
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నోరు జారారు. ప్రతిపక్షాలను పరుష పదజాలంతో దూషించారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్‌కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని.. ఇతర ల.. కొడుకులకు లేదని రెడ్యానాయక్ నోరు పారేసుకున్నారు. రేవంత్ రెడ్డిని బోసి.. కే అంటూ సంబోధించారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకుడు రెడ్యానాయక్ ఇలాంటి మాటలు మాట్లాడటంతో సభకు వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాగా మాట్లాడేది అనే గుసగుసలు వినిపించాయి.
చదవండి: ‘పాత నంబర్ ఎందుకు మార్చారు?.. చైనాకు కాల్స్ ఎందుకు వెళ్లాయి?’
Comments
Please login to add a commentAdd a comment