trudeau
-
కెనడా అడ్డగోలు ఆరోపణలు
ఒట్టావా/వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, కెనడా దౌత్యబంధానికి హఠాత్తుగా బీటలు పడుతున్నాయి. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయ హైకమిషన్ పేరును చేర్చిన కెనడా తాజాగా వ్యవస్థీకృత నేరగ్యాంగ్తో భారతీయ ఏజెంట్లకు సంబంధం అంటగట్టి భారత్‌తో దౌత్యబంధంలో ఆగ్రహజ్వాలలను రగలించింది. భారత్‌పై కెనడా నోటికొచి్చనట్లు ఆరోపణలు గుప్పించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మొదలు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులదాకా అందరూ మూకుమ్మడిగా భారత్‌పై అభాండాలు మోపారు.కెనడాలోని ఖలిస్తానీ నేతలను భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని, ఇందుకోసం కెనడాలోని బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఏజెంట్లు చేతులు కలిపారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కెనడియన్లపై దాడులకు భారత్ తన ఏజెంట్లతోపాటు వ్యవస్థీకృత నేరగాళ్లను ఆశ్రయించిందని కెనడా ప్రధాని ట్రూడో మంగళవారం దారుణ విమర్శలు చేశారు. తప్పని పరిస్థితుల్లో భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. కెనడా అధికారులు, నేతల మూకుమ్మడి విమర్శలను భారత్ ఏకపక్షంగా తోసిపుచ్చింది.నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరును చేర్చడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్ అందుకు ప్రతిగా ఢిల్లీలోని ఆరుగురు దౌత్యాధికారులను బహిష్కరించడం, దానికి ప్రతీకారంగా కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యాధికారులను బహిష్కరించిన నేపథ్యంలో మంగళవారం కెనడా ఆరోపణల పర్వం మొదలెట్టింది. ఖలిస్తాన్ ఉద్యమకారులపై దాడులు కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమకారులు, నేతలపై దాడులను ప్రస్తావిస్తూ రాయల్ కెనడా మౌంటెడ్ పోలీస్ కమిషనర్ మైక్ డ్యూహెన్, డిప్యూటీ కమిషనర్ బ్రిగిట్ గౌవిన్లు మంగళవారం ఒట్టావాలో మీడియాతో మాట్లాడారు. ‘‘దక్షిణాసియా వాసులను, ముఖ్యంగా ఖలిస్తాన్ ఉద్యమంలో భాగస్వాములైన వారిని భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం ఏజెంట్లు బిష్ణోయ్ గ్యాంగ్‌తో చేతులు కలిపారు. హత్య, డజనుకుపైగా బెదిరింపులు, హింసాత్మక ఘటనలతో భారత్‌కు సంబంధం ఉంది. హత్యల కేసులో 8 మందిని, భారతప్రభుత్వంతో సంబంధం ఉండి బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో 22 మందిని అరెస్ట్‌చేశాం’’అని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకేసులో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మళ్లీ తెరపైకి వచి్చన వేళ ఆ నేరముఠా పేరును కెనడా పోలీసులు ప్రస్తావించడం గమనార్హం. భారత్ పెద్ద తప్పిదం చేసింది: ట్రూడో కెనడా రాయల్ పోలీసులు ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే ట్రూడో మీడియాతో మాట్లాడారు. ‘‘కెనడియన్లపై దాడి చేసేందుకు భారత్ తన దౌత్యవేత్తలు, ఏజెంట్లతోపాటు వ్యవస్థీకృత నేరగాళ్లను వినియోగించి భారీ తప్పిదం చేసింది. కెనడాలో హింస పెరగడంలో భారత పాత్ర దాగి ఉంది. భారత వైఖరితో మా పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. హింసకు పాల్పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గత వేసవికాలం నుంచి మా పంచ నేత్ర నిఘా కూటమి(ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్, అమెరికా)తో భారత వైఖరిని పంచుకుంటున్నాం. చట్టాలకు అతీతంగా భారత్ హత్యలకు ప్రయత్నించింది. భారత్‌తో ఇలాంటి ఘర్షణాత్మక సంబంధాలను మేం కోరుకోవట్లేము. కానీ మాతో కలిసి పనిచేసేందుకు భారత్ విముఖత చూపుతోంది’’అని ట్రూడో వ్యాఖ్యానించారు. ఆరోపణలను తోసిపుచి్చన భారత్ ‘‘నిజ్జర్ కేసులో సాక్ష్యాలను ఇచ్చామని కెనడా చెబుతున్న దాంట్లో నిజం లేదు. ట్రూడో మళ్లీ అదే పాత కారణాలను, పాత విషయాలను వల్లె వేశారు. నిజ్జర్ హత్య ఘటనకు ఎవరు బాధ్యులో, ఎందుకు బాధ్యులో కెనడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేదు. ఆ ఉదంతంలో గత ఏడాదికాలంగా భారత హైకమిషర్‌ను వేధించి ఇప్పుడు కేసులో ఇరికించి లక్ష్యంగా చేసుకోవడం అసంబద్ధం’’అని భారత్ ఆగ్రహం వ్యక్తంచేసింది.కెనడా, భారత్ జాతీయ భద్రతా సలహాదారుల రహస్య భేటీ! భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కెనడా జాతీయ భద్రతా మహిళా సలహాదారు నాథలీన్ డ్రౌలీ, ఉన్నతాధికారులతో వారం రోజుల క్రితం సింగపూర్‌లో రహస్యంగా సమావేశమయ్యారని అమెరికా వార్తాసంస్థ వాషింగ్టన్ పోస్ట్ కొత్త కథనం ప్రచురించింది. నిజ్జర్ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయముందని కెనడా రాయల్ పోలీసులు ఆరోపించిన వేళ ఈ వార్త చర్చనీయాంశమైంది. కెనడాలో సిక్కు వేర్పాటువాదులపై దాడులకు, నిజ్జర్‌ను హత్యచేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను భారత్ వాడుకుందని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కెనడా అధికారులు దోవల్‌కు సమరి్పంచారని కథనం సారాంశం. -
సిక్కుల ఓట్ల కోసమే చిచ్చు!
ప్రజా వ్యతిరేకతను, సొంత పార్టీ లో తిరుగుబాటును అధిగమించి వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గడానికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నారా? కెనడాలో గణనీయ సంఖ్యలో ఉన్న సిక్కు ఓటర్లను ప్రసన్నం చేసుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తహతహలాడుతున్నారా? కేవలం అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలతో భారత్– కెనడా సంబంధాలను బలి పెట్టడానికి సైతం వెనుకాడడం లేదా? రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అవుననే చెబుతున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని జస్టిన్ ట్రూడో పదేపదే ఆరోపిస్తున్నారు.అంతేకాదు ఈ హత్యలో భారత హైకమిషనర్ సంజయ్ కమార్ వర్మను ట్రూడో ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చింది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. ట్రూడో పదవీ కాంక్ష వల్ల భారత్, కెనడా ప్రజలు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్‌లో కెనడా పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. మరో ఏడాది సమయమే మిగిలి ఉంది. మరోవైపు జస్టిన్ ట్రూడో పాలనల పై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సొంత పార్టీ లో సైతం నిరసన గళాలు బలం పుంజుకుంటున్నాయి. ట్రూడో నాయకత్వాన్ని, పరిపాలనా సామర్థ్యాన్ని అధికార ‘లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా’ నాయకులు ప్రశి్నస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించడానికి నిజ్జర్ హత్యను ట్రూడో తెలివిగా తనకు అనుకూలంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజ్జర్ వ్యవహారంలో భారత్‌ను ఇరుకునపెట్టడం ద్వారా సిక్కుల ఓట్లపై ఆయన వల విసురుతున్నట్లు ప్రచారం సాగుతోంది. 2021 నాటి గణాంకాల ప్రకారం కెనడాలో 7.70 లక్షల మంది సిక్కులున్నారు. అంటే జనాభాలో 2.1 శాతం మంది సిక్కులే. భారత్‌కు వెలుపల అత్యధిక సంఖ్యలో సిక్కులు ఉన్న దేశం కెనడా. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండి రాజకీయ ప్రాబల్యం కలిగిన సిక్కులను మచ్చిక చేసుకోవడానికి కెనడా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తులను ప్రోత్సహిస్తుంటాయి.భారత్‌లో సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్న నినాదంతో పుట్టుకొచి్చన ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కెనడా అడ్డాగా మారిపోయింది. వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, సిక్స్ ఫర్ జస్టిస్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ తదితర సంస్థలు కెనడా నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రాజకీయ పార్టీ లు వీటికి మద్దతిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. కనీసం 9 ఖలిస్తానీ టెర్రర్ గ్రూప్‌లకు కెనడాయే ప్రధాన స్థావరం. ఇవన్నీ భారత సార్వబౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్నాయి. తమ దేశంలో నేరాలకు పాల్పడిన ఖలిస్తాన్ ఉగ్రవాదులను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కెనడా లెక్కచేయడం లేదు. కనీసం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా తిరస్కరిస్తోంది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు ఖలిస్తానీలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తోంది. ట్రూడో పాలనలో కెనడా దేశం భారత్‌కు మరో పాకిస్తాన్‌గా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థి వీసాలపై పిడుగు! కెనడా–భారత్ మధ్య విభేదాలు ముదురుతుండడంతో ఇరు దేశాల ప్రజలు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా వీసా సేవలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కెనడాలో 1.78 లక్షల మంది ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు), 15.10 లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. 2.80 లక్షల మందికిపైగా భారత విద్యార్థులు ఉన్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 41 శాతం మంది భారతీయులే.ఈ ఏడాది ప్రారంభంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాలను ప్రభుత్వం 3.60 లక్షలకే పరిమితం చేసింది. 2022 నాటితో పోలిస్తే విద్యార్థి వీసాల సంఖ్యను 35 శాతం తగ్గించింది. దీనివల్ల భారతీయ విద్యార్థులు నష్టపోయారు. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో విభేదిస్తున్న నేపథ్యంలో విద్యార్థి వీసాలను మరింత తగ్గించే అవకాశం కనిపిస్తోంది. భారతీయ ఉద్యోగులను ఇప్పటికప్పుడు వెనక్కి పంపించే పరిస్థితి లేకున్నా, సమీప భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
70 వేల మంది విద్యార్థులపై బహిష్కరణ
టోరంటో: కెనడాలో వలసలపై పరిమితి విధించడమే లక్ష్యంగా ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు విదేశీ విద్యార్థులోగుబులు రేపుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 70 వేల మంది విదేశీ విద్యార్థులు కెనడాను వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా ఆందోళన బాటపట్టారు. తమను బయటకు వెళ్లగొట్టడం సమంజసం కాదంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వైఖరి మార్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసన దీక్షలకు దిగుతున్నారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, ఒంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియా తదితర ప్రావిన్స్‌ల్లో దీక్షలు, ర్యాలీలు జరుగుతున్నాయి. కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో సింహభాగం భారతీయులే ఉన్నారు. కొత్త జీవితం నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో కెనడాలో అడుగుపెట్టిన వీరంతా ఇప్పుడు దినదినగండంగా బతుకున్నారు.స్పందన శూన్యం స్టడీ పర్మిట్లు, వర్క్ పర్మిట్ల సంఖ్యను భారీగా కుదించాలని, పర్మనెంట్ రెసిడెన్సీ నామినేషన్లను కనీసం 25 శాతం తగ్గించాలని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఈమేరకు ఇటీవలే మార్పులు చేసింది. 70 వేల మంది విదేశీ విద్యార్థుల వర్క్ పర్మిట్ల గడువు ఈ ఏడాది ఆఖరు నాటికి ముగిసిపోతుంది. వాటిని పొడిగించే అవకాశం కనిపించడం లేదు. దాంతో వారంతా బయటకు వెళ్లక తప్పదు. దాంతో దేశవ్యాప్తంగా విదేశీ విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. వర్క్ పర్మిట్ల గడువు పెంచాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. దీనిపై మాట్లాడడానికి ప్రభుత్వ అధికారులు ఇష్టపడడం లేదు.ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ శాసనసభ భవనం ఎదుట గత మూడు నెలలుగా ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. విదేశీ కార్మికులపైనా పరిమితి విదేశాల నుంచి విద్యార్థులు భారీగా వచ్చిపడుతుండడంతో కెనడాలో మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. హౌసింగ్, ఆరోగ్య సంరక్షణతోపాటు ఇతర సేవలు అందరికీ అందడం లేదు. అందుబాటులో ఉన్న వనరులు సరిపోని పరిస్థితి. అందుకే విదేశాల నుంచి వలసల తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా విద్యార్థుల రాకను చట్టబద్ధంగానే అడ్డుకుంటోంది.రాబోయే రెండేళ్లపాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్ పర్మిట్ అప్లికేషన్లను పరిమితంగానే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది కేవలం 3.60 లక్షల స్టడీ పర్మిట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు అంచనా. గత ఏడాది కంటే ఇది 35 శాతం తక్కువ కావడం గమనార్హం. పోస్టుగ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ల కోసం విదేశీ విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోవద్దని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ సూచించారు. తక్కువ వేతనాలకు తాత్కాలికంగా పనిచేసుకోవడానికి వచ్చే విదేశీ కార్మికుల సంఖ్యపై పరిమితి విధించబోతున్నట్లు కెనడా ప్రధానమంత్రి కెనడా జస్టిన్ ట్రూడో సోమవారం వెల్లడించారు. -
‘ఖలిస్థానీ‘ వివాదాస్పద పోస్టర్లు: ఘాటుగా స్పందించిన కెనడా మంత్రి
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు అతికించడం కలకలకలం రేపింది. ఈ చర్యలను కెనడా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీనిపై ఎక్స్ వేదికగా కెనడా మంత్రి డామినిక్ ఏ లెబ్లాంక్ స్పందించారు. ‘వాంకూవర్‌లో కొందరు ఇందిరా గాంధీ హత్య పోస్టర్లు వేశారు. కెనడాలో ఈ విధంగా హింసను ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు. దీనికి ముందు కెనడాలోని వాంకోవర్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యపై వివాదాస్పద పోస్టర్లు అతికించడాన్ని హిందూ-కెనడియన్ ఎంపీ, మంత్రి చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుపట్టారు. కెనడాలో హింసను ప్రోత్సహించడాన్ని ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రూడో ప్రభుత్వాన్ని ఆయన కోరారు.ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్టీకి చెందిన ఎంపీ ఆర్య ట్విట్టర్ వేదికగా.. ‘భారత ప్రధాని ఇందిరా గాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని, ఆమె అంగరక్షకులే తుపాకులు పట్టుకుని హంతకులుగా మారారని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు పోస్టర్లు వేసి, మరోమారు హిందూ-కెనడియన్లలో భయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.ఇది కొన్ని సంవత్సరాల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన బెదిరింపుల కొనసాగింపని, కెనడాలోని హిందువులను భారతదేశానికి తిరిగి వెళ్లాలని కోరుతున్న ఖలిస్థానీ ఉద్యమ నేత పన్నూన్ చర్య అని పేర్కొన్నారు. ఆయన ప్రత్యేక సిక్కు రాష్ట్ర ఉద్యమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకు పాల్పడతున్నారన్నారు. పన్నూన్‌పై కెనడాలోని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్య డిమాండ్ చేశారు. ఇటీవల వాంకోవర్‌లో భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరించే పోస్టర్లు వెలిశాయని పబ్లిక్ సేఫ్టీ, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్ గవర్నమెంటల్ అఫైర్స్ మంత్రి డొమినిక్ ఎ లెబ్లాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా హౌస్ ఆఫ్ కామన్స్ ఆఫ్ కెనడాలో నేపియన్ ఎన్నికల జిల్లాకు చంద్ర ఆర్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Khalistan supporters in Vancouver with posters, of Hindu Indian prime minister Indira Gandhi body with bullet holes with her bodyguards turned assassins holding their guns, are again attempting to instil fear of violence in Hindu-Canadians. This is continuation of threats with a… pic.twitter.com/ia8WQL4VtH— Chandra Arya (@AryaCanada) June 8, 2024 -
కెనడాకు తగ్గిన భారత యువత
ఒట్టావా: కెనడా-భారత్ మధ్య వివాదం కారణంగా 2023 ఏడాదికి భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు గణనీయంగా తగ్గాయని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. వాటి సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం కనిపించట్లేదని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు అనంతరం విద్యార్థులకు జారీ చేసే స్టడీ పర్మిట్లు 86 శాతానికి తగ్గాయని స్పష్టం చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనంతరం వీసా అనుమతులను ఇచ్చే కెనడియన్ దౌత్యవేత్తలను భారతదేశం తొలగించడం, తక్కువ మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేయడంతో ఈ పరిణామాలు ఎదురయ్యాయని మిల్లర్ చెప్పారు. "భారతదేశం నుండి కెనడా వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలించే మా సామర్థ్యం సగానికి తగ్గింది. ఇరుదేశాల మధ్య మళ్లీ దౌత్య సంబంధాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే దాని గురించి నేను చెప్పలేను." అని ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడారు. దీంతో ఇరుదేశాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం అనంతరం కెనడా దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పంపింది. ఇదీ చదవండి: ఉగ్రవాదులపై ఇరాన్ ఉక్కుపాదం.. పాక్‌పై క్షిపణులతో దాడులు -
నిజ్జర్ హత్య కేసులో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం?!
ఒట్టావా: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పురోగతి చోటు చేసుకుందా?. ఈ కేసుకు సంబంధించి.. ఇద్దరు వ్యక్తులను కెనడా పోలీసులు అరెస్టు చేయనున్నారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల నిఘాలో ఉన్నారని సమాచారం. నిజ్జర్ హత్య తర్వాత హంతకులు కెనడాను విడిచిపెట్టలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెలల తరబడి పోలీసుల నిఘాలో ఉన్నారని తెలుస్తోంది. కెనడా సర్రేలోని గురుద్వారాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను ఈ ఏడాది జులై 18న గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఇది కాస్త భారత్-కెనడా వివాదంగా మారిపోయింది. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైన విషయం కాదని తెలిపింది. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తుకు భారత్ బాధ్యత వహించాలని కెనడా డిమాండ్ చేసింది. ప్రపంచ దేశాల నుంచి భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేసింది. ఇరుదేశాలు వీసాలపై నిబంధనలు విధించుకునే స్థాయికి వెళ్లాయి. ఇటీవలే కెనడా వీసాల రద్దును భారత్ సడలించింది. ఇదీ చదవండి: హైదరాబాద్ నుంచే అయోధ్య రామ మందిర తలుపులు -
భారత్ చర్యతో లక్షల మంది జీవితాలు దుర్భరం: ట్రూడో
కెనడా దౌత్యవేత్తలకు రక్షణ కల్పించడాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. 41 మంది కెనడా దౌత్యవేత్తలపై భారత్ అనుసరించిన వైఖరి ఈ రెండు దేశాల్లోని లక్షలాది మంది జీవితాల్ని దుర్భరం చేస్తున్నదని ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ నుంచి కెనడాకు చెందిన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పంపిస్తున్నన్నట్టు భారత్ ప్రకటించిన నేపధ్యంలో జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కెనడా దౌత్యవేత్తల అధికారిక హోదాను ఏకపక్షంగా రద్దు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందని ఆయన ఆరోపించారు. భారత్ చర్య కారణంగా కెనడా, భారతదేశంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు సాధారణ జీవితాన్ని భారత ప్రభుత్వం కష్టతరం చేసిందని ట్రూడో పేర్కొన్నారు. ఇది దౌత్య విధానంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని అన్నారు. భారత్‌లో ఉంటున్న కెనడియన్ల సంక్షేమంపై తనలో ఆందోళన నెలకొన్నదన్నారు. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కెనడా చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించింది. భారతదేశంలోని కెనడియన్ దౌత్యవేత్తలకు సంబంధించి కెనడా ప్రభుత్వం అక్టోబర్ 19న చేసిన ప్రకటనను గమనించామని, ఇరు దేశాల్లోని దౌత్యవేత్తల సంఖ్యలో సమానత్వం గురించి చర్చించామని పేర్కొంది. భారతదేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్య అధికంగా ఉందని, అందుకే భారతదేశ అంతర్గత వ్యవహారాల్లోనూ కెనడా జోక్యం పెరిగిపోయిందని భారత ప్రభుత్వం ఆరోపించింది. కెనడియన్ దౌత్యవేత్తలు వెనక్కి రావడం గురించి కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ .. అక్టోబర్ 20 తర్వాత 21 మంది కెనడియన్ దౌత్యవేత్తలు మినహా మిగిలిన దౌత్యవేత్తల దౌత్యపరమైన అధికారాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని భారతదేశం తెలియజేసిందని అన్నారు. ఈ మేరకే తాము దౌత్యవేత్తలందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారిని భారతదేశం నుండి సురక్షితంగా వెనక్కి పిలిపించామన్నారు. భారత్ చేపట్టిన ఈ చర్యను తాము ఊహించలేదని అన్నారు. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని, ఏ దేశంలోనైనా దౌత్యవేత్తల అధికారాలను ఏకపక్షంగా రద్దు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. ఇటువంటి చర్య కారణంగా ఏ దౌత్యవేత్త అయినా భారత్‌లో పనిచేయడం కష్టమని అన్నారు. అయితే దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, గత నెల రోజులుగా ఈ అంశంపై కెనడా ప్రభుత్వంతో కలిసి భారత ప్రభుత్వం చర్చిస్తున్నదని తెలిపింది. ఈ నిర్ణయాలు వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1కు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. దౌత్యవేత్తల విషయంలో సమానత్వాన్ని అమలు చేయాలనే నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగా భారత్ పరిగణించదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: కాన్సులేట్ సేవలు నిలిపేసిన కెనడా -
పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్ సాక్షిగా ప్రధాని జస్టిన్ ట్రూడో చేష్టలపై నెటిజన్లు ఫైరవుతున్నారు. దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ప్రదర్శించాల్సిన తీరుకాదని విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం కెనడా పార్లమెంట్లో నూతన స్పీకర్ కొలువుదీరిన నేపథ్యంలో జస్టిన్ ట్రూడో నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కెనడా పార్లమెంట్లో నూతన స్పీకర్ గ్రెగ్ ఫెర్గస్.. ప్రధాని జస్టిన్ ట్రూడోను సభకు పరిచయం చేస్తూ..'గౌరవనీయులైన ప్రధాని' అని సంబోధించారు. ఇంతలోనే ట్రూడో మధ్యలో కలగజేసుకుని 'చాలా గౌరవనీయులైన ప్రధాని' అని సరిచేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ గ్రెగ్ వైపు చూస్తూ నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. The rig is in. Canadian Prime Minister Justin Trudeau gives a wink and bites his tongue at new Speaker of the House of Commons, Greg Fergus. What is going on in Canada? Fergus, who is a liberal, was elected after the previous speaker was forced to resign for praising a Nazi on… pic.twitter.com/WjuaaVuLIu — illuminatibot (@iluminatibot) October 4, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని స్థానంలో ఉండి ట్రూడో వైకరి చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కన్నగీటడం, నాలుకతో సంజ్ఞలు సాధారణ పౌరులకే ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటిది పార్లమెంట్ సాక్షిగా ఇలా ప్రవర్తించడం దారుణమని కామెంట్లు పెట్టారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షనాయకులు విమర్శలు సందించారు. నాజీ సైన్యంలో పనిచేసిన ప్రముఖునికి పార్లమెంట్లో గౌరవసన్మానం చేసిన వ్యవహారంలో మాజీ స్పీకర్ ఆంటోని రోటా తన పదవికి రాజీనామా చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. యూదులను ఊచకోత కోసిన హిట్లర్ తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తికి సన్మానం చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో మాజీ స్పీకర్ రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్‌ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదీ చదవండి: మోదీ చాలా తెలివైన వ్యక్తి: పుతిన్ -
ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో భారత దౌత్య అధికారుల హస్తం ఉందన్న విశ్వసనీయ సమాచారాన్ని ఇండియాకు తాము కొన్ని వారాల క్రితమే తెలియజేశామని అన్నారు. గత సోమవారం పార్లమెంట్లో మాట్లాడటం కంటే ముందే భారత్‌కు చెప్పామని స్పష్టం చేశారు. ఇండియాతో నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కోరుకున్నామని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య అధికారుల ప్రమోయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. కెనడా పౌరుని హత్యలో భారత్ జోక్యం అంటూ మండిపడ్డారు. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టింది. ఇది రాజకీయ లాభం కోసం చేస్తున్న చర్యగా అభిప్రాయపడింది. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిఘా విభాగాలు ఎలాంటి ఆధారాలు సేకరించాయో బయటపెట్టాలని భారత్ కోరింది. కానీ కెనడా ఇప్పటివరకు ఆధారాలను వెల్లడించలేదు. ఇండియా జవాబుదారీగా ఉండాలి: అమెరికా ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ఆరోపణలపై భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. దర్యాప్తులో కెనడాకు సహకరించాలని ఇండియాకు పిలుపునిచ్చారు. ఈ అంశంలో భారత్, కెనడాతో సంప్రదింపులు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత..? -
ఐరాస వేదికగా ఖలిస్థానీ ప్రశ్నలకు ట్రూడో ఎడముఖం
న్యూయార్క్: ఐరాస వేదికగా ఇండియా-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించడానికి జస్టిన్ ట్రూడో నిరాకరించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్రపై ట్రూడో చేసిన ఆరోపణలపై పీటీఐ అడిగిన ప్రశ్నలను దాటవేశారు. జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. వాతావరణ లక్ష్యాలు, ఉక్రెయిన్ అంశాలపై భద్రతా మండలిలో మాట్లాడారు. ఈ క్రమంలో రెండు సందర్భాల్లో ట్రూడోని పీటీఐ ప్రశ్నించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా ఖండించిన అంశంపై ప్రశ్నించారు. కానీ ఏ మాత్రం స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. Visuals of Canadian PM Justin Trudeau at United Nations (UN) headquarters in New York, US. pic.twitter.com/itdbUnI2tm — Press Trust of India (@PTI_News) September 21, 2023 ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం పాత్ర ఉందని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారిని ఆ దేశం నుంచి బహిష్కరించారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఆరోపణలుగా పేర్కొంటూనే కెనడా దౌత్య అధికారిని ఇండియా కూడా బహిష్కరించింది. కెనడా, భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కెనడా ప్రయాణికులకు ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశానికి వెళ్లదలచినవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. ఇదీ చదవండి: ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై అనుమానాలు.. -
భారత్‌ను రెచ్చగొట్టే ఉద్దేశం లేదు: ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు, భారత ప్రభుత్వ ఏజెంట్లకు మధ్య సంబంధం ఉందని ఆరోపించిన వ్యవహారంలో భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. ’’భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఈ అంశాన్ని తీసుకుంది.. కానీ ఇండియాను రెచ్చగొట్టడం మా ఉద్దేశం కాదు. కానీ కొన్ని ప్రశ్నలకు మాకు సమాధానాలు కావాలి" ఖలిస్థానీ అంశంలో కెనడా ప్రధాని ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం భారత ప్రభుత్వం చాలా సీరియస్ కామెంట్లు చేసింది. అందుకే కెనడా ప్రధాని మళ్లీ స్పందించినట్లు స్పష్టం అవుతోంది. కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇంతేకాకుండా కెనడాలో ఉన్న ఇండియన్ దౌత్య అధికారిని బహిష్కరించారు. ఈ పరిణామాలను భారత్ సీరియస్‌గా తీసుకుంది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారిని కూడా బహిష్కరించింది. దేశం విడిచి వెళ్లాలని గడువు విధించింది. ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
ఖలిస్తాన్ రెఫరెండం!
టొరంటో: భారత వ్యతిరేక శక్తులు కెనడాలో తిష్టవేశాయని స్వయంగా ఆ దేశ ప్రధాని ట్రూడో ఎదుటే ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేసిన వేళ అదే రోజు మరో పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ను విడగొట్టి సిక్కుల కోసం ఖలిస్తాన్‌ను ఏర్పాటుచేయడంపై అభిప్రాయం తెలపాలంటూ కెనడాలో సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వేర్పాటువాద సంస్థ రెఫరెండం నిర్వహించింది. సుర్రే పట్టణంలో ఎస్ఎఫ్జే వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ సారథ్యంలో సిక్కు ప్రజాభిప్రాయ సేకరణ(రెఫరెండం) చేపట్టారు. భారీ వ్యక్తిగత భద్రత నడుమ రెఫరెండం ప్రాంతానికి వచి్చన గురపత్వంత్ అక్కడే భారత వ్యతిరేక విద్వేష ప్రసంగం చేశారు. గురు నానక్ సింగ్ గురుద్వారా వద్ద జరిగిన ఈ రెఫరెండం తంతులో దాదాపు 7వేల మంది పాల్గొన్నారు. దాదాపు 50 వేలకుపైగా జనం వస్తారని ఆశించిన నిర్వాహకులకు భంగపాటు ఎదురైంది. కెనడా ప్రధాని ట్రూడోతో మోదీ ఖలిస్తాన్ వేర్పాటువాదం సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించిన ఆదివారం రోజే ఈ రెఫరెండంను ఎస్ఎఫ్జే నిర్వాహకులు పనిగట్టుకుని నిర్వహించారు. అంతకుముందు పత్వంత్ సింగ్ ఒక ఆడియో సందేశం విడుదలచేశారు. ‘ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతున్న ప్రగతి మైదాన్ ప్రాంగణానికి భారీ సంఖ్యలో వెళ్లి నిరసన గళం వినిపించండి’ అని కశీ్మర్ లోయలో నివసించే ముస్లింలకు పిలుపునిస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తాన్ వేర్పాటువాద జెండా ఎగరేస్తామని పత్వంత్‌సింగ్ సవాల్ చేశారు. -
కెనడా వైపు చూస్తున్న అమెరికన్లు!
వాషింగ్టన్: ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు అగ్రరాజ్యం అమెరికాకు వలస వెళ్తుంటారు. అయితే ఇప్పుడు అమెరికా ప్రజలు మాత్రం అమెరికా నుంచి పారిపోవడం ఎలా అని ఆలోచిస్తున్నారట. వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా.. ఓ వార్తాపత్రిక ఈ అంశంపై మాక్ ట్యుటోరియల్ను సైతం నిర్వహించింది. గూగుల్‌లో అమెరికన్లు కెనడాకు వెళ్లడం ఎలా అనే అంశాన్ని ఎక్కువగా శోధిస్తున్నారు. మొత్తానికి అమెరికా ప్రజలు కెనడాను సురక్షిత ప్రాంతంగా భావిస్తున్నారని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున ముందువరుసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దేశ దక్షిణ సరిహద్దులోని మెక్సికన్లపై విషం చిమ్ముతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర సరిహద్దులోని కెనడాపై లిబరల్ అమెరికన్ల దృష్టి పడిందని అంటున్నారు విశ్లేషకులు. దేశంలోకి ముస్లింలను రాకుండా అడ్డుకోవాలని, దేశ దక్షిణ ప్రాంతం మెక్సికో సరిహద్దులో గోడను నిర్మిస్తానని, ఇండియాతో సహా పలు దేశాలకు చెందినవారిని వెనక్కి పంపుతానని అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా మొదటి నుంచి శరణార్థుల విషయంలో కఠినవైఖరినే అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో కెనడా యువ ప్రదాని జస్టిన్ ట్రుడేవ్ సిరియా సహా ఇతర ప్రాంత శరణార్థులను సాదరంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ట్రుడేవ్ ఉదారవాద విధానాలు ఆకర్షించడంతో పాటు.. శరణార్ధులు ఇతర విషయాల్లో ట్రంప్ అహంకార ధోరణితో విసుగెత్తిన లిబరల్ అమెరికా ప్రజలు కెనడా వైపు చూస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
సిరియా, ఇరాక్‌ల నుండి ఫైటర్ జెట్ విమానాల ఉపసంహరణ
కెనడా: సిరియా, ఇరాక్‌ల నుండి ఫైటర్ జెట్ విమానాలను ఉపసంహరించుకుంటున్నట్లు కెనడా ప్రధాని ట్రుడేవ్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తెలిపినట్లు మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ట్రుడేవ్ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడడానికి కెనడా ఫైటర్ జెట్ విమానాలను గత సంవత్సరం పంపింది. ఒప్పందం ప్రకారం మార్చి 2016 వరకు కెనడా ఫైటర్ జెట్ విమానాలు ఇరాక్, సిరియాలో కొనసాగాల్సి ఉంది. ఇటీవల లిబరల్ పార్టీ తరపున కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రుడేవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన ట్రుడేవ్.. ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఫైటర్ జెట్ల ఉపసంహరణ నిర్ణయం ఎప్పటి నుండి అమలులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ట్రుడేవ్ ప్రకటించలేదు. ఉత్తర ఇరాక్‌లో కుర్ధులకు మద్దతుగా తమ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.