షీలా దీక్షిత్ భారతీయురాలే: మీనాక్షి
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ భారతీయురాలేనని మీనాక్షి లేఖి వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోడీ పాలనను షీలా ప్రశంసించడం తప్పు కాదని లేఖి తెలిపారు. మోడీ సమర్ధవంతంగా పాలన అందిస్తున్న కారణంగానే షీలా ప్రశంసించారని లేఖీ అన్నారు.
ఓ ప్రత్యేక విజన్ తో మోడీ పాలన సాగుతోంది. గెలిచే ప్రతివ్యక్తిలోనూ విశ్వాసం కనిపిస్తుందని.. మోడీలోనూ అదే కనిపిస్తోందని షీలా దీక్షిత్ వ్యాఖ్యలు చేశారు.