కెనడాకు తగ్గిన భారత యువత | Indian Students Skip Canada Amid Political Row, Says Minister - Sakshi
Sakshi News home page

కెనడాకు తగ్గిన భారత యువత

Published Wed, Jan 17 2024 9:58 AM | Last Updated on Wed, Jan 17 2024 11:12 AM

Indian Students Skip Canada Amid Political Row - Sakshi

ఒట్టావా: కెనడా-భారత్ మధ్య వివాదం కారణంగా 2023 ఏడాదికి భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు గణనీయంగా తగ్గాయని ఆ దేశ  ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. వాటి సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం కనిపించట్లేదని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు అనంతరం విద్యార్థులకు జారీ చేసే స్టడీ పర్మిట్‌లు 86 శాతానికి తగ్గాయని స్పష్టం చేశారు. 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనంతరం వీసా అనుమతులను ఇచ్చే కెనడియన్ దౌత్యవేత్తలను భారతదేశం తొలగించడం, తక్కువ మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేయడంతో ఈ పరిణామాలు ఎదురయ్యాయని మిల్లర్ చెప్పారు. 

"భారతదేశం నుండి కెనడా వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలించే మా సామర్థ్యం సగానికి తగ్గింది. ఇరుదేశాల మధ్య మళ్లీ దౌత్య సంబంధాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే దాని గురించి నేను చెప్పలేను." అని ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ అన్నారు. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడారు. దీంతో ఇరుదేశాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం అనంతరం కెనడా దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పంపింది.      

ఇదీ చదవండి: ఉగ్రవాదులపై ఇరాన్ ఉక్కుపాదం.. పాక్‌పై క్షిపణులతో దాడులు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement