ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్! | mla prakash goud take u turn on party change | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్!

Published Thu, Oct 9 2014 5:32 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్! - Sakshi

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్!

హైదరాబాద్: రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డిలతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ ను గురువారం ఉదయం ప్రకాష్ గౌడ్ కలిశారు.  వీరందరూ టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది.

తలసాని శ్రీనివాస్, తీగల కృష్ణారెడ్డి... టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటన చేయగా ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డి పార్టీ మారుతున్నట్టు స్పష్టం చేయలేదు. సాయంత్రం చంద్రబాబును ప్రకాష్ గౌడ్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తానిప్పుడు పార్టీ మారడం లేదని చెప్పారు. తనను చేరమని టీఆర్ఎస్ ఆహ్వానించలేదన్నారు. టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement