నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్పై ఆదివారం దాడి జరిగింది. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అనుచరులు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ప్రకాశ్ గౌడ్ అనుచరులు ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ వద్ద సంజయ్పై దాడి చేసి వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో బ్రహ్మాజీ కుమారుడికి గాయాలయ్యాయి. టోల్గేట్ వద్ద ప్రకాశ్ అనుచరులకు, సంజయ్కు మధ్య వాగ్వాదం జరిగింది. దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే చూస్తుండగానే ఆయన అనుచరులు సంజయ్పై దాడి చేశారు. బ్రహ్మాజీ కుమారుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్రహ్మాజీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సంజయే తమ పట్ల దురుసుగా వ్యవహరించాడని ప్రకాశ్ గౌడ్ అనుచరులు చెప్పారు. పోలీసులు విచారణంలో భాగంగా టోల్గేట్ సిబ్బందిని ప్రశ్నించనున్నారు.