిని దర్శించు కున్నారు. రూ.62,908 వ్యయంతో 20.28 గ్రాముల బరువుతో తయారు చేయించిన కోర మీసాలను వీరభద్రుడికి సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లిలోని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఇంట్లో భోజనం చేశారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు.. ప్రజలు 40 నుంచి 44 ఏళ్లు కాంగ్రెస్ నాయకులకు అవకాశమిస్తే ఏమీ చేయలేదని.. ఇప్పుడు తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ తరఫున కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని, వాటిపై స్పష్టమైన ఆధారా లతో అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. ‘‘ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసిన చరిత్ర కాంగ్రెస్ నేతలది. వారివి బానిస బతుకులు. కాంగ్రెస్ కల్చర్ చీప్ లిక్కర్ పంచే కల్చర్. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దొంగల ముఠా తయారైంది. చిల్లర రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు..’’అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి మొక్కుల విషయంలో కొందరు సన్నాసులు రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని.. ప్రజలందరూ బాగుండాలని తలపెట్టిన యాగంపై సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. త్వరలోనే టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన వరంగల్ రూరల్ జిల్లాలో త్వరలోనే టెక్స్టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. సూరత్, భీవండికి వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చేలా ఈ టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీనికి భూసేకరణ కూడా పూర్తయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. డోర్నకల్ నియోజకవర్గానికి తాత్కాలికంగా పాలేరు నుంచి నీరందిస్తామని హామీ ఇచ్చారు. మల్కాపూర్ దగ్గర రిజర్వాయర్ కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కోరారని.. దానికి కేబినెట్ ఓకే చెప్పిందని వెల్లడించారు. ఈసారి బీసీల బడ్జెట్ ఈ ఏడాది రూ.10–12 వేల కోట్లతో బీసీల బడ్జెట్ ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది సంచార జాతుల వారు ఉన్నారని, వారి కోసం రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని యాదవుల కోసం రూ.4 వేల కోట్లతో 88 లక్షల గొర్రెలు పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులు చెట్ల కింద, చెరువు కట్ట మీద క్షవరాలు చేసే పద్ధతి పోవాలని, రాష్ట్రవ్యాప్తంగా 40 వేల వరకు హైజెనిక్ సెలూన్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక రజకులకు డ్రైయింగ్ మిషన్, వాషింగ్ మిషన్లు అందజేసి అత్యాధునిక లాండ్రీ షాపులు ఏర్పాటు చేయిస్తామన్నారు. వీరభద్రుడి ఆలయానికి రూ.5 కోట్లు.. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ నుంచి రూ.28.25 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో కురవి వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున, మిగతా 4 మండల కేంద్రాలకు రూ.50 లక్షల చొప్పున ఇస్తామ ని నియోజకవర్గంలోని 77 గ్రామ పంచాయ తీలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం, మంత్రులు ఇంద్రక రణ్‌రెడ్డి, అజ్మీరా చందూలాల్, ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, కోరం కనకయ్య, కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీలు కొండా మురళీ, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. -
'రెడ్యానాయక్ చేరిక కుటిల రాజకీయం కాదు'
-
'రెడ్యానాయక్ చేరిక కుటిల రాజకీయం కాదు'
హైదరాబాద్: దళితులు, గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. గిరిజన తండాలను పంచాయతీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఆయన కూతురు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మంగళవారం సాయంత్రం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రెడ్యానాయక్ చేరికను కుటిల రాజకీయ చేరికలా చూడడం లేదని వ్యాఖ్యానించారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అండదండలు అందించాలన్న ఉద్దేశంతో ఆయన తమ పార్టీలో చేరారని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం చరిత్రలో కనీవినీ ఎరుగని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీలోని గిరిజన నాయకులు ఐక్యంగా పనిచేయాలని కేసీఆర్ కోరారు.