Meenakshi lekhi
-
‘నేను సంతకం చేయలేదు.. కేంద్రమంత్రి క్లారిటీ’
సాక్షి, ఢిల్లీ: హమాస్‌ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా ప్రకటించినట్లు వెలుగులోకి వచ్చిన విషయంపై కేంద్రమంత్రి మీనాక్షీ లేఖీ స్పందించారు. హమాస్‌ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌గా గుర్తిస్తున్నారా? అంటూ పార్లమెంట్లో ప్రశ్నగా ఉన్న పేపర్‌కు సమాధానంగా తాను ఎటువంటి సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ‘స్టార్ గుర్తు లేని’ ప్రశ్నకు కేంద్ర మంత్రి మీనాక్షీ సమాధానం ఇచ్చినట్లు లిఖితపూర్వకమైన పత్రం ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. You have been misinformed as I have not signed any paper with this question and this answer @DrSJaishankar @PMOIndia https://t.co/4xUWjROeNH — Meenakashi Lekhi (@M_Lekhi) December 8, 2023 ‘అది సరైన సమాచారం కాదు. నేను ఎటువంటి ప్రశ్నకు సంబంధించిన పత్రాలపై సమాధానంగా సంతకం చేయలేదు’ అని స్పష్టం చేస్తూ.. కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని నరేంద్రమోదీకి ‘ఎక్స్’లో ట్యాగ్ చేశారు. అయితే తాను ఈ విషయంపై అధికారికంగా దర్యాప్తు చేపడతామని, దర్యాప్తులో అసలు దోషి ఒవరో తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. In the tweet below, - Meenakshi Lekhi ji is denying&disassociating to a response attributed to her - says has no idea who drafted this as response to a PQ since she didn’t sign it - is she then claiming it is a forged response, if yes this is a serious breach and violation of… pic.twitter.com/4mNscaFhpA — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) December 9, 2023 అయితే, కేంద్ర మంత్రి మీనాక్షీ క్లారిటీపై శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. ‘ఈ విషయంలో ఫోర్జరీ జరిగి ఉంటుందని మీనాక్షీ భావిస్తున్నారా? అదే నిజమైతే. ఇది తీవ్రస్థాయి నిబంధనల ఉల్లంఘనే. దీనిపై ఆమె స్పష్టత వస్తే మేం సంతోషిస్తాం’ అని అన్నారు. -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్‌కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
ఆ డాక్యుమెంట్ ఆధారాలు లేనందునే జాప్యం.. ఎంపీ ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు
న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రచారం చేసేందుకు జీ20 వేదికను వినియోగిస్తామని సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి వెల్లడించారు. రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. భారతీయ సంస్కృతి, ప్రాచీన సంస్కృతి పరిరక్షణకు, చోరీకి గురై దేశం నుంచి తరలిపోయిన ప్రాచీన కళాఖండాలను తిరిగి వెనక్కి రప్పించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అలాగే జీ20 వేదికగా భారత సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సవివరంగా సమాధానాలు చెప్పారు. చదవండి: (CM YS Jagan: సీఎం జగన్ కీలక ప్రకటన) జీ20 వేదికపై భారతీయ సంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే దిశగా ప్రభుత్వం జీ20 భాగస్వామ్య దేశాలన్నింటితోను సంప్రదింపులు జరుతున్నట్లు మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. చోరీకి గురైన ప్రాచీన కళాఖండాలను తిరిగి దేశాలను రప్పించే విషయంలో యునెస్కో ఒడంబడికకు లోబడి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఒడంబడికపై సంతకాలు చేసిన రెండు దేశాల మధ్య ఆయా దేశాల వారసత్వ సంపదను పర్సపరం కాపాడాలి. దీనికి సంబంధించి ఇటీవలే స్కాట్లాండ్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపినట్లు చెప్పారు. అలాగే వివిధ దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇదో నిరంతర ప్రక్రియ. చోరీకి గురై విదేశాలకు తరలిపోయిన కళాఖండాలను తిరిగి వెనక్కి రప్పించే ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మంత్రి తెలిపారు. చోరీకి గురైన కళాఖండాలకు సంబంధించి సరైన వివరాలు లేకపోవడం, చోరీ జరిగినట్లు రిపోర్టు కాకపోవడం వంటి తగిన డాక్యుమెంట్ ఆధారాలు లభ్యం కానందున ఈ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. -
BJP MP: మీ ఎమ్మెల్యేలు, మీరు ఈ మాఫియాలో భాగమే!
న్యూఢిల్లీ: రేషన్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. "మీ పేరు కేజ్రీవాల్, నాట్వర్లాల్ కాదు, దయచేసి కేంద్రానికి నిరంతరం లేఖలు రాయడం ద్వారా ప్రజలను అంధకారంలో ఉంచడం ఆపండి." అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. "మీరు ఐదేళ్ళకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని రేషన్ షాపుల లైసెన్సులను రద్దు చేసారు. ఎంత మందిని జైలుకు పంపారు. ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీటిపై మీరు తీసుకున్న చర్యలేంటి? ప్రధానమంత్రికి లేఖలు రాయడంతోనే మీరు కాలం వెళ్లదీస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు, మీరు ఈ మాఫియాలో భాగమేనని స్పష్టమవుతుంది" అంటూ బీజేపీ ఎంపీ విమర్షలు గుప్పించారు. "రేషన్ డోర్ డెలివరీ చేసే సమయం నుంచి ఈ రేషన్‌ను ఎక్కడ నుండి కొన్నారో.. బడ్జెట్లో కేటాయించిన వాటి వివరాలు కూడా మాకు చెప్పండి. మీరు లబ్ధిదారులుగా గుర్తించిన గృహాలన్నీంటికీ రేషన్ అందించాలనుకుంటే దాన్ని మేం స్వాగతిస్తున్నాం. మీ స్వంతంగా రేషన్ పథకం ద్వారా దాని కోసం ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే మీ వద్ద ఉన్న రేషన్‌ను ఆహార భద్రతా చట్టం ప్రకారం ఢిల్లీకి ఇస్తారు.” అని ఎంపీ మీనాక్షీ లేఖి తెలిపారు. ఇక రేషన్‌ను ఇంటికి పంపిణీ చేయడానికి మార్పులు తేవాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. (చదవండి: 4 భారీ టవర్లు.. 5 దశాబ్దాల సేవ.. 10 సెకన్లలోనే!) -
భారత్‌ను క్షమాపణలు కోరిన ట్విటర్
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్ తాను చేసిన తప్పిదానికి భారత్‌ను లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరింది. బుధవారం బీజేపీ ఎంపీ మినాక్షి లేఖీ నేతృత్వంలోని జేపీసీ ముందు ట్విటర్ ప్రతినిధులు హాజరైన క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా మీనాక్షి లేఖీ మీడియాతో మాట్లాడుతూ.. లడఖ్‌ను చైనా భూభాగంలో చూపించినందుకు ట్విటర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరిందని చెప్పారు. భారత పటాన్ని తప్పుగా జియో ట్యాగింగ్ చేయడంపై ట్విటర్ ఇండియా మాతృసంస్థ అమెరికా ఐఎన్‌సీ చీఫ్ ప్రైవసి ఆఫిసర్ డమైన్ కరియన్ అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చారని తెలిపారు. లడఖ్‌ను చైనా భూభాగంలో చూపించి భారతీయుల మనోభవాలను దెబ్బతీసినందుకు తమ తప్పును ఈ నెల 30వ తేదీ నాటికి సవరించుకుంటామని హామీ ఇచ్చినట్లు మీనాక్షి లేఖీ వెల్లడించారు. (చదవండి: ట్విట్టర్‌పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం) కాగా ఇటీవల ట్విటర్ చైనాకు సంబంధించిన ఓ పోస్టు చేస్తూ లడఖ్‌ను చైనా భుభాగంలో చూపించింది. దీంతో ట్విటర్ తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రశ్నించేలా వ్యవహరించిందని పేర్కొంది. అంతేగాక దీనిని దేశ ద్రోహంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ట్విటర్ తప్పిదానికి గల కారణాలేంటో ట్విటర్ మాతృసంస్థ అమెరికా ఐఎన్‌సీ లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని సంస్థ యాజామన్యాన్ని ఆదేశించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ట్విటర్ దిగోచ్చి క్షమాపణలు చెప్పింది. (చదవండి: ఇన్‌స్టా మొరాయింపు: ‘నేను ఎలా బ్రతకగలను’) -
‘వాళ్లనూ ఎడ్యుకేట్ చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై చదువుకున్న వారికి సైతం అవగాహన కల్పించాలనేందుకు సత్య నాదెళ్ల వ్యాఖ్యలే సరైన ఉదాహరణని ఆమె అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌ల్లో నిరాదరణకు గురవుతున్న మైనారిటీలకు అవకాశాలు కల్పించేందుకే పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన ఉద్దేశమని ఆమె ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్లో ఆమె మైక్రోసాఫ్ట్ కొలువుతీరిన అమెరికాలో యెజ్దీల స్ధానంలో సిరియన్ ముస్లింలకు ఎందుకు అలాంటి అవకాశాలు కల్పించడం లేదని మీనాక్షి లేఖి విస్మయం వ్యక్తం చేశారు. ఇరాక్, సిరియా, టర్కీల్లో ఉన్న యెజ్దీలను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ చెలరేగడంతో ఉగ్ర సంస్థ ఆగడాలు భరించలేని యెజ్దీల్లో 15 శాతం మందిపైగా ఇతర దేశాలకు పారిపోయారు. సీఏఏ సరైన చర్య కాదని, భారత్‌కు వచ్చిన ఓ బంగ్లాదేశీ భారత్‌లో మరో యూనికార్న్‌ను సృష్టించడం లేదా ఇన్ఫోసిస్‌కు సీఈవో స్ధాయికి ఎదగడం వంటివి చూడాలని తాను కోరుకుంటానని మన ఉద్దేశాలు అలా ఉండాలని సత్య నాదెళ్ల బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. చదవండి : సీఏఏపై సత్య నాదెళ్ల ఏమన్నారంటే.. -
'ఆ సమయంలో సిద్ధూ ఎక్కడికి పారిపోయారు'
న్యూఢిల్లీ : పాకిస్తాన్లో నాన్కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజేపి నాయకురాలు మీనాక్షి లెఖీ తెలిపారు. అయితే దాడి జరిగిన సమయంలో కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎక్కడికి పారిపోయారో తనకు తెలియదని, ఎవరైనా కనిపెట్టాలంటూ చురకలంటించారు. గురుద్వారాపై జరిగిన దాడిపై శనివారం బిజెపి జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లేఖీ మాట్లాడుతూ .. పాకిస్తాన్‌లోని మతపరమైన ప్రదేశాలలో నిరంతరం హింస చోటుచేసుకుంటుందని వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా బలవంత మత మార్పిడులు, అత్యాచారాలతో మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. పాకిస్తాన్లో యువతులను బలవంతంగా ఎత్తుకొచ్చి వారికి మతమార్పిడిలు చేసి ముస్లిం అబ్బాయిలకు ఇచ్చి వివాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివి అక్కడ వేల సంఖ్యలో జరుగుతున్న పోలీసులు, ప్రభుత్వం అరికట్టాల్సింది పోయి వారికి వత్తాసు పలకడం దారుణమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి అక్కడ హింస నిరంతరాయంగా కొనసాగుతుండడంతో మైనారిటీలు భారతదేశంలోకి బలవంతంగా చొరబడుతున్నారు. దీనివల్ల దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడం సరైందేనని తాను భావిస్తున్నట్లు తెలిపారు. సీఏఏ అవసరం దేశంలో ఎంత ఉందనేది పాకిస్తాన్లో జరిగిన చర్యలే నొక్కిచెబుతున్నాయని వివరించారు. సిక్కులకు ఎంతో పవిత్రంగా భావించే నాన్కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడులు కాబా, జెరూసలేంపై జరిగిన దాడులతో సమానం అని ఆమె అభివర్ణించారు.ఈ దాడి జరిగిన సమయంలో సిద్దూ ఎక్కడికి పారిపోయాడో తనకు తెలియదని పేర్కొన్నారు. అతను ఎక్కడున్నాడనేది ఎవరైనా కనిపెట్టాలని, ఒకవేళ ఈ దాడి జరిగిన తర్వాత ఐఎస్ఐ చీఫ్ ను ఆలింగనం చేసుకుంటాడేమోనన్న విషయాన్ని కాంగ్రెస్ పరిశీలించాల్సిన అవసరం ఉందని మీనాక్షి లేఖీ అభిప్రాయపడ్డారు. -
ఇప్పుడు కూడా ఆయనను కౌగిలించుకుంటారా?
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో సిక్కులపై రాళ్ల దాడిని బీజేపీ నేత, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఖండించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లోని నంకానా గురుద్వారా సాహిబ్ వద్ద శుక్రవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. సిక్కు యువతి జగ్జీత్కౌర్ను అపహరించి, మతమార్పిడికి పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయంపై స్పందించిన మీనాక్షి లేఖి.. కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబట్టారు. ‘ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా నవజ్యోత్ సింగ్ ఐఎస్ఐ చీఫ్‌ను ఆలింగనం చేసుకుంటారా? ఈ విషయం గురించి కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు. సిద్ధు అన్నయ్య ఎక్కడికి పారిపోయారో తెలియడం లేదు’ అని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాగా గతేడాది పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సమయంలో నవజ్యోత్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది దేశపు ఆర్మీ చీఫ్‌ను ఎలా కౌగిలించుకుంటారంటూ సిద్ధుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం జోక్యం చేసుకోవాలి: మాయావతి సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ జన్మస్థానమైన నంకానా సాహిబ్ వద్ద సిక్కులపై రాళ్ల దాడిని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు...‘ గురునానక్ దేవ్ జీ జన్మస్థానం వద్ద శుక్రవారం జరిగిన మూకదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ఘటనల గురించి మన దేశం సహజంగానే స్పందిస్తుంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని ట్విటర్ వేదికగా విఙ్ఞప్తి చేశారు. -
ఆ స్థానం ఎవరు గెలిస్తే.. కేంద్రంలో వారిదే అధికారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్థానంలో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి రావడం గత రెండు దశాబ్ధాలుగా సాగుతోంది. 1992లో జరిగిన ఉప ఎన్నికల నుంచి ఈ స్థానంలో ఎవరు గెలిస్తే కేంద్రంలో కూడా అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగగా.. దానిలో 13సార్లు ఇదే సీన్ రిపీటైంది. దీంతో ఈ స్థానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌తో సహా ఆప్ కూడా ప్రతీష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశంలో కీలకమై కేంద్ర వ్యవస్థలన్నీ ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటం విశేషం. భారత అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంట్, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాజ్యాంగ బద్దమైన సంస్థలు, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల నివాసాలు ఇదే నియోజకవర్గంలో ఉన్నాయి. అంతేకాదు దేశ రక్షణ వ్యవస్థకు చెందిన అనేక సంస్థలు కూడా ఈ స్థానం పరిధిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖీ విజయం సాధించారు. అనుకున్నట్లుగానే కేంద్రంలో అత్యధిక మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకుముందు జరిగిన 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్రంలో కొలువుదీరింది. 1998, 1999లో ఎన్నికల్లో కేంద్రంలో వాజ్‌పేయీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు ఎన్నికల్లోనూ అనుహ్యంగా బీజేపీ అభ్యర్థి జగ్మోహన్ విజయం సాధించారు. ఆయన కొద్ది కాలంపాటు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్కే దావన్‌పై ఆయన గెలుపొందారు. అయితే అంతకుముందు 1996లో వాజ్‌పేయీ ప్రభుత్వం లోక్‌సభలో మెజార్టీ లేక కేవలం 13 రోజులకే పడిపోయిన విషయం తెలిసిందే. అప్పడు కూడా జగ్మోహన్ విజయం సాధించడం విశేషం. అద్వానీ గెలుపు.. ఉప ఎన్నికల్లో ఓటమి 1991లో దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఘన విజయం సాధించారు. అయితే అదే సమయంలో ఆయన గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి కూడా గెలుపొందడంతో న్యూఢిల్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హాపై కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ కన్నా గెలుపొందారు. ఆ సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1992కు ముందు ఈ సాంప్రదాయంలో కొంత మార్పు వచ్చింది. 1951 నుంచి 89 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఆరుసార్లు మాత్రమే న్యూఢిల్లీ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటే కేంద్రంలో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. స్వాతంత్ర భారతంలో మొదటి సారి 1951లో జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానాన్ని కిసాన్ మాజ్దుర్ ప్రజా పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ నుంచి ఇక్కడ పోటీచేసిన సుచేతా కృపాలాని ఘన విజయం సాధించారు. ఆతరువాత ఎన్నికల్లో కూడా (1957) కూడా కృపాలానినే రెండోసారి విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత యూపీ అసెంబ్లీకి పోటీచేసి దేశ చరిత్రలో తొలి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. అప్పటి నుంచే ఈ సాంప్రదాయం మొదలైంది. ఇక 1962, 1971, 84 ఎన్నికల్లో న్యూఢిల్లీతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక అత్యయిక పరిస్థితి అనంతరం జరగిన తొలి ఎన్నికల్లో (1977) బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు అటల్ బిహారి వాజ్‌పేయీ.. భారతీయ లోక్‌దళ్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రంలో మోరార్జీ దేశాయ్ నేతృత్వంలో తొలి కాంగ్రెసేతేర ప్రభుత్వాన్ని (జనతా) ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి అద్వానీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందగా.. వీపీ సింగ్ సారథ్యంలో నేషనల్ ఫ్రెంట్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 1967, 80 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం ఇతరులు కైవసం చేసుకున్నారు. ఈసారి విజయం ఎవరిదో.. ఇలా వినూత్న సాంప్రదాయానికి వేదికైన న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో విజయం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ మీనాక్షీ లేఖి మరోసారి బరిలో నిలవగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అజయ్ మాకెన్ మరోసారిపోటీలో నిలిచారు. ఆప్ నుంచి బ్రిజేష్ గోయల్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాలకు బీజేపీయే సొంతం చేసుకుంది. మరోసారి అదే ధీమాతో బరిలో నిలిచింది. దీనిలో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో కూడా మొదటినుంచి వ్యూహాత్మకంగా అడుగులువేసింది. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను ఇక్కడి నుంచి బరిలో నిలపాలని బీజేపీ భావించినా.. చివరి నిమిషంగా లేఖీ అభ్యర్థిగా ప్రకటించింది. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు.. (10) కరోల్‌బాగ్, పటేల్ నగర్, మోతీ నగర్, ఢిల్లీ కాంట్, రాజేంద్ర నగర్, న్యూఢిల్లీ, కస్తూరిబా నగర్, మాలవియ నగర్, ఆర్కే పురం, గ్రేటర్ కైలాష్. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఆప్ విజయం సాధించడం విశేషం. -
మురికిగుంట ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ: ‘మీరు మాకు ఓటేయండి.. మేము మీకు మలేరియా, డెంగ్యూ లాంటివి ఇస్తాం’ ఇదీ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల పేరిట వెలిసిన పోస్టర్లు. నడివీధిని మురుగు నీరు ముంచెత్తి, బహిరంగ చెరువును తలపిస్తున్న దృశ్యాన్ని నిరసిస్తూ ఓ రొబోటిక్ ఇంజినీర్ తన నిరసనను ఇలా వ్యక్తం చేశారు. ‘ఓపెన్ ఎయిర్ సీవేజ్ లేక్’ ప్రారంభోత్సవం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎంపీ మీనాక్షి లేఖి, ఎమ్మెల్యే శివచరణ్‌లను ఆయన ఆహ్వానించారు. ముందుగా చెప్పుకున్న పోస్టర్లలో వీరిద్దరి ఫొటోలు చేర్చారు. అసలే ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతున్న కార్యక్రమమంటే మాటలా? దీంతో దుర్గంధభరిత పరిసరాల్ని శుభ్రం చేసే పని మొదలైంది. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు ప్రజాపనుల విభాగం ట్రక్కులు ఒక దాని వెనక మరొకటి వచ్చి మురుగు నీటిని తొలగించి అక్కడి డ్రైనేజీ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టారు. ఎన్నికల సమయం కూడా కావడంతో సమస్య త్వరగా పరిష్కారమైందని అంటున్నారు ఆ ఇంజినీర్ తరుణ్ భల్లా. ఈ సమస్యను స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ‘హింసాత్మక మార్గంపై నాకు ఆసక్తి లేదు. అలాగే, మునిసిపల్ అధికారుల చేతికి గ్రీజు అంటించాలని కూడా అనుకోలేదు. ఓ సామాన్యుడిగా ఇతరుల మద్దతు కూడగట్టడమే నా బలం’ అని సమస్య పరిష్కారం సందర్భంగా తరుణ్ వ్యాఖ్యానించారు. శుభ్రంగా మారిన రోడ్డు -
‘మిస్టర్ స్టుపిడ్’.. క్షమాపణలు చెప్పాలి’
ఇండోర్ : పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సందర్భంగా సిద్ధూ ఇండోర్ మేయర్‌ను విమర్శించిన సంగతి తెలిసిందే. సిద్దూ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె, సిద్ధూని ఉద్దేశిస్తూ.. ‘మిస్టర్ స్టుపిడ్’ అనడమే కాక మేయర్ మాలిని లక్ష్మణ్‌సింగ్ గౌర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిద్ధూ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా ఇండోర్‌లోని రాజ్వాడ ప్రాంతంలో దేవి అహల్య విగ్రహం ముందు మౌన దీక్ష చేసి నిరసన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇండోర్‌లో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న సిద్ధూ, నగర మేయర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలో జరుగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతపై మాట్లాడుతూ.. ‘చప్పట్లు కొట్టండి అలాగే మేయర్‌ను కూడా కొట్టండి’ అంటూ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక నష్టపరిహారం ఇవ్వకుండా ప్రజల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిద్ధూ టెలివిజన్ కామెడీ షోలో ‘చప్పట్లు కొట్టు’ అనే పదం ఎక్కువగా వాడతారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అదే పదాన్ని వాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా నేత పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో సిద్ధూ క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 28న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
ఆ చరిత్ర పటేల్‌కే దక్కుతుంది : మీనాక్షి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో కలిసి పోయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఆరోపించారు. సొంతపార్టీకి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంత్యక్రియలు కూడా సరిగ్గా చేయని పార్టీ కాంగ్రెస్ అని ఆమె వ్యాఖ్యానించారు. నగరంలోని ముషీరాబాద్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ యువ భేరీలో పాల్గొన్న మీనాక్షి మాట్లాడుతూ.. కొన్ని కుటుంబాల కలయిక మహాకూటమని వర్ణించారు. చాయ్ అమ్మిన మామూలు మనుషులను ప్రధాని చేసిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. రైతులకు భీమా, ఆయుష్మాన్ భారత్ వంటి గొప్ప పథకాలను మోదీ ప్రభుత్వం అమలుచేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర పథకాలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రాంతాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన ఘనత సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కే దక్కుతుందని ఆమె గుర్తుచేశారు. దక్షిణ భారతంలో తినడానికి తిండి కూడా దొరకదని పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. బీజేపీ మద్దతు తెలపడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. సచివాలయానికి రాకుండా పాలిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని విమర్శించారు. టీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరని.. కేవలం బిడ్డను ఎంపీ చేసి కుటుంబ పాలన చేస్తున్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరు చూసి టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. -
ప్రియాంక గాంధీకీ ఆ వేధింపులు తప్పలేదు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు భద్రత కరవైందన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్‌కు బీజేపీ దీటుగా బదులిచ్చింది. కథువా ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో స్వయంగా ప్రియాంక గాంధీనే వేధింపులకు గురిచేశారని బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్త తనను లైంగికంగా వేధించారన్న మహిళ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె ఢిల్లీ పోలీసులను కోరారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో గతంలో పనిచేసిన ఓ మహిళ స్వయంగా తన సహచరుడే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసుకు ఫిర్యాదు చేశారని, ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమెకు భద్రత కల్పించాలని మీనాక్షి లేఖి ఢిల్లీ పోలీసులను కోరారు. కాగా మహిళల భద్రత విషయంలో భారత్ అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో ముందుందన్న రాయ్‌టర్స్ సర్వేను ఉటంకిస్తూ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని తన గార్డెన్లో యోగా వీడియోలు రూపొందిస్తుంటే మహిళలపై లైంగిక దాడులు, హింస విషయంలో దేశం సిరియా, ఆప్ఘనిస్తాన్, సౌదీ అరేబియాలను మించిపోతోందని రాహుల్ ట్వీట్ చేయడం రాజకీయంగా దుమారం రేపింది. -
‘కథువా కేసుకు మతం రంగు’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి, దారుణ హత్య కేసుకు మతం రంగు పులుముతున్నారని బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి విపక్షాలపై మండిపడ్డారు. గతంలో దళితులు, మైనారిటీలపై దాడులంటూ గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ తాజాగా మహిళల అంశాలపై మొసలికన్నీరు కారుస్తోందన్నారు. కథువా ఘటనలో నిందితులకు అనుకూలంగా మాట్లాడిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను కొందరు తప్పుదారి పట్టించారని, వారు అలా వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు. ఈ ఘటనను బీజేపీ ఇప్పటికే ఖండించిందని, నిందితులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడతాయని చెప్పారు. మరోవైపు ఉన్నావ్ ఘటనను లేఖి ప్రస్తావించారు. ఈ ఘటన గత ఏడాది జరిగిందని, అప్పట్లో బాధితురాలు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ పేరును మేజిస్ర్టేట్ ఎదుట ప్రస్తావించలేదని చెప్పారు. ఆ తర్వాతే ఆమె సెంగార్‌పై ఫిర్యాదు చేశారని, ప్రస్తుతం ఆయనను సీబీఐ ప్రశ్నిస్తోందని, బాధితురాలి తండ్రిని వేధించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సింగ్‌ను అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. లైంగిక దాడికి లోనయ్యే వారంతా బాధితులేనని..వీటికి మతం రంగు పులమవద్దని కోరారు. అస్సాంలో ఐదో తరగతి విద్యార్థినిపై జాకీర్ హుస్సేన్ అనే యువకుడితో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేసి, సజీవంగా హతమార్చారని దీనిపై విపక్షాలు ఎందుకు నోరుమెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. -
'మొదట్నుంచి చెబుతూనే ఉన్నాం'
న్యూఢిల్లీ: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు క్లీన్ చీట్ ఇవ్వడాన్ని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నేతలు స్వాగతించారు. ఈ కేసుతో సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు ఎటువంటి సంబంధం లేదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని బీజేపీ అధికార ప్రతినిధి, లోక్ సభ ఎంపీ మీనాక్షి లేఖి అన్నారు. సాధ్వికి క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా సాధ్విని ఈ కేసులో ఇరికించారని ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ ఆరోపించారు. పథకం ప్రకారం దేశభక్తులను అప్రదిష్టపాల్జేస్తున్నారని విమర్శించారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రమేయం లేదని ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొందని, దీంతో ఆమెపై పెట్టిన కేసు ఉపసంహరించబడుతుందని డిఫెన్స్ లాయర్ మహేశ్ జెఠ్మలానీ తెలిపారు. మాలెగావ్ పేలుళ్ల కేసుపై రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. సాధ్వితో పాటు 12 మంది నిందితులపై 'మోకా' కింద పెట్టిన అభియోగాలను ఎన్ఐఏ ఉపసంహరించుకుంది. -
'మోదీని దేవుడిగా భావిస్తున్నారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నరేంద్ర మోదీ ఫోబియాను వ్యాపింపజేస్తోందని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆరోపించారు. దేశంలో కరువు వచ్చినందుకు మోదీ ప్రభుత్వాన్ని నిందిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు మోదీని దేవుడిగా భావిస్తున్నారేమో కానీ ఏదో ఒకరోజు కరువుకు కూడా ఆయనే కారణమని చెబుతారని లేఖి ఘాటైన విమర్శలు చేశారు. 65 ఏళ్లకు దేశానికి అసమర్థపాలన అందించిన కాంగ్రెస్ పార్టీ కరువుకు, నీటి ఎద్దడికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 'కరువుకు వాటర్ మేనేజ్మెంట్లోని లోపమే కారణం. నదులు పుష్కలంగా ఉన్న ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా కరువుతో సతమతమవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారు. వారి అవినీతిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. తప్పు చేసిన కాంగ్రెస్ నాయకులకు కష్టాలు తప్పవు' అని మీనాక్షి లేఖి అన్నారు. -
'వాళ్లిద్దరూ ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలు'
కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షీద్ ఇద్దరూ ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలంటూ బీజేపీ తీవ్రంగా మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ విమర్శలను ఖండిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందని, ప్రధానమంత్రి ఈ విషయంలో చెబుతున్న మాటలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించిందని ఆమె అన్నారు. ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో 130 మంది మరణించినా, కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఐఎస్ఐఎస్, తాలిబన్లకు ప్రచారకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. భారత్- పాక్‌ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన తొలగిపోవాలంటే ముందు మోదీని తొలగించి తమను అధికారంలోకి తీసుకురావాలని మణిశంకర్ అయ్యర్ ఓ పాకిస్థానీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దీనిపైనే బీజేపీ మండిపడింది. అలాగే విదేశాంగ శాఖ మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా గత వారం పాకిస్థాన్‌లో ఉండి ప్రధానమంత్రిపై విమర్శలు చేయడంతో ఆయనపైనా మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండు దశాబ్దాలుగా బిహార్‌లో ఓటమి అనుభవం లేదని, అలాగే ఆయనకు తనను ఆరాధించే వాళ్లతో తప్ప ఇతరులతో మాట్లాడటం పెద్దగా రాదని ఖుర్షీద్ పాకిస్థాన్‌లోని జిన్నా ఇన్స్టిట్యూట్లో చేసిన ప్రసంగంలో అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడి.. కాంగ్రెస్ నేతలను తాలిబన్లు, ఐఎస్ఐఎస్ ప్రచారకర్తలుగా అభివర్ణించింది. -
షీలా దీక్షిత్ భారతీయురాలే: మీనాక్షి
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ భారతీయురాలేనని మీనాక్షి లేఖి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోడీ పాలనను షీలా ప్రశంసించడం తప్పు కాదని లేఖి తెలిపారు. మోడీ సమర్ధవంతంగా పాలన అందిస్తున్న కారణంగానే షీలా ప్రశంసించారని లేఖీ అన్నారు. ఓ ప్రత్యేక విజన్ తో మోడీ పాలన సాగుతోంది. గెలిచే ప్రతివ్యక్తిలోనూ విశ్వాసం కనిపిస్తుందని.. మోడీలోనూ అదే కనిపిస్తోందని షీలా దీక్షిత్ వ్యాఖ్యలు చేశారు. Follow @sakshinews -
54 ఏళ్ల తరువాత..మరోసారి మహిళ
న్యూఢిల్లీ: దాదాపు 54 ఏళ్ల తరువాత న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో మహిళా అభ్యర్థి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్మాకెన్ను ఓడించడం తెలిసిందే. న్యూఢిల్లీ ఎంపీగా 54 ఏళ్ల క్రితం స్వాతంత్య్ర సమరయోధురాలు సుచేతా కృపలానీ ఎంపీగా వ్యవహరించారు. ఆమె 1952-1957 మధ్యకాలంలో న్యూఢిల్లీ ఎంపీగా పనిచేశారు. అప్పటి నుంచి 2014 వరకు పురుష ఎంపీలే ఇక్కడ పనిచేశారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి కూడా 1977లో న్యూఢిల్లీ ఎంపీగా జనతాపార్టీ టికెట్‌తో ఎన్నికయ్యారు. 1980లో మాత్రం బీజేపీ టికెట్‌తో మళ్లీ ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. తదనంతరం ఎల్కే అద్వానీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీ ఎంపీలుగా ఎన్నికయ్యారు. 54 ఏళ్ల తరువాత న్యూఢిల్లీ మహిళా ఎంపీగా వ్యవహరించనున్న లేఖికి ఈసారి 4.53 లక్షల ఓట్లు పడ్డాయి. ఈమె సమీప ప్రత్యర్థి ఆశిష్ ఖేతాన్‌కు 2.90 లక్షల ఓట్లు పోలయ్యాయి. అజయ్ మాకెన్ 1.82 లక్షల ఓట్లతో సరిపెట్టుకున్నారు. -
మిస్సింగ్ ఎంపీ..! మాకెన్‌పై మీనాక్షి వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్‌పై ఆయన ప్రత్యర్థి, బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. మాకెన్ ‘మిస్సింగ్ ఎంపీ’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత పదేళ్ల నుంచి నియోజకవర్గంలో ఆయన కనిపించడం లేదని, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఖర్చు చేసిందేమీ లేదని ఆరోపించారు. పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా కొనసాగినా ఆయన నియోజకవర్గంలో ఇంకా అనేక సమస్యలు తాండవిస్తూనే ఉన్నాయన్నారు. ఇక నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ గెలవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రజలు తన ను తప్పుకుండా గెలిపిస్తారని ఓ వార్తాసంస్థకు ఇచ్చి న ఇంటర్వ్యూలో చెప్పారు. నరేంద్ర మోడీ చుట్టూ పార్టీ కేంద్రీకృతమైందని, ఆయన బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు ఆమె ఖండించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరొందిన అమన్ లేఖీని వివాహమాడారు. పార్టీలో పెద్ద పెద్ద నాయకులుండగా మీకే పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చింద ంటూ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... ‘నిజమే... సుబ్రమణ్యన్ స్వామి, నిర్మలా సీతారామన్ వంటి సీనియర్లు పార్టీలో ఉన్నా అధిష్టానం నాకే టికెట్ ఇవ్వడంపై ప్రత్యర్థులు రకరకాల ప్రచారాలు చేశారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించిన పార్టీ ప్రత్యర్థి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని, వారిని ఓడించాలంటే నేనే సరైన వ్యక్తినని నమ్మి టికెట్ ఇచ్చింద’న్నారు. -
బీజేపీలో ఉత్సాహం నింపిన మోడీ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో దళిత, ముస్లిం జనాభా ఎక్కువగా నివసించే ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల కోసం నగరంలో బుధవారం రాత్రి మోడీ నిర్వహించిన తొలి బహిరంగ సభ బీజేపీలో ఉత్సాహం నింపింది. దీని ద్వారా ముస్లిం ఓటర్లను కూడా ఆకట్టుకున్నామని బీజేపీ నేతలు భావిస్తున్నారు.ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, చాంది నీచౌక్ నియోజకవర్గాల్లోని ముస్లిం ఓటర్లు తమ పార్టీకి తప్పకుండా ఓటేస్తారని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ర్యాలీలో మోడీ జపం బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ర్యాలీతో బుధవారం శాస్త్రిపార్క్ ‘హర్‌హర్ మోడీ’ నినాదాలతో మార్మోగింది. ఈ నినాదంపై వివాదం కొనసాగుతున్నప్పటికీ కార్యకర్తలు, పశ్చిమ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ కూడా పలుసార్లు వేదికపై ఈ నినాదం చేశారు. హర్‌హర్ మోడీ నినాదం చేయవద్దని మోడీ స్వయంగా కోరినా ఫలితం లేకపోయింది. ర్యాలీ కోసం బారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న మీనాక్షీ లేఖీ మినహా మిగతా ఆరు స్థానాల నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులు హాజరయ్యారు. నరేంద్ర మోడీ ప్రసంగానికి ముందు వీరంతా మాట్లాడారు. అయితే ఈ అభ్యర్థులు ప్రసంగిస్తుండగా ప్రేక్షకుల్లో కనిపించని ఉత్సాహం మోడీ ప్రసంగిస్తుండగా కనిపించింది. మోడీకి మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చే శారు. కాంగ్రెస్, ఆప్‌పై విమర్శనాస్త్రాలు నరేంద్ర మోడీ తన ప్రసంగంలో రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు కురిపించారు. ఆప్‌కు ఓటు వేసి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటును మళ్లీ చేయరాదని ఆయన కోరారు. ఆప్‌ను కాంగ్రెస్‌కు ‘బీ’ టీంగా అభివర్ణించారు. ‘కాంగ్రెస్ అనేక ముసుగులు వేసుకుంటుంది. వీటిని గుర్తించాలి. ప్రతిపక్షంలో అనేక ఏళ్లు గడిపిన మాకు ఈ విషయం బాగా తెలుసు. ట్రాన్స్ యమునా ప్రాంతంలో సదుపాయాలు ఏవీ లేవు. ఇక్కడ మనుషులు ఎలా నివసిస్తున్నారో అర్థం కావడం లేదు. దేశరాజధానిలో మహిళలకు భద్రత లేదని డిసెంబర్ 16 సామూహితక అత్యాచార ఘటన నిరూపిస్తోంది. కాంగ్రెస్ కేవలం మైనారిటీ రాజకీయాలు చేస్తుంది. ముస్లింలకు కాంగ్రెస్ వల్ల కలిగిన లాభం ఏమీ లేదు’ అని మోడీ అన్నారు.