Indresh Kumar
-
బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ నేత యూ టర్న్!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్‌సభ బీజేపీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అహం పెరిగిపోవడం వల్లే సరైన ఫలితం రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పేరు ప్రస్తావించకుండా ప్రతిపక్ష కూటిమిపై విమర్శలు గుప్పించారు. ఇక.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపటంతో క్లారిటీ ఇచ్చారు.‘‘ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాముడిని వ్యతిరేకించిన వాళ్లు అధికారంలో లేరు. రాముడిని గౌరవించాలనే సంకల్పం ఉన్నవాళ్లు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు. అదే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది’’ అని ఇంద్రేష్ కుమార్ స్పష్టం చేశారు.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారు.మరోవైపు.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు.మరోవైపు.. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా .. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని అన్నారు. ఇటీవల ఆఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
‘అహం పెరిగింది.. అందుకే రాముడు అలా చేశాడు’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు పెట్టుకుంది. కానీ, గురి తప్పింది. అయితే ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అహం పెరిగిపోవడం వల్లే ఎన్నికల్లో అలాంటి ఫలితం వచ్చిందంటూ వ్యాఖ్యానించారాయన.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారాయన. అలాగే.. ప్రతిపక్ష ఇండియాకూటమిని కూడా ఆయన వదల్లేదు. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారాయన. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని కామెంట్ చేశారు.#Breaking: RSS slams Narendra Modi & the BJP for their arrogance.Taking a jibe at the Loksabha election results, RSS leader Indresh Kumar said that those who became arrogant didn’t get as much power as they were expecting, Prabhu Ram reduced their numbers.It’s open fight now! pic.twitter.com/mr7pnJtAFI— Shantanu (@shaandelhite) June 14, 2024ఇదిలా ఉంటే.. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా మెజారిటీ(272) కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం విఫలమైంది. కేవలం 241 సీట్లతో మిత్రపక్షాల మీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇదిలా ఉంటే.. మొన్నీమధ్యే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
‘2025 తర్వాత పాక్ కనిపించదు’
ముంబై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) సీనియర్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్... భారత్‌లో భాగం కాబోతుందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ మాదిరి అఖండ భారత్ రూపొందడానికి దారులు తెరుచుకుని ఉన్నాయని అన్నారు. రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో కరాచీ, లాహోర్, రావల్పిండిలలో ఇళ్లు కొనుక్కోవాలనే, బిజినెస్ చేయాలనే కల నెరవేరబోతుందనే విషయాన్ని రాసిపెట్టుకోండని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘1947కు మందు పాకిస్తాన్ అనేది లేదు.. 1945కు ముందు ప్రజలు దానిని హిందూస్తాన్లో భాగంగానే పరిగణించేవారు. అలాంటి పాకిస్తాన్ మళ్లీ 2025 తర్వాత తిరిగి హిందూస్తాన్లో భాగం కానుంది. అఖండ భారత్ కల కూడా సాకరమవుతుందనే నమ్మకం కలుగుతోంది. తొలిసారిగా భారత ప్రభుత్వం కశ్మీర్ సమస్యపై కఠిన వైఖరి తీసుకుంది.. తద్వారా సైన్యానికి ఆత్మవిశ్వాసం పెరిగింది. తాజాగా కశ్మీర్లో పరిస్థితులు మారాయి. ఇకపై లాహోర్‌లో జీవించడానికి.. చైనా అనుమతి తీసుకోకుండా మానసరోవరం వెళ్లడానికి కలలు కనవచ్చ’ని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ భారత్‌లో ఏ విధంగా భాగం కాబోతుందనే విషయాన్ని మాత్రం ఇంద్రేశ్ కుమార్ వ్యక్తపరచలేదు. -
గోవధపై ఆరెస్సెస్ నేత సంచలన వ్యాఖ్యలు
రాంచీ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కీలక నేత ఇంద్రేష్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లోకి భారత ఆర్మీ తమకు కావల్సినప్పుడు ప్రవేశిస్తుందని ఇటీవల పేర్కొన్న ఆయన.. తాజాగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన దారుణంపై స్పందించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జగ్రాన్ హిందూ మంచ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇంద్రేష్ మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆవును చంపాలని ఏ మతం బోధించద లేదన్నారు. ఎప్పుడైతే ఆవులను చంపడం (గోవధ) ఆపేస్తారో అప్పుడే దేశంలో కొనసాగుతోన్న మారణహోమానికి ఫుల్స్టాప్ పడుతుందని పేర్కొన్నారు. మూక దాడులు, హత్యలపై ఇంద్రేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మీ ఇంట్లో వాళ్లపైగానీ, పక్కింటి వారిపైగానీ.. ఎవ్వరిపైనైనా సరే దాడులు అనేది హేయమైన చర్య. అయితే ఆవులను చంపాలని చెప్పే మతం ఏదైనా ఉంటే చెప్పండంటూ ఆయన ప్రశ్నించారు. ‘క్రైస్తవులు ఆవును గోమాతగా పిలుస్తారు. యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించడమే అందుకు కారణం. మక్కా-మదీనాలో ఆవులను చంపడంపై నిషేధం ఉందన్న విషయం తెలిసిందే. అందుకే ఎప్పుడైతే గోవధను నిషేధించి, పూర్తిస్థాయిలో పాటిస్తారో అప్పుడే మూకదాడులు, హత్యాకాండ, అనిశ్చితికి తావుండని’ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ జూలై 17న అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఇంద్రేష్ ఖండించారు. హిందువులకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారన్న కారణంగా జార్ఖండ్‌లోని పాకుర్లో అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతియడానికి యత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆవులను చంపుతున్న కారణంగానే మెజార్టీ వర్గాల్లో అనిచ్చితి నెలకొని దాడులకు ప్రేరేపిస్తోందని, గోవధకు స్వస్తి చెబితే అంతా శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘ఏ క్షణంలోనైనా లాహోర్‌లోకి ప్రవేశిస్తాం’
నాగ్‌పూర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశిస్తుందని, అందుకు కేంద్రం గతంలో చేసిన సర్జికల్ దాడులే నిదర్శనమని పేర్కొన్నారు. భారత్‌లో ప్రస్తుత పరిస్థితి-స్థితిగతులపై మాట్లాడుతూ.. 300 మంది ఉగ్రవాదులను ఏరివేశామంటూ దాయాది పాక్‌ను హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉండగా కేవలం మూడు, నాలుగు పర్యాలు చేసిన కీలక దాడుల్లోనే ఈ ఘటన సాధించామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ.. ఆర్మీకి, ఎన్ఐఏ నిఘా విభాగాలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఉగ్రవాదులను ఏరివేస్తూ పాక్‌ను దెబ్బతీసినట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిందన్నారు. లాహోర్‌లో ఎప్పుడైనా మేం కాలుపెట్టగలమని తెలపడమే సర్జికల్ దాడుల సారాంశమని అభిప్రాయపడ్డారు. అఖండ భారతాన్ని పునర్నిర్మించాలని తాము కలలు కంటున్నామని.. నాగ్‌పూర్, లాహోర్లలో సొంత నివాసాలు కట్టుకోవాలనుందని మనసులో మాట బయటపెట్టారు. తుదిశ్వాస విడిచేవరకూ అఖండ భారత నిర్మాణం కోసం ఆరెస్సెస్ పని చేస్తుందన్నారు. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవార్, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ల భావజాలంతో నవ భారతం నిర్మితమౌతుందని ఇంద్రేష్ కుమార్ వివరించారు. (వైరల్ : భారత్ సర్జికల్ స్ట్రైక్స్ వీడియో..!) -
రాహుల్ గాంధీకి ఆరెస్సెస్ ఆహ్వానం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భగవద్గీత చదివితే ఆయన కూడా ఆరెస్సెస్‌లో చేరాలని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ అన్నారు. రాహుల్ గాంధీ అరెస్సెస్ నిర్వహించే కార్యక్రమాలకు రాహుల్ గాంధీ హాజరవ్వాలని ఆయన ఆహ్వానం పలికారు. అప్పుడైనా ఆయనకు భారత్ అంటే ఏమిటో అర్ధమవుతుందని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గత వారం రాహుల్‌గాంధీ చెన్నైలో మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాను కూడా భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు చదువుతానని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఇంద్రేష్ కుమార్ ‘రాహుల్‌గాంధీ గీతా, పురాణాలు చదివితే ఆయన భవిష్యత్తులో ఆరెస్సెస్‌లో చేరాలనికోరుకుంటారు’ అంటూ ఆయన హాస్యమాడారు. -
వారికి వ్యతిరేకంగా ఆధారాల్లేవ్!!
జైపూర్: అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, ఆరెస్సెస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ సహా నలుగురు నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) క్లీన్చిట్ ఇచ్చింది. 2007లో జరిగిన అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో దర్యాప్తును ముగిస్తున్నట్టు నివేదికను జైపూర్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. నలుగురు నిందితులకు వ్యతిరేకంగా తగినంతగా ఆధారాలు సేకరించలేకపోయామని, అందుకే వారికి వ్యతిరేకంగా కేసును మూసివేస్తున్నామని ఎన్ఐఏ తెలిపింది. సాధ్వీ, ఇంద్రేష్‌కుమార్ సహా నిందితులు ప్రిన్స్, రాజేంద్రకు వ్యతిరేకంగా కేసును మూసివేస్తూ ఎన్ఐఏ నివేదిక సమర్పించిందని, ఈ నివేదికను అంగీకరించాలా? వద్దా? అనేది ఏప్రిల్ 17న ప్రత్యేక కోర్టు నిర్ణయించనుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్వినీ శర్మ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సందీప్ దంగే, సురేశ్ నాయర్, రాంచద్ర కల్సంగ్రా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేయడంలో ఎన్ఐఏ అశక్తత వ్యక్తం చేయడంతో ఈ కేసు విచారిస్తున్న జడ్జి దినేశ్ గుప్తా ఎన్ఐఏ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2007 అక్టోబర్‌లో ప్రముఖ సుఫీ దర్గా అయిన అజ్మీర్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు మృతిచెందగా, 17 మంది గాయపడ్డారు. -
'మొదట్నుంచి చెబుతూనే ఉన్నాం'
న్యూఢిల్లీ: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు క్లీన్ చీట్ ఇవ్వడాన్ని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నేతలు స్వాగతించారు. ఈ కేసుతో సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు ఎటువంటి సంబంధం లేదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని బీజేపీ అధికార ప్రతినిధి, లోక్ సభ ఎంపీ మీనాక్షి లేఖి అన్నారు. సాధ్వికి క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా సాధ్విని ఈ కేసులో ఇరికించారని ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ ఆరోపించారు. పథకం ప్రకారం దేశభక్తులను అప్రదిష్టపాల్జేస్తున్నారని విమర్శించారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రమేయం లేదని ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొందని, దీంతో ఆమెపై పెట్టిన కేసు ఉపసంహరించబడుతుందని డిఫెన్స్ లాయర్ మహేశ్ జెఠ్మలానీ తెలిపారు. మాలెగావ్ పేలుళ్ల కేసుపై రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. సాధ్వితో పాటు 12 మంది నిందితులపై 'మోకా' కింద పెట్టిన అభియోగాలను ఎన్ఐఏ ఉపసంహరించుకుంది.