'మొదట్నుంచి చెబుతూనే ఉన్నాం' | I had been saying from long that no case against Pragya Thakur: Meenakshi Lekhi | Sakshi
Sakshi News home page

'మొదట్నుంచి చెబుతూనే ఉన్నాం'

Published Fri, May 13 2016 4:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

'మొదట్నుంచి చెబుతూనే ఉన్నాం'

'మొదట్నుంచి చెబుతూనే ఉన్నాం'

న్యూఢిల్లీ: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు క్లీన్ చీట్ ఇవ్వడాన్ని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నేతలు స్వాగతించారు. ఈ కేసుతో సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు ఎటువంటి సంబంధం లేదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని బీజేపీ అధికార ప్రతినిధి, లోక్ సభ ఎంపీ మీనాక్షి లేఖి అన్నారు. సాధ్వికి క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా సాధ్విని ఈ కేసులో ఇరికించారని ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ ఆరోపించారు. పథకం ప్రకారం దేశభక్తులను అప్రదిష్టపాల్జేస్తున్నారని విమర్శించారు.

మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రమేయం లేదని ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొందని, దీంతో ఆమెపై పెట్టిన కేసు ఉపసంహరించబడుతుందని డిఫెన్స్ లాయర్ మహేశ్ జెఠ్మలానీ తెలిపారు. మాలెగావ్ పేలుళ్ల కేసుపై రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. సాధ్వితో పాటు 12 మంది నిందితులపై 'మోకా' కింద పెట్టిన అభియోగాలను ఎన్ఐఏ ఉపసంహరించుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement