ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్‌సభ బీజేపీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అహం పెరిగిపోవడం వల్లే సరైన ఫలితం రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పేరు ప్రస్తావించకుండా ప్రతిపక్ష కూటిమిపై విమర్శలు గుప్పించారు. ఇక.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపటంతో క్లారిటీ ఇచ్చారు.
‘‘ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాముడిని వ్యతిరేకించిన వాళ్లు అధికారంలో లేరు. రాముడిని గౌరవించాలనే సంకల్పం ఉన్నవాళ్లు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు. అదే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది’’ అని ఇంద్రేష్ కుమార్ స్పష్టం చేశారు.
జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారు.మరోవైపు.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు.
మరోవైపు.. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా .. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని అన్నారు. ఇటీవల ఆఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment