70 వేల మంది విద్యార్థులపై బహిష్కరణ | Fearing deportation after Canada immigration policy tweaks, Indian students protest against Trudeau govt | Sakshi
Sakshi News home page

70 వేల మంది విద్యార్థులపై బహిష్కరణ

Published Wed, Aug 28 2024 9:48 AM | Last Updated on Wed, Aug 28 2024 12:15 PM

Fearing deportation after Canada immigration policy tweaks, Indian students protest against Trudeau govt

కెనడా ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ విధానాల్లో మార్పులు  

వర్క్‌ పరి్మట్‌ గడువు ముగిసిన విదేశీ విద్యార్థులు బయటికే  

గడువు పెంచాలని విద్యార్థుల ఆందోళనలు.. నిరసన ర్యాలీలు  
 

టోరంటో: కెనడాలో వలసలపై పరిమితి విధించడమే లక్ష్యంగా ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ విధానాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు విదేశీ విద్యార్థులోగుబులు రేపుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 70 వేల మంది విదేశీ విద్యార్థులు కెనడాను వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా ఆందోళన బాటపట్టారు. తమను బయటకు వెళ్లగొట్టడం సమంజసం కాదంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

 ప్రభుత్వం వైఖరి మార్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసన దీక్షలకు దిగుతున్నారు. ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్, ఒంటారియో, మనిటోబా, బ్రిటిష్‌ కొలంబియా తదితర ప్రావిన్స్‌ల్లో దీక్షలు, ర్యాలీలు జరుగుతున్నాయి. కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో సింహభాగం భారతీయులే ఉన్నారు. కొత్త జీవితం నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో కెనడాలో అడుగుపెట్టిన వీరంతా ఇప్పుడు దినదినగండంగా బతుకున్నారు.

స్పందన శూన్యం స్టడీ పర్మిట్లు, వర్క్‌ పర్మిట్ల సంఖ్యను భారీగా కుదించాలని, పర్మనెంట్‌ రెసిడెన్సీ నామినేషన్లను కనీసం 25 శాతం తగ్గించాలని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ విధానాల్లో ఈమేరకు ఇటీవలే మార్పులు చేసింది. 70 వేల మంది విదేశీ విద్యార్థుల వర్క్‌ పర్మిట్ల గడువు ఈ ఏడాది ఆఖరు నాటికి ముగిసిపోతుంది. వాటిని పొడిగించే అవకాశం కనిపించడం లేదు. దాంతో వారంతా బయటకు వెళ్లక తప్పదు. దాంతో దేశవ్యాప్తంగా విదేశీ విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. వర్క్‌ పర్మిట్ల గడువు పెంచాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. దీనిపై మాట్లాడడానికి ప్రభుత్వ అధికారులు ఇష్టపడడం లేదు.

ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌ శాసనసభ భవనం ఎదుట గత మూడు నెలలుగా ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. విదేశీ కార్మికులపైనా పరిమితి విదేశాల నుంచి విద్యార్థులు భారీగా వచ్చిపడుతుండడంతో కెనడాలో మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. హౌసింగ్, ఆరోగ్య సంరక్షణతోపాటు ఇతర సేవలు అందరికీ అందడం లేదు. అందుబాటులో ఉన్న వనరులు సరిపోని పరిస్థితి. అందుకే విదేశాల నుంచి వలసల తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా విద్యార్థుల రాకను చట్టబద్ధంగానే అడ్డుకుంటోంది.

రాబోయే రెండేళ్లపాటు ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ పర్మిట్‌ అప్లికేషన్లను పరిమితంగానే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది కేవలం 3.60 లక్షల స్టడీ పర్మిట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు అంచనా. గత ఏడాది కంటే ఇది 35 శాతం తక్కువ కావడం గమనార్హం. పోస్టుగ్రాడ్యుయేట్‌ వర్క్‌ పర్మిట్ల కోసం విదేశీ విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోవద్దని కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ సూచించారు. తక్కువ వేతనాలకు తాత్కాలికంగా పనిచేసుకోవడానికి వచ్చే విదేశీ కార్మికుల సంఖ్యపై పరిమితి విధించబోతున్నట్లు కెనడా ప్రధానమంత్రి కెనడా జస్టిన్‌ ట్రూడో సోమవారం వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement